జలపాతం వద్ద పర్యాటకులపై దాడులు
ఉత్తర కన్నడ జిల్లాలో వింత ఘటన
యశవంతపుర: జలపాతం చూడడానికి వెళుతున్న పర్యాటకులపై తేనెటీగలు దాడులు చేస్తుండటంతో అధికారులు అక్కడ రాకపోకలను బంద్ చేశారు. ఉత్తర కన్నడ జిల్లా యల్లాపుర సమీపంలోని అటవీ ప్రాంతంలో ప్రఖ్యాత సాతోడ్డి జలపాతం వద్ద తేనెటీగల బెడద మొదలైంది. గత రెండు రోజుల నుంచి 30 మందికిపైగా పర్యటకులను తేనెటీగలు కుట్టాయి. ఆదివారం మధ్యాహ్నం జలపాతాన్ని చూడడానికి వచ్చిన నలుగురి మీద దాడి చేయడంతో అస్వస్థతకు గురయ్యారు.
వారిని హుబ్లీ ఆస్పత్రికి తరలించి చికిత్సలు అందిస్తున్నారు. వేసవి సెలవులు కావటంతో అనేకమంది తమ పిల్లలను తీసుకొని ఈ సుందరమైన జలపాతానికి వెళుతున్నారు. అయితే ఎప్పుడూ లేని విధంగా తేనెటీగలు చురుగ్గా సంచరిస్తూ ఇబ్బంది పెడుతున్నాయి. అవి కుట్టడం వల్ల అటవీ ప్రాంతంలో సత్వర వైద్యం అందక బాధితులు లబోదిబోమనాల్సి వస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment