Basheer Bagh
-
బషీర్ బాగ్ కాల్పులకు 21 ఏళ్ళు..
సాక్షి, విశాఖపట్నం: బషీర్ బాగ్ కాల్పులు జరిగి నేటికి 21 ఏళ్ళు అయ్యింది ఈ సందర్భంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద బషీర్ బాగ్ కాల్పుల అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించారు. ఇందులో వామపక్ష పార్టీల నేతలు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం సీపీఎం నేత నర్సింగరావు మీడియాతో మాట్లాడుతూ.. విద్యుత్ చార్జీలు తగ్గించమంటే చంద్రబాబు దుర్మార్గంగా కాల్పులు జరిపించారని, ఈ కాల్పుల్లో ముగ్గురు అమరులు కాగా ఎంతోమంది విద్యార్థులు క్షతగాత్రులు అయ్యారన్నారు. అప్పట్లో జరిగిన ఈ ఉద్యమంలో రాజశేఖర్ రెడ్డితో ఇతర పార్టీల నాయకులు పాల్గొన్నారని, ఆ తరువాత అధికారంలోకి వచ్చిన రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం విద్యుత్ చార్జీలు పెంచలేదన్నారు. చరిత్రలో బషీర్ బాగ్ ఉద్యమం నిలిచిపోతుందని తెలిపారు. బషీర్ బాగ్ ఉద్యమంతోనే చంద్రబాబు పాలన అంతమైందని విమర్శించారు. కాగా, విద్యుత్ చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ 2000 ఆగష్టు 28న వామపక్షాలు చలో అసెంబ్లీ చేపట్టారు. ఆనాటి ఈ విద్యుత్ ఉద్యమానికి రైతులు భారీగా తరలివచ్చారు. ఆ సమయంలో జరిపిన కాల్పుల్లో బాలస్వామి, రామకృష్ణ, విష్ణువర్ధన్‌రెడ్డి మృతి చెందారు. ఈ ముగ్గురు అమరవీరులకు వామపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు శనివారం నివాళులు అర్పించారు. -
'ఆగస్టు 28.. చంద్రన్న రక్తపాత దినోత్సవం'
సాక్షి,అమరావతి : వైఎస్సార్సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పించారు. బషీర్‌బాగ్ కాల్పులు జరిగి 20 సంవత్సరాలు పూర్తైన నేపథ్యంలో చంద్రబాబుకు చురకలంటించారు. ' విశ్వాస ఘాతకుడిగా 25 ఏళ్లు పూర్తి చేసుకొని ఆగస్ట్25న ''వెన్నుపోటు'' దినోత్సవం జరుపుకున్న బాబు.. ఆగస్ట్28 ''చంద్రన్న రక్తపాత దినోత్సవం'' జరుపుకుంటున్నారు. బషీర్‌బాగ్‌లో బాబు సృస్టించిన మారణహోమం నేటికి 20 ఏళ్లు. నీవు ఎంత క్రూరుడివో, ఎంతటి విధ్వంసకారుడివో చరిత్రే చెబుతుంది బాబు.' అంటూ పేర్కొన్నారు. సరిగ్గా 20 ఏళ్ల కిందట.. 2000 సంవత్సరం ఆగస్టు 28న తెలుగుదేశం పార్టీ అధినేత, నాటి సీఎం చంద్రబాబు నాయుడి నిరంకుశ పాలనలో హైదరాబాద్ నడిబొడ్డున, అసెంబ్లీకి కూతవేటు దూరంలో పోలీసుల తుపాకీ గుళ్లకు ముగ్గురు నేలకొరిగారు. ప్రపంచబ్యాంక్ షరతులకు తలొగ్గి ప్రైవేటీకరణ విధానాల అమలు, విద్యుత్‌రంగ సంస్కరణల్లో భాగంగా చంద్రబాబు సర్కార్ విద్యుత్‌చార్జీలు పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు భగ్గుమన్నాయి. గణనీయంగా పెరిగిన గృహావసరాల కరెంట్ చార్జీలను తగ్గించాలంటూ పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వెల్లువెత్తినా సీఎం చంద్రబాబు పట్టించుకోలేదు. తొలుత సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీ, ఇతర వామపక్షాలు కలిసి రాష్ట్రవ్యాప్త ఆందోళన చేపట్టాయి. (చదవండి : బషీర్‌బాగ్ కాల్పులకు 20 ఏళ్లు) -
సరిగ్గా 20 ఏళ్ల కిందట.. 2000 సంవత్సరం
సాక్షి, హైదరాబాద్: సరిగ్గా 20 ఏళ్ల కిందట.. 2000 సంవత్సరం ఆగస్టు 28న తెలుగుదేశం పార్టీ అధినేత, నాటి సీఎం చంద్రబాబు నాయుడి నిరంకుశ పాలనలో హైదరాబాద్ నడిబొడ్డున, అసెంబ్లీకి కూతవేటు దూరంలో పోలీసుల తుపాకీ గుళ్లకు ముగ్గురు నేలకొరిగారు. ప్రపంచబ్యాంక్ షరతులకు తలొగ్గి ప్రైవేటీకరణ విధానాల అమలు, విద్యుత్‌రంగ సంస్కరణల్లో భాగంగా చంద్రబాబు సర్కార్ విద్యుత్‌చార్జీలు పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు భగ్గుమన్నాయి. గణనీయంగా పెరిగిన గృహావసరాల కరెంట్ చార్జీలను తగ్గించాలంటూ పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వెల్లువెత్తినా సీఎం చంద్రబాబు పట్టించుకోలేదు. తొలుత సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీ, ఇతర వామపక్షాలు కలిసి రాష్ట్రవ్యాప్త ఆందోళన చేపట్టాయి. దాదాపు నాలుగు నెలలపాటు సాగిన నిరసనల సందర్భంగా 25 వేలకు పైబడి కార్యకర్తలపై కేసులు నమోదయ్యాయి. మరోవైపు అప్పటి సీఎల్పీ నేత రాజశేఖరరెడ్డి ఆధ్వర్యంలోనూ విద్యుత్ చార్జీల ఉద్యమం ఉధృతమైంది. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో 90 మంది ఎమ్మెల్యేలతో విపక్షనేత డాక్టర్ వైఎస్సార్ నిరవధిక నిరాహారదీక్షను మొదలుపెట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్కసారిగా షాక్ తగిలేలా చేశారు. విద్యుత్ చార్జీలను భారీగా పెంచి ప్రజలపై భారం మోపడాన్ని నిరసిస్తూ చంద్రబాబుకు నేటి తెలంగాణ సీఎం, నాటి డిప్యూటీ స్పీకర్ కె.చంద్రశేఖరరావు లేఖ ద్వారా తమ అసంతృప్తిని తెలిపారు. ఆ తర్వాత డిప్యూటీ స్పీకర్ పదవికి, టీడీపీకి కేసీఆర్ రాజీనామా చేసి, మలిదశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టేందుకు, తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటునకు విద్యుత్‌చార్జీల ఉద్యమం, కాల్పుల ఘటన పరోక్షంగా కారణమైంది. ఆ రోజు ఏమైందంటే... విద్యుత్ చార్జీల వ్యతిరేక ఉద్యమం తీవ్రమవుతున్న దశలోనే శాసనసభ సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా, ఆగస్టు 28న వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ విడివిడిగా ‘చలో అసెంబ్లీ’కి పిలుపునిచ్చాయి. అడుగడుగునా పోలీసులు అడ్డంకులు కల్పించినా వేలాదిమంది కార్యకర్తలు ఇందిరాపార్కు ధర్నాచౌక్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి శాంతియుతంగా గుంపులు గుంపులుగా అసెంబ్లీ వైపు కదిలారు. ఇనుప కంచెలు, బ్యారికేడ్లతో నిలువరించే ప్రయత్నం చేసినా వాటిని తోసుకుంటూ ప్రదర్శనగా బషీర్‌బాగ్ వైపు సాగారు. బషీర్‌బాగ్ చౌరస్తాలోని ఫ్లైఓవర్ కింద పెద్దసంఖ్యలో పోలీసులను మోహరించారు. అశ్వికదళాలు సైతం కదంతొక్కాయి. అక్కడకు కార్యకర్తలు చేరుకోకుండా పోలీసులు ఎక్కడికక్కడ లాఠీచార్జీలు, భాష్పవాయుగోళాలు ప్రయోగించి, గుర్రాలతో అడ్డుకునే చర్యలు తీవ్రం చేశారు. అయినప్పటికీ అసెంబ్లీ వైపునకు పరుగులు తీస్తున్న కార్యకర్తలపై చివరకు పోలీసు కాల్పులు జరపడంతో సత్తెనపల్లి రామకృష్ణ, బాలస్వామి, విష్ణువర్ధన్‌రెడ్డిలకు తుపాకీ గుళ్లు తగిలి అసువులు బాశారు. ఆ విధంగా బషీర్‌బాగ్ ప్రాంతం రక్తసిక్తమైంది. చంద్రబాబు పాలనకు కౌంట్‌డౌన్.. చంద్రబాబు ఆధ్వర్యంలోని టీడీపీ పాలనకు కాల్పుల ఘటనతో కౌంట్‌డౌన్ మొదలైంది. ఆ ప్రభుత్వ ప్రజా వ్యతిరేకచర్యలు, తీవ్ర కరువు పరిస్థితుల్లోనూ వ్యవసాయాన్ని, రైతాంగాన్ని ఆదుకునే చర్యలు చేపట్టకపోవడాన్ని నిరసిస్తూ డా.వైఎస్సార్ చేపట్టిన చరిత్రాత్మక పాదయాత్ర చంద్రబాబు ఆధ్వర్యంలోని ప్రజా వ్యతిరేక పాలనకు చరమగీతం పాడేలా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను చైతన్యవంతులను చేసిం ది. 2004లో టీడీపీ పాలనను అంతమొందిస్తూ డా.వైఎస్సార్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బషీర్‌బాగ్ ఫ్లైఓవర్ కింద ముగ్గురు నేలకొరిగిన ప్రాంతం లో విద్యుత్ అమరవీరుల జ్ఞాపకార్థం ‘షహీద్‌చౌక్’ను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది ఆగస్టు 28న నాటి క్రూరమైన కాల్పుల ఘటనను గుర్తుచేసుకుంటూ వామపక్షాలు, ఇతర పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు ఆ ముగ్గురు యోధులకు నివాళి, జోహార్లు అర్పించి వారిని గుర్తుచేసుకుంటున్నారు. -
వేర్వేరు చోరీలకు పాల్పడుతున్న ముఠాలు అరెస్టు
సాక్షి, హైదరాబాద్ : వేర్వేరు కేసుల్లో చోరీలకు పాల్పడుతున్న ముఠాలను అరెస్టు చేసినట్లు సీపీ అంజనీ కుమార్ వెల్లడించారు. బషీర్‌బాగ్‌లోని సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో అంజనీ మాట్లాడారు. ఇళ్లలో ఎవరు లేని సమయాన్ని టార్గెట్ చేసుకొని చోరీలకు పాల్పడుతున్న సయ్యద్ యూసుఫ్, షేక్ సాహద్, సయ్యద్ శహ్ బాజ్లను అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితుల నుంచి రూ.10 లక్షల పది వేలు విలువైన ఆభరణాలు, లక్ష రూపాయల విలువ చేసే గడియారం, రెండు బైక్ లు, కొబ్బరి బోండాల కట్ చేసే కత్తి, మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారని పేర్కొన్నారు.కాగా ఆర్ధిక ఇబ్బందుల కారణంగానే వీరు చోరీల బాట పట్టారు. కాగా మరో కేసులో దుర్గామాతా విగ్రహంతో పాటు కోటి రూపాయల విలువ చేసే నాగమణి రాయిని విక్రయిస్తున్న నలుగురు నిందితులను వెస్ట్ జోన్ పోలీసులు అరెస్ట్ చేశారని అంజనీ కుమార్ వెల్లడించారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో బీ. దేవేందర్, టీ. జాన్, ప్రేమ్ చంద్ గుప్తా, మహమ్మద్ అష్రఫ్ లు ఉన్నారు. దేవేందర్ మూడేళ్ల క్రితం ముంబైలో ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి నాగమణి రాయిని కొనుగోలు చేశాడు.ఈ క్రమంలోనే విగ్రహంతో పాటు నాగమణి రాయిని అమ్ముతున్నారన్న విశ్వసనీయ సమాచారంతో రంగంలోకి దిగి నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. అయితే వీరివద్ద లభించిన దుర్గామాతా విగ్రహం, నాగమణి రాయి పంచలోహం కాదని నకిలీవని తేలినట్లు అంజనీ స్పష్టం చేశారు. -
ఫొటోలు తీసి చెప్పినట్లు చేయాలని బెదిరింపులు
బన్సీలాల్‌పేట్: మైనర్ బాలికను ప్రేమించి మోసం చేసి ఆమెతో సన్నిహితంగా ఉన్నపుడు తీసిన ఫొటోలను చూపించి బ్లాక్ మెయిల్ చేస్తున్న ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన గురించి డీసీపీ శనివారం విలేకరులకు వివరించారు. బషీర్‌బాగ్ చంద్రానగర్ ప్రాంతానికి చెందిన నాగరాజు (19), దోమల్‌గూడ మైసమ్మబండ ప్రాంతానికి చెందిన మైనర్ బాలిక సంవత్సర కాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో ఆమెతో సన్నిహితంగా ఉన్నపుడు నాగరాజు ఫొటోలు తీశాడు. వాటిని చూపించి బ్లాక్మెయిల్ చేశాడు. తాను చెప్పినట్లు చేయకపోతే ఫొటోలను బహిర్గతం చేస్తానని బెదిరించాడు. దీంతో బాలిక తన స్నేహితులకు విషయం చెప్పింది. ఈ నెల 6న నాగరాజు బాలికను డీబీఆర్ మిల్స్ ప్రాంతానికి రావాలని కోరాడు. డీబీఆర్‌మిల్స్ ప్రాంతానికి వెళ్లిన స్నేహితులు నాగరాజును చిదకబాది అతని ఫోన్లోని ఫొటోలను తొలగించారు. విషయం బయటకు రావడంతో ఇద్దరూ ఈ నెల 7న ఇంటి నుంచి వెళ్లిపోయారు. దీంతో బాలిక తండ్రి 8న గాంధీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు బాలిక కోసం వెతకడం ప్రారంభించారు. అయితే శుక్రవారం మధ్యాహ్నం బాలిక నెక్లెస్ రోడ్డులో ఉన్నట్లు సమాచారం రావడంతో తమ సిబ్బంది వెళ్లి బాలిక స్టేషన్ తీసుకు వచ్చి విచారించామన్నారు. అనంతరం నాగరాజును అదుపులోకి తీసుకొని విచారించారు. బాలిక అందరితో చనువుగా ఉండటం నచ్చలేదని అందుకే బ్లాక్ మెయిల్ చేశానని యువకుడు ఒప్పుకున్నాడన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. విలేకరుల సమావేశంలో చిక్కడ్పల్లి ఏసీపీ నర్సింహ్మారెడ్డి, సీఐ శ్రీనివాస్, క్రైమ్ ఇన్స్పెక్టర్ ప్రమోద్‌కుమార్, ఎస్ఐలు బాలక్రిష్ణ, అజయ్‌కుమార్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
నెత్తుటి మరక
-
15న దళిత, గిరిజన సమస్యలపై సదస్సు
దళితులు, గిరిజనుల సమస్యలపై చర్చించేందుకు ఈ నెల 15వ తేదీన రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్లు ఐడియల్ దళిత్ ఉమెన్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు జి.రాజసుందర్ బాబు, ఏపీ అధ్యక్షురాలు పద్మ సుకుమారి తెలియ జేశారు. బషీర్‌బాగ్‌లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ విధానం సక్రమంగా అమలు చేయాలని, ఎస్సీ, ఎస్టీ కేసుల్లో బాధితులకు చట్ట ప్రకారం ఆర్థిక పునరావాస సాయం కల్పించాలని కోరారు. కింగ్‌కోఠి రోడ్డులోని భారతీయ విద్యాభవన్‌లో 15న సాయంత్రం జరిగే ఈ రాష్ట్ర స్థాయి సదస్సుకు ఏపీ మంత్రి రావెల కిషోర్ దితరులు హాజరవుతారని పేర్కొన్నారు.