banukacharla
-
అడుగులో అడుగులై.. కదన సింహాలై..
జనం తోడుగా.. అన్నదాత వెంట నడవగా..అభిమాన సంద్రం ఉప్పొంగింది. ప్రభుత్వ తీరును ఎండగట్టగ ఊరూవాడా ఒక్కటైకదిలింది. ఆ ఒక్క అడుగుకు వేలాది అడుగులు జతకట్టగా.. ‘పట్టి’సీమ వెనుక ధనయజ్ఞాన్ని జనం గొంతుక ఎలుగెత్తింది.రైతన్న వెన్నెముకగా.. ప్రజల కష్టాలను పాల్పంచుకునే నేస్తంగా.. జగమంత కుటుంబంలో ఒకనిగా సీమ వాకిట కాలిడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి అడుగడుగునా నీరాజనం లభించింది. జల‘విఘ్నా’లపై బాణం ఎక్కుపెట్టిన నేత ఆశయ సిద్ధికి అశేష జనం సలాం చేసింది. సాక్షి ప్రతినిధి, కర్నూలు: పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన బస్సుయాత్ర అధికార పార్టీ గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది. యాత్ర ప్రకటించిన తర్వాత రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి జిల్లాలో రెండు పర్యాయాలు పర్యటించడమే ఇందుకు నిదర్శనం. పార్టీ ఆధ్వర్యంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి శుక్రవారం జిల్లాలో జగన్ చేపట్టిన బస్సు యాత్ర విజయవంతమైంది. సాగునీటి ప్రాజెక్టులపై చంద్రబాబు ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యాన్ని ఆయన అడుగడుగునా ఎండగట్టారు. ప్రతి ప్రాజెక్టుకు ఎంత మేర నిధులు అవసరం? బడ్జెట్లో ఎంత కేటాయించారనే వివరాలను ఆయన మాట్లాడిన ప్రతీ చోట వివరించే ప్రయత్నం చేశారు. రాయలసీమలోని ప్రాజెక్టులను పూర్తిచేయాలనే సంకల్పం చంద్రబాబు ప్రభుత్వానికి లేదన్న విషయాన్ని ఆయన విశదీకరించారు. జిల్లాలోని సిద్దాపురం, బానకచర్ల క్రస్ట్‌గేట్లు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీతో పాటు మల్యాల వద్ద ఉన్న అనంత వెంకటరెడ్డి హంద్రీ-నీవా సుజల స్రవంతి(ఏవీఆర్హెచ్ఎన్ఎస్ఎస్) ప్రాజెక్టులను ఆయన శుక్రవారం ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకూ సందర్శించారు. అక్కడున్న రైతులతో ముచ్చటించారు. జిల్లాలోని పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. మొత్తం యాత్రలో రోడ్డుపొడవునా జనం నీరాజనం పలికారు. హడావుడిగా మంత్రి పర్యటన జగన్మోహన్రెడ్డి బస్సుయాత్ర ప్రారంభిస్తున్నారనే ప్రకటన వెలువడగానే రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి జిల్లాలో రెండు పర్యాయాలు పర్యటించారు. ప్రాజెక్టులను పూర్తి చేస్తామని నమ్మబలికే ప్రయత్నం చేశారు. అయితే నిధుల కేటాయింపుపై ప్రశ్నలకు ఆయన వద్ద సమాధానం లేకపోయింది. కేవలం మంత్రి పర్యటనలతో లాభం లేదనుకున్న ప్రభుత్వం.. హడావుడిగా ప్రాజెక్టుల వద్ద పెండింగ్ పనులను ప్రారంభించే ప్రయత్నం మొదలుపెట్టింది. ఇందులో భాగంగా పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ కెనాల్ విస్తరణ పనులను నామమాత్రంగా రెండు జేసీబీలు, మూడు ట్రిప్పర్లతో హడావుడి చేసింది. తెలివితక్కువోళ్లం కాదన్న రైతులు జగన్ పర్యటన సందర్భంగా మాట్లాడిన రైతులు ప్రాజెక్టులపై చంద్రబాబు చూపిన అలసత్వం, నిర్లక్ష్యాన్ని తమ అనుభవ పూర్వకంగా ఎండగట్టారు. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేసేందుకు నిధులివ్వని చంద్రబాబు ప్రభుత్వం.. పట్టిసీమ నుంచి సీమకు నీళ్లు ఇస్తామంటే నమ్మేందుకు తెలివితక్కువోళ్లమా అని ప్రశ్నించారు. రాయలసీమపై చంధ్రబాబుది కపట ప్రేమ అని రైతులు ఘాటుగా విమర్శించారు. వైఎస్ ఉన్నప్పుడు ఎస్ఆర్బీసీ నుంచి మూడుకార్లు పంట పండించుకున్నామని రైతులు పేర్కొన్నారు. ఇప్పుడు ఒక్క పంటకు కూడా సరిగ్గా నీరు రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ప్రభుత్వంపై చేసే పోరాటంలో కలిసి వస్తామని ఆయన పర్యటన మొత్తం కదలివచ్చిన జిల్లా ప్రజలు హామీనిచ్చారు. ఉదయం 11 గంటలకు సిద్ధాపురం చెరువు వద్ద మొదలైన ఈ యాత్ర రాత్రి 10 గంటలకు హంద్రీనీవా వద్ద ముగిసింది. అనంతరం ఆయన బ్రహ్మణకొట్కూరులోని గౌరు వెంకటరెడ్డి ఇంటికి వెళ్లారు. అక్కడి నుంచి నేరుగా ఆయన హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. కార్యక్రమంలో కర్నూలు ఎంపీ బుట్టా రేణుక, పార్టీ జిల్లా అధ్యక్షుడు బుడ్డా రాజశేఖర రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, గౌరు చరితారెడ్డి, సాయిప్రసాద్ రెడ్డి, బాలనాగిరెడ్డి, ఎస్వీ మోహన్ రెడ్డి, గుమ్మనూరు జయరాం, భూమా అఖిలప్రియ, మణిగాంధీ, ఐజయ్య, పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకట రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్ రెడ్డి, ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్చార్జి జగన్మోహన్ రెడ్డి, బనగానపల్లె నియోజకవర్గ ఇన్చార్జి కాటసాని రాంరెడ్డి, పార్టీ నేతలు బుడ్డా శేషారెడ్డి, సీఈసీ సభ్యుడు హఫీజ్ ఖాన్, తెర్నేకల్లు సురేందర్ రెడ్డి, డీకే రాజశేఖర్, నర్శింహులు యాదవ్, కృష్ణారెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, భరత్‌కుమార్ రెడ్డి, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. -
'కరెంట్ బిల్లులకే సరిపోతున్నాయి'
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును పక్కకు పెట్టి.. పట్టిసీమ ప్రాజెక్టును తెరపైకి తీసుకురావడంపై వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. పట్టిసీమ ప్రాజెక్టుపై ప్రేమ కురిపిస్తున్నబాబుకు ఆ ప్రాజెక్టుతో భారీగా ముడుపులు ముడుతున్నాయని విమర్శించారు. వైఎస్సార్ సీపీ ప్రాజెక్టుల యాత్రలో భాగంగా వైఎస్ జగన్ చేపట్టిన బస్సుయాత్ర శుక్రవారం రాత్రి హంద్రీనీవాకు చేరుకుంది. అక్కడ హంద్రీనీవా ప్రాజెక్టును పరిశీలించిన అనంతరం మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలోని ప్రాజెక్టులపై చంద్రబాబు అవలంభిస్తున్న తీరును తప్పుబట్టారు. రూ.1600 కోట్ల పట్టిసీమ ప్రాజెక్టు కారణంగా చంద్రబాబుకు రూ.300 కోట్ల ముడుపులు అందుతున్నాయని జగన్ ఎద్దేవా చేశారు. బాబుకు రాయలసీమపై నిజమైన ప్రేమే ఉంటే గాలేరు, నగరి, హంద్రీనీవా, వెలిగొండ ప్రాజెక్టులు ముందు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. వెలుగొండ ప్రాజెక్టును గాలికి వదిలేసిన బాబు.. ఇప్పడు రాయలసీమకు నీళ్లు అంటూ కొత్త రాగం అందుకోవడం వెనుక ఉద్దేశం ఏమిటని జగన్ నిలదీశారు. ఇంకా రూ.11 కోట్లు కేటాయిస్తే హంద్రీనీవా పూర్తవుతుందని జగన్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు రాయలసీమ గుర్తుకు రాలేదా? అని జగన్ ప్రశ్నించారు. ఆ దివంగత నేత వైఎస్సార్ హయాంలో హంద్రీనీవాకు రూ.5,800 కోట్లు కేటాయిస్తే.. బాబు ఆ ప్రాజెక్టు రూ13 కోట్లు మాత్రమే కేటాయించారన్నారు. చంద్రబాబు ప్రాజెక్టులకు కేటాయిస్తున్న నిధులు కరెంట్ బిల్లులకే సరిపోతున్నాయని జగన్ విమర్శించారు. రాయలసీమ నీటి కష్టాలు తీర్చేందుకు వైఎస్సార్ తపించే వారని.. ఆయన హయాంలో 85 శాతం ప్రాజెక్టుల పనులు పూర్తయ్యాయని జగన్ తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రాజెక్టుల నిధులు కేటాయింపుల్లో అన్యాయంగా వ్యవహరిస్తుందన్నారు. మిగిలిన ప్రాజెక్టు పనులు పూర్తి చేయడానికి రూ,1100కోట్ల కావాల్సి వస్తే.. చంద్రబాబు బడ్జెట్ లో రూ.200 కోట్లు మాత్రమే కేటాయించారన్నారు. రైతు రుణాలు మాఫీ సంగతి అటుంచితే.. వడ్డీలు కూడా ఇప్పటివరకూ మాఫీ కాలేదని.. చివరకు డ్వాక్రా మహిళలను కూడా బాబు మోసం చేశారని జగన్ విమర్శనాస్త్రాలు సంధించారు. అందరం కలిసి ప్రభుత్వంపై పోరాడదామని జగన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ముగిసిన వైఎస్సార్ సీపీ ప్రాజెక్టుల బస్సుయాత్ర.. మూడు రోజుల పాటు సాగిన వైఎస్సార్ సీపీ బస్సుయాత్ర ముగిసింది. ధవళేశ్వరం, పోలవరం,పట్టిసీమ, కృష్ణా బ్యారేజీ, వెలుగొండ, బనకచర్ల, పోతిరెడ్డి పాడు, హంద్రీనీవా ప్రాజెక్టులను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సందర్శించారు.ఈ యాత్రలో ఆయనతో పాటు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. -
వైఎస్ జగన్ మూడోరోజు బస్సు యాత్ర
-
'సమైక్య ఆంధ్ర సీఎం అన్నట్లు వ్యవహారిస్తున్నాడు'
-
'సమైక్య ఆంధ్ర సీఎం అన్నట్లు వ్యవహారిస్తున్నాడు'
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు సమైక్య ఆంధ్రప్రదేశ్‌కు సీఎం అన్నట్లు వ్యవహారిస్తున్నాడని వైఎస్ఆర్ సీపీ సీనియర్ నేత ఎంవీ మైసూరారెడ్డి ఎద్దేవా చేశారు. ప్రాజెక్టుల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్రలో భాగంగా మూడో రోజు శుక్రవారం కర్నూలు జిల్లాలోని బానుకచర్ల డైవర్షన్ స్కీమ్ హెడ్ రెగ్యలరేటర్ పనులను పరిశీలించారు. ఈ సందర్బంగా వైఎస్ జగన్ వెంట ఉన్న మాజీ మంత్రి, వైఎస్ఆర్ సీపీ నాయకుడు ఎంవీ మైసూరారెడ్డి మాట్లాడుతూ.... ఇక్కడ నీళ్లు ఇస్తానంటాడు.. అక్కడ నీళ్లు ఇస్తానంటూ చంద్రబాబు ప్రజలను మభ్య పెడుతున్నారని ఆరోపించారు. పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణం వల్ల సీమ ప్రజల కష్టాలు తీరుస్తానంటూ బాబు చెప్పే మాటలు నమ్మవద్దని ఆయన ప్రజలకు హితవు పలికారు. గాలేరు - నగరి ప్రాజెక్టు గోవింద అవుతుదేమోనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం చేపట్టే ప్రాజెక్టులు నిరర్థక ఆస్తులగా మారతాయని మైసూరారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. పట్టిసీమ వల్ల ప్రయోజనం ఉండదన్నారు. పట్టిసీమ ప్రాజెక్ట్‌ను గోదావరి, కృష్ణా డెల్టా రైతులు వ్యతిరేకిస్తున్నారని మైసూరా ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయినా చంద్రబాబు పట్టిసీమను పూర్తి చేయాల్సిందే అన్నట్లు వ్యవహరిస్తున్నారన్నారు. ప్రాజెక్టులన్నీ చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరిచి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు పోలవరం కట్టండి... పట్టిసీమను ఆపండి... రాయలసీమను ఆదుకోండి అంటూ చంద్రబాబు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
'చంద్రబాబు రాయలసీమకు అన్యాయం చేస్తున్నాడు'
-
బానుకచర్ల డైవర్షన్ స్కీమ్ హెడ్ రెగ్యలరేటర్ పనులను పరిశీలించిన జగన్
-
''మేము పట్టుబట్టాకే బాబు ఆలోచిస్తున్నాడు''
-
చంద్రబాబు సీమకు అన్యాయం చేస్తున్నారు: వైఎస్ జగన్
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పట్టిసీమ ప్రాజెక్టుపై కంటే డబ్బులపైనే ప్రేమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ శాసనసభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. ప్రాజెక్టుల కోసం చేపట్టిన బస్సుయాత్రలో భాగంగా మూడో రోజు శుక్రవారం వైఎస్ జగన్ కర్నూలు జిల్లాలో బనకచర్ల డైవర్షన్ స్కీమ్ హెడ్ రెగ్యలరేటర్ పనులను పరిశీలించారు. అనంతరం రైతులతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు. గతంలో తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గాలేరు నగరి ప్రాజెక్టు గురించి పట్టించుకున్న పాపానపోలేదని వైఎస్ జగన్ ఆరోపించారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నారని అన్నారు. చంద్రబాబు రాయలసీమకు అన్యాయం చేస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును పక్కనబెట్టి, పట్టిసీమ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని అన్నారు. పట్టిసీమ ప్రాజెక్టుకు చంద్రబాబుకు అనుకూలంగా ఉన్న ఇద్దరు మాత్రమే టెండర్లు వేశారని చెప్పారు. చంద్రబాబు లంచాలు తీసుకుని, రైతులకు అన్యాయం చేస్తున్నారని వైఎస్ జగన్ విమర్శించారు. పోతిరెడ్డిపాడు నుంచి బనకచర్లకు 44 వేల క్యూసెక్కుల నీరు రావాల్సివుండగా, 3 నుంచి 4 వేల క్యూసెక్కుల నీరు మాత్రమే వస్తోందని అన్నారు. పట్టిసీమ ప్రాజెక్టుకు ఎక్కువ కోట్ చేసినా చంద్రబాబు పట్టించుకోలేదని వైఎస్ జగన్ ఆరోపించారు. పట్టిసీమ ప్రాజెక్టు వల్ల చంద్రబాబుకు 300 కోట్ల రూపాయల ముడుపులు అందాయని విమర్శించారు. పట్టిసీమ జీవోలో రాయలసీమ గురించి ప్రస్తావన లేదని వైఎస్ జగన్ గుర్తు చేశారు. ఈ ప్రభుత్వ తీరుపై గట్టిగా పోరాడుతామని చెప్పారు. వైఎస్ జగన్ అంతకుముందు శ్రీశైలం కుడి కాలువ పనుల గురించి ఇంజినీర్లను అడిగి తెలుసుకున్నారు. గండికోట రిజర్వాయర్‌కు 30 టీఎంసీల నీరు ఎలా తెప్పిస్తారని వైఎస్ జగన్ ప్రశ్నించారు. ఈ ఏడాది గండికోటకు ఎన్ని టీఎంసీల నీరు అందించగలిగారని ఇంజీనీర్లను అడిగారు. గండికోటకు 30 టీఎంసీల నీరు చేరుకోవాలంటే మధ్యలో పనులు జరగాల్సివుండగా, ఈ పనులు పూర్తికావాలంటే చాలా ఏళ్లు పడుతుందని వైఎస్ జగన్ అన్నారు. ఈ ఏడాది గండికోటకు కేవలం ఒక టీఎంసీ నీరు ఇవ్వగలిగామని ఇంజినీర్లు వివరించారు. రాయలసీమ ప్రాజెక్టులకు బడ్జెట్ కేటాయింపులపై వైఎస్ జగన్ ఆరా తీశారు. వైఎస్ జగన్ ప్రసంగంలోని ఇతర ముఖ్యాంశాలు.. ప్రాజెక్టులపై చంద్రబాబు నిస్సిగ్గుగా అబద్దాలు చెబుతున్నారు వెలిగొండ ప్రాజెక్టును గాలికొదిలేశారు శ్రీశైలం జలాశయంలో కనీసం నీటిమట్టం 854 అడుగులు ఉండాలని వైఎస్ హయాంలో నిర్ణయించారు కనీస నీటిమట్టం 854 అడుగులు ఉంటేనే రాయలసీమకు నీరు అందుతుంది చంద్రబాబు వచ్చాక శ్రీశైలం నీటిమట్టాన్ని 803 అడుగులకు తగ్గించారు రాయలసీమపై ప్రేమ ఉందని చెబుతూనే చంద్రబాబు తీరని అన్యాయం చేశారు శ్రీశైలం నిండినా సీమకు మాత్రం నీళ్లు రావడం లేదు బాబు హయాంలో రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు నీరిచ్చింది లేదు హంద్రీనీవాకు 40 టీఎంసీలు ఎందుకు.. 5 టీఎంసీలు చాలని జీవో ఇచ్చిన ఘనత చంద్రబాబుదే రూ. 1100 కోట్లు కేటాయిస్తే హంద్రీనీవా పూర్తవతుంది కానీ బడ్జెట్లో రూ.200 కోట్లు మాత్రమే కేటాయించారు పట్టిసీమ ప్రాజెక్టులో చంద్రబాబు డబ్బులు తింటూ మిగిలిన ప్రాజెక్టులను పట్టించుకోవడం లేదు గాలేరు-నగరి ప్రాజెక్టును పూర్తి చేయడానికి 2600 కోట్లు కావాల్సివుండగా, 169 కోట్లు మాత్రమే కేటాయించారు పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి అత్యవసరమైనది -
బానుకచర్ల హెడ్ రెగ్యులరేటర్‌ను పరిశీలించిన వైఎస్ జగన్
కర్నూలు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ శాసనసభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బృందం కర్నూలు జిల్లా బానుకచర్ల డైవర్షన్ స్కీమ్ హెడ్ రెగ్యులరేటర్ పనులను పరిశీలించింది. ప్రాజెక్టుల కోసం చేపట్టిన బస్సుయాత్రలో భాగంగా మూడో రోజు శుక్రవారం వైఎస్ జగన్ కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. పోతిరెడ్డిపాడు నుంచి బానుకచర్లకు 44 వేల క్యూసెక్కుల నీరు రావాల్సివుండగా, 3 నుంచి 4 వేల క్యూసెక్కుల నీరు మాత్రమే వస్తోందని వైఎస్ జగన్ విమర్శించారు. ఈ రోజు ఉదయం దోర్నాల నుంచి బస్సు యాత్ర ప్రారంభమైంది. వైఎస్ జగన్ మాల్యాలలో హంద్రీ-నీవా ప్రాజెక్టును సందర్శించిన అనంతరం రైతులతో మాట్లాడనున్నారు.