సాక్షి, అమరావతి: రక్షక భటులు అని గొప్పలు చెప్పుకునే పోలీసుల ఆస్తులకే రక్షణ లేకుండా పోతోంది. పర్యాటకం పేరుతో రూ.4 వేల కోట్ల విలువైన పోలీసు ఆస్తులను ప్రయివేటు వ్యక్తులకు కట్టబెట్టే మరో భారీ స్కెచ్‌కు బీజం పడింది. గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఏపీఎస్‌పీ 6వ బెటాలియన్ ఉన్న ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని గురువారం జరిగిన రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) సమావేశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో జాతీయ రహదారి పక్కన, కొండల నడుమ అన్ని విధాలుగా కీలకంగా ఉన్న బెటాలియన్‌ను వేరొక ప్రాంతానికి తరలించేందుకు నిర్ణయించారు. ఈ ప్రాంతంలోని విలువైన భూముల్లో హోటళ్లు, రిసార్ట్స్ నిర్మించేందుకు ప్రయివేటు వ్యక్తులకు అప్పగించేందుకు రంగం సిద్ధమైంది. ఈ ప్రతిపా దనల వెనుక ‘ప్రభుత్వ పెద్దల’ భారీ స్కెచ్ ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజధాని నేపథ్యంలో మంగళగిరి బెటాలియన్ ఉన్న ప్రాంతానికి అతి చేరువలో జాతీయ రహదారి పక్కనే ఇటీవల భారీ రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలిశాయి. ప్రభుత్వ పెద్దలకు అతి సన్నిహితంగా మెలిగే ఎల్‌ఈపీఎల్ (లింగమనేని), మిడ్‌వాలీ తదితర ప్రముఖ సంస్థలకు చెందిన బహుళ అంతస్తుల (అపార్టుమెంట్) భవనాల నిర్మాణం వేగంగా సాగుతున్నాయి. దాదాపు 28 అంతస్తుల ఎత్తైన భారీ భవన (అపార్టుమెంట్) సముదాయాలకు ఆనుకుని ఉన్న ఏపీఎస్‌పీ బెటాలియన్ భూములపై పెద్దల కన్ను పడింది. టూరిజం సాకుతో మొదట ఆ భూములను స్వాధీనం చేసుకుని ప్రయివేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకే ‘ప్రభుత్వ పెద్దలు’ వ్యూహం రచించారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదురుగా ఉన్న సుమారు రూ.100 కోట్ల విలువైన భూమిలో 72 పోలీస్ క్వార్టర్స్‌ను తొలగించి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం గమనార్హం.
నక్సల్స్ అణచివేతకు ఆవిర్భవించిన బెటాలియన్...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నల్లమల అటవీ ప్రాంతంతో పాటు పలు జిల్లాల్లో విస్తరించిన మావోయిస్టులను అణచివేసేందుకు ఆవిర్భవించిన 6వ బెటాలియన్‌కు 45 ఏళ్ల ఘనచరిత్ర ఉంది. గుంటూరు జిల్లాతో పాటు పలు జిల్లాల్లో విస్తరించిన నల్లమల, తెలంగాణ ప్రాంతంలోని వరంగల్, ఖమ్మం, కరీంనగర్ తదితర జిల్లాల్లో మూవోయిస్టుల తీవ్రత ఉన్న రోజుల్లో కాకినాడ (3వ బెటాలియన్) నుంచి ఆయా ప్రాంతాలకు ప్రత్యేక బలగాలు (స్పెషల్ పోలీస్) రావడానికి తీవ్ర జాప్యం జరిగేది. ఈ నేపథ్యంలోనే నల్లమలకు సమీపంలోని మంగళగిరి ప్రాంతంలో 1972 ఆగస్టు 15న 6వ బెటాలియన్‌కు శంఖుస్థాపన చేశారు. ఏపీఎస్‌పీ 2, 3 బెటాలియన్‌ల నుంచి 125 మంది (ఒక కంపెనీ) చొప్పున బలగాలను అదే ఏడాది సెప్టెంబర్‌లో ఇక్కడికి తరలించారు. తాడేపల్లి, ఆత్మకూరు, మంగళగిరి స్థానిక సంస్థలతో పాటు అటవీశాఖ (ఫారెస్టు) శాఖకు చెందిన 142.68 ఎకరాలను కేటాయిస్తూ అప్పటి ప్రభుత్వం జీవో 1134 జారీ చేసింది. ఫారెస్టు భూములను కూడా బెటాలియన్ కోసం డీనోటిఫై చేశారు. అటు తరువాత 1029 మంది అధికార, సిబ్బందికి సరిపడే క్వార్టర్స్, శిక్షణ ప్రాంతం, ప్రధాన కార్యాలయంతో 6వ బెటాలియన్ రాష్ట్రంలోనే కీలకంగా మారింది. ఇక్కడే పోలీస్ ఉన్నతాధికారులకు క్వార్టర్స్, కీలక కార్యాలయాల నిర్మాణానికి ఇటీవల ప్రతిపాదనలు కూడా జరిగాయి.
కిట్‌లో విషపురుగులు.. రాళ్లపై అవస్థలు: శిరిగిరి గుండయ్య, రిటైర్డ్ ఏఆర్ ఎస్సై
మంగళగిరి బెటాలియన్‌లో విధులు నిర్వహించేందుకు వచ్చిన మేము తొలినాళ్లలో పడ్డ కష్టాలు తలుచుకుంటేనే ఒళ్లు జలదరిస్తుంది. అటవీప్రాంతంలో చెట్టు, పుట్టలు, రాళ్లతో ఈ ప్రాంతాన్ని మేము ఉండేందుకు అనుకూలంగా మలుచుకునేందుకు పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. మా కిట్ (బ్యాగ్)లోకి తేళ్లు, పాములు వంటి విషపురుగులు చేరేవి. మంచినీరు కూడా దొరకని ఈ ప్రాంతంలో రాళ్లు, రప్పల్లో విధులు నిర్వర్తించాం. ఎంతో శ్రమ, ఎందరో కృషి ఫలితంగా బెటాలియన్ ఇప్పుడు అన్ని విధాలుగా అనుకూలంగా అభివృద్ధి చెందింది. అటువంటి బెటాలియన్‌ను ప్రయివేటుకు వ్యక్తులకు అప్పగించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం బాధాకరం.తొలగించి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం గమనార్హం.
నక్సల్స్ అణచివేతకు ఆవిర్భవించిన బెటాలియన్...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నల్లమల అటవీ ప్రాంతంతో పాటు పలు జిల్లాల్లో విస్తరించిన మావోయిస్టులను అణచివేసేందుకు ఆవిర్భవించిన 6వ బెటాలియన్‌కు 45 ఏళ్ల ఘనచరిత్ర ఉంది. గుంటూరు జిల్లాతో పాటు పలు జిల్లాల్లో విస్తరించిన నల్లమల, తెలంగాణ ప్రాంతంలోని వరంగల్, ఖమ్మం, కరీంనగర్ తదితర జిల్లాల్లో మూవోయిస్టుల తీవ్రత ఉన్న రోజుల్లో కాకినాడ (3వ బెటాలియన్) నుంచి ఆయా ప్రాంతాలకు ప్రత్యేక బలగాలు (స్పెషల్ పోలీస్) రావడానికి తీవ్ర జాప్యం జరిగేది. ఈ నేపథ్యంలోనే నల్లమలకు సమీపంలోని మంగళగిరి ప్రాంతంలో 1972 ఆగస్టు 15న 6వ బెటాలియన్‌కు శంఖుస్థాపన చేశారు. ఏపీఎస్‌పీ 2, 3 బెటాలియన్‌ల నుంచి 125 మంది (ఒక కంపెనీ) చొప్పున బలగాలను అదే ఏడాది సెప్టెంబర్‌లో ఇక్కడికి తరలించారు. తాడేపల్లి, ఆత్మకూరు, మంగళగిరి స్థానిక సంస్థలతో పాటు అటవీశాఖ (ఫారెస్టు) శాఖకు చెందిన 142.68 ఎకరాలను కేటాయిస్తూ అప్పటి ప్రభుత్వం జీవో 1134 జారీ చేసింది. ఫారెస్టు భూములను కూడా బెటాలియన్ కోసం డీనోటిఫై చేశారు. అటు తరువాత 1029 మంది అధికార, సిబ్బందికి సరిపడే క్వార్టర్స్, శిక్షణ ప్రాంతం, ప్రధాన కార్యాలయంతో 6వ బెటాలియన్ రాష్ట్రంలోనే కీలకంగా మారింది. ఇక్కడే పోలీస్ ఉన్నతాధికారులకు క్వార్టర్స్, కీలక కార్యాలయాల నిర్మాణానికి ఇటీవల ప్రతిపాదనలు కూడా జరిగాయి.
ఆ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేశాం.. ప్రభుత్వ నిర్ణయం బాధాకరం
మంగళగిరి బెటాలియన్‌లో విధులు నిర్వహించేందుకు వచ్చిన మేము తొలినాళ్లలో పడ్డ కష్టాలు తలుచుకుంటేనే ఒళ్లు జలదరిస్తుంది. అటవీప్రాంతంలో చెట్టు, పుట్టలు, రాళ్లతో ఈ ప్రాంతాన్ని మేము ఉండేందుకు అనుకూలంగా మలుచుకునేందుకు పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. మా కిట్ (బ్యాగ్)లోకి తేళ్లు, పాములు వంటి విషపురుగులు చేరేవి. మంచినీరు కూడా దొరకని ఈ ప్రాంతంలో రాళ్లు, రప్పల్లో విధులు నిర్వర్తించాం. ఎంతో శ్రమ, ఎందరో కృషి ఫలితంగా బెటాలియన్ ఇప్పుడు అన్ని విధాలుగా అనుకూలంగా అభివృద్ధి చెందింది. అటువంటి బెటాలియన్‌ను ప్రయివేటుకు వ్యక్తులకు అప్పగించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం బాధాకరం.
– శిరిగిరి గుండయ్య, రిటైర్డ్ ఏఆర్ ఎస్సై
Comments
Please login to add a commentAdd a comment