చేతులు కాల్చుకున్న రితేష్ దేశ్‌ముఖ్
జెనీలియా భర్త రితేష్ దేశ్‌ముఖ్‌కు చేతులు కాలాయి. అయితే, ఇది వంట చేస్తున్నప్పుడు జరిగిన ప్రమాదం మాత్రం కాదు. బంగిస్థాన్ అనే సినిమా షూటింగ్ జరుగుతుండగా చిన్నపాటి ప్రమాదం సంభవించడంతో ఆయన చేతులు కాలాయి. ఈ విషయాన్ని స్వయంగా రితేష్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశాడు. సినిమాలో నటించేటప్పుడు సహజత్వం రావాలంటే ఇలాంటి సాహసాలు చేయడం తప్పనిసరి అవుతోంది. ఇటీవలి కాలంలో చాలామంది హీరోలు సహజంగా కనిపించడం కోసం ఫైట్లలో కూడా సాహసాలు చేస్తున్నారు.
2015లో విడుదల కానున్న కామెడీ చిత్రం బంగిస్థాన్లో రితేష్ దేశ్ముఖ్తో పాటు పులకిత్ సమ్రాట్ కూడా నటిస్తున్నాడు. దీనికి కరణ్ అన్షుమన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఓ ప్రత్యేక గీతంలో కనిపిస్తారు. సల్మాన్ ఖాన్ నటించిన 'కిక్' సినిమాలో ఆమె పాట హిట్టవడంతో ఇప్పుడు బంగిస్థాన్లోనూ నర్తిస్తోంది.