bee attack
-
తేనెటీగలు పగబట్టాయా?
యశవంతపుర: జలపాతం చూడడానికి వెళుతున్న పర్యాటకులపై తేనెటీగలు దాడులు చేస్తుండటంతో అధికారులు అక్కడ రాకపోకలను బంద్ చేశారు. ఉత్తర కన్నడ జిల్లా యల్లాపుర సమీపంలోని అటవీ ప్రాంతంలో ప్రఖ్యాత సాతోడ్డి జలపాతం వద్ద తేనెటీగల బెడద మొదలైంది. గత రెండు రోజుల నుంచి 30 మందికిపైగా పర్యటకులను తేనెటీగలు కుట్టాయి. ఆదివారం మధ్యాహ్నం జలపాతాన్ని చూడడానికి వచ్చిన నలుగురి మీద దాడి చేయడంతో అస్వస్థతకు గురయ్యారు. వారిని హుబ్లీ ఆస్పత్రికి తరలించి చికిత్సలు అందిస్తున్నారు. వేసవి సెలవులు కావటంతో అనేకమంది తమ పిల్లలను తీసుకొని ఈ సుందరమైన జలపాతానికి వెళుతున్నారు. అయితే ఎప్పుడూ లేని విధంగా తేనెటీగలు చురుగ్గా సంచరిస్తూ ఇబ్బంది పెడుతున్నాయి. అవి కుట్టడం వల్ల అటవీ ప్రాంతంలో సత్వర వైద్యం అందక బాధితులు లబోదిబోమనాల్సి వస్తోంది. -
మ్యాచ్ మధ్యలో తేనెటీగలు.. నెటిజన్ల జోకులు
చెస్టర్ లీ స్ట్రీట్ : ఐసీసీ ప్రపంచకప్‌లో భాగంగా శ్రీలంక-దక్షిణాఫ్రికా మధ్య శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో తేనెటీగలు హల్చల్ చేశాయి. మ్యాచ్ చూడటానికి వచ్చినట్లు మైదానమంతా చుట్టుముట్టాయి. దీంతో ఆటగాళ్లు, అంపైర్లు నేలపై పడుకొని వాటి బారి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ముఖానికి చేతులు అడ్డుపెట్టుకుని తేనెటీగలు కుట్టకుండా జాగ్రత్తపడ్డారు. శ్రీలంక ఇన్నింగ్స్ 48వ ఓవర్లో ఈ అనూహ్య అతిథులు మైదానంలోకి రాగా.. మ్యాచ్‌కు కాసేపు అంతరాయం ఏర్పడింది. వెంటనే మైదాన సిబ్బంది ఫాగింగ్‌తో వాటిని తరిమికొట్టారు. అనంతరం మ్యాచ్ పునఃప్రారంభమైంది. ఇక తేనెటీగల రాకపై నెటిజన్లు కుళ్లు జోకులు పేల్చుతున్నారు. బోరింగ్ మ్యాచ్‌లో తేనెటీగలు ఉల్లాసపరిచాయని ఒకరంటే.. వాటి దెబ్బకు ఆటగాళ్లంతా వణికిపోయారని మరొకరు కామెంట్ చేశారు. ఇంకొందరైతే శ్రీలంక-దక్షిణాఫ్రికా జట్లపై తేనెటీగలు పగబట్టాయో ఏమో.. ఏడాదిలోపే రెండో సారి దాడి చేశాయంటున్నారు. గతేడాది కూడా దక్షిణాఫ్రికా - శ్రీలంక జట్లను తేనెటీగలు భయపెట్టాయి. అప్పుడు కూడా శ్రీలంకనే బ్యాటింగ్ చేస్తుండటం గమనార్హం. దీంతో ఐసీసీ ఆ రెండు ఫొటోలను పక్క పక్కన పెట్టి గతంలో కూడా ఆ రెండు దేశాల మ్యాచ్‌లో తేనెటీగలు అంతరాయం కలిగించాయిని ట్వీట్ చేసింది. ఇక ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 9 వికెట్లతో శ్రీలంకను చిత్తు చేసింది. ఈ గెలుపుతో సఫారీలు టోర్నీ నుంచి పోతూ లంకను కూడా తమ వెంట పెట్టుకుపోతున్నారు. Bees invaded the pitch at the Sri Lanka vs South Africa world cup cricket match forcing players on to the floor. Head to https://t.co/iOm40vn1kt for today's top stories pic.twitter.com/EWH6kUX2Hf — Sky News (@SkyNews) June 28, 2019 చదవండి : లంకను ముంచిన దక్షిణాఫ్రికా! -
తేనెటీగల దాడి.. ఆగిన మ్యాచ్
తిరువనంతపురం : భారత్ ఏ- ఇంగ్లండ్ లయన్స్ మధ్య జరుగుతున్న నాలుగో వన్డేలో అనుకొని సంఘటన.. కలకలం రేపింది. తిరవనంతపురం గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ మైదానం వేదికగా మ్యాచ్ జరగుతుండగా.. ప్రేక్షకులపైకి ఆకస్మాత్తుగా తేనెటీగలు దాడి చేశాయి. దీంతో అభిమానులంతా లబోదిబోమంటూ మైదానం బయటకు పరుగు తీశారు. తేనెటీగల దాడి నుంచి రక్షించుకోవడం కోసం చొక్కాలు విప్పి మరీ పరుగెత్తారు. ఈ అనుకోని ఘటనతో మ్యాచ్ 15 నిమిషాలపాటు నిలిచిపోయింది. సరిగ్గా మ్యాచ్ 28వ ఓవర్లో ఈ ఘటన చోటుచేసుకోగా.. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది. అయితే తేనెటీగల దాడిలో ఆటగాళ్లకు ఎలాంటి గాయాలు కాలేదని, అవి అసలు మైదానంలోకే రాలేదని అధికారులు స్పష్టం చేశారు. కేవలం గ్యాలరీలోని ప్రేక్షకులపై మాత్రమే దాడి చేశాయన్నారు. తేనెటీగల దాడి సమయంలో భారత్-ఏ కోచ్, మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ మైదానంలో నడుస్తున్నాడని, వాటి బారిన పడకుండా పరుగు తీశాడని అధికారులు తెలిపారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు స్పష్టం చేశారు. ఇదో దురృష్టకరమైన ఘటనని, ప్రేక్షకుల కోసం గ్యాలరీలను శుభ్రం చేయించమన్నారు. కానీ కొంత మంది అభిమానులు అత్యుత్సాహంతో తేనెటీగలు దాడి చేశాయన్నారు. ఈ ఘటనతో ప్రేక్షకులను పశ్చిమ దిశ గ్యాలరీ నుంచి తూర్పుదిశకు మార్చమన్నారు. -
పిక్నిక్లో విషాదం
పొందూరు: పిక్నిక్లో పెను విషాదం చోటుచేసుకుంది. పొందూరు మండలం జాడపేటలో తేనెటీగలు దాడి చేసిన ఘటనలో ఓ చిన్నారి మృతి చెందగా ముగ్గురు ఉపాధ్యాయులకు స్వల్ప గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. జాడపేట ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు శనివారం సమీప తోటలో పిక్నిక్ జరుపుకొన్నారు. అందరూ సందడిగా ఉన్న సమయంలో ఒక్కసారిగా తేనెటీగల గుంపు దాడి చేశాయి. అందరూ తలోవైపు పరుగులు తీశారు. అయితే బైరోతు అనూష(2) అనే రెండో తరగతి విద్యార్థిని మాత్రం తేనెటీగల నుంచి తప్పించుకోలేకపోయింది. ఒక్కసారిగా గుంపు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడింది. వెంటనే బాలికను పొందూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు రిఫర్ చేశారు. అక్కడ వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ మృతిచెందింది. తేనెటీగల దాడిలో ముగ్గురు ఉపాధ్యాయులకు సైతం స్వల్ప గాయాలయ్యాయి. విషాదంలో తల్లిదండ్రులు.. బైరోలు అనూష స్వగ్రామం విజయనగరం జిల్లా కురుపాం గ్రామం. తల్లిదండ్రులు లక్ష్మి, సింహాచలం వలస కూలీలు. తోటపని, ఇటుకల పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో కొన్నాళ్లుగా జాడపేటలో ఉంటున్నారు. అనూష ఇటీవలే గుండె జబ్బుతో తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆపరేషన్ చేశారు. ఆరోగ్యం కుదుటపడుతున్న సందర్భంలో తేనెటీగల దాడితో పాప భయభ్రాంతులకు గురై మృతి చెంది ఉండవచ్చునని స్థానికులు అనుమానిస్తున్నారు. రెండు గ్రామాల్లో విషాదం.. పొందూరు మండలంలోని జాడపేట, జి.సిగడాం మండలం వాండ్రంగి గ్రామాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. వాండ్రంగిలో అనూష తాత కంది రమణ, అమ్మమ్మ విజయలక్ష్మి ఉంటున్నారు. మనవరాలు మృతి చెందిందని తెలియడంతో కన్నీరుమున్నీరుగా విలపించారు. ఒక్కగానొక్క కుమార్తె మృతి చెందడంతో తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరివల్లా కాలేదు. కాగా, అనూష చదువుతున్న పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు ప్రగాఢ సంతాపం తెలిపారు. -
అంతిమయాత్రలో విషాదం.. మనవడి మృతి
జైపూర్: అంతిమ సంస్కారాల నిర్వహణలో విషాదం చోటుచేసుకుంది. అంత్యక్రియలు నిర్వహించడానికి వెళ్లిన ఓ కుటుంబసభ్యులపై తేనెటీగలు దాడి జరపగా చనిపోయిన వ్యక్తి మనవడు మృతిచెందాడు. ఈ విషాదఘటన రాజస్థాన్ లోని బరాన్ జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బరాన్ జిల్లాలోని కలోని గ్రామానికి చెందిన వృద్ధుడు జానకీ లాల్ మెహతా మంగళవారం చనిపోయాడు. అయితే, బుధవారం తాత అంత్యక్రియలు నిర్వహించేందుకు మెహతా మనవడు నందకిషోర్(45) కుటుంబసభ్యలు, బంధువులతో కలిసి శ్మశానవాటికకు వెళ్లాడు. అంత్యక్రియలు నిర్వహిస్తున్న సమయంలో దురదృష్టవశాత్తూ తేనెటీగల గుంపు వీరిపై దాడిచేసింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన నందకిషోర్‌ను, మరో గాయపడిన మరో 15 మందిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మెహతా మనవడు నందకిషోర్ మృతిచెందాడు. ఒకరి అంత్యక్రియలకు వెళ్లగా ఇంట్లోని మరో వ్యక్తి మృతిచెందడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. -
తేనెటీగల దాడి : 15 మంది పోలీసులకు గాయాలు
విశాఖపట్నం : విశాఖపట్నం జిల్లా చింతపల్లి మండలం బలపం అటవీ ప్రాంతంలో గురువారం కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులపై తేనెటీగలు ఆకస్మాత్తుగా దాడి చేశాయి. ఈ దాడిలో 15 మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సహచర పోలీసులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. స్థానిక వైద్యులు వారికి ప్రాథమిక చికిత్స అందించారు. ఈ దాడి కారణంగా కూంబింగ్‌ను పోలీసులు తాత్కాలికంగా నిలిపివేశారు. -
తేనెటీగల దాడిలో బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి మృతి
జైనథ్: తేనెటీగల దాడిలో ఓ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి మృతి చెందిన సంఘటన మంగళవారం ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. మండల కేంద్రంలోని బీఎస్ఎన్ఎల్ ఎక్స్ఛేంజ్ కార్యాలయంలో ఎంఏ హమీద్‌ఖాన్ (53) టెలిఫోన్ మెకానిక్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. సంవత్సరకాలంగా కార్యాలయం పైకప్పుకు బయటి భాగం నుంచి తేనెటీగలు తుట్టెలను ఏర్పర్చుకున్నాయి. మంగళవారం విధులకు హాజరైన హమీద్ ఖాన్ మధ్యాహ్న సమయంలో భోజనం ముగించుకుని కార్యాలయంలో సేద తీరుతుండగా తేనెటీగలు దాడి చేశాయి. పక్కనే ఉన్న ఎంపీడీవో, తహసీల్దార్, సొసైటీ కార్యాలయాల వైపు కూడా తేనెటీగలు విజృంభించాయి. తీవ్రంగా గాయపడిన హమీద్‌ఖాన్ అక్కడికక్కడే చనిపోయారు.