యూపీలోని బదయూ జిల్లాలో అనుమానాస్పదంగా మృతి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు అత్యాచారానికి గురికాలేదని, వాళ్లను ఎవరూ హత్య చేయలేదని ఆధారాలతో కేసు మూసివేత నివేదికను సీబీఐ కోర్టులో సమర్పించింది. ఈ కేసుకు సంబంధించి 91 పేజీల నివేదికను సీబీఐ గురువారం ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ (పీఓసీఎస్‌ఓ) కోర్టు జిల్లా అదనపు న్యాయమూర్తి జస్టిస్ అనిల్ కుమార్‌కు, ఫిర్యాదుదారులకు అందజేసింది.
ఇందులో 34 పేజీల మూసివేత నివేదిక, 2 పేజీలలో ఇద్దరు బాలికల పోస్ట్‌మార్టమ్ రిపోర్టు, 4 పేజీల సాక్షుల లిస్టు, మిగతా పేజీలలో సాక్షులు చెప్పినవి, డీఎన్‌ఏ, ఫోరెన్సిక్, స్టేటస్ రిపోర్టులున్నాయి. వారు అత్యాచారానికి, హత్యకు గురయ్యారనడానికి ఎంలాంటి ఆధారాలు లేవని నివేదికలో పేర్కొంది. ఈ కేసును కోర్టు ఫిబ్రవరి 11కు వాయిదా వేసింది. వారిద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారని గత డిసెంబర్ 11న సీబీఐ మూసివేత నివేదిక సిద్ధం చేసింది. గతేడాది మే 28న కత్రా గ్రామంలో ఇద్దరు బాలికలు చెట్టుకు వేలాడుతూ అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే.
ఆ అక్కాచెల్లెళ్లపై అత్యాచారం జరగలేదు!
Published Fri, Feb 6 2015 5:26 PM | Last Updated on Sat, Jul 28 2018 8:40 PM
Advertisement