స్టీవ్ స్మిత్, బెన్‌క్రాఫ్ట్
కేప్‌టౌన్ : బాల్ ట్యాంపరింగ్ వివాదంలో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్‌పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) డబుల్ షాకిచ్చింది. ఓ మ్యాచ్ నిషేధం విధిస్తూ ఐసీసీ చర్యలు తీసుకుంది. దీంతో పాటుగా మొత్తం మ్యాచ్ ఫీజును (100 శాతం) కోత విధిస్తున్నట్లు ప్రకటించింది. ఇక బాల్ ట్యాంపరింగ్‌కు యత్నించిన ఆసీస్ ఆటగాడు బెన్‌క్రాఫ్ట్‌కు మ్యాచ్ ఫీజులో 75 శాతం కోత విధిస్తూ.. మూడు డీమెరిట్ పాయింట్లు ఇచ్చింది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో బెన్ క్రాఫ్ట్ ట్యాంపరింగ్‌కు యత్నించి టీవీ కెమెరాలకు అడ్డంగా దొరికిన విషయం తెలిసిందే.
మ్యాచ్ అనంతరం ఈ విషయాన్ని జట్టు వ్యూహంలో భాగమేనని స్టీవ్ స్మిత్, కామెరాన్ బెన్‌క్రాఫ్ట్‌లు చేసిన తప్పును ఒప్పుకున్నారు. ఈ ఘటనపై ఆస్ట్రేలియా ప్రధానమంత్రి మాల్కమ్ టర్న్‌బుల్ సైతం స్పందించారు. కెప్టెన్ స్మిత్, జట్టు ప్రవర్తించిన తీరు తనను ఆశ్చర్యానికి గురి చేసిందని, దీన్ని ఆసీస్ క్రికెట్ అభిమానులు సైతం అంగీకరించబోరని ఆయన పేర్కొన్నారు. ఈ వివాదాన్ని సిరీయస్‌గా పరిగణించిన క్రికెట్ ఆస్ట్రేలియా.. స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లను తాత్కాలికంగా కెప్టెన్, వైస్ కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పిస్తూ వేటు వేసింది.
Comments
Please login to add a commentAdd a comment