Bangalore-Guwahati Express
-
‘సెంట్రల్’లో టెన్షన్
చెన్నై, సాక్షి ప్రతినిధి:రాష్ట్రంలో తీవ్రవాద కార్యకలాపాలు అడపాదడపా జరుగుతూనే ఉన్నాయి. బెంగళూరు-గువాహటి ఎక్స్‌ప్రెస్ రైలు సుమారు ఆరునెలల క్రితం చెన్నై మీదుగా వె ళుతున్న తరుణంలో సెంట్రల్ రైల్వే స్టేషన్లో ఆగింది. సరిగ్గా అదే సమయంలో ఆ రైలులోని రెండు బోగీల్లో బాంబులు పేలగా ఒక ఇంజనీరింగ్ ఉద్యోగి ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన జరిగి నెలలు దాటుతున్నా నిందితులెవరూ దొరకలేదు. నాటి నుంచి నగరంలోని పోలీస్ స్టేషన్లకు బాంబు బెదిరింపు కాల్స్ రావడం పరిపాటి అయింది. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం 1గంట సమ యంలో పోలీసులకు మరో ఫోన్‌కాల్ వచ్చిం ది. సాయంత్రం 4-6 గంటల మధ్య సెంట్ర ల్ రైల్వే స్టేషన్లో బాంబు పేలనుందని అందులోని సారాంశం. ఈ ఫోన్‌కాల్‌తో ఉలిక్కిపడిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు సెంట్రల్లో తనిఖీలు ప్రారంభించారు. ఏ మూలను వదలకుండా గాలించారు. ఫ్లాట్‌ఫారంలపై బయల్దేరేందుకు సిద్ధంగా ఉన్న అన్ని రైళ్లను తనీఖీలు చేశారు. రైల్వే స్టేషన్లోకి వచ్చే ప్రయాణికులను, వారి లగేజీలను క్షుణ్ణంగా తనిఖీ చేసిగానీ వదల్లేదు. సుమారు నాలుగు గంటల పాటు విరామం లేకుండా వెదికినా అనుమానాస్పద వస్తువులు ఏమీ దొరకలేదు. దీంతో ఇదంతా ఆకతాయి పనిగా నిర్ధారించుకుని ఊపిరి పీల్చుకున్నారు. రైల్వే పోలీసులను, ప్రయాణికులను, అధికారులను ఇంతగా భయాందోళనకు గురిచేసిన ఫోన్‌కాల్ ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. -
ఆ బాంబులు సీమాంధ్ర కోసమేనా?
గురువారం చెన్నైలో పేలిన బాంబులు నిజానికి ఆంధ్రప్రదేశ్ లో పేల్చాలని ఉగ్రవాదులు పథకం వేశారా? ఆ బాంబులను ఆంధ్రప్రదేశ్ లోకి తరలిస్తున్నారా? అవుననే అంటున్నారు ఉగ్రవాద వ్యవహారాల నిపుణులు. ఎందుకంటే సీమాంధ్ర తప్ప మొత్తం దక్షిణ భారతదేశంలో ఎన్నికలు అయిపోయాయి. ఈ బాంబులు పేలిక కంపార్ట్ మెంట్లలోని ప్రయాణికులు అందరూ కోస్తా ప్రాంతానికి వెళ్తున్న వారే. కాబట్టి ఆంధ్ర ప్రాంతంలో ఎన్నికలను ప్రభావితం చేసేందుకు వీటిని ఉద్దేశించి ఉండవచ్చునని హోం శాఖ కు చెందిన ఒక నిపుణుడు పేర్కొన్నారు. రైలు చెన్నైకి దాదాపు రెండు గంటలు ఆలస్యంగా వచ్చింది. సమాయినికి రైలు ప్రయాణించి ఉంటే బాంబు పేలే సమయానికి అది కోస్తా ప్రాంతంలో ఉండి ఉండేదని నిపుణులు చెబుతున్నారు. అయితే బాంబులను టైమర్ ద్వారా పేల్చి ఉండవచ్చునని చెబుతున్నారు. మరో వైపు బాంబు పేలుళ్ల నేపథ్యంలో రైలులోనే ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చెన్నై రైల్వే స్టేషన్ లో కానీ, తమిళనాడులో రైళ్లలో కానీ పేలుళ్లు జరగడం ఇదే తొలిసారి. తమిళనాట ఇంతకుముందు ఒకే బాంబు పేలుడు సంఘటన జరిగింది. అంది 1998 లో కోయంబత్తూరులో ఒకే సారి 12 చోట్ల బాంబులు పేలి, 60 మంది చనిపోయారు. దాదాపు 200 మంది గాయపడ్డారు. ఆ తరువాత జరిగిన సంఘటన ఇదే. -
మృత్యువు ఆమె సీటు కిందే పొంచి ఉంది!
ఆమె ఎక్కిన రైలు గమ్యం చేరలేదు. గురువారం ఆమె ఇంటికి రావలసింది. అమ్మను ఆలింగనం చేసుకోవలసింది. కానీ నవ్వుతూ కేరింతాలు కొడుతూ ఇంటికి రావలసిన అమ్మాయి శవమై వచ్చింది. మృత్యువును తత్కాల్ టికెట్ తో కొనుగోలు చేసి మరీ ఆమె తిరిగిరాని లోకాలకు వెళ్లింది. మన గుంటూరు అమ్మాయి మన గుంటూరు అమ్మాయి, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఉద్యోగి స్వాతి పరుచూరి ఉగ్రవాదులు చెన్నై రైల్వేస్టేషన్ లో ఆగి ఉన్న బెంగుళూరు - గువహటి ట్రెయిన్ లో పెట్టిన బాంబుకి బలైపోయింది. స్వాతి మంచి ప్రతిభగలిగిన విద్యార్థిని. గత డిసెంబర్ లో ఆమె టీసీఎస్ లో చేరింది. ఈ ఫిబ్రవరిలోనే ట్రెయినింగ్ పూర్తి చేసుకుని తొలి జీతాన్ని తీసుకుంది. ఆమె తల్లితండ్రులను కలవాలనుకుంది. వారిని కలిసి ఆనందాన్ని పంచుకోవాలనుకుంది. కబుర్లు కలబోసుకోవాలనుకుంది. అందుకే తత్కాల్ లో టికెట్ కొని బెంగుళూరులో రైలు ఎక్కింది. మృత్యువు ఆమె సీటు కిందే బాంబు రూపంలో పొంచి ఉందన్న సంగతి ఆమెకు తెలియలేదు. తత్కాల్ లో మృత్యువును కొనుగోలు చేసిన స్వాతి చెన్నై స్టేషన్ లో ఆగి ఉండగా బాంబు పేలింది. తల్లిదండ్రులు తమ కూతురు చుట్టూ కట్టుకున్న ఆశలు ఆకాంక్షల బంగారు కోటలు భగ్నమైపోయాయి. కొద్ది రోజుల్లోనే ఆమెకి పెళ్లి చేయాలని తల్లిదండ్రులు సంబంధాలు కూడా చూస్తున్నారు. స్వాతి ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సైన్సెస్ లో బిటెక్ చేసింది. ఆమె తల్లి కామాక్షి పాలిటెక్నిక్ టీచర్, తండ్రి రైతు, తమ్ముడు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. గుంటూరు శ్రీనగర్ కాలనీకి ఇప్పుడు చిరునవ్వుల స్వాతి చిరనిద్రలో వస్తోంది. వీధి వీధంతా విషాదమై ఆమె కోసం ఎదురుచూస్తోంది. ఉగ్రవాద రక్కసి ఖాతాలో మరో ప్రాణం ఆవిరై చేరింది.