bank transections
-
బ్యాంకు లావాదేవీలపై నిఘా ఉంచాలి
సాక్షి, కర్నూలు: ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో బ్యాంకు లావాదేవీలపై బ్యాంకు అధికారులు నిఘా ఉంచాలని ఎస్పీ ఫక్కీరప్ప సూచించారు. పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో జిల్లాలోని బ్యాంకు మేనేజర్లతో సోమవారం ఎస్పీ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. బ్యాంకు ఖాతాల్లో రూ.లక్షకు మించి నగదు జమ చేసినా, విత్‌డ్రా చేసినా వారి వివరాలను జిల్లా ఎలక్షన్ సెల్‌కు, సంబంధిత అధికారులకు అందజేయాలన్నారు. ఎవరైనా ఆన్లైన్లో నగదును ఇతరుల ఖాతాల్లోకి పెద్దపెద్ద మొత్తాల్లో బదిలీ చేసినా.. అలాంటి వారి వివరాలను సైతం తెలియజేయాలన్నారు. ఏటీఎంలు, బ్యాంకు బ్రాంచులకు నగదును రవాణా చేసే వాహనాల్లో సంబంధిత పత్రాలు కలిగి ఉండాలన్నారు. సెక్యూరిటీ వాహనాల్లో డబ్బులను తరలించే బ్యాంకు సిబ్బందికి విధిగా గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు. బ్యాంకు తుపాకులకు సంబంధించి మినహాయింపు ఇవ్వడానికి జిల్లా కలెక్టర్‌తో అనుమతి తీసుకోవాలని సూచించారు. బ్యాంకుల భద్రత కోసం ఉన్న తుపాకులకు లైసెన్సులు రెన్యూవల్ చేయించుకోవాలన్నారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ నగేష్, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ రామచంద్ర, వివిధ శాఖల బ్యాంకు మేనేజర్లు సమావేశంలో పాల్గొన్నారు. -
బోయకొండ ఆర్థిక లావాదేవీలపై ఐటీ కన్నెర్ర
– 14 ఖాతాలు స్తంభింపజేస్తూ ఉత్తర్వులు – స్తంభించిన పాలన పుంగనూరు : ప్రముఖ పుణ్యక్షేత్రమైన బోయకొండ గంగమ్మ ఆలయానికి చెందిన బ్యాంకు ఆర్థిక లావాదేవీలపై ఆదాయపు పన్ను (ఐటీ)శాఖ కన్నెర్ర చేసింది. పన్నులు చెల్లించకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ బోయకొండ ఆలయానికి చెందిన 14 బ్యాంకుల ఖాతాలను స్తంభింప చేస్తూ ఐటీ శాఖ బుధవారం ఉత్తర్వులిచ్చింది. దీని కారణంగా బోయకొండ ఆలయంలో పాలన స్తంభించింది. నిత్య పూజలకు అవసరమైన డబ్బులకు సైతం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొంది. బోయకొండ గంగమ్మ ఆలయ ఆర్థిక లావాదేవీలపై ప్రతియేటా ఆదాయపు పన్నుశాఖకు నివేదికలు పంపేవారు. ఇలా ఉండగా 2012 సంవత్సరం నుంచి ఆర్థిక లావాదేవీలను పంపకపోవడంతో ఐటీ అధికారులు రూ.23.80 లక్షలు పన్ను చెల్లించాలని బోయకొండ ఆలయానికి నోటీసులు జారీచేశారు. దీనిపై బోయకొండ ఈవో ఏకాంబరం ఐటీ అధికారులపై ఉన్నతాధికారులకు జూన్‌లో అప్పీలుచేశారు. దీనిపై ఐటీ శాఖ 15 శాతం పన్ను డిపాజిట్ చేస్తే స్టే ఉత్తర్వులు జారీచేస్తామని, లేకపోతే రూ.23.80 లక్షలు కట్టాల్సిందేనని తెలిపారు. దేవాదాయశాఖ ఉన్నతాధికారులు సకాలంలో స్పందించకపోవడంతో స్థానిక అధికారులు ఏం చేయలేని స్థితిలో ఉండిపోయారు. దీనిపై ఐటీ శాఖ పలుమార్లు ఆలయ ఈవోకు నోటీసులు జారీచేసింది. స్పందన లేకపోవడంతో బోయకొండకు చెందిన 14 బ్యాంకుల్లోని ఖాతాలను స్తంభింప చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాం బ్యాంకు ఖాతాలను ఐటీ శాఖ స్తంభింపజేసిన మాట వాస్తవమే. 2012 సంవత్సరంలో రూ.23.80 లక్షలు చెల్లించాలని ఉత్తర్వులు ఇవ్వడంతో అప్పీలుచేశాం. దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. భక్తులకు, ఆలయంలో నిత్యపూజలకు ఎలాంటి సమస్య ఉండదు. ప్రత్యామ్నయ చర్యలు చేపట్టాం. – ఏకాంబరం, కార్యనిర్వహణాధికారి, బోయకొండ ఆలయం