Bank Savings Account
-
అత్యవసర నిధికి ఎక్కడ, ఎంత ఇన్వెస్ట్ చేయాలి?
నేను 2010 నుంచి బీఎస్‌ఎల్‌ఐ డ్రీమ్ ఎండోమెంట్ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించాను. ఇప్పటివరకూ రూ.3,95,000 పెట్టుబడులు పెట్టాను. వీటి ప్రస్తుత విలువ రూ.4,10,000గా ఉంది. ఆరేళ్లలో వచ్చిన రాబడులు చాలా స్వల్పంగా ఉన్నాయి. ఈ ప్లాన్‌లో కొనసాగమంటారా? వైదొలగమంటారా ? - రాఘవ, విజయవాడ బీఎస్‌ఎల్‌ఐ డ్రీమ్ ఎండోమెంట్ ప్లాన్.. యూనిట్ లింక్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్(యులిప్) కిందకు వస్తుంది. ఈ యులిప్‌లు మనకు తగిన బీమా రక్షణను ఇవ్వలేవు. అలాగే ద్రవ్యోల్బణాన్ని ధీటుగా తట్టుకునే రాబడులను ఇవ్వలేవు. పైగా ఈ తరహా ప్లాన్‌లో చార్జీల భారం అధికంగా ఉంటుంది. మీరు ఇన్వెస్ట్ చేసే దాంట్లోంచి ఈ చార్జీలను మినహాయించుకొని మదుపు చేస్తారు. ఈ పాలసీ మీకు ఏడాదికి కనీసం 1 శాతం కంటే తక్కువ రాబడినే ఇచ్చింది. సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలో ఇన్వెస్ట్ చేసినా ఇంతకంటే ఎక్కువ రాబడులే వచ్చేవి. అందుకని ఈ ప్లాన్ నుంచి వైదొలగడమే ఉత్తమం. ఈ ప్లాన్‌నుంచి వైదొలగి, తగిన బీమా, తక్కువ ప్రీమియమ్ ఉండే టర్మ్ బీమా పాలసీ తీసుకోండి. ఇక మీరు ఈ పాలసీ తీసుకొని ఐదేళ్లు పూర్తయింది కాబట్టి, ఈ పాలసీని సరెండర్చేస్తే ఎలాంటి సరెండర్ చార్జీలు చెల్లించాల్సిన పనిలేదు. అంతేకాకుండా ఈ ప్లాన్‌ను సరెండర్ చేయడం ద్వారా మీరు పొందిన మొత్తాలపై ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన పనిలేదు. మూడు అంతకు మించిన కాలానికి ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు పొందవచ్చు. అత్యవసరాల కోసం ఎంత మొత్తాన్ని కేటాయించాలి? ఇలా కేటాయించే సొమ్ములను ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? దీని కోసం బ్యాంక్ సేవింగ్స్ ఖాతా తెరిస్తే సరిపోతుందా? - విజయ్, రాజమండ్రి అంచనా వేయలేని దుర్ఘటన కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా మనల్ని సంరక్షించేలా అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. మూడు నుంచి ఆరు నెలల ఇంటి ఖర్చులకు సరిపడేలా ఈ అత్యవసర నిధిని తయారు చేసుకోవాలి. తక్షణం సొమ్ము చేసుకునేలా ఈ నిధి ఉండాలి. బ్యాంక్ డిపాజిట్లు, స్వీప్ ఇన్ సౌకర్యమున్న సేవింగ్స్ ఖాతాలో ఇన్వెస్ట్ చేయడం లేదా లిక్విడ్ ఫండ్స్‌లో మదుపు చేయడం.. అత్యవసర నిధి ఏర్పాటు కోసం పరిశీలించదగ్గ మార్గాలు. మీ మొత్తం పెట్టుబడిలో కొంత మొత్తాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకునేలా స్వీప్ ఇన్ సౌకర్యంగా ఉంచుకోవాలి. మిగిలిన మొత్తాన్ని లిక్విడ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలి. ఒక్క రోజు నోటీసు ద్వారా ఈ లిక్విడ్ ఫండ్ నుంచి మీ సొమ్ములు తీసుకోవచ్చు. నా కోడలు సాధారణ గృహిణి, అందువల్ల ఆమెకు టర్మ్ బీమా పాలసీకి అర్హత లేదు. కొన్ని బీమా కంపెనీలు ఈ పాలసీలను ఆఫర్ చేస్తున్నాయి. కానీ, వాటికి ప్రీమియమ్ అధికంగా ఉంది. ఎందుకు ఈ విచక్షణ? - కామేశ్వరరావు, వరంగల్ చాలా కంపెనీలు గృహిణులకు టర్మ్ బీమా పాలసీలు ఆఫర్ చేయడం లేదు. గృహిణులు ఎలాంటి ఉద్యోగాలు చేయకపోయినా సరే, కుటుంబానికి సంబంధించి ఎన్నో బరువు బాధ్యతలు మోస్తుంటారు. ఈ బాధ్యతల ఆర్థిక విలువ ఎంతగానో ఉంటుంది. సంపాదించే వ్యక్తి మరణిస్తే, ఆర్థిక భరోసా కల్పించడమే బీమా ఉద్దేశమని బీమా కంపెనీల వాదన. గృహిణులకు ఎలాంటి ఆదాయం లేనందున సాంకేతికంగా టర్మ్ బీమా పాలసీలకు గృహిణులు అనర్హులని పలు బీమా కంపెనీలు భావిస్తున్నాయి. ఏగాన్ లైఫ్ వంటి కొన్ని బీమా సంస్థలు గృహిణులకు కూడా టర్మ్ ప్లాన్లను ఆఫర్ చేస్తున్నాయి. కానీ ఆ గృహిణి బీమాను భర్త బీమా రక్షణతో అనుసంధానం చేసిన పాలసీలనే ఈ సంస్థ ఆఫర్చేస్తోంది. పలు కంపెనీలు బీమా, పెట్టుబడి కలగలపిన ఎండోమెంట్ ప్లాన్లు, యులిప్‌లను గృహిణులకు ఆఫర్ చేస్తున్నాయి. ఈ యులిప్, ఎండోమెంట్ ప్లాన్లు స్వల్పమైన బీమాను మాత్రమే కవర్ చేస్తాయి. పెపైచ్చు వీటిపై వచ్చే రాబడులు అంతంత మాత్రంగానే ఉంటాయి. కాబట్టి వీటి జోలికి వెళ్లకపోవడమే ఉత్తమం. నేను ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్నాను. నెలకు రూ.10,000 వరకూ ఇన్వెస్ట్ చేయగలను. మా పాప ఉన్నత విద్య అవసరాల కోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. దీంట్లో డివిడెండ్, గ్రోత్.. రెండు ఆప్షన్లు ఉన్నాయి. డివిడెండ్లపై ఎలాంటి పన్నులు లేనందున, డివిడెండ్ ఆప్షన్‌ను ఎంచుకుందామనుకుంటున్నాను. నా నిర్ణయం సరైనదేనా? - రజని, హైదరాబాద్ మీ నిర్ణయం సరైనది కాదు. నెల లేదా మూడు నెలలకొకసారి మీకు సొమ్ము అవసరం ఉన్నప్పుడు మాత్రమే మీరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో డివిడెండ్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఉదాహరణకు మీరు రిటైరైన తర్వాత ఇంటి ఖర్చులకు, వైద్య అవసరాలకు మీకు నెలవారీ కొంత మొత్తం అవసరమవుతుంది. ఇలాంటి అవసరాలున్నప్పుడు మాత్రమే డివిడెండ్ ఆప్షన్లో ఇన్వెస్ట్ చేయాలి. మీరు మీ పాప ఉన్నత విద్య అవసరాల కోసం ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నారు. ఇది దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యం. ఇలాంటి దీర్ఘకాలిక ఆర్థిక అవసరాల కోసం గ్రోత్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఫలితంగా మీకు చక్రవడ్డీ ప్రయోజనాలు లభిస్తాయి. ఒక వేళ మీరు డివిడెండ్ ఆప్షన్‌ను ఎంచుకున్నారనుకుందాం. మీకు వచ్చే డివిడెండ్ ఆదాయం మీకు తెలియకుండానే ఖర్చు చేసేస్తారు. లేదా అనుదుత్పాదక అవసరాల కోసం వినియోగిస్తారు. ఈక్విటీ ఆధారిత ఫండ్స్‌లో వచ్చే డివిడెండ్లపై ఎలాంటి డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్(డీడీటీ) లేదు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించిన డివిడెండ్ లేదా గ్రోత్.. ఏ ఆప్షన్‌ను ఎంచుకున్నా దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను భారం ఉండదు. (ఏడాది తర్వాత) అందుకని పన్ను భారం లేదన్న కారణంగా డివిడెండ్ ఆప్షన్‌ను ఎంచుకోవడం సరైన నిర్ణయం కాదు. - ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
షార్ట్ టర్మ్ డెట్ ఫండ్స్ బెటరా..?
ఇల్లు కొందామని రూ.4 లక్షలు పోగేశాను. కానీ దానిని ఏడాది పాటు వాయిదా వేశాను. ఈ సొమ్మును బ్యాంక్ సేవింగ్స్ ఖాతాలో వేద్దామనుకుంటున్నాను. కానీ మిత్రుడొకరు ఆల్ట్రా షార్ట్‌టర్మ్ డెట్‌ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయమని సూచించాడు. సేవింగ్స్ ఖాతాలో అయితే 4 శాతం మాత్రమే వడ్డీ వస్తుందని, ఈ డెట్‌ఫండ్స్‌లో అయితే అంతకంటే ఎక్కువే రాబడి వస్తుందని పేర్కొన్నాడు. అతడు చెప్పింది నిజమేనా? ఈ డెట్ఫండ్స్కు సంబంధించి ఏమైనా పన్నులు చెల్లించాల్సి ఉంటుందా? వివరించగలరు. -ముక్తేశ్వర రావు, నిజామాబాద్. మీ మిత్రుడు చెప్పింది నిజమే. బ్యాంక్ సేవింగ్స్ ఖాతా కంటే ఆల్ట్రా షార్ట్‌టర్మ్ డెట్‌ఫండ్స్‌లో మంచి రాబడులే వస్తాయి. స్వల్పకాలిక వడ్డీరేట్ల ప్రయోజనాలను వినియోగించుకోవడం వల్ల ఇవి మంచి రాబడులనిస్తాయి. కార్పొరేట్, మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్లో ఈ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తాయి. అయితే వీటికి కొంత రిస్క్ లేకపోలేదు. వడ్డీరేట్లు అధికంగా ఉన్నందున గత ఏడాది కాలంలో ఈ ఫండ్స్ చెప్పుకోదగ్గ రాబడుల (9 శాతానికి పైగా)నిచ్చాయి. వడ్డీరేట్లు తగ్గితే ఈ రాబడులు తగ్గుతాయి. అయితే బ్యాంక్ సేవింగ్స్ ఖాతా రాబడుల(4 శాతం) కంటే అధికంగానే వస్తాయని చెప్పవచ్చు. ఇక పన్ను విషయానికొస్తే, సేవింగ్స్ ఖాతా నుంచి ఆర్జించిన వడ్డీలో రూ.10,000 వరకూ ఎలాంటి పన్ను బాధ్యత ఉండదు. అయితే డెట్ ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మూడు సంవత్సరాల లోపు ఉపసంహరించుకుంటే ఈ ఫండ్స్ రాబడులపై పన్ను మీ ఆదాయపు పన్ను స్లాబ్(10/20/30 శాతంగా)ననుసరించి ఉంటుంది. గ్రోత్ ఆప్షన్ తీసుకుంటే ఈ స్థాయి పన్ను మాత్రమే వర్తిస్తుంది. అలా కాకుండా డివిడెండ్ ఆప్షన్ తీసుకుంటే అదనంగా 28.33 శాతం డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్(డీడీటీ) కూడా చెల్లించాల్సి ఉంటుంది. సేవింగ్స్ ఖాతాపై వడ్డీరేటు 4 శాతం, ఆల్ట్రాషార్ట్ టర్మ్ డెట్ ఫండ్ రాబడి 8 శాతంగా భావించి ఏడాది కాలానికి ఈ రెండు మార్గాల్లో వచ్చే రాబడుల వివరాలను కింది పట్టికలో పొందుపరిచాము. ఆదాయపు పన్ను స్లాబ్ 20 శాతంగా పరిగణించాం. నేను ఒకేసారి పెద్ద మొత్తాన్ని యాక్సిస్ ఈక్విటీ, యాక్సిస్ లాంగ్‌టర్మ్ ఈక్విటీ, ఐసీఐసీఐ ప్రు ఫోకస్డ్ బ్లూచిప్ ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. అయితే ఏజెంట్‌కు ఎంత మొత్తం కమీకషన్ చెల్లించాల్సి ఉంటుంది. కమీషన్ చెల్లించాల్సిన అవసరం లేకుండా పెట్టుబడి పెట్టే మార్గాలేమైనా ఉన్నాయా? ఒకవేళ సిప్ (సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్)విధానాన్ని అనుసరిస్తే కంపెనీకి గానీ, ఏజెంట్‌కు గానీ ట్రయల్ కమీషన్ తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుందా? - మనోరమ, విజయవాడ మీరు పేర్కొన్న స్కీమ్‌లకు సంబంధించి డెరైక్ట్ ప్లాన్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఏజెంట్లకు ఎలాంటి కమీషన్ చెల్లించాల్సి ఉండదు. ఒకేసారి పెద్ద మొత్తంలో లేదా సిప్ విధానంలో గానీ ఇన్వెస్ట్ చేసినా ఇది వర్తిస్తుంది. మ్యూచువల్ ఫండ్ సంస్థ వెబ్సైట్ ద్వారా కానీ, మ్యూచువల్ ఫండ్ హౌస్ బ్రాంచ్ ఆఫీస్ ద్వారా గానీ ఈ డెరైక్ట్ ప్లాన్లలో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇక మ్యూచువల్ ఫండ్స్ ఏజెంట్లకు మ్యూచువల్ ఫండ్ సంస్థల నుంచి రెండు రకాలైన కమీషన్లు లభిస్తాయి. ఒకటి అప్‌ఫ్రంట్ కమిషన్. దీనిని మ్యూచువల్ ఫండ్ సంస్థ చెల్లిస్తుంది. ఇంకొకటి ట్రయల్ కమీషన్(ఫండ్ ఎక్స్పెన్స్ రేషియోలోనే ఇది ఉంటుంది).. మీరు మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లో కొనసాగినంత కాలం ఇది ఏజెంట్‌కు చెల్లిస్తారు. మీరు కనుక డెరైక్ట్ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఇలాంటి, ఎలాంటి కమీషన్లు చెల్లించాల్సి ఉండదు. ఎఫ్ఎంపీ(ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్)ల ఇన్వెస్ట్మెంట్స్ ఏడాదికి మించితేనే దీర్ఘకాల మూలధన లాభాల పన్నును గతంలో చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ కాలాన్ని ఏడాది నుంచి మూడేళ్లకు పెంచారు. అంటే దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను ప్రయోజనాలు పొందాలంటే ఎఫ్ఎంపీల్లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఏడాది కాలం కాక మూడేళ్లపాటు కొనసాగించాలి. అయితే బడ్జెట్‌కు ముందు మెచ్యూర్ అయ్యే వాటికి పాత నిబంధనలే వర్తిస్తాయని ఆర్థిక మంత్రి గత ఏడాది బడ్జెట్ ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. నా ఎఫ్ఎంపీ ఇన్వెస్ట్మెంట్స్ 2014, జూలై తర్వాత మెచ్యూర్ అయ్యాయి. నేను దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను లేక స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను.. ఏది చెల్లించాలి? -భవానీ శంకర్, హైదరాబాద్ 2014, జూలై 10కు ముందు మెచ్యూర్ అయ్యే ఎఫ్ఎంపీ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు పాత పన్ను నిబంధనలు వర్తిస్తాయి. ఈ నిబంధనల ప్రకారం ఏడాది కాలానికి మించిన ఇన్వెస్ట్‌మెంట్స్‌పై వచ్చిన రాబడులపై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను 10 శాతంగా చెల్లించాల్సి ఉంటుంది. 2014, జూలై 10 తర్వాత మెచ్యూర్ అయ్యే డెట్ ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు కొత్త పన్ను నిబంధనలు వర్తిస్తాయి. ఈ నిబంధనల ప్రకారం ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మూడేళ్లపాటు కొనసాగిస్తేనే దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను వర్తిస్తుంది. -
ఆలస్యం భారమే
ఏ సమయుంలో చేయూల్సిన పనిని ఆ సవుయుంలో చేసెయ్యూలి. లేకుంటే సవుస్యల్ని చేజేతులా కొనితెచ్చుకున్నట్లవుతుంది. పొదువు విషయుంలో ఇది నూటికి నూరుపాళ్లూ నిజం. పిల్లల చదువు కోసం, రిటైర్మెంట్ తర్వాతి అవసరాల కోసం పొదుపును సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలి. పొదుపును వారుుదా వేస్తే ఆ మేరకు అదనపు భారం భరించాల్సి వస్తుంది. ఇప్పుడో ఉదాహరణ చూద్దాం. ఉద్యోగం చేస్తున్న 30 ఏళ్ల యుువకుడు తన రిటైర్మెంట్ తర్వాత రూ.25 లక్షలు చేతికి రావాలని భావిస్తే ఇప్పుడైతే ఏటా రూ.24 వేలు ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది. ఏవో కారణాలతో ఐదేళ్లు వారుుదా వేశాడనుకుందాం. అప్పుడు ఏటా రూ.38 వేలు ఇన్వెస్ట్ చేయూల్సి వస్తుంది (పెట్టుబడులపై వార్షికాదాయుం 8% చొప్పున లెక్కించాం). పెన్షన్ ప్లాన్లలో పెట్టుబడులు మరింత ఆలస్యమైతే వ్యయం వురింత పెరుగుతుంది. వురో ఉదాహరణ.. ఓ విద్యార్థి ఎంబీఏ పూర్తి చేయుడానికి ప్రస్తుతం సుమారు నాలుగు లక్షల రూపాయులు వ్యయువువుతుంది. అదే 15 ఏళ్ల తర్వాతైతే ఖర్చు సుమారు రూ.20 లక్షల వరకు పెరగొచ్చు. కనుక పిల్లల ఉన్నత విద్యాభ్యాసానికి పొదువు చేయుదల్చిన వారు భవిష్యత్ అవసరాలను, పరిస్థితులను తప్పనిసరిగా దృష్టిలో పెట్టుకోవాలి. అనువైన పెట్టుబడి వూర్గాలను అన్వేషించాలి. పిల్లలకు సురక్షిత భవిష్యత్తు కల్పించాలనుకునే తల్లిదండ్రులకు బ్యాంకు సేవింగ్స్ అకౌంటుతో పాటు బీమా పథకాలున్నారుు. అనుకోని పరిణామాలు సంభవించినప్పటికీ, బీమా పథకాలతో పిల్లల చదువులు నిరాటంకంగా కొనసాగుతారుు. అంతేకాదు. తల్లిదండ్రుల జీవితానికీ బీమా భరోసా చేకూరుతుంది. భవిష్యత్తుకు భద్రత చేకూరాలంటే పొదుపు, పెట్టుబడులను సాధ్యమైనంత త్వరగా ప్రారంభించడమే విజయుసూత్రం.- గౌరవ్ రాజ్‌పుత్, వూర్కెటింగ్ డెరైక్టర్, అవీవా లైఫ్