bandh effect
-
రాజస్థాన్ బంద్.. నాలుగు జిల్లాల్లో హైఅలర్ట్
జైపూర్: రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణిసేన జాతీయ అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ గోగామేడీ దారుణ హత్య నేపథ్యంలో రాజస్థాన్ అట్టుడుకుతోంది. హత్యకు నిరసనగా సుఖ్‌దేవ్ సింగ్ మద్దతుదారులు బుధవారం రాజస్థాన్ బంద్‌కు పిలుపునిచ్చారు. ఘటన విషయం గురించి తెలియగానే పెద్ద ఎత్తున రాజ్‌పుత్ సామాజిక వర్గం రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చురు, ఉదయ్‌పూర్, అల్వార్, జోధ్‌పూర్ జిల్లాల్లోనూ నిరసనలకు దిగారు. దీంతో, పలుచోట్ల ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. అయితే, సుఖ్‌దేవ్ సింగ్ గోగామేడీ పట్టపగలే దారుణ హత్యకు గురికావడం సంచలనంగా మారింది. రాజధాని జైపుర్‌లోని శ్యామ్నగర్లో ఆయన నివాసంలోనే గోగామేడీ హత్యకు గురయ్యారు. ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు మంగళవారం మధ్యాహ్నం సుఖ్‌దేవ్ నివాసానికి వెళ్లి దారుణానికి పాల్పడ్డారు. గోగామేడీతో మాట్లాడాల్సి ఉందని భద్రతా సిబ్బందికి చెప్పి లోపలికి వెళ్లారు. కొద్దిసేపు మాట్లాడిన తర్వాత ఒక్కసారిగా కాల్పులు జరిపారు. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. #SukhdevSinghGogamedi Murder | Rajasthan DGP Umesh Mishra appeals for peace; stating that raids are underway on potential hideouts of criminals. Gogamedi's supporters have called for a #RajasthanBandh today after the leader's fatal shooting in Jaipur. pic.twitter.com/Ph6k37iNoI — NDTV (@ndtv) December 6, 2023 మరోవైపు.. రాజస్థాన్‌లో ఉద్రికత్తలపై డీజీపీ ఉమేశ్ మిశ్రా స్పందించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అందరూ శాంతియుతంగా ఉండాలని కోరారు. నేరస్థుల రహస్య స్థావరాలపై దాడులు జరుగుతున్నాయన్నారు. నేరుస్తులను వదిలిపెట్టమని హామీ ఇచ్చారు. ఇక, దుండగుల్లో ఒకడైన నవీన్ షెకావత్‌ను సుఖ్‌దేవ్ సింగ్ సహచరులు కాల్చి చంపారు. గోగామేడీ భద్రతా సిబ్బంది కాల్పుల్లో నవీన్ చనిపోయినట్టు జైపుర్ పోలీస్ కమిషనర్ బిజు జార్జ్ జోసెఫ్ వెల్లడించారు. అయితే, రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజునే హత్య జరగడం కలకలం సృష్టించింది. Rajasthan | Members of the Rajput community sit in protest against the murder of Sukhdev Singh Gogamedi, national president of Rashtriya Rajput Karni Sena, in Jaipur The Rajput community outfits supporting Sukhdev Singh Gogamedi have called for a state-wide bandh today pic.twitter.com/T0FTFVJMSm — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) December 6, 2023 -
బంద్ ఎఫెక్ట్.. కామారెడ్డిలో హై టెన్షన్!
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో బంద్ కొనసాగుతోంది. మరోవైపు.. కామారెడ్డికి వచ్చే అన్ని రూట్లను పోలీసులు బ్లాక్ చేశారు. రైతుల ర్యాలీని పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకుంటున్నారు. పోలీసు యాక్ట్ 30 అమలులో ఉందని పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలో పలువురు రైతు జేఏసీ, కాంగ్రెస్, బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. ఇదిలా ఉండగా.. మాస్టర్ ప్లాన్‌కు నిరసనగా శుక్రవారం కామారెడ్డి నియోజకవర్గంలో బంద్ పాటించాలని రైతు ఐక్య కార్యాచారణ కమిటీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జిల్లావ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. మరోవైపు.. రైతు జేఏసీ నాయకులు విద్యాసంస్థలను మూసివేయించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సైతం జై జవాన్.. జై కిసాన్ అంటూ నినాదాల చేసుకుంటూ విద్యార్థులు బయటకు వచ్చారు. ఇదిలా ఉండగా.. జిల్లాలో బంద్ నేపథ్యంలో కామారెడ్డి బీజేపీ నియోజకవర్గ ఇంఛార్జ్ కాటిపల్లి వెంకట రమణారెడ్డిని పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. అనంతరం, బీబీపేట పోలీసు స్టేషన్‌కు తరలించారు. మరోవైపు.. మాస్టర్ ప్లాన్ భూబాధత రైతులకు మద్దతుగా కామారెడ్డిలో బీజేపీ నేతలు బైక్ ర్యాలీ చేపట్టారు. జిల్లా కేంద్రంలో స్వచ్చందంగా వ్యాపారులు షాపులను బంద్ చేయాలని బీజేపీ నేతలు విజ్ఞప్తి చేస్తున్న చేస్తున్నారు. రైతుల భూములపై స్పష్టత ఇచ్చేవరకు ఉద్యమాన్ని ఆపేదిలేదంటున్న బీజేపీ నేతలు కామెంట్స్ చేస్తున్నారు. ఇక, రైతులకు కాంగ్రెస్ నేత షబ్బీర్ మద్దతుగా నిలిచారు. ఈ సందర్బంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. కలెక్టరేట్ దగ్గర రైతుల ఆందోళనను అవమానించారు. మాస్టర్ ప్లాన్ బాధిత రైతులకు కాంగ్రెస్ అండగా ఉంటుంది. మాస్టర్ ప్లాన్‌ను సవరిస్తామని ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలి. మాస్టర్ ప్లాన్ పేరుతో ప్రభుత్వం..రైతుల భూములను లాక్కుంటోంది. రైతుల భూముల్లో ఇండస్ట్రియల్ ప్రతిపాదను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. -
ఉసూరుమన్న ప్రజాభిప్రాయ సేకరణ
ఒంగోలు సబర్బన్: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏ.పి.ఇ.ఆర్.సి)గురువారం ఒంగోలులో నిర్వహించిన బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణపై బంధ్ ఎఫెక్ట్ పడింది. స్థానిక దక్షిణ బైపాస్ రోడ్డులోని పాత జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏ.పి.ఈ.ఆర్.సి చైర్మన్ జస్టిస్ జి.భవాని ప్రసాద్ అధ్యక్షతన ప్రజాభిప్రాయ సేకరణ సమావేశాన్ని నిర్వహించారు. మండలి సభ్యులు పి.రామ్మోహనరావు, పి.రఘు కూడా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రకటించిన బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్సీపీతో పాటు వామపక్ష పార్టీలు బంధ్ నిర్వహించాయి. దీంతో ప్రజాభిప్రాయ సేకరణకు ప్రజలు రాక వెలవెల బోయింంది. పట్టుమని పది మంది కూడా విద్యుత్ వినియోగదారులు హాజరు కాలేకపోయారు. సమావేశానికి ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ ఎంఎం.నాయక్, డైరెక్టర్ పి.పుల్లారెడ్డి విజయవాడ సీఈ రాజబాపయ్య, కర్నూల్ సీఈ పీరయ్య, ప్రకాశం ఎస్ఈ ఎన్వీఎస్.సుబ్బరాజు, నెల్లూరు ఎస్ఈ విజయకుమార్ రెడ్డి, కర్నూల్ ఎస్ఈ భార్గవ రాముడు, వినియోగదారుల పరిష్కార వేదిక చైర్పర్సన్ ఏ.జగదీష్ చంద్రరావు, సభ్యులు పాల్ సురేంద్ర కుమార్, ఒంగోలు డీఈ కట్టా వెంకటేశ్వరరావు, ఒంగోలు పట్టణ ఏడీఈ పి.వి.వి ప్రసాదుతో పాటు జిల్లాలోని విద్యుత్ డీఈలు, ఏడీఈలు, ఏఈలు, సిబ్బంది పాల్గొన్నారు. విద్యుత్ చార్జీల్లో మార్పు లేదు 2018–19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విద్యుత్ చార్జీల్లో మార్పు లేదు. 2017–18లో ఉన్న చార్జీలనే అమలు చేస్తున్నాం. రానున్న ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్థిక ఆవశ్యకతగా రూ. 21,429 కోట్లు నిర్ధారించారు. విద్యుత్ చార్జీలు సంతృప్తి కరంగానే ఉన్నాయి. దేశంలో కల్లా రాష్ట్రంలోనే విద్యుత్ చార్జీలు తక్కువగా ఉన్నాయి. వినియోగదారులపై ఆర్థిక భారాన్ని మోపేదిలేదు. ఆదాయాన్ని, వ్యయాన్ని సమన్వయం చేసుకోవటానికే ఇలాంటి బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. – జస్టిస్ జి.భవానీ ప్రసాదు, ఏ.పి.ఇ.ఆర్.సి చైర్మన్ రూ. 6,218 కోట్లు సబ్సిడీ రావాల్సి ఉంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి విద్యుత్ సంస్థలకు రూ. 6,218 కోట్లు సబ్సిడీల రూపంలో రావాల్సి ఉంది. ఈ మేరకు ఏ.పి.ఇ.ఆర్.సి చైర్మన్‌కు ప్రతిపాదనలు అందించాం. పాత విద్యుత్ చార్జీలే యథావిధిగా ఉంటాయి. విద్యుత్ అమ్మకాల ద్వారా ఏ.పి.ఎస్.పి.డి.సి.ఎల్‌కు రూ. 14,816 కోట్లు వస్తాయి. అందులో భాగంగా హెచ్.డి సర్వీస్‌ల ద్వారా రూ. 457 కోట్లు, ఎల్టీ సర్వీస్‌ల ద్వారా రూ. 7,370 కోట్లు వస్తాయి. విద్యుత్ కొనుగోళ్ల కోసం రానున్న ఆర్థిక సంవత్సరంలో రూ.16,850 కోట్లు వెచ్చించాల్సి ఉంది. ఒక్క ట్రాన్స్‌కోకు రూ. 930 కోట్లు చెల్లిస్తున్నాం. విద్యుత్ ప్రమాదాల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు నష్టపరిహారాలను వెంటనే వాళ్ల బ్యాంక్ ఖాతాల్లో జమచేయాలి. – ఎం.ఎం.నాయక్, ఏ.పి.ఎస్.పి.డి.సి.ఎల్ సీఎండీ -
నేడు తమిళనాడు బంద్
-
గంగమ్మా ..
బంద్, అమావాస్యల ప్రభావం తగ్గిన పుష్కర జనం జిల్లాలో 55,016 మంది స్నానాలు నేడు భక్తులు పెరిగే అవకాశం సాక్షి, రాజమహేంద్రవరం : గోదావరి అంత్యపుష్కరాల్లో భాగంగా మూడో రోజు మంగళవారం జిల్లా వ్యాప్తంగా 55,016 మంది భక్తులు స్నానమాచరించారు. రాజమహేంద్రవరంలోని ఘాట్లతోపాటు కోటిపల్లి, అంతర్వేది, అప్పనపల్లి, అయినవిల్లి, వాడపల్లి, జొన్నాడ, ధవళేశ్వరం రామపాదాల రేవు, మునికూడలి ఘాట్లలో భక్తులు పుణ్య స్నానాలు చేశారు. మంగళవారం అమావాస్య కావడంతోపాటు రాష్ట్ర బంద్ వల్ల భక్తుల రాక తగ్గింది. రాజమహేంద్రవరంలోని ఘాట్లు మధ్యాహ్నం 12 గంటలకే వెలవెలబోయాయి. భక్తుల రాక మందగించడంతో మధ్యాహ్నం పుష్కర, కోటిలింగాల ఘాట్లలో జల్లు స్నానం నిలిపివేసి సాయంత్రం ప్రారంభించారు. పుష్కరఘాట్ 15,405, కోటిలింగాలఘాట్లో 9,370 మంది పుణ్య స్నానాలు చేశారు. పలువురు భక్తులు పితృదేవతలకు పిండ ప్రదానాలు చేశారు. భక్తుల రద్దీ తగ్గడంతో బందోబస్తు సిబ్బందిని తగ్గించారు. అంత్యపుష్కరాల నోడల్ అధికారి వి.విజయరామరాజు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం నుంచి సీసీ కెమెరాల ద్వారా ఘాట్ల వద్ద ఏర్పాట్లను పర్యవేక్షించి సిబ్బందికి సూచనలిచ్చారు. భక్తులకు సేవలందించిన స్వచ్ఛంద సంస్థలు రాజమహేంద్రవరం నగరంలోని ఏడు ఘాట్లలో వివిధ స్వచ్ఛంద సంస్థలు, కాలేజీల విద్యార్థులు, ఎన్సీసీ క్యాడెట్లు భక్తులకు సేవలందించారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులు 100 మంది, ఆదిత్య డిగ్రీ కాలేజీ విద్యార్థులు 190 మంది, ఏబీవీపీ, ఆంధ్రకేసరి యువజన సంఘం ప్రతినిధులు, ఎస్ఆర్కే మహిళా కాలేజీ ఎన్సీసీ క్యాడెట్లు, శ్రీ కల్కి మానవసేవా సంస్థ ప్రతినిధు లు భక్తులకు వివిధ సమాచారం, వృద్థులను ఘాట్లలోకి తీసుకెళ్లడం, తీసుకురావడం, మంచినీరు అందించడం వంటి సేవలు అందించారు. వైభవంగా హారతి మహోత్సవం పుష్కరాల రేవులో రాత్రి ఏడు గంటలకు రాష్ట్ర దేవాదాయశాఖ, బుద్ధవరపు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హారతి కార్యక్రమం వైభవంగా జరిగింది. వర్షం పడుతున్నా సుమారు 7,500 భక్తులు హారతిని వీక్షించి ఆనందపరవశులయ్యారు. ఏఎస్పీ రెడ్డి గంగాధర్‌రావు, డీఎస్పీ జె.కులశేఖర్ సిబ్బందితో కలసి హారతి కార్యక్రమం వద్ద బందోబస్తును పర్యవేక్షించారు. రాజమహేద్రవరంలోని ఘాట్లలో ఎన్సీసీ 18వ ఆంధ్రాబెటాలియన్ కమాండెంట్ కల్నల్ మనీష్ గౌర్ పర్యటించారు. ఆయా ఘాట్ల వద్ద విధులు నిర్వహిస్తున్న ఎన్సీసీ క్యాడెట్లకు భోజన వసతి, రవాణా సౌకర్యం అందించాలని అక్కడి అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ కోటిలింగాలఘాట్లోని తెరపై రాత్రి ఏడుగంటకు ‘కలసి ఉంటే కలదు సుఖం’ చిత్రాన్ని ప్రదర్శించింది. రాష్ట్ర భాష, సాంసృ్కతిక శాఖ ఆధ్వర్యంలో కనకదుర్గ ప్రజానాట్యమండలి ఆనం కళాకేంద్రంలో శ్రీకృష్ణ తులాభారం నాటకాన్ని ప్రదర్శించింది. మంగళవారం జిల్లాలోని వివిధ ఘాట్లలో స్నానమాచరించిన భక్తుల సంఖ్య కోటిలిగాలఘాట్ 9,370 పుష్కరఘాట్ 15,405 మార్కండేయఘాట్ 168 టీటీడీఘాట్ 511 శ్రద్ధానందఘాట్ 124 పద్మావతిఘాట్ 682 సరస్వతిఘాట్ 5,367 గౌతమిఘాట్ 1,675 ధవళేశ్వరం 2,854 మునికూడలి 1,797 కోటిపల్లి 930 అప్పనపల్లి 5,628 అంతర్వేది 3,960 వాడపల్లి 2,797 జొన్నాడ 2,800 -
బోసిపోయిన సత్తెన్న ఆలయం
అన్నవరం : రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్ కారణంగా మంగళవారం సత్యదేవుని ఆలయానికి భక్తులు పెద్దగా రాకపోవడంతో ఆలయ ప్రాంగణం వెలవెలబోయింది. సత్యదేవుని ఆలయానికి వెళ్లే భక్తులు, వారి వాహనాలతో నిత్యం రద్దీగా ఉండే స్వామివారి ఆలయం వెనుక ఉన్న పశ్చిమ రాజగోపురం మంగళవారం సందడి లేకుండా కనిపించింది. నిత్యం వేలాది సంఖ్యలో స్వామివారిని దర్శించుకునే భక్తులు, మంగళవారం మాత్రం వెయ్యి కన్నా తక్కువ సంఖ్యలో దర్శించుకున్నారు. స్వామివారి వ్రతాలు 210 మాత్రమే జరిగాయి. ఆదాయం కూడా రూ.రెండు లక్షలు మాత్రమే వచ్చింది.