బాలసాయిబాబాపై చీటింగ్ కేసు నమోదు
కర్నూలు : నగరంలోని బాలసాయిబాబాతో పాటు మరో ఐదుగురిపై రెండవ పట్టణ పోలీసుస్టేషన్లో చీటింగ్ కేసు నమోదైంది. బాలసాయిబాబాతో పాటు ఆలయంలో పనిచేస్తున్న షరీఫ్, షఫీవుల్లా, ఫణిభూషణ్, మద్దయ్య, ఖాశీం సాహెబ్‌లు తన సంతకాన్ని ఫోర్జరీ చేసి కోర్టును తప్పుదోవ పట్టించారని ఫోర్టు ప్రాంతానికి చెందిన శివప్రసాద్ జిల్లా కోర్టును ఆశ్రయించారు. ఆలయం పక్కన కోట దగ్గర తన ఖాళీ స్థలాన్ని ఆక్రమించాడని శివప్రసాద్ కోర్టులో దావా వేశాడు. గతేడాది నవంబర్ 18న తన సంతకాలను ఫోర్జరీ చేసి రాజీ అయినట్లుగా కోర్టుకు నివేదించి తప్పుదోవ పట్టించారని ఫిర్యాదు చేశాడు. కోర్టు ఉత్తర్వుల మేరకు శుక్రవారం కేసు నమోదు చేసినట్లు రెండవ పట్టణ సీఐ డేగల ప్రభాకర్ తెలిపారు.