BC Corporation loan units
-
రుణం.. అందని ద్రాక్షే!
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: బీసీ కార్పొరేషన్లో రుణాలు అందని ద్రాక్షగా మారాయి. గత రెండేళ్లుగా రుణాల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలే పంపకపోవడం గమనార్హం. 2017–18 సంవత్సరాలకు బీసీ అభ్యర్థుల నుంచి రుణాల కోసం దర ఖాస్తులను ఆహ్వానించింది. దీంతో జిల్లావ్యాప్తంగా మొత్తం 32వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. మొదటి విడతగా రూ.50వేలు వందశాతం «సబ్సిడీ కోసం దరఖాస్తులు చేసుకున్న 86 మందికి అధికారులు రుణాలు మంజూరు చేశారు. మిగతా వారికి కూడా రుణాలు ఇచ్చేందుకు అధికారులు సకరత్తు చేస్తున్నారు. అయితే లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత డొల్లగా మారిందనే విమర్శలున్నాయి. గతంలో జిల్లాస్థాయి కమిటీ లబ్ధిదారులను ఎంపిక చేసేది. ప్రస్తుతం పూర్తిగా మండ ల స్థాయి అధికారులే చేస్తున్నారు. ఎంపీడీఓతో పాటు డీపీడీఓ, బ్యాంకు అధికారులు, రెవెన్యూ అధికారులతో కూడిన కమిటీ ప్రతి గ్రామంలో గ్రామసభ నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉంది. చాలా మండలాల్లో అధికారులు లబ్ధిదారుల ఎంపిక విషయంలో నిబంధనలు పాటించలేదన్న వాదన బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రోజుల తరబడి ఎదురుచూసిన జిల్లాలోని నిరుద్యోగుల ఆశలపై బీసీ కార్పొరేషన్ నీళ్లు చల్లినట్లైంది. అధికారులు తమకు ఇష్టమొచ్చినట్లు ఎంపిక చేశారని, మండల నాయకులు చెప్పిన వారికే రుణాలు ఇచ్చారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. లబ్ధిదారుల ఎంపిక విధానం బీసీ కార్పొరేషన్ వివిధ స్కీంలకు దరఖాస్తు చేసుకున్న వారికి వ్యక్తిగత రుణాలతో పాటు, కార్పొరేషన్ రుణాలు ఇస్తుంది. ముందుగా దరఖాస్తులను అభ్యర్థులు ఆన్లైన్ పద్ధతిలో చేసుకుని అనంతరం, మండల ఎంపీడీఓ కార్యాలయంలో వాటిని సమర్పించాల్సి ఉంటుంది. వీటి ఆధారంగా గ్రామాల వారి వివరాలను సేకరించిన మండల స్థాయి కమిటీ గ్రామాలలో లబ్ధిదారుల ఎంపికను గ్రామసభల ద్వారా ఎంపిక చేస్తుంది. ఇందులో అభ్యర్థులు ఆర్థిక, సామాజిక, వ్యాపారం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. ప్రభుత్వం లబ్ధిదారుల ఎంపికపై నిబంధనలు ప్రత్యేకంగా జారీ చేయలేదు. ఈ క్రమంలో లబ్ధిరులను ఎలా ఎంపిక చేస్తారన్న విషయంలో కూడా స్పష్టత లేకుండా పోయింది. స్థానిక నాయకులు చెప్పిన వారికే రుణాలు జిల్లాలో చాలా మండలాల్లో ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తయ్యిందన్న విషయం దరఖా స్తుదారులకు తెలియదు. గ్రామసభల ద్వారా ఎంపిక చేస్తారన్న విషయం మాత్రమే తెలుసు. సభలు ఎప్పుడు నిర్వహిస్తారో, ఎంపిక ఎలా చేస్తారన్న విషయం స్పష్టత లేదు. ఈ విషయంలో అధికారులు పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహించారన్న ఆరోపణలున్నాయి. స్థానిక నాయకులు చెప్పిన వారినే ఏకపక్షంగా ఎంపిక చేశారని, పూర్తి స్థాయి లో ఏ గ్రామంలో కూడా గ్రామసభలు నిర్వహించలేదని అంటున్నారు. దరఖాస్తుదారులకు అధికారులు మొండిచేయి చూపారని విమర్శిస్తున్నారు. 1,360 మంది లబ్ధిదారులు జిల్లా వ్యాప్తంగా బీసీ కార్పొరేషన్ రుణాల కోసం దరఖాస్తులు చేసుకున్న మొత్తం లబ్ధిదారులు 1,360 మందిని ఎంపిక చేయాలని ప్రభుత్వం జిల్లా అధికారులకు సూచించింది. వివిధ స్కీంల కింద రూ.6.80 కోట్లను కేటాయించింది. ఇందులో రూ. 50వేలు వందశాతం సబ్సిడీ కోసం దరఖాస్తులు చేసుకున్న 86 మందికి అందించేందుకు ప్రభుత్వం రూ.43లక్షలు విడుదల చేసింది. వీటితో పాటు రెండో విడతగా 243 మంది లబ్ధిదారుల కోసం రూ.1.21.50 కోట్లలో బడ్జెట్ కేయించారు. వీటికోసం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తయి జిల్లా అధికారుల వద్దకు ఫైల్ వెళ్లింది. ఈ క్రమంలో మొ త్తం ఇప్పటివరకు 329 మంది లబ్ధిదారులకు రుణా లు ఇచ్చేందుకుప్రక్రియపూర్తయ్యింది.1.031 మంది లబ్ధిదారులకు ఇంకా రుణాలు మంజూరుకావాల్సి ఉంది. దీనికోసం అధికారులు కసరత్తు చేస్తున్నారు. సంఘాల రుణాలపై లేని స్పష్టత వివిధ ఫెడరేషన్ల కింద రూ.50వేల నుంచి రూ.10లక్షల వరకు రుణాల కోసం 32వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో సంఘాలుగా ఏర్పడిన వారూ ఉన్నారు. మొదటి విడతగా కేవలం రూ.50వేలకు మాత్రమే ప్రభుత్వం రుణా లు ఇస్తుంది. ఎక్కువ మొత్తంలో «రుణం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి, సంఘాల తరపున దరఖాస్తు చేసుకున్న వారికి ఎప్పుడు రుణాలు ఇస్తారో అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు. -
బీసీ రుణాలపై వీడని సందిగ్ధత
బీసీ రుణాల పంపిణీ మళ్లీ మొదటికొచ్చింది. నాలుగేళ్లుగా స్వయం ఉపాధి రుణాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు నిరాశే మిగిలే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో రుణాల పంపిణీ ప్రక్రియకు విఘాతం కలిగే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో నాలుగేళ్లుగా ప్రభుత్వం బీసీ సంక్షేమ శాఖకు ఇస్తున్న హామీలు బుట్టదాఖలవుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉద్యోగాలు ఎలాగూ లేవు.. కనీసం స్వయం ఉపాధితో జీవనం గడుపుదామని భావించిన బీసీ వర్గాలకు నిరాశే ఎదురవుతోంది. జిల్లా వ్యాప్తంగా బీసీ సంక్షేమ శాఖకు బీసీలు, ఎంబీసీలు, ఫెడరేషన్ల రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 20 వేలకు చేరుకుంది. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేవలం 100 మందికి రూ.50 వేల చొప్పున 50 లక్షల రుణాలను మంత్రి చేతుల మీదుగా అందజేశారు. మిగతా దరఖాస్తుదారులు తమకు రుణాలు వస్తాయా లేదా అనే మీమాంసలో పడ్డారు. సాక్షి, కరీంనగర్: జనాభాలో సగభాగమున్న బీసీల సమస్యలను పరిష్కరించడమే తమ లక్ష్యమని, బడుగు, బలహీన వర్గాల సమగ్రాభివృద్ధే తమ ధ్యేయమని, కుల వృత్తులకు పెద్దపీట వేస్తామని, సంక్షేమం కోసం ఎన్ని కోట్లయినా వెచ్చించేందుకు వెనుకాడబోమని పదేపదే వేదికలపై వల్లెవేస్తున్న ప్రజాప్రతినిధుల మాటలు నీటిమూటలుగా మారుతున్నాయి. నాలుగేళ్లుగా బీసీ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగ యువతకు ఇచ్చే రుణాల జాడే లేదు. ఫెడరేషన్ల పరిస్థితి అదే తీరు. ఈ ఆర్థిక సంవత్సరం రుణ ప్రణాళిక ఊసేలేదు. దీంతో బడుగులపై ప్రభుత్వం సవతితల్లి ప్రేమ చూపుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాయితీలతో ఆశలు.. ఎన్నడూ లేని విధంగా 2015–16 ఆర్థిక సంవత్సరానికి రుణప్రణాళికలో భారీ రాయితీలను ప్రకటించింది. గతంలో ఇంత భారీ మొత్తం ఇవ్వలేదు. ఇచ్చినా రూ.2 లక్షలు మించి ఇచ్చేవారు కాదు. రాయితీ రుణంలో 50 శాతం మించేది కాదు. ఈసారి ప్రభుత్వం రాయితీ మొత్తాన్ని పెద్ద మొత్తంలో పెంచింది. కేటగిరి 1,2,3 పేరిట ఈ మొత్తాన్ని పెంచినట్లు ప్రకటించింది. కేటగిరి 1 లో రూ.లక్షలోపు రుణం తీసుకుంటే 80 శాతం రాయితీ, రూ.2 నుంచి రూ.4 లక్షల వరకు 60 శాతం, ఆపై 50 శాతం రాయితీ వర్తింపజేసింది. దీంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. ఉమ్మడి జిల్లాలో దరఖాస్తులు వెల్లువెత్తాయి. బీసీ కార్పొరేషన్లో 21,323 దరఖాస్తులు వచ్చాయి. ఫెడరేషన్ రుణాల పరిమితిని పెంచి రాయితీని పెంచారు. రూ.11 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు రాయితీ ప్రకటించారు. దీనికితోడు గౌడ సంఘానికి ప్రత్యేకంగా ఫెడరేషన్ ఏర్పాటు చేశారు. దీంతో పెద్ద సంఖ్యలో ఫెడరేషన్స్ రుణాల కోసం దరఖాస్తులు వచ్చాయి. అందేది ఎప్పుడు..? బీసీ కార్పొరేషన్ ద్వారా 2015–16 సంవత్సరానికి మార్జిన్ మనీ కింద లక్ష్యం 434 యూనిట్లకు రూ.388.80 లక్షలు ఇవ్వగా 418 యూనిట్లకు రూ. 320.78 లక్షలకు మంజూరు ఇచ్చారు. హైదరాబాద్‌లోని బీసీ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం నుంచి 146 యూనిట్లకు రూ.108.64 లక్షల నిధులు మంజూరు కాగా, 272 యూనిట్లకు రూ. 212.06 లక్షలు మంజూరు చేయాల్సి ఉంది. పట్టణ ప్రాంతాల్లో చేతి వృత్తుల వారికి సావిత్రిబాయి పూలే అభ్యుదయ యోజన కింద 128 యూనిట్లకు రూ.121 లక్షలుగా లక్ష్యం నిర్దేశిస్తే 120 యూనిట్లకు రూ.93.40 లక్షలు మంజూరు పత్రాలు జారీ చేశారు. ఇందులో కేంద్ర కార్యాలయం నుంచి 102 యూనిట్లకు రూ.76.25 లక్షల నిధులు లబ్ధిదారుల చేతికి వచ్చాయి. ఇంకా 11 మందికి రూ.12.15 లక్షలు మంజూరు కావాల్సి ఉంది. మొత్తంగా 283 మంది లబ్ధిదారులకు రూ.224.21 లక్షల నిధులు రావాల్సి ఉంది. ఫెడరేషన్ల పరిస్థితీ అంతే.. జిల్లాలో వివిధ సామాజిక ఫెడరేషన్లలో 37 యూనిట్లకు రూ.432.50 లక్షలు మంజూరు ఇస్తే ఇప్పటివరకు 14 ఫెడరేషన్ యూనిట్ల కు రూ.168 లక్షలు మాత్రమే మంజూరు చే శారు. ఇంకా 23 ఫెడరేషన్లకు రూ.264.50 లక్షలు ఇవ్వాల్సి ఉంది. దీంతో ఫెడరేషన్ల సభ్యులు రుణాలకు ఎదురుచూస్తున్నారు. కమ్ముకున్న నీలినీడలు.. 2015–16, 2016–17 సంవత్సరాలకు మంజూరు చేసిన రుణాలకే రాయితీలు రాక లబ్ధిదారులు బ్యాంకులు, బీసీ అభివృద్ధి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. మరోవైపు 2017–18 ఆర్థిక సంవత్సరం ముగిసిపోయింది. ప్రస్తుతం 2018–19 ఆర్థిక సంవత్సరం ప్రారంభమై ఆరు నెలలు గడిచిపోతోంది. అయినా.. ఇప్పటివరకు పాత రుణాల జాడలేదు. కొత్త రుణాలకు సంబంధించిన ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా బీసీ, ఎంబీసీలకు, ఫెడరేషన్లకు మూడు కేటగిరీలలో 100 మందిని ఎంపిక చేసి ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున 50 లక్షలు మంత్రి చేతుల మీదుగా అందజేశారు. మరో 20 వేల పైచిలుకు మంది దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులు మళ్లీ రుణాలు ఇస్తారో లేదో అనే సందేహంలో పడ్డారు. ఇప్పటికే స్టెప్‌కార్ ద్వారా ఇచ్చే రుణాలను ఎత్తివేసిన ప్రభుత్వం రాబోయే రోజుల్లో బీసీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చే రుణాలకు మంగళం పాడుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏడాదిన్నరగా ఎదురుచూస్తున్నా.. రూ.2 లక్షలు రుణం మంజూరు చేసి ఏడాదిన్నర గడుస్తోంది. ఇప్పటివరకు రుణం డబ్బులు బ్యాంకులో వేయలేదు. బ్యాంకుకు వెళ్లి అడిగితే ప్రభుత్వం ఇవ్వలేదని అంటున్నారు. బీసీ కార్పొరేషన్ అధికారుల వద్దకు వెళ్తే నేరుగా మీ ఖాతాకే లోన్ మొత్తం వస్తుందంటున్నారు. రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు లోన్ జాడే లేదు. – నాగవెల్లి లక్ష్మీనారాయణ, లబ్ధిదారుడు బీసీలను విస్మరించడం బాధాకరం.. జనాభాలో సగభాగమున్న బీసీలను దగా చేయడం బాధాకరం. భారీ రాయితీలు ప్రకటించి నిరుద్యోగులకు ఆశలు కల్పించి రుణాలు మంజూరు చేయకుండా కాలయాపన చేయడం బీసీల మనోభావాలను దెబ్బతీయడమే. నాలుగేళ్ల అనంతరం కేవలం 50 వేల చొప్పున రుణం ఇవ్వడం సరికాదు. – కేశిపెద్ది శ్రీధర్‌రాజు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రభుత్వ ఆదేశాల మేరకే.. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. గ్రామసభలు, మున్సిపల్ వార్డు సభల ద్వారా ఎంపికై ఎంపీడీవోలు, మున్సిపల్ చైర్మన్ల ద్వారా వంద మందిని ఎంపిక చేశాం. ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున 50 లక్షలు అందించాం. మిగితా దరఖాస్తుదారులకు సంబంధించి బడ్జెట్ త్వరలోనే వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాగానే పంపిణీ చేస్తాం. – రంగారెడ్డి, బీసీ సంక్షేమ శాఖ అధికారి -
బీసీ కార్పొరేషన్‌కు అరకొర నిధులు
బీసీ నిరుద్యోగులకు రుణాల విషయంలో ఊరించి ఊసురుమనిపించినట్లుంది ప్రభుత్వ తీరు. బీసీ కార్పొరేషన్, వివిధ కుల వృత్తుల ఫెడరేషన్ల ద్వారా రాయితీ రుణాలు ఇస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం జిల్లాకు అరకొరగానే నిధులను కేటాయించింది. దీంతో వెనకబడిన తరగతుల వారు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. స్వయం ఉపాధికోసం పెద్ద మొత్తంలో దరఖాస్తులు రాగా ప్రభుత్వం కేటాయించిన నిధులు కొంత మందికే సరిపోతున్నాయి. మోర్తాడ్(బాల్కొండ) : స్వయం ఉపాధి రుణాల కోసం దరఖాస్తులు చేసుకున్న బీసీ నిరుద్యోగులకు నిరాశే ఎదురవుతోంది. ప్రభుత్వం నామమాత్రంగానే నిధులను కేటాయించడంతో కేవలం 13 శాతం మందికి మాత్రమే రాయితీ రుణాలు అం దుతున్నాయి. 2018–19 ఆర్థిక సంవత్సరానికి గాను జూన్, జూలైలో బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు రుణాల కోసం ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్నారు. రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు రుణాల కోసం 4,755, రూ.లక్షకు మించి రుణాల కోసం 8,830 దరఖాస్తులు వచ్చాయి. అయితే ప్రభుత్వం మాత్రం బీసీ కార్పొరేషన్ ద్వారా రూ.50 వేలను వంద శాతం సబ్సిడీపై అందించాలని నిర్ణయించింది. బ్యాంకు లింకేజీతో సంబంధం లేకుండా నూటికి నూరుశాతం రాయి తీని ప్రకటించిన ప్రభుత్వం ఇందు కోసం జిల్లాకు రూ.8 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ నిధులను రూ.50 వేల చొప్పున విభజించి 1,600 మందికి చెక్కుల రూపంలో పంపిణీ చేయాలని నిర్ణయించింది. చిన్న వ్యాపారులకే లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం సూచించడంతో చిన్న వ్యాపారాలను నిర్వహిస్తున్న వారికే రాయితీ సొమ్మును అందిస్తున్నారు. కాగా కేటగిరి 1లో దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే రాయితీ సొమ్మును అందిస్తున్నారు. రూ.లక్ష లోపు రుణాల కోసం దరఖా స్తు చేసుకుంటే అలాంటి వాటిని కేటగిరి 1 అని, రూ.లక్షకు మించి ఎక్కువ రుణం కోరితే అలాంటి దరఖాస్తులను కేటగిరి 2 కింద పరిగణించారు. ప్రస్తుతం ప్రభుత్వం కేటాయించిన నిధులనుకేటగిరి 1 కింద ఉన్న దరఖాస్తులను పరిశీలించి అందులో 1,600 మందిని ఎంపిక చేయగా వంద శాతం రాయితీకి సంబంధించిన రూ.50 వేల చొప్పున చెక్కులను అందించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున కేవలం 100 మందికి మాత్రమే చెక్కులను పంపిణీ చేశారు. ఇంకా 1,500 మందికి మండల స్థాయిలో సబ్సిడీ చెక్కులను పంపిణీ చేయాల్సి ఉంది. కేటగిరి 1 కింద 4,755 మంది దరఖాస్తు చేసుకోగా ఇందులో 1,600 మందికి రాయితీ సొమ్ము పంపిణీ చేయనుండగా మిగిలిన 3,155 మందికి మొండి చెయ్యి చూపనున్నారు. కేటగిరి 2లో ఉన్న దరఖాస్తులకు మాత్రం రుణాల పంపిణీ జరిగే అవకాశం కనిపించడం లేదు. బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా ప్రభుత్వం రాయితీ సొమ్మును ప్రకటించకపోవడంతో బీసీల ఆశలు అడియాసలవుతున్నాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఫెడరేషన్ దరఖాస్తుల ఊసెత్తని ప్రభుత్వం... కుల వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారికి రాయితీ రుణాలను పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఫెడరేషన్ల ఆధ్వర్యంలోనే దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వం సూచించగా ఆయా వృత్తులకు సంబంధించిన వారు త మ కులాల ఫెడరేషన్ల ద్వారా దరఖాస్తులు అం దించారు. విశ్వబ్రహ్మణులు, క్షవరశాలల నిర్వాహకులు, రజకులు, కుమ్మరి, భట్రాజులు, దర్జీ తదితర కుల వృత్తిదారులు తమ ఫెడరేషన్ల ద్వారా దరఖాస్తులను అందించారు. ఫెడరేషన్ల ద్వారా అందిన దరఖాస్తులకు సంబంధించి రుణాల పంపిణీపై ఎలాంటి స్పష్టత లేక పోవడంతో కుల వృత్తులపై ఆధారపడిన వారు ప్రభుత్వం తీరుపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బీసీ కార్పొ రేషన్, ఫెడరేషన్ల ద్వారా రాయితీ రుణాలను అందించడానికి నిధులను ఎక్కువ మొత్తంలో విడుదల చేయాలని పలువురు కోరుతున్నారు. -
అందని ద్రాక్షగా బీసీ రుణాలు
ఒంగోలు టూటౌన్: కొత్తపట్నం మండలం అల్లూరు గ్రామానికి చెందిన దుంపల శ్రీనివాసులు 216–17 ఆర్ధిక సంవత్సరంలో శివ కేశవ సగర ఉప్పుర సొసైటీ కింద జేసీబీ యూనిట్‌కు ఆన్లైన్ దరఖాస్తు చేసుకున్నాడు. రూ.13 లక్షల సబ్సిడీ కాగా రూ.13 బ్యాంకు రుణం కింద మంజూరైంది. బ్యాంకులో నగదు జమైనట్లు అతని సెల్‌కు మెసేజ్ వచ్చింది. బ్యాంకుకు పోతే డబ్బులు రాలేదని అధికారులు తిప్పిపంపుతున్నారు. ఇలా ఒకటిన్నర సంవత్సరంగా బ్యాంకు చుట్టూ, బీసీ కార్పొరేషన్ చుట్టూ రుణం కోసం తిరుగుతూనే ఉన్నాడు. శ్రీనివాసులు లాంటి వారు ఎంతో మంది రుణాల కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. జిల్లాలో రజక ఫెడరేషన్లు 24 ఉండగా వాటిలో సుమారుగా 10 ఫెడరేషన్లకు రుణాలు మంజూరయ్యాయి. ఈ గ్రూపులలో దాదాపు 150 మంది వరకు లబ్ధిదారులు ఉన్నారు. వీరు కూడా 2017–18 ఆర్థిక సంవత్సరంలోనే రుణాలకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటి వరకు ఒక్కరికి కూడా రుణం అందని పరిస్థితి ఉంది. జిల్లాలో బీసీ ఫెడరేషన్లకు రుణాలు అందని ద్రాక్షగా మారింది. రెండేళ్లుగా చాలా మంది లబ్ధిదారులకు రుణాలు అందక అటు బ్యాంకుల చుట్టూ, ఇటు బీసీ కార్పొరేషన్ చుట్టూ ప్రదక్షిణలు చేసే దుస్థితి నెలకొంది. 2016–17 ఆర్ధిక సంవత్సరంలో కొతపట్నం మండలం అల్లూరు గ్రామానికి చెందిన దుంపల శ్రీనివాసరావు మరో 12 మంది సభ్యులతో కలిసి శివ కేశవ సగర ఉప్పర సొసైటీ (ఫెడరేషన్) ఏర్పాటు చేసి, బీసీ కార్పొరేషన్ ద్వారా జేసీబీ యూనిట్‌కు ఆన్లైన్ దరఖాస్తు చేసుకున్నాడు. యూనిట్ మొత్తం విలువ రూ.26 లక్షలు. దీనిలో రూ.13 లక్షలు సబ్సిడీ కాగా, రూ.13 లక్షలు బ్యాంకు రుణంగా మంజూరైంది. రుణం మంజూరుకు బ్యాంకులో రూ.30 లక్షల విలువైన ప్రాపర్టీని హామీగా చూపించారు. ఈ రుణం మంజూరుకు సంబంధించి 2017 డిసెంబర్ 30న చెక్ మంజూరైంది. చెక్ మంజూరు అయినట్లు ఆన్లైన్ మెసెజ్ కూడా లబ్ధిదారుని సెల్‌కు వచ్చింది. బ్యాంకు ఖాతాలో డబ్బులు జమయినట్లు చెక్ నెంబర్‌తో సహా ఆన్లైన్లో చూపిస్తోంది. బ్యాంకుకు పోయి అధికారులను అడిగితే డబ్బులు జమకాలేదని చెబుతున్నారు. దీంతో లబ్ధిదారుడు అయోమయానికి గురయ్యారు. చేసేదేం లేక శివ కేశవ సగర ఉప్పర సొసైటీ ఫెడరేషన్ చైర్మన్ అయిన ఎస్.ఏడుకొండలు దృష్టికి తీసుకెళ్లాడు. వస్తాయి అని చెబుతున్నారే కానీ ఇంతవరకు రుణం అందలేదని బాధితుడు శ్రీనివాసులు ‘సాక్షి’ ముందు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ రుణం కోసం తిరగడానికి వివిధ ఖర్చుల నిమిత్తం దాదాపు లక్ష వరకు సొంత ఖర్చులు అయినట్లు తెలిపాడు. ఇతనే కాకుండా ఇంకొంత మంది లబ్ధిదారులు ఇలానే రుణం కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నారని బీసీ సంఘం నాయకుడు బంకా చిరంజీవి తెలిపారు. రజక ఫెడరేషన్ రుణాలదీ అదే పరిస్థితి అదే విధంగా రజక ఫెడరేషన్లకు సంబంధించిన రుణాలు ఇంత వరకు లబ్ధిదారులకు అందలేదని రజక సంఘం జిల్లా అధ్యక్షుడు కొండయ్య తెలిపారు. జిల్లాలో మొత్తం 24 రజక ఫెడరేషన్లు ఉంటే వాటిలో దాదాపు 10 ఫెడరేషన్ల వరకు రుణాలు మంజూరైనట్లు చెప్పారు. కానీ ఏ ఒక్క ఫెడరేషన్‌కు డబ్బులు చేతికందలేదని తెలిపారు. ఆన్లైన్లో రుణాలు మంజూరైనట్లు చూపిస్తూ ప్రభుత్వమే మోసం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని శ్రీరామ్‌కాలనీ, విజయ నగర్ కాలనీ, ఎన్జీవో కాలనీల్లోని గ్రూపులకు మంజూరు రుణాలు పెండింగ్‌లోనే ఉన్నట్లు తెలిపారు. గత ఏడాది నాగులుప్పలపాడు మండలం కార్యాలయం నుంచి మంజూరైన నగదు వివరాలను స్థానిక బ్యాంకులకు ఆన్లైన్ ద్వారా పంపించనందున దాదాపు రూ.80 లక్షల రుణాలు లబ్ధిదారులకు అందకుండానే మురిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, స్థానిక రాజకీయ నాయకుల వల్ల ఉప్పుగుండూరు, మద్దిరాలపాడు, అమ్మనబ్రోలు గ్రామాలకు చెందిన రజక సంఘాల లబ్ధిదారులు దాదాపు 40 మంది తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. ఫెడరేషన్ల రుణాల మంజూరులో గందరగోళంపై ఇటీవల మీకోసం కూడా జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. అధికారులకు ఇచ్చిన వినతి పత్రాన్ని తిరిగి బీసీ కార్పొరేషన్ ఈడీకే పంపించడం వలన అది బుట్టదాఖలైందని ఆవేదన వ్యక్తం చేశారు. రుణాలు బ్యాంకులో పెండింగ్ పడటానికి కారణం ప్రభుత్వమేనని మండిపడ్డారు. సబ్సిడీ నిధులు విడుదల చేయకుండా, రుణాలు మంజూరైనట్లు ఆన్లైన్లో పురోగతి చూపించడం ఏమిటని ప్రశ్నించారు. ఫెడరేషన్ల రుణాలు లబ్ధిదారులకు అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. -
ముఖ్యమంత్రి ‘కాపు’ కాయలేదు
రూ.60వేలకే పరిమితమైన బీసీ కార్పొరేషన్ రుణయూనిట్లు జన్మభూమి కమిటీల అడ్డంకులతో నేటికి 842మందికే సాయం సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఏరు దాటినంత వరకు ఓడ మల్లన్న..ఏరు దాటాక బోడి మల్లన్న అన్నట్లు ఉంది ప్రభుత్వం పరిస్థితి. అధికారం చేపట్టేందుకు ఇబ్బడిముబ్బడిగా హామీలిచ్చి తీరా అధికారం చేజిక్కాక అందుకు సాయపడిన వారిని కరివేపాకు లా తీసిపారేస్తోంది. కాపులే తమ బలమని, వారి కోసం ప్రభుత్వం ఎంతైనా చేస్తుందని పదేపదే చెబుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆచరణలోకొచ్చేసరికి వారికి ఝలక్ ఇచ్చారు. ఒక్కో రుణ యూనిట్ రూ.2లక్షల విలువతో మంజూరు చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి ఇప్పుడేమో యూనిట్‌ను రూ.60వేలకే పరిమితం చేసి వారి ఆశలపై నీళ్లు చల్లారు. మరోవైపు చంద్రబాబు నియమించిన జన్మభూమి కమిటీలు బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయి. బీసీలకు 5945యూనిట్లు మంజూరు చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నా జన్మభూమి కమిటీల గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో అర్థిక సంవత్సరం ముగియవస్తున్నా వెయ్యి యూనిట్లు కూడా లబ్ధి చేకూర్చే పరిస్థితి లేదు. ఇంకోవైపు బ్యాంకు రుణాలతో మెలిక పెడ్డటం కూడా లబ్ధిదారులకు ప్రతిబంధకంగా మారింది. 50శాతం రుణమిస్తామని, బ్యాంకులు అంగీకరిస్తేనే మిగతా 50శాతం సబ్సిడీ విడుదల చేస్తామని ప్రభుత్వం కొర్రీ పెట్టింది. ఏదో రకంగా ప్రజలను మభ్యపెట్టి, మోసగిస్తూ పబ్బం గడుపుకునే ప్రయత్నమే ప్రభుత్వం చేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రూ. 60వేల లోపే కాపులకు రుణం 2015-2016ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో ఉన్న కాపులకు రూ.50వేల నుంచి రూ. 2లక్షల విలువైన యూనిట్లను మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు జిల్లావ్యాప్తంగా 2462 రుణయూనిట్లు ఇచ్చేందుకు లక్ష్యం పెట్టుకుంది. అయితే, అమల్లోకి వచ్చేసరికి రూ.60వేలకు మించి రుణయూనిట్ ఇచ్చేది లేదని కరాఖండిగా చెబుతోంది. అంతమేరకే బీసీ కార్పొరేషన్‌కు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఇప్పుడా నిధుల విడుదలకు కూడా బ్యాంకు రుణం మెలిక పెట్టింది. 50శాతం మేర బ్యాంకులు రుణమిచ్చేందుకు అంగీకరిస్తేనే మిగతా 50శాతం సబ్సిడీని విడుదల చేస్తామని చెబుతోంది. లేదంటే ఆ రుణ యూనిట్‌ను పెండింగ్‌లో పెడుతోంది. ఈ క్రమంలో బ్యాంకు అనుమతి లేక అనేక మంది రుణ యూనిట్లకు దూరమవుతున్నారు. బీసీలకు అడ్డంకిగా మారిన జన్మభూమి కమిటీలు బీసీలకు జన్మభూమి కమిటీల ద్వారా తీవ్ర అన్యాయం జరుగుతోంది. కమిటీలు పెడుతున్న ఇబ్బందులు పడలేక చాలామంది నిరాశకు లోనవుతున్నారు. జిల్లాలో బీసీలకు 5945యూనిట్లు మంజూరు చేసేందుకు అవకాశం ఉంది. ఈమేరకు ఆన్లైన్లో 10,572దరఖాస్తులొచ్చాయి. వాటిలో అర్హులైన వారిని ఎంపిక చేసి, బీసీ కార్పొరేషన్‌కు నివేదించాల్సిన బాధ్యతను జన్మభూమి కమిటీలకు సర్కార్ అప్పగించింది. జన్మభూమి కమిటీలు టీడీపీ కమిటీలుగానే చెలామణి అవుతున్నాయని సర్వత్రా వినిపిస్తున్న మాట. దాదాపు సభ్యులంతా అధికార పార్టీకి చెందిన వారే కావడంతో అవి కాస్తా పచ్చ కమిటీలుగా మారిపోయాయి. వాళ్లకు నచ్చితే ఎంపిక చేస్తారు. లేదంటే పక్కన పడేస్తారు. పలు కమిటీలు చిలక్కొట్టుడుకు ఆశపడడంతో పరిస్థితి దయనీయంగా తయారైంది. ఈ ఆర్థిక సంవత్సరం మరో నెలతో ముగియనుంది. కానీ ఇప్పటి వరకు 842మందికి సంబంధించిన ఎంపిక జాబితాయే అధికారుల వద్దకు వచ్చింది. వాటికి మాత్రమే రుణమంజూరు ఇచ్చారు. వారికి 50శాతం మేర బ్యాంకు రుణ అనుమతి ఇస్తేనే సబ్సిడీ నిధుల్ని విడుదల చేస్తున్నారు. లేదంటే కొర్రీ పెడుతున్నారు. నిధుల మేరకే యూనిట్లు ప్రభుత్వం కేటాయించిన నిధుల మేరకు కాపులకు యూనిట్లు మంజూరు చేస్తున్నాం. రూ.60వేల లోపే యూనిట్లు కేటాయిస్తున్నాం. జన్మభూమి కమిటీలిచ్చే జాబితా ప్రకారమే బీసీలకు రుణ యూని ట్లు మంజూరు చేస్తున్నాం. బ్యాంకులు 50శాతం రుణం ఇచ్చేందుకు అంగీకరిస్తేనే మిగతా 50శాతం సబ్సిడీ నిధుల్ని విడుదల చేస్తున్నాం. అంతకుమించి చేసేదేమీ లేదు. - ఆర్.వి.నాగరాణి, ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్, బీసీ కార్పొరేషన్