bashirabad
-
చల్‌చల్ గుర్రం.. 50 ఏళ్లుగా అశ్వాన్నే వాడుతున్న రైతు
సాక్షి, బషీరాబాద్: ప్రస్తుత యాంత్రిక జీవితంలో ప్రతిఒక్కరూ శరవేగంగా గమ్యం చేరాలని భావిస్తున్నారు. నిమిషాలు, గంటల్లో వెళ్లేలా ఆధునిక వాహనాలను వాడుతున్నారు. ఈ నేపథ్యంలో పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ ఖరీదైనన కార్లు, బైకులు కనిస్తున్నాయి. కానీ బషీరాబాద్ మండలం ఎక్మాయికి చెందిన రైతు అల్లూరు నర్సయ్యగౌడ్ యాభై ఏళ్లుగా అశ్వాన్నే వాహనంగా వాడుతున్నారు. తన 18వ ఏట నుంచి ఇప్పటి వరకు సుమారు ఐదు గుర్రాలపై స్వారీ చేసినట్లు చెబుతున్నాడు. ఎక్కడికి వెళ్లినా ప్రమాదం లేకుండా, పైసా ఖర్చు లేకుండా ప్రయాణం పూర్తవుతుందని తెలిపాడు. సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే తప్ప బైకులు, కార్లు, బస్సులు ఎక్కలేదని వివరించాడు. (చదవండి: నాడు నాన్న.. నేడు అమ్మ అనాథైన బాలిక ) -
దడ పుట్టిస్తున్న ధార్ గ్యాంగ్
సాక్షి, హైదరాబాద్: పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలో మంగళవారం జరిగిన భారీ చోరీ మధ్యప్రదేశ్‌లోని ధార్ ముఠా పనిగా సైబరాబాద్ పోలీసులు గుర్తించారు. ఒకేసారి నాలుగైదు ఇళ్లలో చోరీలకు పాల్పడటం ఈ గ్యాంగ్ స్టయిల్. దూలపల్లి హైటెన్షన్ లైన్‌లోని మహాలక్ష్మి ఎన్క్లేవ్ అగ్రి నివాస్‌లో అశోక్ రామ ఇంటితో పాటు అదే అపార్ట్మెంట్లోని 108, 203, 202 ఫ్లాట్లలోనూ దుండగులు చోరీకి యత్నించారు. ఈ క్లూ ఆధారంగానే ఈ చోరీ ధార్ గ్యాంగ్ పనేనని పోలీసులు నిర్ధారించారు. తెలంగాణలో 2018 నుంచి చోరీలకు పాల్పడుతున్న ఈ ముఠాపై 98 కేసులుండగా.. వీటిలో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 68 ఉండటం గమనార్హం. నెల రోజుల క్రితం ఈ గ్యాంగ్‌లోని ప్రధాన నిందితుడు మాన్‌సింగ్‌తో పాటు మొహబత్, రీమ్ సింగ్, కిషన్‌సింగ్‌లను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నలుగురు నిందితుల గుర్తింపు.. అగ్రి నివాస్ అపార్ట్మెంట్లో సీసీటీవీ కెమెరాలు లేకపోవటంతో.. ఆ రహదారిలోని సీసీటీవీ ఫుటేజీలను పేట్ బషీరాబాద్ పోలీసులు విస్తృతంగా తనిఖీ చేస్తున్నారు. సోమవారం అర్ధరాత్రి నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు అపార్ట్‌మెంట్‌కు వెళ్లే దారిలోని రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతున్నట్లు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయినట్లు ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. చోరీ జరిగిన ఇంట్లోని వేలిముద్రలు, ఇతరత్రా సాంకేతిక ఆధారాల మేరకు నలుగురు నిందితులు చోరీకి పాల్పడినట్లు గుర్తించామని ఆయన పేర్కొన్నారు. చోరీ సొత్తుతో నిందితులు రాష్ట్రం దాటకుండా ముమ్మర గాలింపు చేస్తున్నామన్నారు. ఐటీ, సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్), లా అండ్ ఆర్డర్ పోలీసులతో నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. (చదవండి: ఆమె జైలుకు.. బాలుడు ఇంటికి) -
బంధువులే చంపి.. అడవిపంది దాడిగా చిత్రీకరించారు!
సాక్షి, బషీరాబాద్: అడవిపంది దాడిలో వ్యక్తి మృతిచెందిన కేసులో కొత్త మలుపు తిరిగింది. తన తండ్రిని బంధువులే చంపేసి ప్రమాదంగా చిత్రీకరిస్తున్నారని మృతుడి కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బషీరాబాద్ మండలం మాసన్పల్లి గ్రామానికి రైతు గొల్ల కమలప్ప అడవి పంది దాడిలో ఈనెల 8వ తేదీన మృతి చెందినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం దర్యాప్తు చేపట్టారు. అయితే తాజాగా మృతుడి కుమారుడు గొల్ల చరణ్ తన తండ్రిది ‘ముమ్మాటికి హత్యే’ అని ఆరోపించారు. ఆస్తి కోసం బంధువులే హత్యచేసి ప్రమాదకరంగా చిత్రీకరిస్తున్నారని తాండూరు డీఎస్పీ లక్ష్మీనారాయణకు ఆదివారం ఫిర్యాదు చేశాడు. గ్రామంలోని పొలాలతో పాటు తాండూరులో ఇంటి స్థలాలు తమకు ఉన్నాయని, వాటిని కాజేయడడానికి తన మేనమామ గొల్ల మొగులప్ప, మేనత్తలు గొల్ల కమలమ్మ, మొగులమ్మతో పాటు మరికొందరు కలిసి హత్యచేశారని ఆరోపించాడు. ఈ విషయాన్ని బయటకు చెబితే చంపేస్తామని వారు బెదిరిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై లోతుగా దర్యాప్తు చేసి న్యాయం చేయాలని కోరారు. విచారణకు ఆదేశించాం మాసన్పల్లి గ్రామానికి చెందిన రైతు కమలప్ప మృతిపై మొదట ఫిర్యాదు చేయడానికి కుటుంబసభ్యులు వెనకాడారు. పోస్టుమార్టం కూడా వద్దన్నారు. ఆ తర్వాత ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశాం. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు లోతుగా విచారణ చేపట్టాలని తాండూరు గ్రామీణ సీఐకి ఆదేశించాం. అన్ని కోణాల్లో విచారణ చేస్తాం. పోస్టుమార్టం, ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు ఆధారంగా కేసును త్వరగా చేధిస్తాం. – లక్ష్మీనారాయణ, డీఎస్పీ -
తల్లి కళ్ల ముందే నిప్పంటించుకున్న యువతి..
బషీరాబాద్(తాండూరు) : తల్లిదండ్రులు సెల్‌ఫోన్ కొనివ్వలేదని మనస్థాపానికి గురైన ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తల్లిదండ్రుల కళ్లముందే ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. ఈ సంఘటన బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిదిలోని మాసన్పల్లి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. యువతి కుటుంబీకులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వడ్డె లక్ష్మ, లక్ష్మయ్య కూతురు వడ్డె నవీన(18) హైదరాబాద్‌లో ఓ ఇంట్లో పనిమనిషిగా చేస్తోంది. అయితే గ్రామంలో చిన్నాన్న కొడుకు పెళ్లి కోసం 20 రోజుల కిందట హైదరాబాద్ నుంచి గ్రామానికి వచ్చింది. మూడు రోజుల కిందట తల్లిదండ్రులతో కలిసి కర్ణాటకలోని తుల్జాపూర్ ఆలయ దర్శనానికి వెళ్లారు. శుక్రవారం రైలులో తిరిగి వస్తుండగా గుల్బర్గా దగ్గర నవీన తన సెల్‌ఫోన్‌ను పోగొట్టుకుంది. దీంతో ఏడుస్తూ దిగాలుగా ఉన్న కూతురుకు కొత్త ఫోన్ కొనిస్తామని తల్లి లక్ష్మీ సముదాయించింది. అయితే శనివారం కొత్త సెల్‌ఫోన్ కావాలని మారం చేయడంతో ఒక్కరోజు ఆగు.. ఇంట్లో పూజ ముగిశాక తాండూరు వెళ్లి సోమవారం తీసుకుందామని తల్లి.. కూతురును మందలించింది. దీంతో మనస్థాపం చెందిన నవీన ఇంట్లో ఉన్న కిరోసిన్ ఒంటిపై పోసుకొని నిప్పంటించుకుంది. తల్లిదండ్రులు వెంటనే మంటలను ఆర్పారు. అప్పటికే తల, ముఖం ఛాతి భాగాలపై తీవ్రంగా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఎస్సై లక్ష్మయ్య సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకొని విచారణ జరిపారు. గాయపడిన నవీనను 108లో చికిత్స కోసం తాండూరు జిల్లా ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని గాంధీకి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై లక్ష్మయ్య తెలిపారు. -
కారు‘చౌక’ మోసం!
బషీరాబాద్, న్యూస్‌లైన్: ‘ఎస్ఎమ్ఎస్ కొట్టు.. బహుమతి పట్టు..! కామన్ మ్యాన్ని కూడా కార్లు వరించే కాంటెస్ట్.. మీకు అతి తక్కువ ధరకే కారు కావాలనుకుంటున్నారా? అయితే ఈ నంబర్‌కు ఎసెమ్మెస్ కొట్టండి’ అంటూ ఓ టీవీ చానల్లో వచ్చిన యాడ్‌ని నమ్మిన వ్యక్తి బోల్తాపడ్డాడు. దాదాపు రూ.లక్ష మోసపోయాడు. ఈ సంఘటన బషీరాబాద్‌లో శుక్రవారం వెలుగుచూసింది. చౌకబేరం.. రాజస్థాన్ రాష్ట్రం జాలోర్ ప్రాంతానికి చెందిన సురేశ్ బషీరాబాద్‌లో మిఠాయి బండార్ నిర్వహిస్తున్నాడు. రోజూ వచ్చే రూ. 200-300లతో కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నంతలో హాయిగా బతుకుతున్నాడు. ‘ఎస్ఎమ్ఎస్ కొట్టు.. బహుమతి పట్టు’ అని ఓ హిందీ చానల్లో ఇటీవల యాడ్ వచ్చింది. అత్యాశకు పోయిన సురేశ్ టీవీ స్క్రీన్ మీద కనిపించే నంబర్‌కు ఎస్ఎమ్ఎస్ పంపాడు. ‘మీకు ఖరీదైన టాటా కారు పొందే అవకాశం వచ్చింది. రూ.25,006 తమ ఖాతాలో వేయాలి’అని ఓ వ్యక్తి ఫోన్ చేసి సురేష్‌కు చెప్పాడు. దీంతో సురేశ్ ఈనెల 15న సదరు మొత్తాన్ని రాజీవ్ రంజన్ పేరిట 33761188005 నంబర్ ఎస్బీఐ ఖాతాలో జమచేశాడు. అదే రోజు సురేష్‌కు మళ్లీ కాల్ వచ్చింది. కారు షోరూమ్‌లో నుంచి కదులుతుంది. ట్రాన్స్పోర్ట్ ఖర్చులకు రూ.15,606 ఖాతాలో జమ చేయాలని మళ్లీ చెప్పడంతో సురేశ్ వేశాడు. ఇలా 16వ తేదీన రెండుసార్లు రూ. 52,302, మరుసటి రోజు రూ.7006లను శశిభూషణ్ అనూజ్(అకౌంట్‌నంబర్33106048542), సం తోష్ మహతో(20168041425) ఖాతో లో డబ్బు జమచేశాడు. ఇలా మొత్తం రూ. 99,618 పలు ఖాతాల్లో వేశాడు. కారు మధ్యలోకి వచ్చింది.. ఇంకో రెండు గంటల్లో ఇంటిముందు ఉంటుదని చెప్పగానే సురేశ్ కుటుంబం సంతోషించింది. శుక్రవారం 072776 58717 నంబర్ నుంచి అశుతోష్ అనే వ్యక్తి నుంచి సురేష్‌కు ఫోన్ చేశాడు. తాను టాటా మోటర్స్ ప్రతినిధి అని పరిచ యం చేసుకున్నాడు. కారు కంటే బంపర్ ఆఫర్ తగిలిందని అశుతోష్ సురేష్‌కు చెప్పాడు. రూ. 6,000లు అకౌంట్లో వేస్తే రూ.12,4 లక్షలు ఖాతాలో జమ అవుతుందని చెప్పగానే సురేష్ కంగు తిన్నా డు. మోసపోయానని గ్రహించి శుక్రవారం పోలీసులను ఆశ్రయించాడు. రెక్కల కష్టం దోచుకున్నారని సురేష్ లబోదిబోమన్నాడు. విచారణ జరుపుతా మని ఎస్ఐ లకా్ష్మరెడ్డి తెలిపారు. -
పాఠశాలలో పాశవికం..
బషీరాబాద్, న్యూస్‌లైన్: పవిత్రమైన పాఠశాలలో దారుణం చోటుచేసుకుంది. గుర్తుతెలియని దుండగులు ఓ కూలీని పొడిచి చంపారు. ఈ సంఘటన మండల పరిధిలోని రెడ్డిఘనాపూర్ అనుబంధ గ్రామం కంసన్పల్లి మక్తా గ్రామంలో బుధవారం వెలుగుచూసింది. మృతుడి బంధువులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చెవుల రాజు(35) స్థానికంగా కూలీపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం రాత్రి 7:30 గంటల సమయంలో ఆయన ఇంటికి స్నేహితులు అంజిలప్ప, వెంకటేష్ వచ్చారు. దీంతో రాజు ఇప్పుడే వస్తానని తండ్రి నర్సప్పకు చెప్పి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కొడుకు ఆచూకీ కోసం నర్సప్ప అర్ధరాత్రి వరకు గాలించినా ఫలితం లేకుండా పోయింది. బుధవారం ఉదయం గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాల వరండాలో రాజు తీవ్ర రక్తగాయాలతో విగతజీవిగా పడి ఉన్నాడు. అదే గ్రామానికి చెందిన గంజాయి ఆశప్ప సమాచారంతో రాజు కుటుంబీకులు ఘటనా స్థలానికి చేరుకొని గుండెలుబాదుకున్నారు. తాండూరు రూరల్ సీఐ రవి, ఎస్ఐ పరమేశ్వర్‌గౌడ్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. రాజు శరీరంపై కత్తిపోట్లు ఉన్నాయి. మృతదేహానికి తాండూరులోని జిల్లా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. కాగా రాజుకు భార్య లక్ష్మి, పిల్లలు నరేష్, అనూష ఉన్నారు. భర్త మద్యానికి బానిసవడంతో లక్ష్మి పిల్లలను తీసుకొని ఆరునెలల క్రితం పుట్టిల్లు అయిన కరన్‌కోట్‌కు వెళ్లింది. భర్త హత్య సమాచారం తెలుసుకున్న ఆమె బుధవారం అత్తారింటికి చేరుకొని కన్నీటిపర్యంతమైంది. తన సోదరుడిని అతడి స్నేహితులు, గ్రామానికి చెందిన అంజిలప్ప, వెంకటేష్‌లు తీసుకెళ్లి చంపేశారని హతుడి సోదరి పద్మ, కుటుంబీకులే ఆరోపించారు. ఈమేరకు కేసు దర్యాప్తులో ఉంది.