ఎన్టీఆర్‌ను పదవి నుంచి తప్పించడంలో రజనీకాంత్ పాత్ర: జోగి రమేష్
సాక్షి, తాడేపల్లి: ఎన్టీఆర్‌ను చంపిన వారందరూ ఒకే వేదిక మీదకు వచ్చి ఇప్పుడు ఆయనను పొగుడుతున్నారని మండిపడ్డారు మంత్రి జోగి రమేష్. ఎన్టీఆర్ చనిపోయిన 27 ఏళ్ల తర్వాత భారతరత్న ఇప్పిస్తావా చంద్రబాబు? అని ప్రశ్నించారు. 14 ఏళ్లు సీఎంగా ఉండి ఏం చేశావు? అని అడిగారు. అప్పుడు ఎన్టీఆర్‌కు భారతరత్న ఎందుకు ఇప్పించలేదు అని నిలదీశారు.
ఎన్టీఆర్‌ను పదవి నుంచి తప్పించడంలో రజనీకాంత్ పాత్ర కూడా ఉందని జోగి రమేష్ అన్నారు. చంద్రబాబు తన వారసుడని ఎన్టీఆర్ ఎప్పుడన్నా ప్రకటించారా? అని ప్రశ్నించారు. తడిగుడ్డతో గొంతులు కోసే వ్యక్తి చంద్ర బాబు అని ఫైర్ అయ్యారు. చంద్రబాబు ఒక నయవంచకుడు, వెన్నుపోటుదారుడు అంటూ ధ్వజమెత్తారు.
'పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచి టీడీపీని, ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌ను చంద్రబాబు లాక్కున్నారు. 14 ఏళ్ల చంద్రబాబు పాలనలో మంచి జరిగిందని ఏ ఒక్కరైనా చెప్పగలరా? ఎన్టీఆర్‌ను చంపిన ఖూనీకోర్లు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ యుగానికి తడిగుడ్డలతో గొంతులు కోసే రక్త చరిత్ర ఉన్న వ్యక్తి చంద్రబాబు. ఈ యుగానికి వీరుడు, ధీరుడు సీఎం వైఎస్ జగన్. లోకేష్ పాదయాత్ర పేరుతో డ్రామాలు చేస్తున్నాడు. తెలుగు సినీ తారలెవరైనా చంద్రబాబును పొగుడుతారా?' అని జోగ్ రమేశ్ ప్రశ్నించారు.
చదవండి: రజనీకాంత్ వ్యాఖ్యలు అజ్ఞానానికి నిదర్శనం: కొమ్మినేని శ్రీనివాసరావు