సాక్షి,అమరావతి : వైఎస్సార్‌సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పించారు. బషీర్‌బాగ్ కాల్పులు జరిగి 20 సంవత్సరాలు పూర్తైన నేపథ్యంలో చంద్రబాబుకు చురకలంటించారు. ' విశ్వాస ఘాతకుడిగా 25 ఏళ్లు పూర్తి చేసుకొని ఆగస్ట్25న ''వెన్నుపోటు'' దినోత్సవం జరుపుకున్న బాబు.. ఆగస్ట్28 ''చంద్రన్న రక్తపాత దినోత్సవం'' జరుపుకుంటున్నారు. బషీర్‌బాగ్‌లో బాబు సృస్టించిన మారణహోమం నేటికి 20 ఏళ్లు. నీవు ఎంత క్రూరుడివో, ఎంతటి విధ్వంసకారుడివో చరిత్రే చెబుతుంది బాబు.' అంటూ పేర్కొన్నారు.
సరిగ్గా 20 ఏళ్ల కిందట.. 2000 సంవత్సరం ఆగస్టు 28న తెలుగుదేశం పార్టీ అధినేత, నాటి సీఎం చంద్రబాబు నాయుడి నిరంకుశ పాలనలో హైదరాబాద్ నడిబొడ్డున, అసెంబ్లీకి కూతవేటు దూరంలో పోలీసుల తుపాకీ గుళ్లకు ముగ్గురు నేలకొరిగారు. ప్రపంచబ్యాంక్ షరతులకు తలొగ్గి ప్రైవేటీకరణ విధానాల అమలు, విద్యుత్‌రంగ సంస్కరణల్లో భాగంగా చంద్రబాబు సర్కార్ విద్యుత్‌చార్జీలు పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు భగ్గుమన్నాయి. గణనీయంగా పెరిగిన గృహావసరాల కరెంట్ చార్జీలను తగ్గించాలంటూ పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వెల్లువెత్తినా సీఎం చంద్రబాబు పట్టించుకోలేదు. తొలుత సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీ, ఇతర వామపక్షాలు కలిసి రాష్ట్రవ్యాప్త ఆందోళన చేపట్టాయి. (చదవండి : బషీర్‌బాగ్ కాల్పులకు 20 ఏళ్లు)
Comments
Please login to add a commentAdd a comment