battalions
-
గణతంత్ర వేడుకలకు సర్వం సిద్ధం
సాక్షి ప్రతినిధి, విజయవాడ: గణతంత్ర వేడుకలకు విజయవాడలోని మునిసిపల్ స్టేడియం ముస్తాబైంది. వేడుకల ఏర్పాట్లను గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా మంగళవారం పరిశీలించారు. ఆయనకు అడిషనల్ డీజీపీ డాక్టర్ రవిశంకర్ అయ్యనార్, ఏపీఎస్పీ బెటాలియన్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ బాగ్చీ, కలెక్టర్ జె.నివాస్, నగర పోలీస్ కమిషనర్ టీకే రాణా, ప్రొటోకాల్ డైరెక్టర్ బాలసుబ్రహ్మణ్యరెడ్డి తదితరులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఫుల్‌డ్రెస్ రిహార్సల్స్ ఆకట్టుకున్నాయి. ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్సీ, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్‌తో సిసోడియా భేటీ అయ్యారు. ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా కార్యక్రమాలు సజావుగా జరిగేలా అన్ని శాఖలు సమన్వయంతో వ్యవహరించాలని కోరారు. కాగా, పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో కర్ణాటక స్టేట్ పోలీస్, ఏపీఎస్పీ రెండో బెటాలియన్ కర్నూలు, మూడో బెటాలియన్ కాకినాడ, ఐదో బెటాలియన్ విజయనగరం, తొమ్మిదో బెటాలియన్ వెంకటగిరి, 11వ బెటాలియన్ భాకరపేట, 14వ బెటాలియన్ అనంతపురం, ఎస్ఏఆర్ సీసీఎల్, ఏపీ యూనిట్ హైదారాబాద్, పైప్ బ్యాండ్ ఏపీఎస్పీ బెటాలియన్ మంగళగిరి బృందాలు కవాతు నిర్వహించాయి. కలెక్టర్ జె.నివాస్ రిహార్సల్స్‌ను తిలకించి పలు సూచనలు చేవారు. జాతీయ సమైక్యత ఉట్టి పడేలా త్రివర్ణ పతాకాలు, విద్యుత్ దీపాలతో మునిసిపల్ స్టేడియాన్ని ముస్తాబు చేశారు. రిహార్సల్స్‌లో జాయింట్ కలెక్టర్లు డాక్టర్ కె.మాధవీలత, కె.మోహన్‌కుమార్, సబ్ కలెక్టర్ జి.సూర్యసాయి ప్రవీణ్‌చంద్, గవర్నర్ ఏడీసీలు సాహిల్ మహాజన్, ఈశ్వరరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
టీఎస్ఎస్పీలో ప్రమోషన్ల గలాట
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ (టీఎస్ఎస్పీ)లో ఇప్పుడు పదోన్నతల గలాటా రేగుతోంది. ప్రమోషన్ల విషయంలో జనరల్ విభాగానికి మిగిలిన విభాగాలకు మధ్య దూరం చెరిపేస్తూ అమలు చేయాలని చూస్తోన్న కొత్త విధానం ఉద్యోగుల మధ్య చిచ్చుపెడుతోంది. దీంతో ఇరువర్గాల మధ్య దూరం పెరిగిపోయింది. తమకు రావాల్సిన ప్రమోషన్లను ఇతరులు తన్నుకుపోతుంటే చూస్తూ ఊరుకునేది లేదని, దీనిపై తాడోపేడో తేల్చుకునేందుకు న్యాయపోరాటానికి సిద్ధమని జనరల్ విభాగాల ఉద్యోగులు అంటుంటే.. తాము కూడా న్యాయపోరాటానికి వెనుకాడమని ఇతర విభాగాల సిబ్బంది అంటున్నారు. దీంతో ఈ వివాదం రోజురోజుకు ముదిరేలా కనిపిస్తోంది. అసలేంటి వివాదం.. ఉమ్మడి రాష్ట్రంలో ఈ విభాగం (అప్పట్లో ఏపీఎస్పీగా వ్యవహరించేవారు) ఒక వెలుగు వెలిగింది. టీఎస్ఎస్పీలో మొత్తం 13 బెటాలియన్లు ఉండగా దాదాపుగా 13వేల మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. టీఎస్ఎస్పీలో మొత్తం నాలుగు విభాగాలు ఉంటాయి. మొదటిది జనరల్ విభాగం వీరిని గ్రేహౌండ్స్, ఎస్ఐబీ, ఆక్టోపస్, స్పెషల్ ఆపరేషన్స్, కూంబింగ్ ఒకటేమిటి.. దాదాపుగా క్లిష్టమైన అన్ని ఆపరేషన్లకు ఉపయోగించేవారు. మావోయిస్టుల ప్రాబల్యం తగ్గాక వీరి పేరు వినిపించడం కాస్త తగ్గిందని చెప్పాలి. ఇప్పుడు కూడా ఆక్టోపస్, ఎస్ఐబీ, కూంబింగ్‌కు వీరినే వినియోగిస్తున్నారు. వీరు నిత్యం ప్రాణాలకు తెగించి, నెలల తరబడి కుటుంబాలకు దూరంగా ఉంటారు. మావోయిస్టులపై పోరులో చనిపోయిన పోలీసుల్లో సింహభాగం వీరే కావడం గమనార్హం. వీరి తరువాత మోటార్ ట్రాన్స్పోర్ట్, బ్యాండ్, ఆర్మర్ అనే మూడు విభాగాలు ఉంటాయి. వీరికి రిస్క్ తక్కువ. కాబట్టి డిపార్ట్మెంట్ పదోన్నతుల విషయంలో వీరికన్నా జూనియర్లయినప్పటికీ.. జనరల్ విభాగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చేవారు. అధికారులు కూడా ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారు. చక్రం తిప్పుతున్న అధికారులు.. కానీ, ఇపుడు అన్ని విభాగాలు ఒకటేనని అందరికీ సీనియారిటీ ఆధారంగా పదోన్నతులు కల్పించాలన్న అంశాన్ని ఓ ఉన్నతాధికారి తెరపైకి తీసుకువచ్చారు. దీంతో తేనెతుట్టెను కదిపినట్లయింది. విధి నిర్వహణలో మాకు రిస్క్ అధికంగా ఉన్నందునే మాకు పదోన్నతుల్లో పెద్దపీట వేస్తున్న విషయం వాస్తవం. కానీ, ఆఫీసులో కూర్చుని పనిచేసే వారిని, మమ్మల్ని ఒకేగాటిన కడితే ఊరుకునేది లేదని జనరల్ విభాగాల ఉద్యోగులు స్పష్టం చేస్తున్నారు. ఇటీవల ఈ విషయంపై వారు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. కానీ, కొందరు ఉన్నతాధికారుల ఒత్తిడితో వెనక్కి తగ్గారు. దాదాపు నాలుగు దశాబ్దాలక్రితం ఉమ్మడి ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నం.69 లో పేర్కొన్న ఓ అంశం ఆధారంగా సదరు అధికారులు .. నోషనల్ సీనియారిటీ ఆధారంగా ఎంటీ, బ్యాండ్, ఆర్మరీ విభాగాలకు చెందిన పలువురి పేర్లతో ఇప్పటికే పదోన్నతుల జాబితాను సిద్ధం చేశారు. దీంతో జనరల్ విభాగం వారు గగ్గోలు పెడుతున్నారు. ఈ వివాదాన్ని న్యాయస్థానంలోనే తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. -
కశ్మీర్‌కు 9 అదనపు బెటాలియన్లు
జమ్మూ: పాకిస్తాన్ చేస్తున్న వరుస షెల్లింగ్ దాడులను తిప్పికొట్టేందుకు కశ్మీర్లో కొత్తగా 9 బెటాలియన్లను ఏర్పాటుచేస్తామని హోం మంత్రి రాజ్‌నాథ్ ప్రకటించారు. అందులో రెండింటిని సున్నిత ప్రాంతాల్లో మోహరిస్తామన్నారు. జమ్మూ, కశ్మీర్‌లలో ఒక్కోటి చొప్పున 2 మహిళా బెటాలియన్లను ఏర్పాటుచేస్తామని, వీటి వల్ల సుమారు 2 వేల మంది మహిళలకు ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. త్వరలో ఏర్పాటుచేయబోయే ఇండియన్ రిజర్వ్ బెటాలియన్లలో స్థానికులకే 60 శాతం ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. సరిహద్దుల్లో పాక్ కాల్పుల ప్రభావిత ప్రాంతాలైన ఆర్‌ఎస్‌పురా, కుప్వారా జిల్లాల్లో పర్యటించి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాల్పుల సమయంలో వాడుకోవడానికి అక్కడ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను అందుబాటులో ఉంచుతామని చెప్పారు. సరిహద్దు ప్రాంతాల్లో స్థానికులకు రక్షణగా రూ.450 కోట్ల వ్యయంతో 14,460 బంకర్లు నిర్మిస్తామన్నారు. పాక్ షెల్లింగ్‌లో మృతిచెందిన వారి కుటుంబీకులకు పరిహారాన్ని రూ.5 లక్షలకు పెంచామని తెలిపారు. ఈ మొత్తాన్ని బాధిత కుటుంబ బ్యాంకు ఖాతాలో వేస్తామని, ఇకపై ఈ సాయం పొందాలంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేయాల్సిన అవసరంలేదన్నారు. రాష్ట్రంలో స్థిరపడిన పశ్చిమ పాకిస్తాన్ శరణార్థుల కుటుంబాలకు రూ.ఐదున్నర లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని వెల్లడించారు. కుప్వారాలో వలసదారులు, స్థానిక ప్రతినిధులతో రాజ్‌నాథ్ సమావేశమయ్యారు. జిల్లా పోలీస్ లైన్స్ సందర్శించి అమర జవాన్లు, పోలీసులకు నివాళులర్పించారు. రాజ్‌నాథ్ వెంట కశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీ, కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ ఉన్నారు. రోహింగ్యాలపై సర్వే.. దేశంలో నివసిస్తున్న రోహింగ్యా ముస్లింలపై సర్వే జరపాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించామని రాజ్‌నాథ్ చెప్పారు. అలాగే వారు పౌరసత్వం పొందేలా ఎలాంటి చట్టబద్ధ పత్రాలు జారీచేయొద్దని సూచించామన్నారు. అన్ని రాష్ట్రాల నుంచి సర్వే సమాచారం వచ్చిన తరువాత రోహింగ్యాలను వెనక్కి పంపే ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. దేశవ్యాప్తంగా మావోయిస్టుల ప్రాబల్యం క్రమంగా తగ్గుముఖం పడుతోందని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కేవలం పది జిల్లాల్లోనే మావోయిస్టుల హింస ఆందోళనకరంగా ఉందని అన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో కూడా అతివాదుల కార్యకలాపాలు తగ్గాయని తెలిపారు. ప్రధానికి నక్సలైట్ల ముప్పు ఉందన్న వార్తలపై స్పందిస్తూ..మోదీ భద్రతకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. -
గెటౌట్ బెటాలియన్
సాక్షి, అమరావతి: రక్షక భటులు అని గొప్పలు చెప్పుకునే పోలీసుల ఆస్తులకే రక్షణ లేకుండా పోతోంది. పర్యాటకం పేరుతో రూ.4 వేల కోట్ల విలువైన పోలీసు ఆస్తులను ప్రయివేటు వ్యక్తులకు కట్టబెట్టే మరో భారీ స్కెచ్‌కు బీజం పడింది. గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఏపీఎస్పీ 6వ బెటాలియన్ ఉన్న ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని గురువారం జరిగిన రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) సమావేశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో జాతీయ రహదారి పక్కన, కొండల నడుమ అన్ని విధాలుగా కీలకంగా ఉన్న బెటాలియన్‌ను వేరొక ప్రాంతానికి తరలించేందుకు నిర్ణయించారు. ఈ ప్రాంతంలోని విలువైన భూముల్లో హోటళ్లు, రిసార్ట్స్ నిర్మించేందుకు ప్రయివేటు వ్యక్తులకు అప్పగించేందుకు రంగం సిద్ధమైంది. ఈ ప్రతిపా దనల వెనుక ‘ప్రభుత్వ పెద్దల’ భారీ స్కెచ్ ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజధాని నేపథ్యంలో మంగళగిరి బెటాలియన్ ఉన్న ప్రాంతానికి అతి చేరువలో జాతీయ రహదారి పక్కనే ఇటీవల భారీ రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలిశాయి. ప్రభుత్వ పెద్దలకు అతి సన్నిహితంగా మెలిగే ఎల్ఈపీఎల్ (లింగమనేని), మిడ్‌వాలీ తదితర ప్రముఖ సంస్థలకు చెందిన బహుళ అంతస్తుల (అపార్టుమెంట్) భవనాల నిర్మాణం వేగంగా సాగుతున్నాయి. దాదాపు 28 అంతస్తుల ఎత్తైన భారీ భవన (అపార్టుమెంట్) సముదాయాలకు ఆనుకుని ఉన్న ఏపీఎస్పీ బెటాలియన్ భూములపై పెద్దల కన్ను పడింది. టూరిజం సాకుతో మొదట ఆ భూములను స్వాధీనం చేసుకుని ప్రయివేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకే ‘ప్రభుత్వ పెద్దలు’ వ్యూహం రచించారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదురుగా ఉన్న సుమారు రూ.100 కోట్ల విలువైన భూమిలో 72 పోలీస్ క్వార్టర్స్‌ను తొలగించి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం గమనార్హం. నక్సల్స్ అణచివేతకు ఆవిర్భవించిన బెటాలియన్... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నల్లమల అటవీ ప్రాంతంతో పాటు పలు జిల్లాల్లో విస్తరించిన మావోయిస్టులను అణచివేసేందుకు ఆవిర్భవించిన 6వ బెటాలియన్‌కు 45 ఏళ్ల ఘనచరిత్ర ఉంది. గుంటూరు జిల్లాతో పాటు పలు జిల్లాల్లో విస్తరించిన నల్లమల, తెలంగాణ ప్రాంతంలోని వరంగల్, ఖమ్మం, కరీంనగర్ తదితర జిల్లాల్లో మూవోయిస్టుల తీవ్రత ఉన్న రోజుల్లో కాకినాడ (3వ బెటాలియన్) నుంచి ఆయా ప్రాంతాలకు ప్రత్యేక బలగాలు (స్పెషల్ పోలీస్) రావడానికి తీవ్ర జాప్యం జరిగేది. ఈ నేపథ్యంలోనే నల్లమలకు సమీపంలోని మంగళగిరి ప్రాంతంలో 1972 ఆగస్టు 15న 6వ బెటాలియన్‌కు శంఖుస్థాపన చేశారు. ఏపీఎస్పీ 2, 3 బెటాలియన్ల నుంచి 125 మంది (ఒక కంపెనీ) చొప్పున బలగాలను అదే ఏడాది సెప్టెంబర్‌లో ఇక్కడికి తరలించారు. తాడేపల్లి, ఆత్మకూరు, మంగళగిరి స్థానిక సంస్థలతో పాటు అటవీశాఖ (ఫారెస్టు) శాఖకు చెందిన 142.68 ఎకరాలను కేటాయిస్తూ అప్పటి ప్రభుత్వం జీవో 1134 జారీ చేసింది. ఫారెస్టు భూములను కూడా బెటాలియన్ కోసం డీనోటిఫై చేశారు. అటు తరువాత 1029 మంది అధికార, సిబ్బందికి సరిపడే క్వార్టర్స్, శిక్షణ ప్రాంతం, ప్రధాన కార్యాలయంతో 6వ బెటాలియన్ రాష్ట్రంలోనే కీలకంగా మారింది. ఇక్కడే పోలీస్ ఉన్నతాధికారులకు క్వార్టర్స్, కీలక కార్యాలయాల నిర్మాణానికి ఇటీవల ప్రతిపాదనలు కూడా జరిగాయి. కిట్‌లో విషపురుగులు.. రాళ్లపై అవస్థలు: శిరిగిరి గుండయ్య, రిటైర్డ్ ఏఆర్ ఎస్సై మంగళగిరి బెటాలియన్‌లో విధులు నిర్వహించేందుకు వచ్చిన మేము తొలినాళ్లలో పడ్డ కష్టాలు తలుచుకుంటేనే ఒళ్లు జలదరిస్తుంది. అటవీప్రాంతంలో చెట్టు, పుట్టలు, రాళ్లతో ఈ ప్రాంతాన్ని మేము ఉండేందుకు అనుకూలంగా మలుచుకునేందుకు పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. మా కిట్ (బ్యాగ్)లోకి తేళ్లు, పాములు వంటి విషపురుగులు చేరేవి. మంచినీరు కూడా దొరకని ఈ ప్రాంతంలో రాళ్లు, రప్పల్లో విధులు నిర్వర్తించాం. ఎంతో శ్రమ, ఎందరో కృషి ఫలితంగా బెటాలియన్ ఇప్పుడు అన్ని విధాలుగా అనుకూలంగా అభివృద్ధి చెందింది. అటువంటి బెటాలియన్‌ను ప్రయివేటుకు వ్యక్తులకు అప్పగించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం బాధాకరం.తొలగించి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం గమనార్హం. నక్సల్స్ అణచివేతకు ఆవిర్భవించిన బెటాలియన్... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నల్లమల అటవీ ప్రాంతంతో పాటు పలు జిల్లాల్లో విస్తరించిన మావోయిస్టులను అణచివేసేందుకు ఆవిర్భవించిన 6వ బెటాలియన్‌కు 45 ఏళ్ల ఘనచరిత్ర ఉంది. గుంటూరు జిల్లాతో పాటు పలు జిల్లాల్లో విస్తరించిన నల్లమల, తెలంగాణ ప్రాంతంలోని వరంగల్, ఖమ్మం, కరీంనగర్ తదితర జిల్లాల్లో మూవోయిస్టుల తీవ్రత ఉన్న రోజుల్లో కాకినాడ (3వ బెటాలియన్) నుంచి ఆయా ప్రాంతాలకు ప్రత్యేక బలగాలు (స్పెషల్ పోలీస్) రావడానికి తీవ్ర జాప్యం జరిగేది. ఈ నేపథ్యంలోనే నల్లమలకు సమీపంలోని మంగళగిరి ప్రాంతంలో 1972 ఆగస్టు 15న 6వ బెటాలియన్‌కు శంఖుస్థాపన చేశారు. ఏపీఎస్పీ 2, 3 బెటాలియన్ల నుంచి 125 మంది (ఒక కంపెనీ) చొప్పున బలగాలను అదే ఏడాది సెప్టెంబర్‌లో ఇక్కడికి తరలించారు. తాడేపల్లి, ఆత్మకూరు, మంగళగిరి స్థానిక సంస్థలతో పాటు అటవీశాఖ (ఫారెస్టు) శాఖకు చెందిన 142.68 ఎకరాలను కేటాయిస్తూ అప్పటి ప్రభుత్వం జీవో 1134 జారీ చేసింది. ఫారెస్టు భూములను కూడా బెటాలియన్ కోసం డీనోటిఫై చేశారు. అటు తరువాత 1029 మంది అధికార, సిబ్బందికి సరిపడే క్వార్టర్స్, శిక్షణ ప్రాంతం, ప్రధాన కార్యాలయంతో 6వ బెటాలియన్ రాష్ట్రంలోనే కీలకంగా మారింది. ఇక్కడే పోలీస్ ఉన్నతాధికారులకు క్వార్టర్స్, కీలక కార్యాలయాల నిర్మాణానికి ఇటీవల ప్రతిపాదనలు కూడా జరిగాయి. ఆ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేశాం.. ప్రభుత్వ నిర్ణయం బాధాకరం మంగళగిరి బెటాలియన్‌లో విధులు నిర్వహించేందుకు వచ్చిన మేము తొలినాళ్లలో పడ్డ కష్టాలు తలుచుకుంటేనే ఒళ్లు జలదరిస్తుంది. అటవీప్రాంతంలో చెట్టు, పుట్టలు, రాళ్లతో ఈ ప్రాంతాన్ని మేము ఉండేందుకు అనుకూలంగా మలుచుకునేందుకు పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. మా కిట్ (బ్యాగ్)లోకి తేళ్లు, పాములు వంటి విషపురుగులు చేరేవి. మంచినీరు కూడా దొరకని ఈ ప్రాంతంలో రాళ్లు, రప్పల్లో విధులు నిర్వర్తించాం. ఎంతో శ్రమ, ఎందరో కృషి ఫలితంగా బెటాలియన్ ఇప్పుడు అన్ని విధాలుగా అనుకూలంగా అభివృద్ధి చెందింది. అటువంటి బెటాలియన్‌ను ప్రయివేటుకు వ్యక్తులకు అప్పగించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం బాధాకరం. – శిరిగిరి గుండయ్య, రిటైర్డ్ ఏఆర్ ఎస్సై -
త్వరలో నూతన ఎన్సీసీ బెటాలియన్లు
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు, అనంతపురం జిల్లాల్లో కొత్తగా ఎన్సీసీ బెటాలియన్లు ప్రారంభించనున్నట్లు ఎన్సీసీ గ్రూప్ హెడ్‌క్వార్టర్స్ ఎయిర్ కమ్‌డోర్, ఏపీ, తెలంగాణా రాష్ట్రాల డిప్యూటీ డైరెక్టర్ జనరల్ పి.మహేశ్వర్ చెప్పారు. సాంవత్సరిక తనిఖీల్లో భాగంగా సోమవారం ఆయన నగరంలోని ఎన్సీసీ క్యాంటీన్‌ను సందర్శించారు. క్యాంటీన్లోని స్టాక్ వివరాలను, వినియోగదారుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోనూ ఎన్సీసీ ట్రూప్‌లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆయన వెంట గ్రూప్ కమాండర్ కల్నల్ పీజీ కృష్ణ, క్యాంటీన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎస్ఎన్ ఐతాల్, మేనేజర్ కేపీ నాయుడు తదితరులు ఉన్నారు. -
జాగా కావలెను
సాక్షి, విజయవాడ : అధికారిక అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని వచ్చేనెల 21వ తేదీన నూతన ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడ నగరంలో నిర్వహించనున్నారు. అయితే, నగరంలో ఎక్కడా పోలీస్ అమరవీరుల స్తూపం లేకపోవడంతో ఏం చేయాలనే దానిపై మల్లగుల్లాలు పడుతున్న అధికారులు తాత్కాలిక స్తూపం ఏర్పాటుపై మొగ్గుచూపి ఆ దిశగా కార్యాచరణ మొదలుపెట్టారు. దీంతోపాటు పోలీస్ బాస్ రంగంలోకి దిగి శాశ్వతంగా అమరవీరుల స్తూపం నిర్మాణానికి అనువైన ప్రాంతాన్ని అన్వేషించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ బాధ్యతలను బెటాలియన్స్ అదనపు డీజీ గౌతమ్ సవాంగ్‌కు అప్పగించారు. దీంతో సవాంగ్ రెండు రోజుల క్రితం విజయవాడ, మంగళగిరి ప్రాంతాల్లో పర్యటించారు. శాశ్వత స్తూపం ఏర్పాటుపై కసరత్తు సాగిస్తూనే విజయవాడలో తాత్కాలిక స్తూపం ఏర్పాటు చేయటానికి సన్నాహాలు మొదలుపెట్టారు. మరోవారం రోజుల వ్యవధిలో విజయవాడలో తాత్కాలిక స్తూపం నిర్మించే ప్రాంతాన్ని ప్రకటించనున్నారు. రాష్ట్ర విభజనకు ముందు వరకు రాష్ట్ర పోలీస్ అమరవీరుల స్తూపం హైదరాబాద్‌లోని గోషామహల్ స్టేడియంలో ఉండేది. దీంతో ప్రభుత్వం ఏటా అక్కడే అధికారిక కార్యక్రమాలు నిర్వహించేది. ఆ కార్యక్రమాలకు ముఖ్యమంత్రి ముఖ్యఅతిథిగా హాజరవుతారు. ఈ క్రమంలో రాష్ట్ర విభజన జరిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగుతుంది. నూతన ఆంధ్రప్రదేశ్‌కు విజయవాడను రాజధానిగా ప్రభుత్వం ప్రకటించింది. విభజన క్రమంలో గోషామహల్ స్టేడియంలోని అమరవీరుల స్తూపం తెలంగాణ రాష్ట్ర కేటగిరీలోకి చేరిపోయింది. దీంతో ఆంధ్రప్రదేశ్ అమరవీరులకు అసలు ప్రస్తుతానికి స్తూపమే లేదు. ఇప్పటివరకు అంత సీరియస్‌గా పట్టించుకోని పోలీస్ శాఖ అమరవీరుల సంస్మరణ దినోత్సవం తేదీ దగ్గర పడటంతో అధికారుల్లో పూర్తిస్థాయి కదలిక మొదలైంది. మంగళగిరి బెటాలియన్‌లో తొలుత శాశ్వత అమరవీరుల సంస్మరణ స్తూపం ఏర్పాటు, స్టేడియం నిర్మాణానికి స్థల లభ్యత ఉందని గుర్తించారు. అయితే, అక్కడ బెటాలియన్ అమరవీరుల స్తూపం ఉండటంతో రాష్ట్ర స్తూపం అక్కడ పెట్టడం సాధ్యంకాదని నిర్ణయించి విజయవాడ నగరంపై దృష్టి సారించారు. విజయవాడను ఇప్పటికే రాజధానిగా ప్రకటించారు కాబట్టి రానున్న రోజుల్లో అన్ని ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు ఇక్కడే జరుగుతాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి కూడా విజయవాడ నుంచి పాలన సాగిస్తానని ప్రకటించిన క్రమంలో విజయవాడలో శాశ్వత స్తూపం, స్టేడియం ఏర్పాటు కోసం స్థల సేకరణపై దృష్టి సారించారు. ఈ క్రమంలో బెటాలియన్స్ డీజీ గౌతమ్ సవాంగ్ విజయవాడలోని ఆంధ్రలయోల కళాశాల ప్రాంగణం, సిదార్థ కళాశాల సెంటర్, ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఎదురుగా ఉన్న పోలీస్ పరేడ్ గ్రౌండ్‌ను పరిశీలించారు. -
పకడ్బందీ ఏర్పాట్లు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: జిల్లాలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణ కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేసేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఛత్తీస్‌గఢ్, ఒరిస్సా రాష్ట్రాలతో దాదాపు 230 కిలోమీటర్ల సుదూర సరిహద్దు ఉన్న జిల్లాకు అదనపు బలగాలు కేటాయించేందుకు అనుమతిచ్చింది. గురువారం హైదరాబాద్‌లో సార్వత్రిక ఎన్నికలపై జరిగిన సమావేశంలో కేంద్ర ఎన్నికల కమిషనర్ నజీమ్, ఉప కమిషనర్ వినోద్జట్సి, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్లాల్లు సమీక్ష నిర్వహించారు. జిల్లా నుంచి కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేశ్, ఎస్పీ ఎ.వి.రంగనాథ్‌లు ఈ సమావేశానికి హాజరుకాగా, శాంతిభద్రతల అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంతో పాటు సరిహద్దు రాష్ట్రాల్లో మావోల ప్రభావం, ఎన్నికల నిర్వహణకు ఎదురయ్యే ఇబ్బందులపై ఎస్పీతో పాటు కలె క్టర్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. దీంతో ఎన్నికల సమయంలో జిల్లాకు నాలుగు బెటాలియన్ల పారా మిలటరీ బలగాలను పంపేందుకు ఎన్నికల కమిషన్ సంసిద్ధత వ్యక్తం చేసింది. దీంతోపాటు అదనంగా గ్రేహౌండ్స్, ఒక హెలికాప్టర్, ఆరు శాటిలైట్ ఫోన్లు కూడా పంపనున్నారు. మన రాష్ట్రంలో ఎన్నికలు జరగకముందే ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికలున్న నేపథ్యంలో అప్పుడు కూడా జిల్లాకు అదనపు బలగాలను పంపాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేయగా...ఎన్నికల కమిషన్ అనుమతించింది . జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థ సరిగా లేదని, మారుమూల ప్రాంతాల్లో గుర్తించిన మొత్తం 55 పోలింగ్స్టేషన్లకు గాను 34 చోట్ల శాటిలైట్ ఫోన్లు లేదా ఎక్కువ సామర్థ్యం గల, అతి ఎక్కువ సామర్థ్యం గల వైర్లెస్ సెట్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. అందులో భాగంగా ఆరు శాటిలైట్ ఫోన్లు జిల్లాకు ఇచ్చేందుకు ఉన్నతాధికారులు అంగీకరించారు. ఈనెల 20లోపు కొత్త ఓటర్ల విచారణ సమావేశంలో భాగంగా కొత్త ఓట్ల కోసం వచ్చిన దరఖాస్తులపై చర్చ జరిగింది. చివరిసారి జిల్లాలో మొత్తం 27వేల మంది కొత్త ఓట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారని, వీరి నివాసానికి సంబంధించిన విచారణను ఈనెల 20లోపు పూర్తి చేస్తామని ఎన్నికల కమిషన్‌కు వివరించినట్టు జిల్లా కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేశ్ ‘సాక్షి’కి చెప్పారు. ఈసారి ఎన్నికలలో జిల్లా నుంచి పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోనున్న 15వేల మంది ఉద్యోగులకు శిక్షణ త్వరలోనే ఇస్తామని, ఈ శిక్షణ కాలంలోనే పకడ్బందీగా వారికి పోస్టల్‌బ్యాలెట్ ప్రక్రియను పూర్తి చేస్తామని ఆయన వెల్లడించారు. అయితే, సమావేశంలో భాగంగా మోడల్ పోలింగ్ స్టేషన్ల ఏర్పాట్లపై చర్చ జరిగినా ఇందుకు సంబంధించిన విధివిధానాలు ఖరారు కానట్లు సమాచారం. ఇలాఉండగా... ఎన్నికల పరిశీలకులుగా ఇతర రాష్ట్ర కేడర్లకు చెందిన ఐఏఎస్ అధికారులు వచ్చే నెల తొమ్మిదిన జిల్లాకు రానున్నారు. ఈసారి పార్లమెంటు స్థానానికి ఒకరు, రెండు అసెంబ్లీ స్థానాలకు ఒకరు చొప్పున పరిశీలకులు రానున్నట్టు సమాచారం.