మాట్లాడుతున్న ఎస్పీ ఫక్కీరప్ప
సాక్షి, కర్నూలు: ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో బ్యాంకు లావాదేవీలపై బ్యాంకు అధికారులు నిఘా ఉంచాలని ఎస్పీ ఫక్కీరప్ప సూచించారు. పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో జిల్లాలోని బ్యాంకు మేనేజర్లతో సోమవారం ఎస్పీ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. బ్యాంకు ఖాతాల్లో రూ.లక్షకు మించి నగదు జమ చేసినా, విత్‌డ్రా చేసినా వారి వివరాలను జిల్లా ఎలక్షన్ సెల్‌కు, సంబంధిత అధికారులకు అందజేయాలన్నారు.
ఎవరైనా ఆన్‌లైన్‌లో నగదును ఇతరుల ఖాతాల్లోకి పెద్దపెద్ద మొత్తాల్లో బదిలీ చేసినా.. అలాంటి వారి వివరాలను సైతం తెలియజేయాలన్నారు. ఏటీఎంలు, బ్యాంకు బ్రాంచులకు నగదును రవాణా చేసే వాహనాల్లో సంబంధిత పత్రాలు కలిగి ఉండాలన్నారు. సెక్యూరిటీ వాహనాల్లో డబ్బులను తరలించే బ్యాంకు సిబ్బందికి విధిగా గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు.
బ్యాంకు తుపాకులకు సంబంధించి మినహాయింపు ఇవ్వడానికి జిల్లా కలెక్టర్‌తో అనుమతి తీసుకోవాలని సూచించారు. బ్యాంకుల భద్రత కోసం ఉన్న తుపాకులకు లైసెన్సులు రెన్యూవల్ చేయించుకోవాలన్నారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ నగేష్, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ రామచంద్ర, వివిధ శాఖల బ్యాంకు మేనేజర్లు సమావేశంలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment