15న దళిత, గిరిజన సమస్యలపై సదస్సు | state -level seminar on the Dalit , tribal problems On march15 | Sakshi
Sakshi News home page

15న దళిత, గిరిజన సమస్యలపై సదస్సు

Published Mon, Mar 14 2016 3:41 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

state -level seminar on the Dalit , tribal problems On march15

దళితులు, గిరిజనుల సమస్యలపై చర్చించేందుకు ఈ నెల 15వ తేదీన రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్లు ఐడియల్ దళిత్ ఉమెన్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు జి.రాజసుందర్ బాబు, ఏపీ అధ్యక్షురాలు పద్మ సుకుమారి తెలియ జేశారు.

బషీర్‌బాగ్‌లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ విధానం సక్రమంగా అమలు చేయాలని, ఎస్సీ, ఎస్టీ కేసుల్లో బాధితులకు చట్ట ప్రకారం ఆర్థిక పునరావాస సాయం కల్పించాలని కోరారు. కింగ్‌కోఠి రోడ్డులోని భారతీయ విద్యాభవన్‌లో 15న సాయంత్రం జరిగే ఈ రాష్ట్ర స్థాయి సదస్సుకు ఏపీ మంత్రి రావెల కిషోర్ దితరులు హాజరవుతారని పేర్కొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement