balasubramanyam
-
చంద్రబాబూ.. ఇదేం వైఖరి..?
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులపై, మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ప్రజాప్రతినిధులే దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. మహిళలనీ చూడకుండా దుర్భాషలాడుతున్నారు. చేయి చేసుకుంటున్నారు. అధికార పార్టీ నాయకుల ఆగడాలకు మహిళలు, అధికారులు కంటతడి పెట్టిన సందర్భాలున్నాయి. అయినా చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోగా.. అధికార పార్టీ నాయకులను వెనకేసుకు వచ్చింది. అదే ప్రతిపక్ష నాయకుల విషయానికి వస్తే వారు ప్రశ్నిస్తేనే లేనిపోని కేసులు పెట్టి వేధిస్తోంది. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో దివాకర్ ట్రావెల్స్ బస్సు ఘోర ప్రమాద దుర్ఘటనలో 12 మంది మరణించినపుడు.. వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంఘటనా స్థలానికి వెళ్లిన సందర్భంగా పోస్టుమార్టమ్ నివేదిక కోరిన విషయంలో కలెక్టర్‌తో ఇష్టానుసారం ప్రవర్తించారంటూ ప్రభుత్వం నానా రభస సృష్టించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఒత్తిడి చేసి మరీ ఐఏఎస్ అధికారుల సంఘం సమావేశం ఏర్పాటు చేయించారు. వైఎస్ జగన్‌ను తప్పుపడుతూ, జరిగిన ఘటనను ఖండించాలని తీవ్ర ఒత్తిడి చేశారు. అదే అధికార పార్టీ నాయకులు అధికారులపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. తాజాగా రవాణ శాఖ కమీషనర్ బాలసుబ్రహ్మణ్యంపై టీడీపీ నాయకుల దాడి ఘటనే ఇందుకు ఉదాహరణ. టీడీపీకి చెందిన ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వర్ రావు ఇద్దరు ఏకంగా ఒక ఐపీఎస్ అధికారితో ఇష్టానుసారంగా మాట్లాడినా ప్రభుత్వం స్పందించలేదు. ఐఏఎస్ అధికారుల తరహాలోనే ఈ విషయంలో ఐపీఎస్ అధికారుల సమావేశం జరగలేదు. ఈ ఘటనను ముఖ్యమంత్రి గానీ, రవాణా శాఖ మంత్రిగానీ ఎక్కడా ఖండించలేదు. ఇదే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల అధికారులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మహిళా తహశీల్దార్ వనజాక్షి విషయంలో ఇష్టానుసారం వ్యవహరించినప్పటికీ చర్యలు లేకపోగా చంద్రబాబు అసెంబ్లీలో ఆ ఘటనను సమర్థించుకున్నారు. కాల్ మనీ కేసు, రిషితేశ్వరి ఆత్మహత్య కేసు, అనంతపురం జిల్లాలో మహిళపై దాడి.. ఇలా ఎన్నో సంఘటనలు జరిగాయి. అయినా చంద్రబాబు నిందితులపై తగిన చర్యలు తీసుకోలేదని, కొందరిని కాపాడే ప్రయత్నం చేశారన్న విమర్శలు వచ్చాయి. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రతిపక్షం ప్రశ్నిస్తుందన్న ఉద్దేశంతోనే బాలసుబ్రహ్మణ్యం పై దాడికి సంబంధించి ఆదివారం హడావిడి చేసినట్టు తెలుస్తోంది. పార్టీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యేను పిలిపించి చంద్రబాబు మందలించినట్టు, దానిపై వారు జరిగిన దానికి చింతిస్తున్నామంటూ ప్రకటన చేయడం అంతా అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షం ప్రశ్నిస్తుందన్న భయంతోనే చేసినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబుతో టీడీపీ నేతలు సమావేశం అనంతరం వారు బాలసుబ్రహ్మణ్యం కార్యాలయానికి వెళ్లి కలుసుకోవడం, ఈ ఘటనను తేలిక చేసే ఉద్దేశంతోనే చేసినట్టుగా ఉందని వారంటున్నారు. -
ఆ ట్రావెల్స్‌కు వ్యతిరేకంగా నివేదిక ఇవ్వాలని కోరారు
-
సీఎం పంచాయితీ చేయడం ఏంటి...చట్టం లేదా ?
-
క్షమాపణలు చెప్పిన కేశినేని, బోండా ఉమా
విజయవాడ: టీడీపీ నాయకులు కేశినేని నాని, బోండా ఉమమహేశ్వరావు దౌర్జన్యం చేసిన ఘటనపై రవాణ శాఖ కమీషనర్ బాలసుబ్రహ్మణ్యం స్పందించారు. ఆదివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గొడవ చేసినవారు క్షమాపణలు చెప్పారని, ఈ ఘటనపై సీఎం చంద్రబాబు స్వయంగా మాట్లాడారని చెప్పారు. ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు కింద పడి ఓ మనిషి చనిపోయారని, దీనిపై పోలీసులు మమ్మల్ని వివరాలు కోరారని బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్ వల్లే ప్రమాదం జరిగిందని రవాణ శాఖ అధికారులు నివేదిక ఇచ్చారని, వాహనంలో మెకానికల్ డిఫెక్ట్ లేదని రాసిచ్చారని చెప్పారు. పోలీసులు మళ్లీ జన్యునటీ సర్టిఫికెట్ కావాలని కోరగా, అది కూడా ఇచ్చామని తెలిపారు. ఈ విషయం వాళ్లకు అర్థం కావడం లేదని టీడీపీ నాయకులను ఉద్దేశిస్తూ అన్నారు. తాము నిబంధనల ప్రకారమే పనిచేస్తామని స్పష్టం చేశారు. ఆరెంజ్ ట్రావెల్స్‌కు వ్యతిరేకంగా నివేదిక ఇవ్వాలని టీడీపీ నేతలు ఒత్తిడి తెచ్చారని బాలసుబ్రహ్మణ్యం చెప్పారు. ఎంపీ కేశినేని నాని పేరుతో ఆయన అనుచరుడు పట్టాభి తమపై పదేపదే ఒత్తిడి తెచ్చాడని తెలిపారు. నిబంధనల ప్రకారమే నివేదిక ఉంటుందని స్పష్టం చేశామని, దీంతో ఎంపీని పిలిచి వివాదం సృష్టించారని చెప్పారు. తన గన్‌మెన్‌పై దాడికి సంబంధించి ఎలాంటి చర్యలు ఉంటాయో మీరో చూస్తారని అన్నారు. తనకు రక్షణ కల్పించిన గన్‌మెన్‌కు న్యాయం జరిగేలా చూస్తానని, తనపై ఇలాంటి దౌర్జన్యం జరుగుతుందని ఎప్పుడూ అనుకోలేదని బాలసుబ్రహ్మణ్యం చెప్పారు. అంతకుముందు టీడీపీ నేతలు కేశినేని నాని, బోండా ఉమా రవాణ శాఖ కమీషనర్ కార్యాలయానికి వెళ్లి కమీషనర్ బాలసుబ్రహ్మణ్యం, ఉద్యోగ సంఘాలతో సమావేశమయ్యారు. రవాణ శాఖ కమీషనర్‌కు క్షమాపణలు చెప్పామని కేశినేని, బోండా ఉమా చెప్పారు. -
రిషితేశ్వరి మృతిపై విచారణ, 5 రోజుల్లో నివేదిక
గుంటూరు: రిషితేశ్వరి మృతిపై బుధవారం విచారణ ప్రారంభమైంది. ఈ విచారణలో భాగంగా నలుగురు సభ్యులతో కూడిన ప్రభుత్వ విచారణ కమిటీ నాగార్జున వర్సిటీకి చేరుకుంది. మూడు రోజుల పాటు యూనివర్సిటీలోనే ఉండి విచారణ జరపనున్నారు. అయితే ఈ రోజు పూర్తిగా అధికారులతోనే కమిటీ సభ్యులు సమావేశం నిర్వహిస్తారని తెలుస్తోంది. రిషితేశ్వరి ఘటన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకున్నారన్న దానిపై విచారణ జరుపుతున్నామని విచారణ కమిటీ సభ్యుడు బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. పోలీసులు, విద్యార్థులు, విద్యార్థి నేతలతో కూడా తామ ప్రత్యేక్యంగా మాట్లాడుతామన్నారు. ఎవరైనా బహిరంగంగా విచారణకు హాజరైనాసరే లేదంటే ఇన్‌కెమెరా విచారణకు హాజరవుతామని తెలిపినా అభ్యంతరం లేదని చెప్పారు. ఈ రోజంతా వర్సిటీ అధికారులతో మాట్లాడి రేపు విద్యార్థులతో విచారణ జరుపుతామని అన్నారు. మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చేవారికి తమ మెయిల్ అడ్రస్ చెబుతామని తెలిపారు. కాగా, ఐదురోజుల్లో తాము ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సి ఉందని బాలసుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, రిషితేశ్వరి మృతిపై విచారణ ప్రారంభమైన నేపథ్యంలో మీడియా ప్రతినిధులను లోపలికి అనుమతించడం లేదని సమాచారం. రిషితేశ్వరి ఉదంతంలో సమాధానం లేని ప్రశ్నలు... 1. ఉరి వేసుకుని వేలాడుతున్న ఆమెను దించిందెవరు? 2. హాస్టల్ లో ఉన్న తోటి విద్యార్దినుల కంటే ముందు ఆమె మరణ వార్త బాయ్స్ హాస్టల్ కు ఎలా చేరింది? 3. ఉరి తాడు బిగించుకున్నప్పుడు ఆమెను మొదట చూసింది ఎవరు? 4. బాబూరావుకు ఎందుకు ఫోన్ చేశారు? 5. హాస్టల్ వార్డెన్ కు ఎందుకు సమాచారమివ్వలేదు? 6. ఉరి వేసుకుని చనిపోయినట్టు నిరూపితమవ్వటానికి కనీసం ఒక్క ఫోటో కూడా ఆధారం లేదు, ఎందుకని? 7. బాబూరావు సస్పెన్షన్ కు ముందుగానే నాటకీయంగా రాజీనామా ఎందుకిచ్చాడు? హైదరాబాద్ లో ఏం పైరవీలు నడుపుతున్నాడు? 8.బాబూరావును కాపాడే ప్రయత్నం ఎవరు చేస్తున్నారు? 9. కాలేజీలో సుప్రీం ఆదేశాల మేరకు ఏర్పాటు చేయాల్సిన యాంటీ ర్యాగింగ్ కమిటీని ఎందుకు ఏర్పాటు చేయలేదు? 10.ముందు రోజు సినిమా హాల్లో ఏం జరిగింది? 11.ఆమెను వేధిస్తూ తీసిన వీడియో ఏమైంది? 12.రిషితేశ్వరిని వేదిస్తున్నారంటూ ఆమె చనిపోవటానికి పది రోజుల ముందు ఆమె పేరెంట్స్ ప్రిన్సిపాల్ కు కంప్లైంట్ ఇచ్చినా ఎందుకు చర్యలు తీసుకోలేదు? 13.విద్యార్ది సంఘాల ఐక్యకార్యాచరణ కమిటీ నిన్న వినతి పత్రాన్నిచ్చి తాత్కాలికంగా ఆందోళనను విరమించుకున్నాక హడావిడిగా వర్శిటీకి ఇప్పుడెందుకు 10 రోజులు సెలవులిచ్చారు? -
రిషితేశ్వరి మృతిపై విచారణ, 5 రోజుల్లో నివేదిక
-
ఐపీఎస్ బాలసుబ్రమణ్యంకు క్లీన్చిట్
ముంబై: సొహ్రబుద్దీన్ బూటకపు ఎన్కౌంటర్ కేసులో ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి ఎన్. బాలసుబ్రమణ్యంకు ఇక్కడి సీబీఐ ప్రత్యేక కోర్టు క్లీన్చిట్ ఇచ్చింది. సొహ్రబుద్దీన్ను ఎన్కౌంటర్ పేరిట చంపేయడంలో బాలసుబ్రమణ్యం, ఆయన కింది అధికారి గుజరాత్ పోలీసులకు సహాయపడ్డారని సీబీఐ అభియోగాలు మోపింది. అయితే ఇందుకు తగిన ఆధారాలు లేవంటూ సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి ఎం.బి.గోసావి సోమవారం అభియోగాలను కొట్టివేశారు. గ్యాంగ్‌స్టర్ అయిన సోహ్రబుద్దీన్కు పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాతో సంబంధాలున్నాయనేది గుజరాత్ పోలీసుల అభియోగం. 2005లో సొహ్రబుద్దీన్, అతని భార్య కౌసర్బీ మహారాష్ట్రలోని సాంగ్లీకి వెళుతుండగా... హైదరాబాద్ సమీపంలో వీరిని గుజరాత్ ఏటీఎస్ పోలీసులు పట్టుకెళ్లారని ఆరోపణలున్నాయి. 2005లో గాంధీనగర్ దగ్గర్లో జరిగిన బూటకపు ఎన్కౌంటర్లో సొహ్రబుద్దీన్ను పోలీసులు కాల్చిచంపారు. -
ఎల్లలు దాటినప్రేమ!
పారిస్ అమ్మాయి...తిరుపతి అబ్బాయి ! ఈ ఏడాది జనవరిలో పారిస్‌లో ఒక్కటైన జంట ప్రస్తుతం పెద్దల సమక్షంలో ఘనంగా రిసెప్షన్ తిరుపతి సిటీ : వీరి ప్రేమ ఖండాంతరాలు దాటింది. దేశాల మధ్య దూరం ఎక్కువైనా.. ఒకరినొకరు ఇష్టపడి మనసుల మధ్య దూరం తక్కువే అని చాటిచెప్పారు. ఆరేళ్లు ప్రేమించుకుని పెద్దలను మెప్పించి ఇద్దరూ ఒక్కటయ్యారు. ఫ్రాన్స్ దేశ రాజధాని పారిస్‌కు చెందిన ఓ అమ్మాయి.. తిరుపతికి చెందిన అబ్బాయి పెళ్లితో ఒక్కటయ్యారు. శుక్రవారం తిరుపతిలో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. వివరాలిలా.. కపిలతీర్థం రోడ్డులో నివసిస్తున్న రిటైర్డ్ టీటీడీ ఉద్యోగి బి.శ్రీరాములు, మునిలక్ష్మిల కుమారుడు బాలసుబ్రమణ్యం 2008లో చదువుకోసం పారిస్ వెళ్లాడు. అక్కడ హీమ, అడుడాల కుమార్తె ఏస్తర్‌తో పరిచయం ఏర్పడింది. 2009లో వీరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ ప్రేమ చివరకు పెళ్లికి దారి తీసింది. ఈ ఏడాది జనవరి 31న పారిస్‌లో పెళ్లి చేసుకున్నారు. ఇటీవల దంపతులిద్దరూ తిరుపతికి వచ్చారు. శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవం నాడు నగరంలోని ఓ ప్రముఖ స్టార్ హోటల్లో బాలసుబ్రమణ్యం తల్లిదండ్రులు రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఇక్కడి బంధువులు, స్నేహితులు హాజరయ్యారు. పారిస్ నుంచి ఏస్తర్ ఇద్దరు అన్నయ్యలు, స్నేహితురాలు సైతం వచ్చారు. రిసెప్షన్‌కు వెళ్లిన వారంతా నవ దంపతులతో ఫొటోలు దిగేందుకు పోటీపడ్డారు. ప్రస్తుతం బాలసుబ్రమణ్యం జర్మనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుండగా.. ఏస్తర్ పారిస్‌లో ఉద్యోగం చేస్తోంది. వీరు త్వరలో పారిస్‌లో కాపురం పెట్టనున్నారు. -
ఆందోళనతో దద్దరిల్లిన నిట్
నిట్‌క్యాంపస్ : కాజీపేటలోని నిట్‌లో సెక్యూరిటీ గార్డులు, నాన్ టీచింగ్ ఉద్యోగులు చేపట్టిన ఆందోళన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ జోక్యంతో మంగళవారం రాత్రి ముగిసింది. నిట్ స్టోర్ అసిస్టెంట్ ఎండీ.అక్బర్‌పై దాడిచేసిన ఇన్చార్జ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఖురేషి, ఉద్యోగి బాలసుబ్రహ్మణ్యంపై చర్య తీసుకోవాలని నిట్ ఉద్యోగ జేఏసీ, సెక్యూరిటీ గార్డులు సోమవారం ఆందోళన దిగిన విషయం తెలిసిందే. మంగళవారం కూడా కొనసాగిన వారి ఆందోళనకు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ మద్దతుగా నిలిచారు. తీవ్ర వాగ్వాదాలు, నిరసనల అనంతరం మంగళవారం రాత్రి నిట్ డెరైక్టర్‌తో ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ చర్చలు ఫలించారుు. మూడు గంటలపాటు మూడు దఫాలుగా జరిగిన చర్చల అనంతరం దాడికి బాధులైన నిట్ ఇన్చార్జ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఎఎ ఖురేషి, నిట్ ఉద్యోగి బాలసుబ్రమణ్యంను సస్పెండ్ చేస్తున్నట్లు నిట్ డైరక్టర్ టి శ్రీనివాసరావు ప్రకటించారు. దీంతో వారు ఆందోళన విరమించారు. ఫ్యాకల్టీ అసోసియేషన్ లెటర్‌పై ఎమ్మెల్యే ఆగ్రహం ఇదిలా ఉండగా ఎమ్మెల్యేలు, ఎంపీలు నిట్ అకడమిక్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దంటూ నిట్ ఫ్యాకల్టీ అసోసియేషన్ లేఖ విడుదల చేయడంపై ఎమ్మెల్యే వినయ్ మండి పడ్డారు. ఒక సెంట్రల్ ఇనిస్టిట్యూట్‌లో ఏం జరిగినా ఊరుకోవాలా అంటూ నిట్ డెరైక్టర్‌ను నిలదీశారు. ఆ ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్ : నిట్ డెరైక్టర్ శ్రీనివాసరావు నిట్ పూర్వ విద్యార్థిగా నిట్‌కు ఉన్న గుర్తింపును నిలబెట్టడం కోసం నిట్ ఇన్చార్జ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఖురేషి, నిట్ ఉద్యోగి బాలసుబ్రమణ్యంను సస్పెండ్ చేస్తున్నాం. ఎమ్మెల్యే, ఉద్యోగ సంఘాలు ఇచ్చిన డిమాండ్లపై కమిటీ రిపోర్టు వచ్చాక తగిన చర్యలు తీసుకుంటాం. పోలీసుల అదుపులో ఖురేషి నిట్‌లో ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిట్ ఇన్చార్జ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఖురేషిని కాజీపేట పోలీసులు మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. -
రోడ్డుప్రమాదంలో టీచర్ దుర్మరణం
రాయచోటి, న్యూస్‌లైన్: రాయచోటిలోని లక్కిరెడ్డిపల్లె మార్గంలో రింగ్ రోడ్డు వద్ద స్పీడ్ బ్రేకర్ దాటుతుండగా స్కూటర్‌పై నుంచి జారిపడిన ఘటనలో వసంతలక్ష్మి (47) అనే ఉపాధ్యాయురాలు మృతి చెందింది. లక్కిరెడ్డిపల్లెకు చెందిన అయ్యల సోమయాజుల బాలసుబ్రహ్మణ్యం భార్య వసంతలక్ష్మి పెనగలూరు మండలం చక్రంపేట ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. ప్రతి రోజు రాయచోటికి చేరుకొని అక్కడి నుంచి చక్రంపేటకు వెళ్లేవారు. బుధవారం ఉదయం స్కూల్‌కు వెళ్లి తిరిగి బస్సులో రాయచోటికి రాత్రి 8గంటలకు చేరుకున్నారు. ప్రతి రోజు స్కూటర్‌పై ఆమెను భర్త బైక్‌లో ఇంటికి తీసుకెళ్లేవారు. బుధవారం రాత్రి ఆమె భర్తకు పని ఉండడంతో మరొక వ్యక్తికి స్కూటర్ ఇచ్చి పంపారు. రాయచోటి నుంచి వారు స్కూటర్‌పై బయలుదేరగా రింగ్ రోడ్డు వద్ద అదే రోజు ఉదయమే ఎత్తుగా వేసిన స్పీడ్ బ్రేకర్‌ను గమనించకుండా దాటుతుండగా వెనకవైపు కుర్చొని ఉన్న ఆమె ఎగిరి రోడ్డుపై పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆమె తల వెనకవైపు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతికి రెఫర్ చేశారు. స్విమ్స్‌కు తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని గురువారం రాయచోటి ఆస్పత్రికి తీసుకొచ్చారు. మృతురాలికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. స్పీడ్ బ్రేకర్ ఎత్తు ఎక్కువగా ఉండడం, అక్కడ సూచికలు లేకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగింది. విషయం తెలిసి ఆర్అండ్బీ అధికారులు అప్పటికప్పుడే జేసీబీతో స్పీడ్ బ్రేకర్‌ను తొలగించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.