Bancroft
-
బాల్ టాంపరింగ్ వివాదం సద్దుమణిగినట్టే: ఆసీస్ కెప్టెన్
సిడ్నీ: క్రికెట్ ఆస్ట్రేలియాలో పెను దుమారం రేపిన బాల్ టాంపరింగ్ వివాదం ప్రస్తుతానికి సద్దుమణిగిందని ఆసీస్ టెస్టు కెప్టెన్ టిమ్ పైన్ వెల్లడించాడు. బాన్‌క్రాఫ్ట్‌తో బౌలర్లు సమావేశమై సమస్యను పరిష్కరించుకున్నారని అతను ప్రకటించాడు. ఓ ఇంటర్వ్యూ సందర్భంగా విలేఖరులు అడిన ప్రశ్నలకు తికమక పడిన బాన్‌క్రాఫ్ట్.. ఒత్తిడిలో అలా మాట్లాడాడని, ఈ ఉదంతం గురించి బౌలర్లకు ముందుగానే తెలుసన్న విషయమై అతని వద్ద ఎలాంటి ఆధారాలు లేవని వెల్లడించాడు. కాగా, 2018లో వెలుగు చూసిన బాల్ టాంపరింగ్ ఉదంతం గురించి తమ బౌలర్లకు ముందే తెలుసంటూ ఆసీస్ ఆటగాడు బాన్‌క్రాఫ్ట్ చేసిన సంచలన వ్యాఖ్యల నేపథ్యంలో ఆ ఘటనపై పునర్విచారణ జరిపేందుకు తాము సిద్దమని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించడంతో ఈ వివాదం మరోసారి వార్తల్లోకెక్కింది.దీంతో నాటి జట్టులో సభ్యులైన కమిన్స్, హాజిల్‌వుడ్, స్టార్క్‌లు బాన్‌క్రాఫ్ట్‌తో సమావేశమయ్యారు. అనంతరం ఈ ముగ్గురు బౌలర్లు ఆ వివాదంలో తమ పాత్ర ఏమీ లేదంటు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఈ వివాదం గురించి ఓ ఇంటర్వ్యూలో ఊహించని ప్రశ్నలు ఎదురవ్వడంతో చిరాకులో ఏదో సమాధానం చెప్పానని బాన్‌క్రాఫ్ట్ తమకు వివరణ ఇచ్చాడని వారు పేర్కొన్నారు. ఈ విషయమై బాన్‌క్రాఫ్ట్ కూడా అదే సమాధానం చెప్పాడు. బాల్ టాంపరింగ్ ఉదంతం గురించి తన దగ్గర ఎలాంటి సమాచారం లేదని తనను సంప్రదించిన సీఏ ఇంటిగ్రిటీ యూనిట్‌కు వివరణ ఇచ్చాడు. దీంతో ఈ వివాదానికి తాత్కాలికంగా బ్రేక్ పడినట్లైంది. కాగా, 2018లో కేప్‌టౌన్ వేదికగా ఆసీస్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన టెస్టులో బాల్ టాంపరింగ్ ఉదంతం వెలుగు చూసింది. ఆ మ్యాచ్‌లో ఆసీస్ ఆటగాడు బాన్‌క్రాఫ్ట్ బంతికి సాండ్ పేపర్ రుద్దుతూ కెమెరాల కంటపడ్డాడు. దీంతో అతనితో పాటు అప్పటి కెప్టెన్ స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌పై నిషేధం విధించారు. చదవండి: 500కు పైగా వికెట్లు తీశాను, కానీ ఏం ప్రయోజనం.. -
Ball Tampering: మళ్లీ తెరపైకి ‘ట్యాంపరింగ్’
మెల్బోర్న్: మూడేళ్ల క్రితం ఆస్ట్రేలియా క్రికెట్‌ను కుదిపేసిన ‘బాల్ ట్యాంపరింగ్’ వివాదం మరోసారి ముందుకు వచ్చింది. కేప్‌టౌన్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో ట్యాంపరింగ్‌కు పాల్పడిన ఘటనలో స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, కామెరాన్ బాన్‌క్రాఫ్ట్‌లపై ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (సీఏ) నిషేధం విధించింది. వారి శిక్ష ముగిసి మళ్లీ మైదానంలోకి దిగడంతో అంతా ముగిసిపోయినట్లు భావించగా... బాన్‌క్రాఫ్ట్ తాజా వ్యాఖ్యలతో ఆ వివాదాన్ని మళ్లీ రేపాడు. ‘బాల్ ట్యాంపరింగ్ గురించి బౌలర్లకు తెలుసా’ అంటూ అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ బాన్‌క్రాఫ్ట్...‘దాని గురించి ప్రత్యేకంగా చెప్పాలా’ అన్నాడు. దాంతో ఇందులో ఆసీస్ బౌలర్లకు కూడా భాగం ఉందని కొత్తగా చర్చ మొదలైంది. బాన్‌క్రాఫ్ట్ వ్యాఖ్యలపై సీఏ వెంటనే స్పందించింది. 2018లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఎవరి వద్దనైనా ఇంకా అదనపు సమాచారం ఉంటే తమకు తెలియజేయాలని... అవసరమైతే దీనిపై పునర్విచారణ చేస్తామని కూడా ప్రకటించింది. అంతే కాకుండా అవినీతి నిరోధానికి సంబంధించిన సీఏ ప్రత్యేక బృందం (ఇంటిగ్రిటీ యూనిట్) వెంటనే బాన్‌క్రాఫ్ట్‌తో మాట్లాడింది. నాడు ఇచ్చిన వాంగ్మూలంకంటే అదనంగా ఇంకా ఏమైనా చెప్పేది ఉందా అంటూ ప్రశ్నించింది. ఆశ్చర్యమేమీ లేదు: క్లార్క్ బాన్‌క్రాఫ్ట్ చేసిన వ్యాఖ్యలపై కొందరు ఒక్కసారిగా ఏదో అనూహ్యం జరిగిపోయినట్లు స్పందిస్తున్నారని, అయితే ఇందులో అంతగా ఆశ్చర్యపడాల్సిందేమీ లేదని ఆసీస్ మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ వ్యాఖ్యానించాడు. ‘బంతిని ట్యాంపరింగ్ చేసిన విషయం జట్టులో ముగ్గురు ఆటగాళ్లకే తెలుసంటే ఎలా నమ్ముతాం. బంతిని షైనింగ్ చేసిన తర్వాత ఎవరైనా బౌలర్ వద్దకే విసురుతారు. వారికి ఆ తేడా అర్థం కాదా. అలాంటి ఘటన ఒక్కసారిగా ఏమీ జరిగిపోదు. దానికి ముందు ఎంతో ప్రణాళిక ఉండే ఉంటుంది. అందులో ఎవరెవరు భాగస్వాములో తెలియాలి కదా. అయితే ఆసీస్ బోర్డు ఈ విషయంలో అసలు నిజాలను దాటి పెట్టేందుకే ప్రయత్నించింది’ అని క్లార్క్ ఘాటుగా విమర్శించాడు. -
బాల్ టాంపరింగ్ వివాదంలో మరికొందరి ప్రమేయం..
మెల్బోర్న్: మూడేళ్ల కిందట జరిగిన బాల్ టాంపరింగ్ వివాదంలో రోజుకో కొత్త విషయం తెరపైకి వస్తుంది. ఆ వివాదంలో ప్రధాన సూత్రధారి అయిన బాన్‌క్రాఫ్ట్ ఇటీవల సంచలన విషయాలను వెల్లడించగా, తాజాగా ఆసీస్ దిగ్గజ ఆటగాడు గిల్‌క్రిస్ట్, డేవిడ్ వార్నర్ మేనేజర్ జేమ్స్, ఆసీస్ మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్‌లు చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని రక్తి కట్టించాయి. ఈ విషయమై తొలుత బాన్‌క్రాఫ్ట్ మాట్లాడుతూ.. 2018లో సఫారీలతో జరిగిన మూడో టెస్ట్‌లో తాను సాండ్ పేపర్ వాడిన విషయం తమ బౌలర్లకు ముందే తెలుసని బాంబు పేల్చగా, తాజాగా ఆసీస్ లెజండరీ ఆటగాడు గిల్లీ మాట్లాడుతూ.. బాల్ టాంపరింగ్ జరిగిన విషయం బాన్‌క్రాఫ్ట్‌తో పాటు మరికొంత మందికి ముందే తెలుసని, ఆ పేర్లను బయటపెట్టేందుకు సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నారని వెల్లడించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. క్రికెట్ ఆస్ట్రేలియాను ఓ కుదుపునకు లోను చేసిన ఈ ఉదంతంపై వార్నర్ మేనేజర్ జేమ్స్ మాట్లాడుతూ.. నాడు జరిగిన విచారణ ఏకపక్షంగా సాగిందని, ఈ విషయమై నిషేదానికి గరైన ఆటగాళ్లు కోర్టును ఆశ్రయించి ఉంటే తప్పక కేసు గెలిచే వాళ్లని సంచలన వ్యాఖ్యలు చేశాడు. మరోవైపు ఆసీస్ మాజీ కెప్టెన్ క్లార్క్ స్పందిస్తూ.. బాల్ టాంపరింగ్ జరిగిన విషయం ఆ ముగ్గురితో పాటు ఇంకా ఎవరికైనా ముందే తెలిసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నాడు. కాగా, ఈ వివాదంలో బాన్‌క్రాఫ్ట్‌తోపాటు నాటి జట్టు కెప్టెన్ స్టీవ్‌స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌లు ఏడాది పాటు నిషేదానికి గురైన సంగతి తెలిసిందే. చదవండి: భారత క్రికెట్ చరిత్రలో తొలిసారి ఇలా జరుగనుంది.. -
నేటి నుంచి ప్రొఫెషనల్ క్రికెట్ బరిలోకి బాన్‌క్రాఫ్ట్
బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడి తొమ్మిది నెలల నిషేధానికి గురైన ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ కామెరాన్ బాన్‌క్రాఫ్ట్ నేటి నుంచి మళ్లీ సీనియర్ ప్రొఫెషనల్ క్రికెట్ బరిలోకి దిగుతున్నాడు. శనివారంతో అతనిపై నిషేధం ముగిసింది. దాంతో బిగ్‌బాష్ టి20 లీగ్ జట్టు పెర్త్ స్కార్చర్స్ తమ 13 మంది సభ్యుల జట్టులోకి బాన్‌క్రాఫ్ట్‌ను ఎంపిక చేసింది. ఆదివారం హోబర్ట్ హరికేన్స్‌తో జరిగే మ్యాచ్‌లో అతను ఆడే అవకాశం ఉంది. 26 ఏళ్ల బాన్‌క్రాఫ్ట్ ఆస్ట్రేలియా తరఫున 8 టెస్టులు, ఏకైక టి20 మ్యాచ్ ఆడాడు. స్మిత్, వార్నర్‌లపై మార్చి 29 వరకు నిషేధం కొనసాగనుంది. -
క్లబ్ క్రికెట్ ఆడేందుకు బాన్‌క్రాఫ్ట్‌కు అనుమతి
సిడ్నీ: బాల్ ట్యాంపరింగ్ ఘటనతో 9 నెలల నిషేధానికి గురైన ఓపెనర్ బాన్‌క్రాఫ్ట్‌కు క్లబ్ క్రికెట్ ఆడేందుకు అనుమతి లభించింది. మంగళవారం సమావేశమైన పశ్చిమ ఆస్ట్రేలియా క్రికెట్ క్లబ్... ప్రత్యేక అంశంగా పరిగణిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు దిగ్గజ క్రికెటర్ మార్క్ వా వ్యాఖ్యాతగా స్థిరపడాలనే ఉద్దేశంతో ఆస్ట్రేలియా జాతీయ సెలక్టర్ పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. మార్క్ పదవీ కాలం వచ్చే ఆగస్టు 31తో ముగియనుంది. -
ఏడాది శిక్ష... చాలా ఎక్కువ!
బాల్ ట్యాంపరింగ్‌లో స్మిత్, వార్నర్, బాన్‌క్రాఫ్ట్ అడ్డంగా దొరకడంతో క్రీడాలోకం ఒక్కసారిగా భగ్గుమంది. క్షమించరాని నేరమంది. వారు చేసింది ఘోరమంది. శిక్షలు పడ్డాక... పశ్చాత్తాపంతో విలపిస్తుంటే అదే ‘లోకం’ అయ్యో పాపమంటోంది. సానుభూతి కురిపిస్తోంది. న్యూఢిల్లీ: బాల్ ట్యాంపరింగ్‌లో తీవ్రమైన శిక్ష ఎదుర్కొంటున్న స్మిత్ విలాపం బహుశా అందర్ని కదిలిస్తోంది. దీంతో అప్పుడు ఛీ అన్నోళ్లే ఇప్పుడు కనికరించాలంటున్నారు. ఐదు రోజుల క్రితం కెప్టెన్ స్మిత్‌పై ఐసీసీ కేవలం ఒక మ్యాచ్ సస్పెన్షన్ విధించడంతో భారత స్పిన్నర్ హర్భజన్ ఐసీసీది ద్వంద్వ నీతంటూ ధ్వజమెత్తాడు. అతనే ఇప్పుడు యూ టర్న్ తీసుకున్నాడు. ఆస్ట్రేలియా క్రికెటర్లు స్మిత్, వార్నర్ చేసిన నేరానికి విధించిన ఏడాది శిక్ష చాలా ఎక్కువని... ఏదో ఒక టెస్టు సిరీస్‌కో లేదంటే రెండు సిరీస్‌లకో వేటు వేయాల్సిందని భజ్జీ అన్నాడు. మరో భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ఆస్ట్రేలియన్లపై సానుభూతి చూపాడు. ‘ప్రపంచం మీ కన్నీళ్లు చూడాలనుకుంది... చూసింది. ఇప్పుడు చూశాక సంతోషించినట్లుంది. కానీ సానుభూతి అనేది పదంలా మాత్రమే కాకుండా నిజంగా చూపిస్తే బాగుంటుంది. దీనినుంచి బయటపడే ధైర్యాన్ని దేవుడు వారికివ్వాలి’ అని అశ్విన్ ట్వీట్ చేశాడు. మోసగాళ్లు, దోషులు అని పతాక శీర్షికల్లో నిందించిన దిన పత్రికలు కూడా ఇవేం శిక్షలంటూ రాశాయి. ‘దిస్ ఈజ్ బాల్ ట్యాంపరింగ్. నాట్ మర్డర్’ (ఇది బాల్ ట్యాంపరింగే... హత్య కాదు), అని, ‘డియర్ ఆస్ట్రేలియా దట్స్ ఎనఫ్ నౌ’ (ఆస్ట్రేలియా... ఇక చాలు) అని పత్రికలు ఆసీస్ ఆటగాళ్లపై నిందలు చాలించాలని కోరాయి. పాక్ కోచ్‌గా వ్యవహరిస్తున్న ఆస్ట్రేలియన్ మైకీ అర్థర్ మాట్లాడుతూ స్మిత్‌కు క్రికెటే లోకమని, ఆటకోసమే పరితపిస్తాడని... అతని కెరీర్లో ఇలాంటి ఘటన దురదృష్టకరమని అన్నారు. మళ్లీ పునరాగమనంలో మరింత కష్టపడతాడని... సుదీర్ఘకాలం జట్టుకు సేవలందిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు. -
వార్నర్, స్మిత్‌లు ఐపీఎల్లో ఆడటం కష్టమే
-
ట్యాంపరింగ్ : వార్నర్, స్మిత్‌లపై వేటు
సిడ్నీ : అంతా అనుకున్నట్టే ట్యాంపరింగ్ వివాదంలో చిక్కుకున్న ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లపై క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఏడాది పాటు నిషేధం విధించింది. ఇక బాల్ ట్యాంపరింగ్‌కు యత్నించిన యువ ఆటగాడు కామెరాన్ బెన్ క్రాఫ్ట్‌పై 9 నెలల నిషేధం విదిస్తూ చర్యలు తీసుకోంది. ఈ నిషేధంపై సవాలు చేసేందుకు వారం గడవుచ్చింది. ట్యాంపరింగ్ పాపం ఈ ముగ్గురు ఆటగాళ్లదేనని ఇప్పటికే తేల్చిన క్రికెట్ ఆస్ట్రేలియా తాజాగా వారిపై చర్యలు తీసుకుంది. ఇప్పటికే స్మిత్, వార్నర్‌లకు ఐపీఎల్ రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీలు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తొలిగిస్తూ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. క్రికెట్ ఆస్ట్రేలియా తీసుకునే చర్యలపైనే స్మిత్, వార్నర్‌ల ఐపీఎల్ భవితవ్యం ఆధారపడి ఉందని గతంలో ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా మీడియాకు తెలిపారు. బీసీసీఐతో సమాలోచన చేశాకే స్మిత్‌పై తమ నిర్ణయం వెలువరిస్తామని ప్రాంచైజీలు ప్రకటించాయి. ఇప్పుడు క్రికెట్ ఆస్ట్రేలియా ఏడాది పాటు నిషేదం విధించడంతో ఈ ఆటగాళ్లు ఐపీఎల్‌లోనూ అనుమతించరనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతానికి బీసీసీఐ మాత్రం ఎలాంటి నిర్ణయం ప్రకటన చేయలేదు. -
ట్యాంపరింగ్ : స్టీవ్ స్మిత్‌కు డబుల్ షాక్!
కేప్‌టౌన్ : బాల్ ట్యాంపరింగ్ వివాదంలో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్‌పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) డబుల్ షాకిచ్చింది. ఓ మ్యాచ్ నిషేధం విధిస్తూ ఐసీసీ చర్యలు తీసుకుంది. దీంతో పాటుగా మొత్తం మ్యాచ్ ఫీజును (100 శాతం) కోత విధిస్తున్నట్లు ప్రకటించింది. ఇక బాల్ ట్యాంపరింగ్‌కు యత్నించిన ఆసీస్ ఆటగాడు బెన్‌క్రాఫ్ట్‌కు మ్యాచ్ ఫీజులో 75 శాతం కోత విధిస్తూ.. మూడు డీమెరిట్ పాయింట్లు ఇచ్చింది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో బెన్ క్రాఫ్ట్ ట్యాంపరింగ్‌కు యత్నించి టీవీ కెమెరాలకు అడ్డంగా దొరికిన విషయం తెలిసిందే. మ్యాచ్ అనంతరం ఈ విషయాన్ని జట్టు వ్యూహంలో భాగమేనని స్టీవ్ స్మిత్, కామెరాన్ బెన్‌క్రాఫ్ట్‌లు చేసిన తప్పును ఒప్పుకున్నారు. ఈ ఘటనపై ఆస్ట్రేలియా ప్రధానమంత్రి మాల్కమ్ టర్న్‌బుల్ సైతం స్పందించారు. కెప్టెన్ స్మిత్, జట్టు ప్రవర్తించిన తీరు తనను ఆశ్చర్యానికి గురి చేసిందని, దీన్ని ఆసీస్ క్రికెట్ అభిమానులు సైతం అంగీకరించబోరని ఆయన పేర్కొన్నారు. ఈ వివాదాన్ని సిరీయస్‌గా పరిగణించిన క్రికెట్ ఆస్ట్రేలియా.. స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లను తాత్కాలికంగా కెప్టెన్, వైస్ కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పిస్తూ వేటు వేసింది. -
బ్యాంక్రాఫ్ట్ వీరోచిత సెంచరీ
ఆస్ట్రేలియా ‘ఎ’కు భారీ ఆధిక్యం అపరాజిత్‌కు 5 వికెట్లు చెన్నై: భారత్ ‘ఎ’తో జరుగుతున్న రెండో అనధికార టెస్టులో ఆస్ట్రేలియా ‘ఎ’ భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ బ్యాంక్రాఫ్ట్ (267 బంతుల్లో 150; 16 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో చెలరేగడంతో గురువారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 103 ఓవర్లలో 9 వికెట్లకు 329 పరుగులు చేసింది. కీఫీ (6 బ్యాటింగ్), ఫెకిటి (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం కంగారూలు 194 పరుగుల ఆధిక్యంలో ఉన్నారు. 43/0 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన ఆసీస్‌కు... బ్యాంక్రాఫ్ట్, ఖాజా (33) తొలి వికెట్‌కు 111 పరుగులు జోడించి శుభారంభాన్నిచ్చారు. తర్వాత ఓజా చకచకా రెండు వికెట్లు తీసినా... ఫెర్గుసన్ (103 బంతుల్లో 54; 8 ఫోర్లు) మెరుగ్గా ఆడటంతో ఆసీస్ ఇన్నింగ్స్ తడబాటు లేకుండా సాగింది. శ్రేయస్ గోపాల్ బౌలింగ్‌లో 14, 25 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కోహ్లి క్యాచ్‌లు జారవిడిచడంతో ఊపిరి పీల్చుకున్న ఫెర్గుసన్.... బ్యాంక్రాఫ్ట్తో కలిసి నాలుగో వికెట్‌కు 107 పరుగులు జోడించి అవుటయ్యాడు.అద్భుతమైన స్ట్రోక్స్‌తో చెలరేగిన బ్యాంక్రాఫ్ట్ ఫస్ట్‌క్లాస్ కెరీర్లో నాలుగో శతకాన్ని నమోదు చేశాడు. అయితే భారీ స్కోరు దిశగా సాగుతున్న కంగారూలకు ఆఫ్ స్పిన్నర్ అపరాజిత్ కాస్త అడ్డుకట్ట వేశాడు. స్వల్ప వ్యవధిలో స్టోనిస్ (10), వేడ్ (11)లతో పాటు బ్యాంక్రాఫ్ట్, సంధూ (36), ఎగర్ (6)లను అవుట్ చేశాడు. అపరాజిత్ 5, ఓజా 3, గోపాల్ ఒక్క వికెట్ తీశారు.