ట్యాంపరింగ్ ఉదంతంతో ఏడాదిపాటు నిషేధానికి గురైన ఆసీస్ ఆటగాడు స్టీవ్ స్మిత్ తనను వెంటాడుతున్న వివాదాన్ని మరచిపోయేందుకు దేశం విడిచి యూఏఈకి వెళ్లాడు. ఇంటా బయటా విమర్శల జడివాన కురుస్తుండటంతో ఉపశమనం పొందడానికి స్మిత్ తన కుటుంబంతో కలిసి యూఏఈకి పయనమయ్యాడు. ఈ క‍్రమంలోనే స్మిత్ క్రికెట్ కిట్‌ను తండ్రి పీటర్ గ్యారేజ్‌లో పడేశాడు. ఇప్పట్లో స్మిత్‌కు పనిలేదు కాబట్టి అతని క్రికెట్ కిట్‌ను గ్యారేజ్‌లో పడేసినట్లు పీటర్ తెలిపాడు.