జైపూర్: అంతిమ సంస్కారాల నిర్వహణలో విషాదం చోటుచేసుకుంది. అంత్యక్రియలు నిర్వహించడానికి వెళ్లిన ఓ కుటుంబసభ్యులపై తేనెటీగలు దాడి జరపగా చనిపోయిన వ్యక్తి మనవడు మృతిచెందాడు. ఈ విషాదఘటన రాజస్థాన్ లోని బరాన్ జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బరాన్ జిల్లాలోని కలోని గ్రామానికి చెందిన వృద్ధుడు జానకీ లాల్ మెహతా మంగళవారం చనిపోయాడు. అయితే, బుధవారం తాత అంత్యక్రియలు నిర్వహించేందుకు మెహతా మనవడు నందకిషోర్(45) కుటుంబసభ్యలు, బంధువులతో కలిసి శ్మశానవాటికకు వెళ్లాడు.
అంత్యక్రియలు నిర్వహిస్తున్న సమయంలో దురదృష్టవశాత్తూ తేనెటీగల గుంపు వీరిపై దాడిచేసింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన నందకిషోర్ను, మరో గాయపడిన మరో 15 మందిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మెహతా మనవడు నందకిషోర్ మృతిచెందాడు. ఒకరి అంత్యక్రియలకు వెళ్లగా ఇంట్లోని మరో వ్యక్తి మృతిచెందడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
అంతిమయాత్రలో విషాదం.. మనవడి మృతి
Published Wed, Jan 13 2016 4:01 PM | Last Updated on Sun, Sep 3 2017 3:37 PM
Advertisement
Advertisement