Badaun rape case
-
ఆ అక్కాచెల్లెళ్లపై అత్యాచారం జరగలేదు!
యూపీలోని బదయూ జిల్లాలో అనుమానాస్పదంగా మృతి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు అత్యాచారానికి గురికాలేదని, వాళ్లను ఎవరూ హత్య చేయలేదని ఆధారాలతో కేసు మూసివేత నివేదికను సీబీఐ కోర్టులో సమర్పించింది. ఈ కేసుకు సంబంధించి 91 పేజీల నివేదికను సీబీఐ గురువారం ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ (పీఓసీఎస్ఓ) కోర్టు జిల్లా అదనపు న్యాయమూర్తి జస్టిస్ అనిల్ కుమార్‌కు, ఫిర్యాదుదారులకు అందజేసింది. ఇందులో 34 పేజీల మూసివేత నివేదిక, 2 పేజీలలో ఇద్దరు బాలికల పోస్ట్‌మార్టమ్ రిపోర్టు, 4 పేజీల సాక్షుల లిస్టు, మిగతా పేజీలలో సాక్షులు చెప్పినవి, డీఎన్ఏ, ఫోరెన్సిక్, స్టేటస్ రిపోర్టులున్నాయి. వారు అత్యాచారానికి, హత్యకు గురయ్యారనడానికి ఎంలాంటి ఆధారాలు లేవని నివేదికలో పేర్కొంది. ఈ కేసును కోర్టు ఫిబ్రవరి 11కు వాయిదా వేసింది. వారిద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారని గత డిసెంబర్ 11న సీబీఐ మూసివేత నివేదిక సిద్ధం చేసింది. గతేడాది మే 28న కత్రా గ్రామంలో ఇద్దరు బాలికలు చెట్టుకు వేలాడుతూ అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. -
'బదౌన్' రేప్ కేసులో మరో కానిస్టేబుల్ అరెస్ట్
బరేలీ: ఉత్తరప్రదేశ్ లోని బదౌన్ లో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో మరో కానిస్టేబుల్ లో పోలీసులు అరెస్ట్ చేశారు. రెండో నిందితుడిగా ఉన్న వీరపాల్ యాదవ్ ను ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇంతకుముందు అవినిష్ యాదవ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. డిసెంబర్ 31న ఇంటి నుంచి బయటకు వచ్చిన 14 ఏళ్ల బాలికపై వీరిద్దరూ అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెను మూసాజాగ్ పోలీసు స్టేషన్లోకి లాక్కెళ్లి ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. -
యూపీలో మరో ఘోరం
బదౌన్ ఘటన తరహాలో మళ్లీ దారుణం బహ్రయిచ్(యూపీ): వరుస అత్యాచార ఘటనలతో అరాచక రాష్ర్టంగా పేరు తెచ్చుకుంటున్న ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు అమ్మాయిలపై అఘాయిత్యం జరిపి చెట్టుకు ఉరేసిన బదౌన్ ఘటనను తలపిస్తూ బుధవారం బహ్రయిచ్ జిల్లాలో మరో ఘటన జరిగింది. వెనుకబడిన వర్గానికి చెందిన ఓ 45 ఏళ్ల మహిళను కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం జరిపి ఇక్కడి రాణీపూర్ ప్రాంతంలో ఆమె చీరతోనే చెట్టుకు ఉరేశారు. స్థానిక లిక్కర్ మాఫియాపై ఆమె ఫిర్యాదు చేసినందుకే ఈ దారుణానికి ఒడిగట్టారన్న వాదన వినిపిస్తోంది. కాగా, మంగళవారం రాత్రి నుంచే బాధితురాలు కనిపించకుండా పోయిందని అదనపు ఎస్పీ సునీల్‌కుమార్ తెలిపారు. లోనియన్పూర్ గ్రామానికి చెందిన ఆమె చికిత్స కోసం లక్నో వెళుతూ అవసరం నిమిత్తం తన కొడుకు ఫోన్ చేయడంతో బహ్రయిచ్‌లో ఆగిపోయింది. తల్లిని తిరిగి ఇంటికి తీసుకువచ్చేందుకు అతను అక్కడికి వెళ్లే సరికే ఆమె కనిపించకుండా పోయింది. తర్వాత ఆమె ఓ చెట్టుకు వేలాడుతూ విగతజీవిగా కనిపించింది. దీనిపై ఆమె కుటుంబసభ్యులు ఐదుగురిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీ సులకు ఫిర్యాదు చేశారు. వీరిలో ముగ్గురిని అరెస్టు చేసినట్లు, దర్యాప్తు అధికారులు తెలిపారు. రంగంలోకి హైకోర్టు, సీబీఐ: యూపీ దారుణాలపై అలహాబాద్ హైకోర్టు స్పందించింది. బదౌన్ ఘటనపై నమోదైన కేసు దర్యాప్తును స్వయంగా పర్యవేక్షించాలని నిర్ణయించింది. ఈ ఘటనతో పాటు గత ఆరు వారాల్లో రాష్ర్టవ్యాప్తంగా చోటుచేసుకున్న అత్యాచార ఘటనలపై నమోదైన ఇతర కేసులకు సంబంధించిన పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని డీజీపీని ఆదేశించింది. మరోవైపు బదౌన్ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసింది. -
అత్యాచారాల నిరోధానికి వారేం చేయగలరు?
న్యూఢిల్లీ: బాదౌన్ హత్యాచార ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, ఆయన తండ్రి ములాయంను బీజేపీ నేత, మధ్యప్రదేశ్ హోంమంత్రి బాబూలాల్ గౌర్ వెనకేసుకొచ్చారు. తండ్రీకొడుకులను ఆయన నిస్సహాయులుగా వర్ణించారు. అత్యాచారాల నిరోధానికి వారేం చేయగలరు అంటూ ఎదురు ప్రశ్నించారు. పురుషుడు మానసిక సమతుల్యం తప్పినప్పుడే అత్యాచారానికి పాల్పడతాడని సూత్రీకరించారు. గత నెల 27న ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్ సమీపంలో కాట్రా గ్రామంలో అక్కాచెల్లెళ్లు అయిన ఇద్దరు బాలికలపై కిరాతకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం వారిని చెట్టుకు ఉరేసి ప్రాణాలను బలి తీసుకున్నారు.