
సాక్షి, తిరుమల: జోరు వర్షాలతో ఏడు కొండలు కొత్త శోభను సంతరించుకున్నాయి. తిరుమలలో సుందర దృశ్యాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. దేవ దేవుడు కొలువైన శేషాచలం అందాలు కనువిందు చేస్తుంది. సుకుమారంగా తాకుతున్న మేఘాల డోలికల్లో సప్తగిరులు మునిగి తేలుతున్నాయి. చెక్కిలి గింతలు పెడుతున్న పిల్ల గాలులకు మైమరచి పోతున్నాయి ఏడు కొండలు.
తనువంతా పచ్చదనాన్ని నింపుకుని సప్తగిరులు శోభాయమానంగా ప్రకాశిస్తుంది. సుకుమారంగా తాకుతున్న మేఘాలు శ్వేత వర్ణ సొగసులద్దాయి. వెరసి.. కలియుగ దైవం కొలువైన ఏడుకొండలు సప్త పదుల రాగాలు పాడుకుంటున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు సప్తగిరుల అందాలు కనువిందు చేస్తున్బాయి. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులను శేషాచల అందాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అలిపిరి, ఘాట్ రోడ్లలో దృశ్యాలు భక్తులను కట్టిపడేస్తున్నాయి. దీంతో ఫోటోలు, సెల్పీలు తీసుకుంటూ ఆస్వాదిస్తున్నారు.
చదవండి: (సూపర్‌స్టార్ కోసం ఒక సీట్ రిజర్వ్.. నవరంగ్ థియేటర్ ఘననివాళి)
Comments
Please login to add a commentAdd a comment