Backing
-
వచ్చే ఏడాది 43% మిగులు విద్యుత్!
సాక్షి, హైదరాబాద్: అవసరానికి మించి విద్యుత్ కొనుగోళ్ల కోసం రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు భారీ ఎత్తున చేసుకున్న దీర్ఘకాలిక ఒప్పందాలు... వచ్చే ఏడాది నుంచి రాష్ట్ర ప్రజలకు గుదిబండగా మారబోతున్నాయని విద్యుత్‌రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలో భారీ ఎత్తున మిగులు విద్యుత్ ఉండనుందని, దీంతో అవసరం లేని విద్యుత్‌కు పెద్ద మొత్తంలో స్థిర చార్జీలు (ఫిక్స్డ్ చార్జీలు) చెల్లించక తప్పదని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) ముందు అభ్యంతరం వ్యక్తం చేశారు. విద్యుదుత్పత్తి కేంద్రాలను బ్యాకింగ్ డౌన్ చేసి ఉత్పత్తిని తగ్గించుకోవడం, పూర్తిగా నిలుపుదల చేయడం తప్పదని స్పష్టం చేశారు. 2024–25లో ఏకంగా 43.24 శాతం, 2025–26లో 41.97 శాతం, 2026–27లో 34.13 శాతం, 2027–28లో 26.29 శాతం, 2028–29లో 15.22 శాతం మిగులు విద్యుత్ ఉండనుందని సెంటర్ ఫర్ పవర్ స్టడీస్ కన్వినర్ ఎం.వేణుగోపాల్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. 2024–29, 2029–34 మధ్య కాలంలో రాష్ట్రంలో ఉండనున్న విద్యుత్ డిమాండ్ అంచనాలు, విద్యుత్ విక్రయాల అంచనాలు, ఆ మేరకు సరఫరా చేసేందుకు విద్యుత్ కొనుగోళ్ల ప్రణాళికలు, పెట్టుబడి ప్రణాళికలతో కూడిన తమ వనరులు, వ్యాపార ప్రణాళికలను ఇటీవల రాష్ట్ర డిస్కంలు ఈఆర్సీకి సమర్పించాయి. దీనిపై ఈఆర్సీ అన్ని వర్గాల నుంచి అభ్యంతరాలను ఆహ్వానించగా ఎం.వేణుగోపాల్‌రావు రాతపూర్వకంగా అభ్యంతరం తెలియజేశారు. కొత్త ఎత్తిపోతల పథకాల విద్యుత్ అవసరాలు ఏటేటా క్రమంగా పెరగనున్నందున మిగులు విద్యుత్ సమస్యే ఉండదంటూ డిస్కంలు సమరి్థంచుకోవడాన్ని కొట్టిపడేశారు. ఎత్తిపోతల పథకాలకు ఎంత విద్యుత్ అవసరమో డిస్కంలు ప్రతిపాదించలేదన్నారు. భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలు జరగకుండా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు అనుమతులు జారీ చేసే ముందు ఈఆర్సీ సమగ్ర పరిశీలన జరపాలని సూచించారు. ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల ధర ఎంత? వ్యవసాయం మినహా అన్ని కేటగిరీల కనెక్షన్లకు 2025 నుంచి ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను బిగించాలని కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలులో భాగంగా రివాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీం (ఆర్డీఎస్ఎస్)లో చేరేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించినట్టు డిస్కంలు ఈఆర్సీకి తమ వనరుల ప్రణాళికలో వెల్లడించాయి. 2024–29 మధ్య కాలంలో ఎల్టీ మీటర్లకు ప్రీపెయిడ్ మీటర్లకు రూ. 348 కోట్లు, హెచ్‌టీ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లకు రూ. 305 కోట్లు అవసరమని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీసీఎల్) నివేదించింది. ఎల్టీ మీటర్లకు రూ.116 కోట్లు, హెచ్‌టీ మీటర్లకు రూ.10.94 కోట్లు అవసరమని ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎన్పీడీసీఎల్) ప్రతిపాదించింది. ఈ మీటర్ల ధర ఎంత? ఏ విధంగా ఈ ధరలను ఖరారు చేశారో తెలపాలని వేణుగోపాల్‌రావు డిస్కంలను ప్రశ్నించారు. కాగా, ఈఆర్సీ గత శుక్రవారం నిర్వహించిన బహిరంగ విచారణకు సరైన సమాచారంతో డిస్కంలు రాకపోవడంతో పలువురు నిపుణులు చేసిన వి జ్ఞప్తి మేరకు ఈ నెల 22న విచారణ నిర్వహించాలని ఈఆర్సీ నిర్ణయించింది. ఆలోగా పూర్తి వివరణలను సమర్పించాలని డిస్కంలను ఆదేశించింది. -
నేడు మానవహారాలు
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో సోమవారం మానవహారాలు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ నంద్యాల, కర్నూలు పార్లమెంటరీ జిల్లాల అధ్యక్షులు శిల్పా చక్రపాణిరెడ్డి, బీవై రామయ్య తెలిపారు. ప్రత్యేక హోదా కోసం సోమవారం పార్లమెంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం చర్చకు రానున్నదని, ఈ నేపథ్యంలో పార్టీ ఎంపీల పోరాటానికి మద్దతుగా మానవహారాలు చేస్తున్నట్లు చెప్పారు. ఆదివారం వారు సాక్షితో మాట్లాడుతూ.. జిల్లాలోని 14 నిమోజకవర్గాల్లో సంఘీభావ మానవ హారాలు చేపట్టాలని, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే వరకు వైఎస్సార్సీపీ నిరంతర పోరాటాలతో ప్రజల్లో ఉంటుందన్నారు. ఐదు కోట్ల ఆంధ్రుల గుండె చప్పుడు ప్రత్యేక హోదా అని, దానిని ఇవ్వబోమని చెప్పడానికి ఎవరికీ హక్కు లేదన్నారు. సీఎం చంద్రబాబునాయుడు స్వలాభం చూసుకోవడంతో హోదా నాలుగేళ్లు ఆలస్యమైందన్నారు. మూడేళ్ల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజ్ వద్దని, ప్రత్యేక హోదా ఇవ్వాలని అడిగి ఉంటే వచ్చేదన్నారు. అయితే సీఎం చంద్రబాబునాయుడు ఓటుకు ఓటు కేసులో ఇరుక్కోవడం, లక్షల కోట్లు అవినీతి చేయడం తదితర కారణాలతో కేంద్రం.. రాష్ట్రానికి అన్యాయం చేసిందన్నారు. నాటి నుంచి నేటి వరకు తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక హోదా కోసమే పోరాడుతున్నారన్నారు. నాలుగేళ్లు తరువాత సీఎం చంద్రబాబునాయుడు ప్రత్యేక హోదా అంటూ యూటర్న్ తీసుకొని.. పోరాటం చేస్తున్నాని చెప్పితే నమ్మేందుకు ప్రజలెవరూ సిద్ధంగా లేరన్నారు. హోదాతో ఏమీ రావని, అది ముగిసిన అధ్యాయం అని చెప్పిన సీఎం.. ఊసరవెల్లిలా ఎన్నికలు దగ్గర పడడంతో మాటమార్చారన్నారు. కేంద్ర ప్రభుత్వంపై రెండోసారి వైఎస్ఆర్సీపీ ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానానికి తెలుగుదేశం పార్టీ మద్దతు ఇవ్వాలని, లేదంటే ప్రజలే వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారన్నారు. -
అదనపు మూలధనం మంచిదేకానీ..
ముంబై: కేంద్రం అదనపు మూలధన కేటాయింపులు బ్యాకింగ్‌కు మంచిదేకానీ మొండిబకాయిలతోనే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని రేటింగ్ సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. 2017–18, 2018–19 ఆర్థిక సంవత్సరాల్లో రూ. 2.11 లక్షల కోట్ల ప్యాకేజ్‌లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ.88 వేల కోట్ల అదనపు మూలధనాన్ని బ్యాంకింగ్‌కు అందించనున్నట్లు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ బుధవారం ప్రకటించిన నేపథ్యంలో... రెండు ప్రధాన రేటింగ్ సంస్థల విశ్లేషణల్లో ప్రధాన అంశాలు చూస్తే.... ఇబ్బందులు తగ్గుతాయ్: ఫిచ్ ప్రభుత్వ తాజామూలధన కల్పన మూలధనానికి సంబంధించి ప్రభుత్వ రంగ బ్యాంకుల ఇబ్బందులు తగ్గడానికి దోహదపడుతుంది. నిర్వహణకు సంబంధించి రేటింగ్స్ పడిపోయే అవకాశాలను తగ్గిస్తుంది. అయితే మొండిబకాయిలు, అధిక రుణ వ్యయాలు సమీప భవిష్యత్తులో బ్యాంకింగ్ పనితీరుకు కొంత ఇబ్బంది కలిగించే అంశాలే. బలహీన రుణ నాణ్యత, ఆదాయాలపై బ్యాంకింగ్ తక్షణం దృష్టి సారించాలి. వ్యాపార వ్యూహాలను పటిష్టపరచుకోవాలి. చిన్న తరహా పరిశ్రమలకు రుణ సాయం పెరగాలి. బ్యాంకులకు క్రెడిట్ పాజిటివ్: ఎస్అండ్పీ ప్రభుత్వ తాజా ప్రకటన బ్యాంకులకు క్రెడిట్ పాజిటివ్. అయితే ఇదొక్కటే సరిపోదు. మొండిబకాయిల పరిష్కారానికి పెద్దపీట వేయడంతోపాటు బ్యాంకింగ్ ప్రధానంగా పనితీరును మెరుగుపరచుకోవడంపై దృష్టి పెట్టాలి. రిస్క్ నిర్వహణా విధానాలకు పదునుపెట్టాలి. లాభదాయకత దిశగా బ్యాంకులు విభిన్న వ్యాపార వ్యూహాలను అలవరచుకోవాలి. బ్యాంకులు క్రమంగా బ్యాంకింగ్యేతర వ్యాపారాలను మానుకుని, తమ ప్రధాన వ్యాపారాలపై దృష్టి సారించాలి. -
వాళ్లను చంపేయాలి... మాజీ న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఒకవైపు జేఎన్‌యూ వివాదం రగులుతూ ఉండగానే ఈ కేసును విచారించిన జడ్జి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఎస్ఎస్ దింగ్రా... అఫ్జల్ గురును వెనకేసుకొచ్చే రాజకీయ నాయకులను చంపేయాలంటూ వివాదానికి తెర లేపారు. ఈ వివాదం నేపథ్యంలో ఓ మీడియా సంస్థకిచ్చిన ఇంటర్య్వూలో ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. పార్లమెంటుపై దాడికి పాల్పడిన కేసులో అఫ్జల్ గురుకు ఉరిశిక్ష విధించడాన్ని ఖండిస్తున్న జేఎన్‌యూ విద్యార్థులను ఆయన తప్పు బట్టారు. ‘జ్యుడిషియల్ కిల్లింగ్’ అంటూ ఆరోపించడంపై ఎస్ఎస్ దింగ్రా మండిపడ్డారు. పార్లమెంటుపై దాడి సందర్భంగా 40,50 మంది ప్రాణాలు కోల్పోతే పరిస్థితి ఏంటని వారిని వెనకేసుకొస్తున్న పార్లమెంటు సభ్యులనుద్దేశించి ప్రశ్నించారు. అపుడు పరిస్థితి వేరేలా ఉండేదని ఆయన వ్యాఖ్యానించారు. సమాజానికి ప్రమాదంగా పరిణమించిన వ్యక్తులను శిక్షించే అధికారం మన న్యాయ వ్యవస్థకు ఉంటుందని ఎస్ఎస్ దింగ్రా స్పష్టం చేశారు. భారతీయ శిక్షా స్మృతిలో అలాంటి నిబంధనలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇలాంటి శిక్షలు హత్యలు ఎలా అవుతాయని ఆయన ప్రశ్నించారు. 2002లో పార్లమెంటుపై దాడి కేసులో దోషిగా 15 మంది మృతికి కారణమైన వ్యక్తి బలిదానం చేశాడంటూ సంతాపం వ్యక్తం చేయడం సరైంది కాదని దింగ్రా మండిపడ్డారు. అఫ్జల్‌గురుని ఉరితీసిన రోజును సంతాప దినంగా వ్యవహరిస్తూ జేఎన్‌యూలో విద్యార్థులు ర్యాలీ వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో కూడా దీనిపై దుమారం చెలరేగుతోంది.