beautiful nature
-
తిరుమలలో సుందర దృశ్యాలు.. మైమరచిపోతున్న భక్తులు
సాక్షి, తిరుమల: జోరు వర్షాలతో ఏడు కొండలు కొత్త శోభను సంతరించుకున్నాయి. తిరుమలలో సుందర దృశ్యాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. దేవ దేవుడు కొలువైన శేషాచలం అందాలు కనువిందు చేస్తుంది. సుకుమారంగా తాకుతున్న మేఘాల డోలికల్లో సప్తగిరులు మునిగి తేలుతున్నాయి. చెక్కిలి గింతలు పెడుతున్న పిల్ల గాలులకు మైమరచి పోతున్నాయి ఏడు కొండలు. తనువంతా పచ్చదనాన్ని నింపుకుని సప్తగిరులు శోభాయమానంగా ప్రకాశిస్తుంది. సుకుమారంగా తాకుతున్న మేఘాలు శ్వేత వర్ణ సొగసులద్దాయి. వెరసి.. కలియుగ దైవం కొలువైన ఏడుకొండలు సప్త పదుల రాగాలు పాడుకుంటున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు సప్తగిరుల అందాలు కనువిందు చేస్తున్బాయి. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులను శేషాచల అందాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అలిపిరి, ఘాట్ రోడ్లలో దృశ్యాలు భక్తులను కట్టిపడేస్తున్నాయి. దీంతో ఫోటోలు, సెల్పీలు తీసుకుంటూ ఆస్వాదిస్తున్నారు. చదవండి: (సూపర్‌స్టార్ కోసం ఒక సీట్ రిజర్వ్.. నవరంగ్ థియేటర్ ఘననివాళి) -
Photo Feature : ప్రకృతి గీసిన మల్లాపూర్ అందాలు
పచ్చని పల్లె ప్రకృతి సోయగం కనువిందు చేస్తోంది. ఏటా శ్రావణమాసంలో మల్లాపూర్ శివారు సోమేశ్వర కొండపైన కొలువుదీరిన శ్రీకనకసోమేశ్వర స్వామిని దర్శించుకు నేందుకు తరలివచ్చే భక్తులు ప్రకృతి అందాలను తిలకిస్తూ పులకించిపోతుంటారు. పచ్చని పొలాలు, గుట్టల మధ్యన ప్రకృతి గీసిన మల్లాపూర్ (పల్లె) అందాన్ని సోమవారం భక్తులు సోమేశ్వర కొండపై నుంచి ఆస్వాదిస్తూ ఆనందించారు. -మల్లాపూర్(కోరుట్ల) -
అద్భుతం: ఇది గ్రాఫిక్ కాదు.. అచ్చంగా ఒరిజినలే!
కొన్ని చూస్తే.. మన కళ్లను మనం నమ్మలేం.. అలాంటిదే ఈ చిత్రం కూడా.. ఇది గ్రాఫిక్ కాదు.. కెమెరా ఎఫెక్ట్ అసలే కాదు.. అచ్చంగా ఒరిజినలే. దక్షిణ ఆస్ట్రేలియాలోని పెనాంగ్‌కు వెళ్తే.. ఈ అద్భుతాన్ని మీరు కూడా చూడవచ్చు. ఇది లేక్ మెక్‌డోనెల్. ఇదో ఉప్పునీటి సరస్సు. ఒకరకమైన నాచు, అలాగే ఒకరకమైన బ్యాక్టీరియా వల్ల దీనికి ఈ రంగు వస్తుంది. ముఖ్యంగా ఈ హాలోబ్యాక్టీరియా ఎర్రరంగు పిగ్మెంట్స్(కణాలు)ను విడుదల చేస్తుంది. అందుకే ఈ సరస్సు ఇలా గులాబీ రంగులో కనిపిస్తుంది. చదవండి: WHO-Covid 19 MU Variant: టీకాలకు లొంగని కోవిడ్ ఎంయూ వేరియంట్! -
అందాల దృశ్య కావ్యం
పార్వతీపురం : కనుచూపు మేరంతా పరచుకున్న పచ్చదనం. కొండకోనల్ని చూస్తుంటే మనసంతా పరవశం. నీలిమబ్బుల సోయగం..అనువణువూ అందమైన దృశ్య కావ్యం. ఆ అందాల సౌరభం ఆస్వాదించాలంటే.. పెదబొండపల్లి గ్రామం వెళ్లాలి. పార్వతీపురం మండలంలోని ఈ గ్రామం ఇటీవలి వర్షాలతో పచ్చదనంతో కనువిందు చేస్తోంది. ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తోంది. -
కళాత్మకం : వర్ణతత్వం!
కొత్త స్వరం అందమైన ప్రకృతి ప్రపంచాన్ని రకరకాల వర్ణాల్లో చూడముచ్చటగా ఆవిష్కరిస్తున్నట్లు అనిపించినా, అలంకారానికి అర్హమైనవిగా అనిపించినా... సీమ చిత్రాల్లో కేవలం అందం, ఆకర్షణ మాత్రమే కాదు జటిలమైన విషయాల మీద వ్యాఖ్యానాలు కనిపిస్తాయి. రంగుల భాషకు తనదైన కొత్త స్వరాన్ని జత చేశారు కోహ్లి. ఎల్లో, రెడ్, గ్రీన్...ఏ రంగు అయితేనేం? ఆమె చేతిలో ఒక కొత్త చూపును ప్రసరిస్తాయి. ఢిల్లీకి చెందిన సీమ కోహ్లి స్త్రీశక్తికి తన కుంచె ద్వారా రకరకాల నిర్వచనాలు ఇవ్వడంలో సిద్ధహస్తురాలు. పెయింటింగ్స్, స్కల్ప్చర్స్, వీడియో ఇన్స్టలేషన్, ఫిల్మ్... ఏమైనా కావచ్చు. మాధ్యమం ఏదైనా కావచ్చు... ఆమె వ్యక్తీకరణలో సరికొత్త కోణం, మరికొంత బలం ఏవో తొంగిచూస్తుంటాయి. ‘‘దైవత్వం అనేది మనలోనే ఉంటుంది. మనలోని రాక్షసత్వం మీద పోరాడుతుంది’’ అని చెబుతున్న కోహ్లి ప్రకృతి నుంచి మనం విడిపడడాన్ని, మిహళాహక్కులను, పర్యావరణ నియమాలను ఉల్లంఘించడమే హక్కు అనుకోవడాన్ని నిరసిస్తారు. సామాజిక వాస్తవాలను చెప్పడానికి మన పురాణాల్లో నుంచి ప్రతీకలు ఎంచుకుంటారు. సమాకాలిన కళాత్మక ధోరణులకు కోహ్లి ఆర్ట్ కాస్త దూరంగా ఉండొచ్చు. కోహ్లి హయ్యెస్ట్ సెల్లింగ్ ఆర్టిస్ట్ కాకపోవచ్చు. అయితే ఆమె ప్రత్యేకతను గుర్తించడంలో ఇవేమీ పరిమితులు కాలేదు. కోహ్లి గీసిన చాలా చిత్రాల్లో యోగినులు ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తారు. వాళ్లు జీవితచక్రాన్ని దర్శిస్తున్నట్లు అనిపిస్తుంది. కోహ్లి చిత్రాల్లో ప్రతి వర్ణానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎరుపు రంగు‘శక్తి’ని, గోల్డ్ కలర్ ‘స్వచ్ఛత’ను సూచిస్తాయి. ‘‘నేను ఉపయోగించి ప్రతి వర్ణానికి ఒక నిర్దిష్టమైన అర్థం ఉంటుంది’’ అంటారు సీమ. కోహ్లి చిత్రాల గురించి స్థూలంగా మాట్లాడుకున్నప్పుడు అవి కోపాన్ని ప్రదర్శించేవి మాత్రమేనా? అగ్రెసివ్ ఫెమినిజం ప్రతిబింబించేవేనా? అనుకుంటే మనం పొరబడినట్లే. నిజంగా చెప్పాలంటే స్త్రీలలో దైవత్వాన్ని, అపారమైన శక్తిని, ప్రకృతిని అవి ఆవిష్కరిస్తాయి.