Bad politics
-
గుడివాడపైనే గురెందుకు? రెచ్చగొడుతున్నదెవరు?
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: కోస్తాంధ్రలోని గుడివాడ రాజకీయాలపై టీడీపీ ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. ఇటీవలి కాలంలో ఇది మరీ ఎక్కువైంది. ప్రతి అంశంలోనూ గిల్లికజ్జాలు పెట్టుకోవడం, తీవ్ర నిందారోపణలు మోపడం, బల ప్రదర్శనలకు దిగడం, దాడులకు పురమాయిస్తూ ఘర్షణ వాతావరణాన్ని సృష్టించడం, చివరకు పాలక పార్టీ నేత లపై నెట్టేయడం రివాజైందనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా వైఎస్సార్ సీపీకి చెందిన స్థానిక శాసనసభ్యుడు, మాజీ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని), ఆయన ముఖ్య అనుచరులపై టీడీపీ నాయకత్వం, ఓ వర్గం మీడియా పనిగట్టుకుని మరీ వ్యతిరేకంగా వ్యవహరిస్తోందనే అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఉనికిని నిలబెట్టుకునే ప్రయత్నాల్లో భాగంగా టీడీపీ అధిష్ఠానమే పార్టీలో గ్రూపులను ఎగదోస్తూ తగువులను ప్రోత్సహిస్తోందనే అనుమానాలు స్వపక్షం నుంచి కూడా వ్యక్తమవుతున్నాయి. అంతర్గత కుమ్ములాటలతో నిలకడలేక ప్రతి సాధారణ ఎన్నికల్లోనూ చతికిలపడుతున్న ‘సైకిల్’కు స్టాండ్‌ను అమర్చుకునే క్రమంలో ప్రతిపక్ష పార్టీపై బురద చల్లుతుందనే చర్చ లేకపోలేదు. వీటన్నింటినీ మించి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ లోపాలను నిత్యం ఎత్తి చూపుతూ తూర్పార పడుతున్న కొడాలిపై ప్రత్యేకంగా రాజకీయ కక్ష తీర్చుకునేలా ఎన్నికలకు ముందస్తు ఎత్తుగడలు అధికమవుతున్నాయనేది పరిశీలకుల మాట. ప్రతి ఎన్నికకూ గుడివాడ నుంచి కొత్త అభ్యర్థిని రంగంలోకి దింపడం, ఓటమిపాలై వెనుతిరగడం షరా మామూలైన నేపథ్యంలో తాజాగానూ కొత్త పేర్లను తెరపైకి తెచ్చే పనిలో తమ పార్టీ ఉందని టీడీపీ వర్గాలే బాహాటంగా అంటున్నాయి. టీడీపీకి గుడివాడ ప్రత్యేకం... టీడీపీకి గుడివాడ అన్ని కోణాల్లో ప్రత్యేకం. పార్టీ ఆవిర్భావ నేత ఎన్టీ రామారావుది ఈ ప్రాంతమే. నిత్యం జాకీలు పెట్టి టీడీపీని నిలబెట్టే ప్రయత్నాలు చేసే మీడియా ముఖ్యులూ ఇక్కడివారే. ఎలాగైనా పునర్వైభవం తీసుకురావాలనే లక్ష్యంతో కొడాలిని లక్ష్యంగా చేసుకుని పని చేస్తున్నారనడం బహిరంగ రహస్యం. ఎన్టీఆర్ గుడివాడ నుంచి 1983లో స్వతంత్ర అభ్యర్థిగా, 1985లో టీడీపీ అభ్యరి్థగా పోటీ చేసి విజయం సాధించారు. 1994లో రావి శోభనాద్రీశ్వరరావు, 1999లో రావి హరిగోపాల్ గెలుపొందారు. 2004 నుంచి కొడాలిదే హవా.. 2004 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించిన కొడాలి నాని 2009లోనూ అదే పరంపర కొనసాగించారు. చంద్రబాబుతో విభేదించి టీడీపీని వీడిన కొడాలిని గుడివాడ ఓటర్లు మాత్రం విస్మరించలేదు. వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా 2014, 2019 ఎన్నికల్లో వరుస విజయాలను సొంతం చేసుకున్నారు. విశ్వసనీయతకే పెద్దపీట అంటూ... గుడివాడ ఓటర్లు విశ్వసనీయతకు, నాయకత్వానికీ పెద్దపీట వేస్తారని, వారి నమ్మకాన్ని ఎప్పుడూ ఒమ్ము చేయలేదన్నది కొడాలి మాట. తాను సీఎం జగన్మోహన్రెడ్డి, వైఎస్సార్ సీపీకి కట్టుబడి ఉన్నానని, అదేవిధంగా ఎన్టీఆర్ కుటుంబానికీ విధేయుడినని చెప్పుకుంటుంటారు. ఇవే తనను నిలబెడుతున్నాయంటారు. ఎన్టీఆర్‌కు, ఆయన కుటుంబానికి తీరని ద్రోహం చేసిన చంద్రబాబును ఏవిధంగానూ వదిలేది లేదని పరుషంగా అంటుంటారు. ఈ పరిస్థితుల నుంచి కొడాలిని గిరాటు వేయాలనే చంద్రబాబు ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయన్నది జవాబులేని ప్రశ్నే. కొడాలిపై కాలు దువ్వడమే.. 2014 నుంచి 2019 మ«ధ్య అధికారంలో ఉన్నంత కాలం కొడాలిని ఎలాగైనా దెబ్బ తీయాలని చంద్రబాబు శతథా ప్రయతి్నస్తున్నారు. ఆయనపైకి బుద్ధా వెంకన్న, బొండా ఉమామహేశ్వరరావు తదితరులతో పాటు రౌడీలను విజయవాడ నుంచి పంపారు. ఇలా రెండు పర్యాయాలు విజయవాడ నుంచి మందీ మార్భలంతో కొడాలిపై కత్తులు దూస్తూ వెళ్లడం ఆయా సందర్భాల్లో ఉద్రిక్తతలకు దారి తీశాయి. జిల్లా పార్టీ అ«ధ్యక్షునిగా, మంత్రిగా దేవినేని ఉమామహేశ్వరరావును నానిపైకి అధిష్ఠానం ఉసిగొల్పని సందర్భమంటూ లేదనేది ఆ పార్టీలోని అన్నిస్థాయిల నాయకులకూ తెలుసు. క్యాసినో పేరిట, గడ్డం గ్యాంగ్ అంటూ... వ్యక్తిత్వ హనన ప్రయత్నాలు నిత్యం కొనసాగుతూనే ఉన్నాయి. టీడీపీవి విఫల ప్రయోగాలే.. కొడాలిని ఎలాగైనా ఓడించి తీరాలని కంకణం కట్టుకున్న చంద్రబాబు రావి, పిన్నమనేని, దేవినేని కుటుంబ వారసులను రంగంలోకి దించినా ఫలితం లేదు సరికదా కొరకరాని కొయ్యలా మారారు. రానున్న ఎన్నికల్లోనూ కొత్త ప్రయోగం చేయపోతున్నారని, ఇప్పటికే ఎన్ఆర్ఐని రంగ ప్రవేశం చేయించారనే ప్రచారం ఊపందుకుంది. అంతర్గత కుమ్ము లాటలతో పార్టీ మరింతగా కకావికలమవుతుందా, నిలబడుతుందా కాలమే చెప్పాలి. కాగా 2004లో టీడీపీ అభ్యర్థిగా 8,864 ఓట్లు (8.06 శాతం), 2009లో 17,630 ఓట్లు (11.90 శాతం) ఓట్ల ఆధిక్యతతో గెలుపొందిన నాని వైఎస్సార్ సీపీ అభ్యరి్థగానూ అంతకన్నా ఆధిక్యతను కొనసాగించారు. 2014లో 11,537 ఓట్లు (7.29 శాతం) మెజార్టీతో రావి వెంకటేశ్వరరావుపై గెలుపొందారు. టీడీపీ జిల్లా రాజకీయాల్లో రెండు దశాబ్దాలకు పైగా చక్రం తిప్పిన మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్ (నెహ్రూ) కుమారుడు అప్పటి తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు అయిన దేవినేని అవినాష్‌ను ప్రత్యేకంగా గుడివాడకు పంపి కొడాలిపై పోటీ చేయించారు. చదవండి: ఏ ఎండకు ఆ గొడుగు.. బాబు ‘సానుభూతి’ రాజకీయం చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్ రూ.కోట్లు కుమ్మరింపజేశారు. గత ఎన్నికలన్నింటికన్నా 19,479 ఓట్లు (9.6 శాతం) మెజార్టీని నాని సాధించారు. ఇదే ఎన్నికల్లో మరో విచిత్ర ప్రయోగమూ జరిగింది. కొడాలి వెంకటేశ్వరరావు అనే పేరుగల వ్యక్తిని పోటీకి దింపడం గమనార్హం. అంతర్గత అవగాహనలో భాగంగా 2014లో కాంగ్రెస్ అభ్యరి్థగా అట్లూరి సుబ్బారావును నానిపై పోటీకి నిలపడం ద్వారా ఓట్లు చీలి తమకు అనుకూల ఫలితం వస్తుందనే బాబు బృందానికి నిరాశే మిగిలింది. 1985లో టీడీపీ అభ్యర్థిగా ఎన్టీఆర్‌కు 53.64 శాతం ఓట్లు రాగా వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా కొడాలి నానికి 2014లో 55.32 శాతం, 2019లో 53.50 శాతం ఓట్లు రావడం విశేషం. కాగా ఎన్టీఆర్‌కు ఇండిపెండెంట్‌గా 1983లోను, 2004లో తొలిసారి అసెంబ్లీ స్థానానికి పోటీ చేసిన నానికి 60 శాతానికి పైగా ఓట్లు దక్కడం పరిశీలనాంశం. కాగా 1999 ఎన్నికల్లో ‘అన్న తెలుగుదేశం పార్టీ’ అభ్యర్థిగా గుడివాడ నుంచి నందమూరి హరికృష్ణ పోటీ చేయగా 11,238 ఓట్లు దక్కాయి. కొడాలి అప్పటికి ఎన్నికల రంగంలో లేరు. -
ప్రాజెక్టులకు ‘వెన్నుపోటు’.. ఈ ప్రశ్నలకు బదులేది బాబూ?
పోలవరం ప్రాజెక్టును నేనే పూర్తి చేస్తా.. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తాజా ప్రకటన. గోదావరి జిల్లాల పర్యటనకు వెళ్లిన సందర్భంగా ఆయన చేసిన అనేక ప్రకటనలలో ఇది ఒకటి. అంతేకాదు.. చీకట్లో పోలవరం సందర్శిస్తానని ధర్నా చేశారు. నిజంగానే చంద్రబాబుకు భారీ ప్రాజెక్టులపైన నమ్మకం ఉదా? నిజంగా చెప్పాలంటే ఆయనకు ఆ విశ్వాసమే లేదు. ఏదైనా పని చేయడానికి ముందు అసలు ఆ వర్క్ మీద ఒక అభిప్రాయం ఉండాలి. ఒక లక్ష్యం ఉండాలి. అవేవి లేకుండా ఏదో చేసేస్తానని చెబితే అది మొక్కుబడి తంతే అవుతుంది తప్ప మరొకటి కాదు. ఎందుకంటే చంద్రబాబు 1995-2004 మధ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరైనా పోలవరం, పులిచింతల ప్రాజెక్టుల గురించి ప్రస్తావించి , వాటిని చేపట్టాలని కోరినప్పుడు అవి అయ్యేవి కావు.. అని మొహమాటం లేకుండా చెప్పేవారు. అదేమిటంటే ఎన్నికల సమయానికి అవి పూర్తి కావని, అందువల్ల ఎన్నికలలో లబ్ది రాదని ఆయన గట్టిగా విశ్వసించేవారు. అప్పట్లో ఆయన ఇంకుడు గుంతలు, చెరువులు వంటి వాటికే అధిక ప్రాధాన్యత ఇచ్చేవారు. ఇది పచ్చి నిజం. ఆ రోజుల్లో కనుక చంద్రబాబు పోలవరం వంటివాటిపై దృష్టి పెట్టి ఉంటే, ఎప్పుడో ఆ ప్రాజెక్టులు పూర్తి అయిపోయేవి. కాని వాటిని అసలుపట్టించుకోలేదు. దటీజ్ వైఎస్ 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ పదవి చేపట్టగానే ఆయన మొదట చేసింది ప్రాజెక్టుల ఫైళ్ళు తీసి దుమ్ము దులపడం. చంద్రబాబు టైమ్ లోనే అధికారులు ప్రాజెక్టులకు సంబంధించి ఒక నివేదిక తయారు చేశారు. దాని ప్రకారం రూ.46 వేల కోట్లతో ఉమ్మడి ఏపీలోని వివిధ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టవచ్చని అందులో తెలిపారు. కానీ చంద్రబాబు దానిని పక్కనపడేశారు. ఆ తర్వాత వైఎస్ హయాంలో క్యాబినెట్ సమావేశంలో ఈ నివేదికను అధికారులు పెట్టినప్పుడు ఆనాటి మంత్రులు వారిని ఒక ప్రశ్న వేశారు. నివేదిక సిద్దం చేసినా చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు ఓకే చేయలేదని అడిగారు. దానికి అధికారులు తమ బాధ్యత ప్రభుత్వంలోకి వచ్చినవారికి నివేదికలు సమర్పించడమేనని, వారి ప్రాధాన్యతలు వేరుగా ఉంటే తామేమీ చేయగలమని అన్నారు. ఆ సమావేశం తర్వాత వైఎస్ మీడియాతో మాట్లాడుతూ పోలవరం , పులిచింతల ప్రాజెక్టులతో సహా వివిధ ప్రాజెక్టులను పూర్తి చేసి తీరుతామని అన్నారు. చిత్తశుద్ధి.. జల సిద్ధి ఎవరైనా ఇంత పెద్ద ప్రాజెక్టులు సకాలంలో పూర్తి అవుతాయా అంటే, ఎక్కడో చోట మొదలైతే, తర్వాత వచ్చేవారు అయినా పూర్తి చేస్తారు కదా అని జవాబు ఇచ్చేవారు. దీనిని విజన్ అంటారు. ఆ ప్రకారమే ఆయన ముందుకు వెళ్లారు. పులిచింతలకు శ్రీకారం చుట్టారు. పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన పనులను ఆరంభించారు. ముందుగా పోలవరం ముంపు ప్రాంత రాజకీయనేతలతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. అందులో ఈ ప్రాజెక్టు అవశ్యకత, ముంపు బాదితులను ఆదుకోవడానికి తీసుకునే చర్యలు మొదలైన వాటిని వివరించి వారందరిని ఈ ప్రాజెక్టు ముందుకు సాగేలా ఒప్పించారు. తదుపరి కేంద్ర ప్రభుత్వం నుంచి రావల్సిన అనుమతులపై దృష్టి పెట్టి పర్యావరణ అనుమతితో సహా పలు క్లియరెన్స్‌లను సాధించారు. అదే సమయంలో ప్రాజెక్టు కింద భూ సేకరణ చేసి కాల్వలను తవ్వించారు. కృష్ణా నది వరకు వచ్చే కుడి కాల్వను దాదాపు పూర్తి చేశారు. కానీ కొన్ని చోట్ల టిడిపి నేతలు పరిహారం పేరుతోనో, ఇతరత్రానో కాల్వ తవ్వకాలకు అడ్డుపడేవారు. అప్పుడు కూడా ప్రతిపక్ష నేత గా ఉన్న చంద్రబాబు ప్రాజెక్టు కట్టకుండా కాల్వలా అని విమర్శిస్తుండేవారు. అయినా ధైర్యంగా వైఎస్ ముందుకు వెళ్లారు. ఆయన అలా చేయకపోతే ప్రాజెక్టు పూర్తి అయినా కాల్వలు సిద్దం అయ్యేవి కావు. కాని దురదృష్టవశాత్తు ఆయన మరణించడంతో ఆ ప్రాజెక్టు కూడా మందగమనంలోకి వెళ్లింది. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే తదుపరి వచ్చిన రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాలు సంబంధిత కాంట్రాక్టును ఫైనలైజ్ చేయడానికే చాలా సమయం తీసుకున్నాయి. అప్పటికీ ఒక కంపెనీకి ఆమోదం తెలిపినా, తదుపరి రాజకీయ, ఇతర కారణాలతో దానిని రద్దు చేశారు. ఆ తర్వాత మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్ ట్రాయ్ కి కాంట్రాక్ట్ అప్పగించింది కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వం .ఆ కంపెనీ ప్రాథమిక ఏర్పాట్లకే అధిక సమయం తీసుకుంది. ప్రాజెక్టు బాగా ఆలస్యం అయింది. ఇంతలో రాష్ట్ర విభజన జరగడం, పోలవరం పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు కు అవకాశం వచ్చింది. ప్రధాని మోడీ తెలంగాణలోని ముంపు మండలాలను ఏపీలో విలీనం చేస్తూ ఆర్డినెన్స్ ఇచ్చారు. అది తన వల్లే జరిగిందని చంద్రబాబు చెప్పుకుంటారు. కాని బీజేపీ నేతలు మాత్రం అది నిజం కాదని, తమ వల్లే జరిగిందని అంటారు. ఏది ఏమైనా ఆ టైమ్ లో కాస్తో, కూస్తో మంచి జరిగిందంటే అదే అనుకోవాలి. నిజంగానే చంద్రబాబే అధి సాధించి ఉంటే, ముఖ్యమంత్రి అయిన వెంటనే ఎందుకు ఆ ప్రాజెక్టు నిర్మాణంపై దృష్టి పెట్టలేదన్నదానికి సమాధానం దొరకదు. దాదాపు రెండున్నర ఏళ్లు ఆ ప్రాజెక్టు ఎక్కడ వేసిన గొంగళి అన్న చందంగా ఉండిపోయింది. జీవనాడితో బాబు ఆటలు ఈ ప్రాజెక్టుకు బదులు పట్టిసీమ లిప్ట్ ప్రాజెక్టు చేపట్టి, అదే గొప్ప విషయం అని చెప్పుకునేవారు. ఆ లిప్ట్ కు ఖర్చు చేసిన 1700 కోట్లను పోలవరం ప్రాజెక్టుపై ఆ రోజులలో పెట్టి ఉండి ఉంటే ఆయనకు మంచి పేరు వచ్చేది. ఎందరో ఆ మాట చెప్పినా ఆయన వినిపించుకోలేదు. అందులో ఆయనకు ఆర్ధిక ప్రయోజనాలు ఉన్నాయని ప్రతిపక్షాలు విమర్శించేవి. తదుపరి ఏపీకి ప్రత్యేక హోదా లేకుండా, ప్యాకేజీని అంగీకరించిన ఫలితంగా చంద్రబాబు ప్రభుత్వానికి పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు బాద్యతలు అప్పగించడానికి కేంద్రం ఒప్పుకుంది. ఆ తర్వాత ఆయన ఆ కాంట్రాక్ట్‌ను ట్రాన్స్ ట్రాయ్ నుంచి నవయుగ సంస్థకు మార్చారు. ఆ పిమ్మట కొంత పని జరిగినా, ఆశించినంత వేగంగా సాగలేదు. చంద్రబాబు సోమవారంపోలవారం అంటూ ప్రచారం చేసుకునేవారు. చంద్రబాబు ఈ విషయంలో విఫలం అయ్యారని స్వయంగా ఆయన పార్టీలో ఉన్నప్పుడు కేంద్ర మంత్రిగా పనిచేసి తదుపరి బిజెపిలోకి వెళ్లిన సుజనా చౌదరే వ్యాఖ్యానించారు. చంద్రబాబు అసలు పనులు మానేసి అసిస్టెంట్ ఇంజనీర్, ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ చేసే పనులను తానే చేయాలని భావించేవారని ఆయన ఎద్దేవా చేశారు. బాబు ఏటీఎం@ పోలవరం ఆ తర్వాత ఎన్నికల సమయంలో ప్రధాని మోదీ వచ్చి పోలవరం చంద్రబాబుకు ఏటీఎం అయిందని, కాంట్రాక్ట్ పేరుతో ప్రాజెక్ట్‌ను పూర్తిగా అవినీతి మయం చేశారని ఆరోపించారు. దానికి ఇంతవరకు చంద్రబాబు సమాధానం ఇవ్వలేకపోయారు. ఇంకో సంగతి చెప్పాలి. పోలవరం ప్రాజెక్టు కోసం ఎర్రా నారాయణ స్వామి, వడ్డి వీరభద్రరావు వంటివారు ఎన్నోసార్లు చంద్రబాబు చుట్టూ తిరిగేవారు. వడ్డి అయితే ఢిల్లీకి సైకిల్ యాత్ర చేశారు. చివరికి పని జరగడం లేదని నిరసనగా గుండు కూడా కొట్టించుకున్నారు. వీటన్నింటిని మర్చిపోయినట్లు చంద్రబాబు నటిస్తుంటారు. ఇంత చరిత్ర తన వెనుక ఉన్నా.. చంద్రబాబు మాత్రం పోలవరం తన కల అని ప్రచారం చేసుకుంటారు. తాను పూర్తి చేస్తానని అంటారు. చంద్రబాబే కనుక కాపర్ డామ్లను సజావుగా పూర్తి చేయించగలిగి ఉంటే, ఇప్పుడు డయాఫ్రమ్ వాల్ కు వరదల వల్ల నష్టం కలిగేది కాదని నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. ఈ ప్రాజెక్టును ముఖ్యమంత్రి జగన్ మేఘా సంస్థకు అప్పగించారు. ఆ తర్వాత ప్రాజెక్టు గేట్లు అన్నీ పూర్తి అయ్యాయి. కరోనా సమస్య, భారీ వరదలు రాకుండా ఉంటే ఈ పాటికి ఈ ప్రాజెక్టు తొలి దశ పూర్తి అయి ఉండేది. అదే సమయంలో నిర్వాసితుల పరిహారం సమస్య పూర్తి కాకపోవడం కూడా ఇబ్బంది అయింది. కవరేజీ కోసం పాకులాట ప్రస్తుత ప్రభుత్వం కచ్చితంగా పోలవరం తొలిదశను పూర్తి చేసి గ్రావిటీ ద్వారా నీటిని అందించాలి. అందులో భిన్నాభిప్రాయం లేదు. ఇదేం ఖర్మ పేరుతో చంద్రబాబు ఆ ప్రాంతంలో తిరుగుతూ పోలవరం సందర్శనను సడన్ గా పెట్టుకున్నారు. చీకటి వేళ అనుమతి లేకుండా ఇంత పెద్ద నాయకుడు ఆ ప్రాజెక్టు సైట్ కు వెళ్లాలని అనుకోవడమే తప్పు. నిజంగా ఆయనకు ఆ ఉద్దేశం ఉంటే ముందుగానే ప్రభుత్వానికి ఆ విషయం చెప్పి వెళ్ళవచ్చు. తగు సెక్యూరిటీ ఏర్పాట్లు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. అలాకాకుండా రాత్రివేళ అక్కడికి వెళతానని రోడ్డు మీద కూర్చోవడం ఏమిటో అర్ధం కాదు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆయనకు తెలియదా? ఆయన పర్యటనలో ఏవైనా అసాంఘిక శక్తులు చొరబడి ప్రాజెక్టు వద్ద గొడవ సృష్టిస్తే ఎవరు బాద్యత వహిస్తారు? ఇదంతా వచ్చే ఎన్నికల కోసం ఆయన ఆడిన డ్రామా అని ఇట్టే తెలిసిపోతుంది. నిజంగా చిత్తశుద్ది ఉంటే ఇలా ఉత్తుత్తి హడావుడి చేస్తారా? ఆయన అధికారంలో ఉన్నా అంతే.. అధికారంలో లేకపోయినా అంతే.. మీడియా కవరేజీ కోసం ఇలాంటి సన్నివేశాలను సృష్టిస్తుంటారు. నాడు పోలవరం ప్రాజెక్టు డెబ్బై రెండు శాతం పూర్తి అయిందని చంద్రబాబు కాకి లెక్కలు చెబుతుంటారు. ఎన్ని గేట్లు పెట్టారు? ఎంత మందికి పరిహారం ఇచ్చారు. నిర్వాసితులకు ఎన్ని ఇళ్లు కట్టారు? కేంద్రం నుంచి ఎన్ని నిదులుతెచ్చారు? మొదలైనవాటి గురించి మాత్రం ప్రస్తావన చేయరు. ఏది ఏమైనా 14 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు ప్రాజెక్టును పూర్తి చేయని చంద్రబాబు, ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చాక తానే ప్రాజెక్టు పూర్తి చేస్తానని చెప్పడం విడ్డూరమే. -హితైషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
ఎస్ఐ మృతిపైనా ‘పచ్చ’ రాజకీయమే!
సాక్షి, అమరావతి/ఏలూరు టౌన్/పెనుగంచిప్రోలు (జగ్గయ్యపేట): రాష్ట్రంలో ఏ చిన్న ఘటన జరిగినా.. దాన్ని ప్రభుత్వానికి లింక్ పెడుతూ టీడీపీ చేస్తున్న ‘పచ్చ’ రాజకీయం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ప్రతి చిన్న విషయాన్ని ప్రభుత్వానికి అంటగడుతూ.. రాజకీయ లబ్ధి కోసం టీడీపీ చేస్తున్న కుయుక్తులు ప్రజలందరికీ వెగటు పుట్టిస్తున్నాయి. కాకినాడ జిల్లా సర్పవరం ఎస్ఐ ముత్తవరపు గోపాలకృష్ణ మరణంపైన ఆ పార్టీ చేస్తున్న రాజకీయంపై ప్రజలు విస్తుపోతున్నారు. వాస్తవాలను మరుగున పరిచి.. కులం కార్డు తగిలించి రెచ్చగొట్టే చర్యలకు దిగడంపై పోలీసులు సైతం నివ్వెరపోతున్నారు. బాబు జమానాలో పోలీసులకు పదోన్నతులు, పోస్టింగ్‌ల్లో కులం కార్డు చూశారనే తీవ్ర విమర్శలను ఆయన మూటగట్టుకున్నారు. చంద్రబాబు హయాంలో అనేక మంది పోలీసులు అనుమానాస్పదంగా మృతి చెందారు. ఆ మరణాలపై అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్సీపీ ఎటువంటి రాజకీయ విమర్శలను చేయలేదని పలువురు గుర్తు చేస్తున్నారు. వాస్తవానికి 2019 వరకు (టీడీపీ ప్రభుత్వ హయాంలో) మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన డొంకరాయిలో గోపాలకృష్ణ విధులు నిర్వహించారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాకే ఆయనకు రాజోలు, కాకినాడ టౌన్, కాకినాడ ట్రాఫిక్, సర్పవరం ఎస్ఐగా ప్రాధాన్యత కలిగిన పోస్టింగ్‌లు ఇచ్చారు. ఇవేమీ గుర్తించకుండా టీడీపీ నేతలు అవాస్తవాలను వండివార్చడంపై పోలీసులు మండిపడుతున్నారు. చంద్రబాబు జమానాలో పోలీసుల అనుమానాస్పద మరణాలు.. ♦చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఆదినారాయణరెడ్డి గన్‌మెన్ చంద్రశేఖర్‌రెడ్డి కడపలో 2017 సెప్టెంబర్‌లో అనుమానాస్పదంగా మృతి చెందారు. రివాల్వర్ శుభ్రం చేసుకుంటూ మిస్‌ఫైర్ అయినట్టు అప్పట్లో ప్రకటించారు. ♦2017 సెప్టెంబర్‌లో నెల్లూరు ఏఎస్పీ శరత్‌బాబు కారుడ్రైవర్‌గా ఉన్న కానిస్టేబుల్ రమేష్‌బాబు రివాల్వర్ కాల్పులతో మరణించారు. ♦2017 జనవరి 2న కర్నూలు జిల్లాలో చంద్రబాబు పర్యటనకు బందోబస్తుకు వచ్చిన ఏఆర్ కానిస్టేబుల్ హంపన్న చేతిలో ఏకే47 గన్ మిస్‌ఫైర్ అయ్యింది. తీవ్రగాయాలైన హంపన్నకు అత్యవసర వైద్యసేవలు అందించినా ప్రాణాలు దక్కలేదు. ♦2016 జూన్ 16న పాడేరు ఏఎస్పీ కె.శశికుమార్ అనుమానాస్పదంగా మృతిచెందడం కలకలం రేపింది. ప్రమాదవశాత్తు తుపాకీ మిస్‌ఫైర్ అయ్యి మరణించారని తొలుత భావించినప్పటికీ.. ఆయన కణతికి దగ్గర్లో కాల్చుకున్నట్టు ఉండటంతో ఆత్మహత్య అయి ఉండొచ్చని ఉన్నతాధికారులు భావించారు. ♦విజయవాడ సమీపంలోని గన్నవరంలో ఒక కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన తీరు అప్పట్లో అనుమానాలకు తావిచ్చింది. ♦ఢిల్లీలోని ఏపీ భవన్లో 2015 అక్టోబర్‌లో జరిగిన కాల్పుల్లో పోలీస్ అధికారి ఒకరు గాయపడగా అది మిస్‌ఫైర్‌గా విచారణలో నిర్ధారించారు. పోలీస్ లాంఛనాలతో ఎస్ఐ గోపాలకృష్ణకు అంత్యక్రియలు ఎస్ఐ గోపాలకృష్ణ మృతదేహానికి శనివారం ఆయన స్వగ్రామమైన ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం నవాబుపేటలో పోలీస్ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన మృతదేహానికి ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను నివాళులర్పించారు. పలువురు పోలీసులు గౌరవ వందనం చేశారు. శ్మశానవాటికలో పోలీస్ సిబ్బంది మూడు రౌండ్లు గాలిలో కాల్పులు జరిపి అంత్యక్రియలు పూర్తి చేయించారు. తప్పుడు కథనాలపై చర్యలు తప్పవు గోపాలకృష్ణ మృతిపై కొన్ని టీవీ చానళ్లలో తప్పుడు కథనాలు వస్తున్నాయి. అటువంటి వాటిపై చర్యలు తప్పవు. పోస్టింగ్‌ల విషయంలో గోపాలకృష్ణకు ఎటువంటి అన్యాయం జరగలేదు. ఆయన మృతికి ఉన్నతాధికారుల వేధింపులు, పోస్టింగ్ కారణం కాదు. సున్నిత మనస్తత్వం కారణంగా పోలీస్ శాఖలో ఇమడలేకపోవడం, తన చదువుకు తగ్గ వృత్తిలోకి వెళ్లలేకపోవడంతో మానసిక ఒత్తిడికి లోనైనట్టు సూసైడ్ నోట్లో గోపాలకృష్ణ పేర్కొన్నారు. ఇదే విషయాన్ని ఇప్పటికే ఆయన కుటుంబ సభ్యులు సైతం వెల్లడించారు. – పాలరాజు, డీఐజీ, ఏలూరు రేంజ్ ఎస్ఐ మృతిపై రాజకీయం ఆపండి ఎస్ఐ గోపాలకృష్ణ మృతిని రాజకీయం చేయడం ఆపాలి. కొందరి రాజకీయ నాయకుల వ్యాఖ్యలు పోలీసులు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయి. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. – జనకుల శ్రీనివాస్, అధ్యక్షుడు, ఏపీ పోలీసు అధికారుల సంఘం రివాల్వర్ మిస్‌ఫైర్ వల్లే జరిగిందనుకుంటున్నాం.. రివాల్వర్ మిస్‌ఫైర్ కావడం వల్లే మా సోదరుడు గోపాలకృష్ణ మరణించి ఉండొచ్చు. ఆయనకు ఎటువంటి ఆర్థిక, కుటుంబపరమైన సమస్యలు లేవు. కొన్ని టీవీ చానల్స్‌లో వస్తున్న వార్తలు నిజం కాదు. పోలీసుల దర్యాప్తుపై మాకు పూర్తి నమ్మకముంది. – సైదులు, మృతుడు ఎస్ఐ గోపాలకృష్ణ సోదరుడు -
నీచ రాజకీయం
-
పదవుల కోసం ఇంత నీచ రాజకీయాలా?
వైఎస్సార్ సీపీ నేత గొల్ల బాబూరావు ఆవేదన కోటవురట్ల: పదవుల కోసం పాకులాడి నీచ రాజకీయాలు చేసేవారిని ప్రజలు క్షమించరని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు వ్యాఖ్యానించారు. పాములవాకలో ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇటీవల కొందరు ఎమ్మెల్యేల టీడీపీలో చేరిని విషయంపై ఆయన తీవ్రంగా స్పందించారు. వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి ఎంతో విలువ ఇచ్చి కుటుంబసభ్యుల్లా చూసుకుంటే ఇటువంటి నీచానికి దిగజారడం దారుణమన్నారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి తనకు పిలిచి అసెంబ్లీ సీటు ఇచ్చారని, ఆయన పేరుతో గెలిచినా పదవిని సైతం త్యజించి మళ్లీ వైఎస్సార్ సీపీ జెండాతో ఉప ఎన్నికకు వెళ్లి అత్యధిక మెజార్టీతో గెలిచిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రాణం ఉన్నంత వరకు మన కోసం ఆలోచించిన వారి వెంటే ఉంటానని స్పష్టంచేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్న చందంగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. మరోసారి గెలిచే సత్తా లేక అడ్డదారులు తొక్కుతూ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఆయనకు ఆది నుండి మోసాలు చేయడం అలవాటేనన్నారు. మామను వెన్నుపోటు పొడిచి గద్దెనెక్కిన ఆయన అవే రాజకీయాలను నడుపుతున్నారని దుయ్యబట్టారు. తెలంగాణలో టీడీపీ అడ్రస్ గల్లంతు కావడంతో ఇక్కడ మైండ్ గేమ్ మొదలెట్టారని విమర్శించారు.