Bandar port construction
-
దేవతల్లా యజ్ఞం చేస్తున్నాం.. రాక్షసుల్లా అడ్డుపడుతున్నారు
చంద్రబాబు కోరుకున్న అమరావతి ఎలాంటిదంటే... అందులో పేదవర్గాలు కేవలం పాచి పనులు మాత్రమే చేయాలి. రోజువారీ పనులు చేసే కార్మికులుగానే ఉండాలి. వాళ్లెవరికీ అక్కడ ఇళ్లు ఉండకూడదు! వాళ్లు అమరావతిలో పొద్దున్నే ఎంటరై పనులు చేసి తిరిగి వెనక్కి పోవాలి!! రాజధాని పేరుతో పేదలకు ఏమాత్రం ప్రవేశం లేని ఓ గేటెడ్ కమ్యూనిటీని చంద్రబాబు ప్రభుత్వ ధనంతో కట్టుకోవాలనుకున్నారు. ఇంతకన్నా సామాజిక అన్యాయం ఎక్కడైనా జరుగుతుందా?. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి ప్రతినిధి, విజయవాడ: రాష్ట్రంలో నాలుగేళ్లుగా పేదలకు మంచి జరగకూడదన్న లక్ష్యంతో చంద్రబాబు బృందం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. పేదలు ఎప్పటికీ పేదలుగానే మిగిలిపోయి పాచి పనులు చేసుకుంటూ బతకాలనే దుర్బుద్ధి కలిగిన రాక్షసులతో మనం యుద్ధం చేస్తున్నామన్నారు. అమరావతిలో కేవలం చంద్రబాబు, ఆయన బినామీలే ఉండాలని, పేదలకు అక్కడ స్థానమే లేకుండా చేయాలని కుట్రలు పన్నుతున్నారని ధ్వజమెత్తారు. దేవుడి ఆశీస్సులు, ప్రజలందరి చల్లటి దీవెనలతో ఆ అడ్డంకులను అధిగమించి అడుగులు ముందుకు వేస్తున్నట్లు చెప్పారు. ఈనెల 26వతేదీన అమరావతిలో 50 వేల మందికి పైగా పేదలకు ఇంటి పట్టాలు పంపిణీ చేయనున్నట్లు ఈ సందర్భంగా సీఎం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రూ.5,156 కోట్ల వ్యయంతో చేపట్టిన బందరు పోర్టు నిర్మాణానికి సోమవారం కృష్ణా జిల్లా మంగినపూడి సమీపంలోని తపసిపూడి వద్ద సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. అనంతరం జాతీయ స్కౌట్స్ అండ్ గైడ్స్ మైదానంలో నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడారు. ఆ వివరాలివీ.. సభలో ప్రసంగిస్తున్న సీఎం జగన్, బహిరంగ సభకు హాజరైన అశేష జనవాహినిలో ఓ భాగం సముద్ర వాణిజ్యంతో శతాబ్దాల చరిత్ర బందరుకు సముద్ర వాణిజ్యంతో శతాబ్దాల చరిత్ర ఉంది. చిరకాల స్వప్నం బందరు పోర్టును సాకారం చేస్తూ మనందరి ప్రభుత్వం అన్ని కోర్టు కేసులను అధిగమించి భూసేకరణ కూడా పూర్తి చేసింది. అన్ని అనుమతులు సాధించి ఫైనాన్షియల్ క్లోజర్‌ను పూర్తి చేసి టెండర్ల ప్రక్రియను ముగించి పోర్టు నిర్మాణ పనులను ప్రారంభించాం. దాదాపు 35 మిలియన్ టన్నుల సామర్ధ్యంతో పోర్టు ప్రారంభమవుతుంది. నాలుగు బెర్తులు ఇక్కడ రానున్నాయి. ట్రాఫిక్ పెరిగే కొద్దీ బెర్తుల సంఖ్యను పెంచుకుంటూ 116 మిలియన్ టన్నుల కెపాసిటీ వరకు విస్తరించుకోవచ్చు. పోర్టుతో రోడ్లు, రైల్వే లైన్ అనుసంధానం బందరు పోర్టు నిర్మాణంతో పాటు అనుబంధంగా మౌలిక వసతుల పనులు కూడా చేపడుతున్నాం. కేవలం 6.5 కి.మీ. దూరంలో ఉన్న 216వ నెంబర్ జాతీయ రహదారిని పోర్టు వరకు అనుసంధానించేలా చర్యలు చేపట్టాం. దీంతోపాటు 7.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుడివాడ, మచిలీపట్నం రైల్వే లైనును కూడా పోర్టు వరకు తీసుకొచ్చి అనుసంధానిస్తున్నాం. బందరు కాలువ నుంచి 0.5 ఎం.ఎల్.డీ నీటిని 11 కిలోమీటర్ల మేర పైపులైన్ ద్వారా తరలించి పోర్టుతో అనుసంధానం చేస్తున్నాం. దీనివల్ల సరుకుల ఎగుమతి, దిగుమతికి అత్యంత మెరుగైన రవాణా వ్యవస్థ ఏర్పడుతుంది. మన పోర్టు రాబోయే రోజుల్లో కృష్ణా జిల్లా చరిత్రను మార్చబోయే అస్త్రంగా అందుబాటులోకి వస్తుంది. పోర్టును అడ్డుకున్న బాబు.. బందరు పోర్టు రాకూడదని చంద్రబాబు అడుగులు వేశారు. 22 గ్రామాలు, 33 వేల ఎకరాలను తీసుకునేందుకు భూములన్నీ నోటిఫై చేసి రైతులెవరూ వాటిని అమ్ముకునే పరిస్థితి లేకుండా అందరినీ ఇబ్బందులకు గురి చేశారు. మచిలీపట్నంలో పోర్టు రాకపోతే అమరావతిలో తన బినామీల భూముల రేట్లు విపరీతంగా పెంచుకోవచ్చనే దుర్బుద్ధితో మచిలీపట్నానికి తీరని ద్రోహం చేశాడు. సంతోషంగా ఇచ్చిన భూములతో.. ఈరోజు పోర్టు నిర్మాణానికి 1,700 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించాం. రైలు, రోడ్డు మార్గానికి కేవలం మరో 240 ఎకరాలు మాత్రమే భూసేకరణ జరిగింది. రైతులందరూ మనస్ఫూర్తిగా ఇచ్చిన 240 ఎకరాలు తీసుకుని పోర్టు నిర్మాణంలోకి వస్తుంది. ఇక్కడ ప్రభుత్వ భూములు చాలా ఉన్నాయి. వాటిలో 4 వేల ఎకరాలను పోర్టుతో అనుసంధానించి పరిశ్రమలు వచ్చేలా చేయడం ద్వారా లక్షలాది ఉద్యోగాలకు ఊతం పడినట్లు అవుతుంది. మారిన బందరు రూపురేఖలు మరో 24 నెలల వ్యవధిలో ఈ ప్రాంతం రూపురేఖలు మారబోతున్నాయి. మచిలీపట్నంలో పెద్ద పెద్ద ఓడలు కనిపిస్తాయి. మచిలీపట్నం రూపురేఖలు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా మారుతున్నాయో చూడండి. జిల్లా యంత్రాంగం మొత్తం ఇక్కడే ఉండేలా మచిలీపట్నం జిల్లా కేంద్రం ఏర్పాటైంది. బందరులో దాదాపు రూ.550 కోట్లతో చేపట్టిన కొత్త మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తి కావస్తోంది. ఈ సంవత్సరమే ఆగస్టు, సెప్టెంబరులో అడ్మిషన్లు జరగనున్నాయి. దీనివల్ల అవనిగడ్డ, పెడన, పామర్రు, గుడివాడ, కైకలూరు నియోజకవర్గాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయి. మా నమ్మకం నువ్వే జగనన్నా.. అంటూ ఫ్లకార్డులు చేబూనిన జనం మరో నాలుగు నెలల్లో ఫిషింగ్ హార్బర్ మత్స్యకారులు ఆరాధించే నాగుల్‌మీరా సాహెబ్ ఆశీస్సులతో ఏ సమయంలోనైనా మత్స్య సంపదను ఒడ్డుకు తెచ్చుకునేందుకు వీలుగా ఇక్కడే మరో రూ.420 కోట్లతో ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరో నాలుగు నెలల్లో ఈ ఫిషింగ్ హార్బర్ అందుబాటులోకి వస్తుంది. ఇక్కడే ఇమిటేషన్ జ్యూయలరీ తయారీకి మద్దతుగా కరెంటు ఛార్జీలను తగ్గిస్తామని నా పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు రూ.7.65 నుంచి మనం అధికారంలోకి రాగానే రూ.3.75లకు తగ్గించాం. ఫిషింగ్ హార్బర్లు.. ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు ప్రపంచ స్ధాయి ప్రమాణాలతో 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టాం. ఇప్పటికే ఐదింటిలో పనులు వేగంగా జరుగుతున్నాయి. మరో 4–5 నెలల్లో పనులు పూర్తవుతాయి. మిగిలినవి త్వరితగతిన పూర్తయ్యేలా అడుగులు వేస్తున్నాం. ఆరు ఫిష్ ల్యాండింగ్ కేంద్రాల పనులూ వేగంగా జరుగుతున్నాయి. 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల కోసం రూ.3,700 కోట్లు ఖర్చు చేస్తున్నాం. పేద కుటుంబాల్లో వెలుగులు పేదరికాన్ని సమూలంగా తొలగించి నా అక్కచెల్లెమ్మల కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు రూ.2.10 లక్షల కోట్లు నేరుగా బటన్ నొక్కి ఖాతాల్లో జమ చేశాం. ఇక నాన్ డీబీటీ కూడా కలిపితే, అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన 30 లక్షలకుపైగా ఇంటి స్ధలాలను కూడా కలిపితే.. ఒక్కో ఇంటి స్ధలం విలువ కనీసం రూ.2.50 లక్షలు వేసుకున్నా వాటి విలువ రూ.75 వేల కోట్లు ఉంటుంది. నాన్ డీబీటీ కూడా కలిపితే రూ.3 లక్షల కోట్ల మేర లబ్ధి చేకూర్చాం. మరోవైపు 21 లక్షల ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇళ్లు పూర్తయితే ఒక్కో ఇంటి విలువ కనీసం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు వేసుకున్నా ఇళ్ల పట్టాలు, ఇళ్లతో అక్కచెల్లెమ్మలకు రూ.1.5 లక్షల కోట్ల నుంచి రూ.2 లక్షల కోట్ల ఆస్తి వారి చేతిలో పెట్టినట్లవుతుంది. ఆర్వోబీ.. కమ్యూనిటీ హాళ్లకు ఓకే ఎమ్మెల్యే పేర్ని నాని నియోజకవర్గ అభివృద్ధి పనుల గురించి అడిగారు. మెడికల్ కాలేజీ వద్ద రోడ్డు ఓవర్ బ్రిడ్జి కోసం రూ.25 కోట్లు మంజూరు చేస్తున్నాం. 6 కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి రూ.3 కోట్లు మంజూరు చేస్తున్నాం. అంబేడ్కర్ భవన్ మరమ్మతులకు రూ.5 కోట్లు కేటాయిస్తున్నాం. మరో 12 గ్రామాలకు సంబంధించి ఎంజాయ్మెంట్ సర్వే పూర్తైన 12,615 ఎకరాలకు సంబంధించిన వివాదాన్ని పరిష్కరించాలని కలెక్టర్‌కు ఇక్కడి నుంచే ఆదేశాలు ఇస్తున్నాం. త్వరలో ఇవ్వబోయే అసైన్డ్ భూములు, లంక భూములకు సంబంధించిన పట్టాలతో పాటు వీరికి కూడా పట్టాలిస్తాం. రాక్షసులు.. వికృత ఆలోచనలు! అమరావతి ప్రాంతంలో 50 వేల మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాలిచ్చి ఇళ్లు నిర్మించి ఇచ్చే కార్యక్రమాన్ని రెండేళ్ల క్రితమే ప్రారంభించాం. కానీ దేవతల యజ్ఞాన్ని రాక్షసులు అడ్డుకున్నట్టుగా టీడీపీ, గజదొంగల ముఠా అడ్డుపడుతోంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 వీరికి ఒక దత్తపుత్రుడు కలిశాడు. వీళ్ల పని దోచుకోవడం పంచుకోవడం.. తినుకోవడమే. రాజధాని పేరుతో పేదవాళ్లకు ఏమాత్రం ప్రవేశం లేని ఓ గేటెడ్ కమ్యూనిటీని ప్రభుత్వ ధనంతో కట్టుకోవాలనుకున్నారు. అమరావతిలో 50 వేల మందికి ఇళ్ల స్ధలాలు ఇవ్వడమే కాకుండా ఇళ్లు కట్టించే కార్యక్రమానికి ఈనెల 26న శ్రీకారం చుడుతున్నాం. పేదల ఇళ్ల కష్టాలు తెలుసా పెద్దమనిషి? అమరావతి పరిధిలో మీ బిడ్డ ప్రతి పేదవాడికి 1.1 సెంటు భూమిని ఉచితంగా ఇచ్చి ఇల్లు కూడా ఉచితంగా కట్టిస్తూ 50 వేల మంది కలలను నిజం చేస్తుంటే ఆ పవిత్ర స్థలాన్ని చంద్రబాబు స్మశానంతో పోలుస్తాడు. పేదలకు ఆయన ఒక్క సెంటు స్థలం కూడా ఇవ్వలేదు. ఇప్పుడు మనం ఇస్తుంటే శ్మశానంతో పోలుస్తాడు. ఇలాంటి మనిషికి మానవత్వం ఉందా ? ఆ పెద్దమనిషికి పేదల కష్టాల గురించి అవగాహన ఉందా? సొంత ఇల్లు లేక అద్దె ఇళ్లలో నివసించే పేదలు ఎలా జీవిస్తున్నారో కనీసం అవగాహన ఉందా? ఆ కుటుంబాలలో ఎవరైనా ఒక మనిషి చనిపోతే శవాన్ని ఆసుపత్రి నుంచి ఎక్కడికి తీసుకెళ్లాలో దిక్కు తోచని దుస్థితిలో అద్దె ఇళ్లలో ఎలా బతుకీడుస్తున్నారో కనీస స్పృహ ఉందా? కడసారి కూడా చూసుకునే భాగ్యం లేని పరిస్థితుల్లో, గుండెల నిండా బాధ ఉన్నా ఎక్కడకు వెళ్లి ఏడవాలో తెలియక శ్మశానాల వద్ద తల్లడిల్లుతున్న పరిస్థితుల్లో ఎలా ఉంటున్నారో ఆలోచన చేయమని అడుగుతున్నాం. చివరకు ఒక పక్షి సైతం ఒక గూడు కట్టుకోవాలని అనుకుంటుంది. తన పిల్లలతో పాటు ఉంటుంది. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లు అవుతున్నా సొంత ఇళ్లు కట్టుకోలేని పరిస్థితుల్లో లక్షల మంది పేదలున్నారు. ఇది మానవత్వం లేని మనుషుల్లో కూడా పరివర్తన తెచ్చే విషయం. కానీ చంద్రబాబుకు మానవత్వం లేదు. పేదలకు మేలు చేసే కార్యక్రమాలను దారుణంగా అడ్డుకుంటున్న ద్రోహి చంద్రబాబు. ఆలోచన చేయండి. మంచి చేసిన చరిత్ర చంద్రబాబుకు ఎప్పుడూ లేదు. పేదల దగ్గరకు వచ్చి మేం ఫలానా మంచి చేశామని చెప్పుకోలేని పరిస్థితి వాళ్లది. వారి ఆలోచనలన్నీ కుళ్లు, కుతంత్రాలే. దత్తపుత్రుడ్ని, మీడియాను నమ్ముకుంటారట! వీళ్లంతా ఏకమైతే ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చూపించగలుగుతార? వారంతా ఏకమైతే మంచి చేసిన చరిత్ర ఉన్న మీ బిడ్డ ఎన్నికల్లో గెలవడమే కష్టమట! మీ గుండెలపై చేతులు వేసుకుని ఒక్కసారి ఆలోచన చేయండి. మీ బిడ్డ పాలనలో మీకు మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే సైనికులుగా నిలవండి. 4 పోర్టులు.. లక్ష ఉద్యోగాలు ఇప్పటివరకు రాష్ట్ర పోర్టుల వార్షిక సామర్ధ్యం 320 మిలియన్ టన్నులు కాగా 2025–26 నాటికి అదనంగా మరో 110 మిలియన్ టన్నులు పెంచేలా అడుగులు వేస్తున్నాం. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా రాష్ట్రంలో నాలుగు చోట్ల 6 పోర్టులు మాత్రమే ఉండగా మీ బిడ్డ ప్రభుత్వం వచ్చాక నాలుగేళ్లలోనే రూ.16 వేల కోట్లతో రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేటలో గ్రీన్ ఫీల్డ్ పోర్టుల పనులు వేగంగా జరిగేలా అడుగులు వేశాం. కాకినాడ వద్ద గేట్‌వే పోర్టు నిర్మాణం జరుగుతోంది. ఒక్కో పోర్టు వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా కనీసం 25 వేల ఉద్యోగాలు వస్తాయి. నాలుగు పోర్టులు అందుబాటులోకి రాగానే లక్ష ఉద్యోగాలు దక్కుతాయి. మచిలీపట్నం పోర్ట్ నిర్మాణానికి శంకుస్థాపనతో కల సాకారం: సీఎం జగన్ రాష్ట్ర ప్రజలకు కలగా మిగిలిన మచిలీపట్నం పోర్ట్ నిర్మాణానికి మన ప్రభుత్వంలో సోమవారం శంకుస్థాపన చేశాం.. అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ‘నాలుగు బెర్తులతో దాదాపు 35 మిలియన్ టన్నుల సామర్థ్యంతో ఈ పోర్ట్‌ను నిర్మిస్తున్నాం. అలాగే కనెక్టివిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటులో భాగంగా ఈ పోర్ట్‌ను జాతీయ రహదారి–216కి, గుడివాడ–మచిలీపట్నం రైల్వేలైన్‌కు అనుసంధానం చేస్తున్నాం’ అంటూ సోమవారం ఆయన ట్వీట్ చేశారు. సముద్ర తీరంలో సీఎం పూజలు సముద్రుడికి పట్టువస్త్రాలు సమర్పించి హారతి సాక్షి ప్రతినిధి, విజయవాడ: బందరు పోర్టు నిర్మాణ పనులకు శంకుస్థాపన సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం సముద్ర తీరంలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. హెలీప్యాడ్ నుంచి పోర్టు నిర్మాణ పనులు జరిగే తపసిపూడి గ్రామ తీరానికి ఉదయం చేరుకున్నారు. ముందుగా దుర్గమ్మ చిత్రపటం వద్ద పూజలు చేసి వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ సాగరుడికి హారతి ఇచ్చారు. అనంతరం సముద్రుడికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం జెండా ఊపి కొండరాళ్లను సముద్రంలో వేసి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమం జరుగుతున్న సమయంలో మత్స్యకారులు సముద్రంలో బోట్లపై పార్టీ జెండాలను రెపరెపలాడిస్తూ శుభాభినందనలు తెలిపారు. అనంతరం పోర్టు పనుల ఫైలాన్‌ను సీఎం జగన్ ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో ప్రారంభించారు. -
బందరు పోర్టు పనులకు నేడే శుభారంభం
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, విజయవాడ: మచిలీపట్నం ప్రజల దశాబ్దాల కలను నెరవేరుస్తూ రూ.5,156 కోట్ల వ్యయంతో చేపడుతున్న పోర్టు నిర్మాణ పనులను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ప్రారంభించనున్నారు. భూసేకరణ పూర్తిచేసి, అన్ని అనుమతులు సాధించి, న్యాయ వివాదాలు పరిష్కరించి, టెండర్లు ఖరారుచేసి, ఫైనాన్షియల్ క్లోజర్ పూర్తిచేసి కొబ్బరికాయ కొట్టిన తర్వాత పనులు ఆగకుండా శరవేగంగా జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికను సిద్ధంచేసింది. పూర్తిగా ప్రభుత్వ వ్యయంతో నిర్మిస్తున్న ఈ పోర్టు రాకతో వాణిజ్య కార్యకలాపాలు విస్తరించి రానున్న కాలంలో కృష్ణాజిల్లా ముఖచిత్రం మారనుంది. 75 ఏళ్లలో ఆరు, ఈ నాలుగేళ్లలో నాలుగు.. స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్లలో రాష్ట్రంలో కేవలం ఆరు పోర్టులు కడితే, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నవశకానికి నాంది పలుకుతూ అధికారంలోకి వచ్చిన కేవలం నాలుగేళ్లలోపే మరో నాలుగు పోర్టుల నిర్మాణానికి సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. ఇప్పటికే రామాయపట్నం, కాకినాడ గేట్‌వే పోర్టుల్లో పనులు శరవేగంగా జరుగుతుండగా, మూలపేట పోర్టు పనులు కూడా ఇటీవలే ప్రారంభమయ్యాయి. ఇక సోమవారం నుంచి ఈ జాబితాలో మచిలీపట్నం పోర్టు కూడా చేరనుంది. 25వేల మంది ఉపాధి.. 35.12 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో రెండు జనరల్ కార్గోకు, ఒకటి బొగ్గుకు, మరొకటి మల్టీపర్పస్–కంటైనర్‌తో ఎగుమతి, దిగుమతులకు ఉపయోగపడేలా మొత్తం నాలుగు బెర్తులతో మచిలీపట్నం పోర్టును 24–30 నెలల్లో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పోర్టు పనుల పూర్తితో ప్రత్యక్షంగా, పరోక్షంగా 25వేల మందికి ఉపాధి లభించనుంది. వాణిజ్య కార్యకలాపాలు విస్తరించేకొద్దీ 16 బెర్తులతో 116 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో పోర్టును విస్తరించేలా ప్రణాళిక రూపొందించుకున్నారు. ఇక ఈ పోర్టు ద్వారా రాష్ట్రంలోని గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు తెలంగాణలోని ఖమ్మం, కరీంనగర్, అదిలాబాద్, నల్గొండ, వరంగల్ జిల్లాలకు ఎరువులు, బొగ్గు, వంటనూనె, కంటైనర్ల దిగుమతులు, వ్యవసాయ ఉత్పత్తులు, సిమెంట్, సిమెంట్ క్లింకర్, గ్రానైట్, ముడి ఇనుము ఎగుమతులకు వేదికగా మారనుంది. సుమారు రూ.16,000 కోట్ల వ్యయంతో రామాయపట్నం, మచిలీపట్నం, కాకినాడ గేట్‌వే, మూలపేట పోర్టుల నిర్మాణాల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 75 వేల మందికి ఉపాధి లభించనుంది. తొలి ఏడాదే కార్పొరేషన్, పరిపాలనా అనుమతులు.. తూర్పు తీరంలో ఆంగ్లేయులతో పాటు డచ్, పోర్చుగీస్ వారికి సైతం వ్యాపార కేంద్రంగా మచిలీపట్నం పోర్టు విలసిల్లింది. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే పోర్టు నిర్మాణానికి 2020 ఫిబ్రవరి 4న మచిలీపట్నం పోర్టు డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరుతో ప్రత్యేక సంస్థ ఏర్పాటు.. రూ.5,156 కోట్లతో పోర్టు నిర్మాణానికి పరిపాలన అనుమతులు మంజూరు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28న పోర్టు నిర్మాణానికి కీలకమైన పర్యావరణ అనుమతులు, ఏప్రిల్ 13న కాలుష్య నియంత్రణ మండలి అనుమతులు, 2023 మార్చిలో 1,923 ఎకరాల భూసేకరణ పూర్తయిన తర్వాత మే 22న పోర్టు నిర్మాణ పనులు ప్రారంభిస్తున్నారు. మారనున్న సముద్ర తీర ప్రాంత ముఖచిత్రం ఆగ్నేయాసియాకు ముఖద్వారంగా 974 కి.మీ తీరంతో దేశంలోనే రెండో అతిపెద్ద సముద్ర తీరంగల రాష్ట్రంలో ప్రస్తుతమున్న ఆరు పోర్టులకు అదనంగా ఏపీ మారిటైమ్ బోర్డు నాలుగు పోర్టులను అభివృద్ధి చేస్తోంది. ఇప్పటికే ఉన్న విశాఖపట్నం మేజర్ పోర్టు, ఐదు నాన్ మేజర్ పోర్టుల ద్వారా ఏటా 320 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యాన్ని రాష్ట్రం కలిగి ఉంది. అలాగే.. ► కొత్తగా నిర్మిస్తున్న పోర్టుల ద్వారా 2025–26 నాటికి అదనంగా మరో 110 మిలియన్ టన్నుల రవాణా సామర్థ్యం అందుబాటులోకి వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ► పారిశ్రామికాభివృద్ధి, వాణిజ్య కార్యకలాపాలకు ఊతమిచ్చేలా కొత్తగా నిర్మిస్తున్న మచిలీపట్నం పోర్టు సమీపంలో పోర్టు ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు 4,000 ఎకరాల సాల్ట్ భూములను ప్రభుత్వం గుర్తించింది. ► తీర ప్రాంతం మరియు పోర్టు పరిసర ప్రాంతాల పారిశ్రామికీకరణ దిశగా అడుగులు వేయడంతో పాటు పోర్టు అనుసంధానిత లాజిస్టిక్స్ ఏర్పాటు ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు అవకాశం లభించనుంది. ► ప్రతీ 50 కి.మీకు ఒక పోర్టు లేదా ఫిషింగ్ హార్బరు ఉండేలా మత్స్యకారులకు లబ్ధి చేకూర్చేందుకు ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలతో 10 ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. ► వీటిద్వారా 2035 నాటికి రాష్ట్ర సముద్ర వాణిజ్య విలువ 20 బిలియన్ డాలర్లకు చేర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ► ఇక రాష్ట్రానికి ప్రకృతి ప్రసాదించిన అతిపెద్ద సముద్ర తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు సమగ్ర ప్రణాళికతో దేశంలోని అతిపెద్ద పోర్టుల్లో ఒకటిగా, రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో కీలకంగా మార్చే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మచిలీపట్నం పోర్టును అభివృద్ధి చేయనున్నారు. హడావుడిగా బాబు శంకుస్థాపన నిజానికి.. అధికారంలో ఉన్న కాలంలో పోర్టు నిర్మాణానికి ఎటువంటి చర్యలు చేపట్టని చంద్రబాబు 2019 ఎన్నికలు దగ్గర పడిన సమయంలో బందరు పోర్టుకు ఎటువంటి అనుమతులు, నిధులు లేకుండా హడావుడిగా శంకుస్థాపన చేశారు. పోర్టు నిర్మాణానికి అవసరమైన పర్యావరణ అనుమతులు, ఫైనాన్షియల్ క్లోజర్, రోడ్డు కనెక్టివిటీ, భూసేకరణ చేయకుండానే మొక్కుబడిగా శంకుస్థాపన చేసి ఈ ప్రాంత ప్రజలను మాయచేశారు. మచిలీపట్నం పోర్టు విశేషాలు.. ► భూసేకరణ, ఇతర అనుబంధ పోర్టులతో కలిపి మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.5,155.73 కోట్లు ► వార్షిక సామర్థ్యం 35.12 మిలియన్ టన్నులు ► బెర్తుల సంఖ్య 4 ► భూసేకరణ.. 1,923 ఎకరాలు ► ఎన్‌హెచ్ 216ను అనుసంధానం చేస్తూ 6.5 కి.మీ. మేర నాలుగు లేన్ల రహదారి ► పెడన రైల్వేస్టేషన్ నుంచి పోర్టు వరకు 7.5 కి.మీ రైల్వే లైన్ నిర్మాణం ► బందరు కెనాల్ నుండి 11 కి.మీ పైప్‌లైన్ ద్వారా 0.5 ఎంఎల్డీ (మిలియన్ లీటర్స్ పర్ డే) నీటి సరఫరా ► పెడన 220 కేవీ సబ్‌స్టేషన్ నుండి 15 ఎంవీఏ (మెగా వోల్ట్ యాంప్) విద్యుత్ సరఫరా నేడు మచిలీపట్నానికి సీఎం జగన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం కృష్ణాజిల్లా మచిలీపట్నంలో పర్యటించనున్నారు. ఉ.8.30 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయల్దేరి మచిలీపట్నం మండల పరిధిలోని తపసిపూడి గ్రామానికి చేరుకుంటారు. పోర్టు నిర్మాణ ప్రదేశంలో భూమి పూజచేసి పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. అనంతరం మచిలీపట్నంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటుచేసిన హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి జిల్లా పరిషత్ సెంటర్లోని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ మైదానంలో ఏర్పాటుచేసిన బహిరంగసభ ప్రాంగణానికి చేరుకుంటారు. అక్కడ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. కార్యక్రమం అనంతరం సీఎం జగన్ మచిలీపట్నం నుంచి బయలుదేరి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. -
బట్టబయలైన ‘పోర్టు’ నాటకం!
సాక్షి, మచిలీపట్నం: ఇచ్చిన హామీ నెరవేర్చాలని అధికారంలో ఉన్న నాలుగున్నరేళ్లు తలంచలేదు.. సరిగ్గా ఎన్నికలకు మరో రెండు నెలలు ఉందనగానే ఒక్కసారిగా గుర్తొచ్చాయి.. ఇంకేముంది ‘పసుపు– కుంకుమ’ మాదిరిగానే ఆర్భాటంగా ఇదిగో బందరు పోర్టు అంటూ ఓ పైలాన్‌ను ఆవిష్కరించేశారు. అందుకోసం టీడీపీ నాయకుల మౌఖిక ఆదేశాలతో రైతుల భూములను మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(ముడా) అధికారులు అనధికారికంగా స్వాధీనం చేసుకుని నిర్మాణాలు సాగించారు. సీన్ కట్‌చేస్తే.. భూములిచ్చిన రైతులకు ఎకరానికి ఇస్తామన్న రూ. 40 లక్షల ఊసు లేదు.. తిరిగి భూములిచ్చేయండని అడిగితే చీదరింపులు.. వెరసి వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారుల ఆధీనంలో ఉన్న తమ భూములను విడిపించాలని మండల పరిధిలోని మేకవానిపాలెం, గోపువానిపాలెం గ్రామాల రైతులు వేడుకుంటున్నారు. బందరు పోర్టు పనుల ప్రారంభోత్సవం పేరుతో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆయా గ్రామాల సరిహద్దులో బహిరంగ సభ నిర్వహించిన విషయం తెలిసిందే. సభాప్రాంగణానికి, పైలాన్ నిర్మాణానికి ఇరు గ్రామాల రైతులకు చెందిన 20 ఎకరాలను వినియోగించారు. అప్పట్లో ఎకరం భూమిని రూ. 40 లక్షలకు కొనుగోలు చేస్తున్నట్లు అధికారులు, టీడీపీ నాయకులు అట్టహాసంగా ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు ఒక్క రూపాయి ఇవ్వకపోగా భూమిని ఖాళీ చేయడం లేదంటూ రైతులు గగ్గోలు పెడుతున్నారు. చిత్తశుద్ధి లేని పనులకు రూ. కోట్లు గడిచిన ఐదేళ్లు టీడీపీ నాయకులు బందరు పోర్టు నిర్మాణంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 2014 ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబునాయుడు గెలిస్తే ఆరు నెలల్లో బందరుకు ఓడను తీసుకొస్తానని ప్రగల్భాలు పలికిన విషయం తెలిసిందే. ఐదేళ్లు భూ సేకరణ, భూ సమీకరణ, మచిలీపట్నం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ(మడా), మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(ముడా) ఏర్పాటు అంటూ కాలయాపన చేశారు. అయితే ముడాకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి విడుదలైన కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఐదేళ్లు హారతికర్పూరం చేశారు. ఇక 2019 ఎన్నికల దగ్గరపడే సమయానికి ఒక్క సారిగా ఉలిక్కిపడ్డారు. ఐదేళ్లు ఆడిన నాటకానికి చివరి అంకంలో రక్తికట్టించే ప్రయత్నంలో భాగంగానే మేకవానిపాలెం, గోపువానిపాలెం గ్రామాల రైతుల భూములను వినియోగించుకున్నారు. బందరు పోర్టు పనులు పూర్తి చేయలేమని, అయితే పనులు ప్రారంభం అంటూ నియోజకవర్గ ప్రజలను మరో మారు వంచించేందుకు ఎన్నికల ముందు, ఫిబ్రవరిలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును తీసుకొచ్చి హడావుడి చేశారు. సభ నిర్వహణకు, హెలికాప్టర్ ల్యాండింగ్‌కు, పైలాన్ నిర్మాణానికి 20 ఎకరాలను రైతుల నుంచి బలవంతంగా తీసుకుని సభను మమ అనిపించారు. ముడా అధికారుల దౌర్జన్యం భూములను ఖాళీ చేయమంటూ ముడా అధికారులు తమపై దౌర్జన్యం చేస్తున్నారని పలువురు రైతులు వాపోతున్నారు. ముందుగా ఎకరం భూమికి రూ. 40 లక్షలు ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకు నగదు చెల్లించకపోవడంతో ఇటీవల కొందరు రైతులు ముడా కార్యాలయానికి చేరుకుని అధికారులను ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ముడా అధికారులు తమపై విరుచుకుపడినట్లు కొందరు రైతులు చెబుతున్నారు. భూములకు సంబంధించిన కాగితాలను తీసుకురావాలని, లేదంటే భూములను ఆన్లైన్ అడంగళ్‌లో నుంచి తప్పిస్తామని, రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తామని, ప్రభుత్వానికి స్వాధీనం చేస్తామని అధికారులు బెదిరిస్తున్నారని రైతులు వివరిస్తున్నారు. ఆగిపోయిన సాగు.. ప్రస్తుతం ఖరీఫ్ సాగు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఏటా తొలకరి వర్షాలను ఆసరాగా తీసుకుని రైతులు ఈ భూముల్లో వేరుశనగ సాగు ప్రారంభిస్తారు. భూముల్లో కంకర, పైలాన్ ఉండటంతో సాగు చేయలేకపోతున్నామంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే కొందరు రైతులు కంకర లేని ప్రాంతంలో పొలాలను దుక్కి దున్ని విత్తనాలు వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ విషయంపై ముడా వైస్ చైర్మన్ విల్సన్‌బాబును వివరణ కోరేందుకు ‘సాక్షి’ ప్రయత్నించగా ఆయన అందుబాటులో లేరని కార్యాలయ సిబ్బంది తెలిపారు. భూమిని సాగుకు పనికిరాకుండా చేశారు ముడా అధికారులు ఆక్రమించిన భూమిలో నాకు 2.50 ఎకరాల భూమి ఉంది. అప్పట్లో భూమి ఇవ్వమని చెప్పాం. టీడీపీ నాయకులు, ముడా అధికారులు బలవంతంగా భూమిని తీసుకున్నారు. పోలీసు కేసులు పెడతామని బెదిరించారు. దీంతో ఎవరికి చెప్పుకోలేకపోయాం. నా భూమిలో కొంత భాగం పైలాన్ కట్టారు. మిగిలిన భూమిలో కంకర పోశారు. ఇప్పుడు సాగు చేసుకునేందుకు వీలు లేకుండా ఉంది. నా కుటుంబానికి ఈ భూమి జీవనాధారం. భూమిలో ఉన్న కట్టడాలను తీసేయ్యాలని ఇటీవల ముడా అధికారులను కలిసి విన్నవించుకున్నాం. వాళ్లు మమ్మల్ని పలు రకాలుగా బెదిరించారు. – మేకా వెంకటశివ, రైతు, గోపువానిపాలెం -
బందరు పోర్టుపై నేడు భేటీ
సీఎంతో అధికారుల సమావేశం మచిలీపట్నం : బందరు పోర్టు నిర్మాణంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం మధ్యాహ్నాం జిల్లా అధికారులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. మచిలీపట్నం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (ఎంఏడీఏ) ద్వారా జరిగిన పురోగతి తదితర అంశాలపై చర్చించనున్నారు. బందరు పోర్టు పోర్టు నిర్మాణం జరిగే మంగినపూడి, తపసిపూడి, గోపువానిపాలెం, కరగ్రహారం, చిలకలపూడి, బందరు ఈస్ట్ రెవెన్యూ గ్రామాల్లో 4,800 ఎకరాల భూమిని సమీకరించి తొలివిడతగా పోర్టు నిర్మాణం చేస్తామని అధికారులు ప్రకటించారు. ఆ దిశగా ఈ ఆరు గ్రామాల్లో భూముల సర్వే ఇటీవల నిర్వహించారు. 3,100ఎకరాల భూమి కి సంబంధించిన సర్వే పనులను పూర్తి చేసి నివేదికను ముఖ్యమంత్రికి ఇచ్చేందుకు ఎంఏడీఏ అధికారులు సిద్ధం చేశారు. రాష్ట్రంలోని అన్ని పోర్టులకు సంబంధించిన కీలక సమావేశం బుధవారం ముఖ్యమంత్రితో జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర రాజధాని అమరావతికి దగ్గరలో ఉన్న బందరుపోర్టు అంశంపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. మాగాణి భూములుగా పరిగణిస్తారా... మచిలీపట్నంలో పోర్టు, పారిశ్రామిక కారిడార్ నిర్మాణం కోసం ఎంఏడీఏ ద్వారా గత ఏడాది సెప్టెంబరులో 33,177 ఎకరాల భూమి కోసం ప్రభుత్వం భూసమీకరణ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. రైతుల నుంచి తీవ్ర వ్య తిరేకత వ్యక్తం కావడంతో పోర్టు నిర్మా ణం జరిగే ఆరు గ్రామాల పరిధిలో 4,800 ఎకరాలను సమీకరించేందుకు అధికారులు సర్వే నిర్వహించారు. భూ సమీకరణ నోటిఫికేషన్ 1934 రెవెన్యూ రికార్డుల ప్రకారం ఇచ్చారు. కాలక్రమంలో కాలువల ఏర్పాటు, సాగునీటి విడుదల జరగటంతో ఏడాదికి రెండు పంటలు పండిస్తున్నారు. సమీకరణ నోటిఫికేషన్లో మెట్టభూమిగా నమో దు చేయటంతో రైతులకు తీవ్ర అన్యా యం జరిగే అవకాశం ఏర్పడింది. మెట్ట ఎకరాకు రూ.30వేలు, మాగాణి భూమికి రూ. 50వేలు చొప్పున పది సంవత్సరాల పాటు లీజు సొమ్ముగా అందజేస్తామని నోటిఫికేషన్లో ప్రభుత్వం వెల్లడించింది. దీంతో అన్ని గ్రామాల్లోని రైతులు నష్టపోనున్నారు. -
‘పోర్టు’కు చలనం
మచిలీపట్నం : జిల్లా ప్రజల చిరకాల వాంఛ అయిన బందరు పోర్టు నిర్మాణ విషయంలో కాస్త చలనం వచ్చింది. విజయవాడలో ఇటీవల జరిగిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బందరు పోర్టు అభివృద్ధికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. పోర్టు భూసేకరణకు సంబంధించిన వివరాలను తనకు నివేదిక రూపంలో అందజేయాలని ఆయన చెప్పారు. రెవెన్యూ అధికారులు నివేదిక తయారు చేస్తే త్వరలోనే ముఖ్యమంత్రి పోర్టు భూసేకరణపై అధికారులతో సమావేశమయ్యే అవకాశం ఉంది. మచిలీపట్నం-విజయవాడ మధ్య నాలుగు లైన్ల రహదారి విస్తరణ పనులను కూడా ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారని అధికారులు చెబుతున్నారు. గతంలోనే నివేదిక రూ.5వేల కోట్లతో 5,324 ఎకరాల విస్తీర్ణంలో పోర్టు నిర్మాణం జరగాల్సి ఉంది. ఇందుకు అవసరమైన భూములను గతంలోనే గుర్తించారు. భూ సేకరణే కీలకంగా మారింది. పోర్టు నిర్మాణానికి అవసరమైన భూ సేకరణకు అవసరమైన నిధులను తామే సమకూరుస్తామని నిర్మాణ కాంట్రాక్టు పొందిన నవయుగ సంస్థ గతంలోనే ప్రభుత్వానికి లేఖ రాసింది. భూసేకరణకు రూ.451.42 కోట్లు, పోర్టు నిర్మిస్తే 563 కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సి ఉంటుందని, ఇందుకు రూ.43.58 కోట్లు అవసరమవుతాయని 2011, జూలైలో కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక పంపారు. 2012, మే నెలలో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పోర్టు కోసం 5,324 ఎకరాల భూమిని కేటాయిస్తూ జీవో నంబరు-11 జారీచేశారు. ఇందులో 524 ఎకరాలు పోర్టుకు సంబంధించిన భూమి ఉంది. ఆ భూమి ఇప్పటికే సేకరించారు. మిగిలిన 4,800 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. ముఖ్యమంత్రి సూచనతో పోర్టుకు అవసరమైన భూ సేకరణ పై మరోమారు అధికారులు గతంలో ఇచ్చిన నివేదికనే కొద్దిపాటి మార్పులు చేసి ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. స్వల్ప మార్పులు..! ఇప్పటి వరకు కరగ్రహారం వద్ద పోర్టు పనులు ప్రారంభించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. అయితే కొద్దిపాటి మార్పులతో పోర్టు పనులు గిలకలదిండి వైపునకు మారే అవకాశం ఉందని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. పోర్టు భూ సేకరణ జరగాలంటే కలెక్టర్ పర్యవేక్షణలో తొలుత భూ సేకరణకు డ్రాస్ట్ నోటిఫికేషన్ ఇవ్వాలి. అనంతరం డ్రాఫ్ట్ డిక్లరేషన్ ఇవ్వాలి. పోర్టు అభివృద్ధికి భూసేకరణ చేయాలని ప్రభుత్వం నుంచి అనుమతులు వస్తేనే ఈ ప్రక్రియ వేగవంతమవుతుందని అధికారులు చెబుతున్నారు. భూసేకరణ పూర్తయితే ఈ భూములను ప్రభుత్వం ఓడరేవుల శాఖకు అప్పగిస్తుంది. ఓడరేవుల శాఖ నుంచి తమకు ఈ భూములు అప్పగించిన వెంటనే పోర్టు పనులు ప్రారంభిస్తామని నవయుగ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో భూ సేకరణకు సంబంధించి నివేదికను తయారు చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. రోడ్డు పనులు ప్రాంభమయ్యేనా! మచిలీపట్నం-విజయవాడ జాతీయ రహదారి విస్తరణ పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు కలెక్టర్‌కు సూచిం చారు. మచిలీపట్నం-విజయవాడ మధ్య 65 కిలోమీటర్ల మేర ఈ జాతీయ రహదారిని రూ.750 కోట్లతో నాలుగు లైన్లుగా విస్తరించేందుకు ప్రభుత్వం 2012లోనే అనుమతులు ఇచ్చింది. ఈ పనులను మధుకాన్ సంస్థ దక్కించుకుంది. ఈ రోడ్డు పనులు ప్రారంభం కావాలంటే 81శాతం భూ సేకరణ జరగాల్సి ఉండగా ఈ ప్రక్రియ పూర్తయింది. మధుకాన్ సంస్థ ఈ పనులు ప్రారంభిం చకుండా జాప్యం చేసింది. బందరు పోర్టు, జాతీయ రహదారికి ప్రభుత్వం నిధులు విడుదల చేయాల్సిన అవసరం లేదు. ఈ రెండు పనులను దక్కించుకున్న సంస్థలే పెట్టుబడి పెడతాయి. పోర్టు పనులు ప్రారంభమైతే ఈ రహదారి నాలుగు లైన్లుగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది.