వైఎస్సార్సీపీ కార్యకర్తపై ఎస్ఐ వీరంగం
కృష్ణా: ఇటీవల పలు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై భౌతిక దాడులకు దిగుతున్నారు. శనివారం కృష్ణా జిల్లాలోని పెదపాయపూడి మండలం వానపాములలో వైఎస్సార్సీపీ కార్యకర్తపై ఓ ఎస్ఐ అత్యుత్సాహం ప్రదర్శించారు. వైఎస్సార్సీపీ కార్యకర్తను బసవయ్యను ఎస్ఐ సోమేశ్వరరావు చితకబాదారు.
దాంతో మనస్తాపం చెందిన బసవయ్య పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. ఇదిలాఉండగా, టీడీపీ నేత వర్ల రామయ్య ప్రోద్బలంతోనే ఎస్ఐ దాడులు చేస్తున్నారంటూ వైఎస్సార్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు.