బాల్ ట్యాంపరింగ్ చేయడంలో ‘మాస్టర్ మైండ్స్’ఎవరైనా ఉన్నారంటే అది ఆస్ట్రేలియా క్రికెట్ జట్టేనేమో. ఆ జట్టు ట్యాంపరింగ్ చేయడానికి యత్నించిన మరొక వీడియో తాజాగా వెలుగులోకి రావడం అందుకు మరింత బలాన్నిచ్చింది. కేప్‌టౌన్‌లో జరిగిన మూడో టెస్టులోనే ఆసీస్ బౌలర్ ప్యాట్ కమిన్స్ తన షూ స్పైక్స్‌తో బంతిని నొక్కిపట్టడం వివాదాస్పదంగా మారింది. తొలిరోజు ఆట 53వ ఓవర్‌లో ప్రొటీస్ ఆటగాడు డీన్ ఎల్గర్‌కు వేసిన బంతి డిఫెన్స్ ఆడడంతో తిరిగి అది కమిన్స్ దగ్గరికే వచ్చింది. దీన్ని అతడు షూస్‌తో ఆపడంతో పాటు తన ఎడమకాలి స్పైక్స్‌తో కొన్ని సెకన్లపాటు బలంగా అదమడం వీడియోలో కనిపించింది.