అంతా అనుకున్నట్టే ట్యాంపరింగ్ వివాదంలో చిక్కుకున్న ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లపై క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఏడాది పాటు నిషేధం విధించింది. ఇక బాల్ ట్యాంపరింగ్‌కు యత్నించిన యువ ఆటగాడు కామెరాన్ బెన్ క్రాఫ్ట్‌పై 9 నెలల నిషేధం విదిస్తూ చర్యలు తీసుకోంది. ఈ నిషేధంపై సవాలు చేసేందుకు వారం గడవుచ్చింది. ట్యాంపరింగ్ పాపం ఈ ముగ్గురు ఆటగాళ్లదేనని ఇప్పటికే తేల్చిన క్రికెట్ ఆస్ట్రేలియా తాజాగా వారిపై చర్యలు తీసుకుంది.