పాక్ బాలికకు అరుదైన క్యాన్సర్ చికిత్స
బెంగళూరు వైద్యుల ఘనత
సాక్షి, బెంగళూరు: ప్రాణాంతక క్యాన్సర్తో బాధపడు తున్న పాక్ బాలికకు విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించి భారతీయ వైద్యులు తమ గొప్పదనాన్ని చాటారు. పాకిస్తాన్కు చెందిన జీనియా అనే బాలికకు బెంగళూరులోని నారాయణ హెల్త్ సిటీ ఆస్పత్రిలో అరు దైన బోన్ మారో (ఎముక మూలుగ మార్పిడి) శస్త్రచికిత్స నిర్వహించారు. క్యాన్సర్తో బాధపడుతున్న జీనియాను ఆమె తల్లిదండ్రులు చికిత్స కోసం బెంగళూరు తీసుకొచ్చారు.
పరిశీలించిన వైద్యులు ఆమెకు బోన్ మారో చికిత్స అ వసరమని నిర్ధారించారు. మూలుగ కోసం ఆమె కుటుంబంలో అందరికీ వైద్య పరీక్షలు జరిపి ఎనిమిది నెలల వయసున్న ఆమె తమ్ముడు రియాన్ మూలుగ జీనియాకు సరిపోవడంతో వైద్యులు బోన్ మారో చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. బాలిక కోలుకున్నట్లు శుక్రవారం మీడియా సమావేశంలో తెలిపారు.