Badaun sisters
-
ఆ అక్కాచెల్లెళ్లపై అత్యాచారం జరగలేదు!
యూపీలోని బదయూ జిల్లాలో అనుమానాస్పదంగా మృతి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు అత్యాచారానికి గురికాలేదని, వాళ్లను ఎవరూ హత్య చేయలేదని ఆధారాలతో కేసు మూసివేత నివేదికను సీబీఐ కోర్టులో సమర్పించింది. ఈ కేసుకు సంబంధించి 91 పేజీల నివేదికను సీబీఐ గురువారం ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ (పీఓసీఎస్ఓ) కోర్టు జిల్లా అదనపు న్యాయమూర్తి జస్టిస్ అనిల్ కుమార్‌కు, ఫిర్యాదుదారులకు అందజేసింది. ఇందులో 34 పేజీల మూసివేత నివేదిక, 2 పేజీలలో ఇద్దరు బాలికల పోస్ట్‌మార్టమ్ రిపోర్టు, 4 పేజీల సాక్షుల లిస్టు, మిగతా పేజీలలో సాక్షులు చెప్పినవి, డీఎన్ఏ, ఫోరెన్సిక్, స్టేటస్ రిపోర్టులున్నాయి. వారు అత్యాచారానికి, హత్యకు గురయ్యారనడానికి ఎంలాంటి ఆధారాలు లేవని నివేదికలో పేర్కొంది. ఈ కేసును కోర్టు ఫిబ్రవరి 11కు వాయిదా వేసింది. వారిద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారని గత డిసెంబర్ 11న సీబీఐ మూసివేత నివేదిక సిద్ధం చేసింది. గతేడాది మే 28న కత్రా గ్రామంలో ఇద్దరు బాలికలు చెట్టుకు వేలాడుతూ అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. -
దళిత అక్కాచెల్లెళ్లది ఆత్మహత్యే: సీబీఐ
న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని బాదౌన్ జిల్లా కర్తా గ్రామంలో అత్యాచారానికి గురైన అక్కాచెల్లెళ్లది ఆత్మహత్యగా సీబీఐ తేల్చింది. వీరిపై ఎవరో సామూహిక అత్యాచారం చేసి చెట్టుకు ఉరేసి ఉంటారని వచ్చినవి పుకార్లేనని, వాస్తవం కాదని సిబిఐ స్పష్టం చేసింది. వారిద్దరూ హత్యాగావించబడినట్లు ఎలాంటి ఆధారాలు లేవని సీబీఐ అయిదు నెలల అనంతరం నివేదిక ఇచ్చింది. ఈ ఏడాది మే 28న బదౌన్ జిల్లాలో దళిత వర్గానికి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు సామూహిక అత్యాచారానికి, హత్యకు గురైన దారుణ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రజాగ్రహం వెల్లువెత్తటంతో ఈ కేసును సీబీఐకి అప్పగించారు. ఈ కేసు విచారణను సీబీఐ జూన్‌లో చేపట్టింది. బదౌన్ జిల్లా కర్తా గ్రామానికి చెందిన 14,15 ఏళ్ల వయసున్న దళిత బాలికలు ఈ ఏడాది మేలో అదృశ్యమయ్యారు. మరుసటి రోజు పళ్లతోటలో వారిద్దరూ సామూహిక లైంగిక దాడికి గురయ్యారు. అక్కడే చెట్టుకు ఇద్దరి మృతదేహాలు ఉరికి వేలాడుతూ కనిపించాయి. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచనలం రేకెత్తించిన సంగతి తెలిసిందే. అఖిలేష్ ప్రభుత్వానికి కూడా ఈ ఘటన చెడ్డపేరు తెచ్చింది.