స్మృతికి బ్యాడ్ టైమ్ మొదలైంది
కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీకి చెడు రోజులు మొదలయ్యాయని, కేంద్రంలో ఆమెకు ప్రాధాన్యం తగ్గిపోతుండటమే దీనికి నిదర్శనమని ఎన్సీపీ నేత తారిఖ్ అన్వర్ అన్నారు. కేంద్రమంత్రిగా స్మృతి పనితీరు ప్రధాని నరేంద్ర మోదీకి నచ్చలేదని ఆయన చెప్పారు.
ఇటీవల జరిగిన కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో మానవ వననరుల అభివృద్ధి శాఖ నుంచి స్మృతిని తప్పించి అంతగా ప్రాధాన్యంలేని జౌళి శాఖను కేటాయించిన విషయాన్ని అన్వర్ గుర్తు చేశారు. అలాగే పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ నుంచి ఆమెకు ఉద్వాసన పలికారు. స్మృతికి ఒకదాని తర్వాత మరొకటి ఎదురవుతున్న పరిణామాలను గమనిస్తే, ఆమెకు ప్రాధాన్యం క్రమంగా తగ్గుతోందని, బ్యాడ్ టైమ్ మొదలైందని ఎన్సీపీ నేత వ్యాఖ్యానించారు.