Beer prices
-
తెలంగాణలో బీర్ ప్రియులకు షాక్.. భారీగా ధరలు పెంపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బీర్ల ధరలు పెరిగాయి. బీరు కంపెనీలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాథమిక ధర (బేసిక్ ప్రైస్)ను, తదనుగుణంగా బీర్ల గరిష్ట చిల్లర ధర (ఎమ్మార్పీ)ను పెంచుతూ ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ధరల నిర్ణాయక కమిటీ (పీఎఫ్సీ) సిఫారసు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే ధరలు ఏ మేరకు పెంచాలన్న దానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. విశ్వసనీయ సమాచార ప్రకారం అన్నిరకాల బ్రాండ్లపై 15% మేర ప్రాథమిక ధర పెంపునకు ప్రభుత్వం అనుమతించింది. అంటే ప్రస్తుతం ఉన్న ఎమ్మార్పీపై 15% మేర పెంచి బీర్లను విక్రయిస్తారన్నమాట. దీని ప్రకారం లైట్ బీరు ధర ప్రస్తుతం ఉన్న రూ.150 నుంచి రూ.180కి పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా స్ట్రాంగ్ బీరు రూ.160 నుంచి రూ.190కి పెరగనుంది. మద్యం ధరల పెంపులో ప్రభుత్వం అనుసరించే రౌండింగ్ అఫ్ పద్ధతి ప్రకారం ధరలు పెరిగే అవకాశం ఉందని ఎక్సైజ్ వర్గాలు వెల్లడించాయి. పాత స్టాకు పాత రేటుకే: ప్రస్తుతం డిపోల్లో ఉన్న బీర్లు, సోమవారం డిపోల నుంచి వైన్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లకు వెళ్లిన బీర్ల ధరలు మంగళవారం నుంచి పెరుగుతాయి. సోమవారం నాటికే వైన్ షాపులకు చేరుకున్న బీర్లను మాత్రం పాత ధరలకే అమ్మాల్సి ఉంటుంది. వాస్తవానికి ధరల పెంపు సమయంలో ప్రతి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఎంత స్టాకు ఉంది అనే వివరాలను తెలుసుకోవడంతో పాటు ధర ఎంత పెరుగుతుంది అనే సమాచారం కూడా క్షేత్రస్థాయి సిబ్బందికి ఎక్సైజ్ శాఖ అందిస్తుంది. కానీ ఈసారి ఉత్తర్వులు అలా రాలేదని, తమను ఎలాంటి స్టాక్ వివరాలు అడగలేదని ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో బీర్ల ధర సరిగ్గా ఎంత పెరుగుతుంది అన్న దానిపై మంగళవారమే స్పష్టత రానుంది. ఇటీవల బేసిక్ ధరల పెంపు, బకాయిల చెల్లింపు విషయంలో ప్రభుత్వ తీరుకు నిరసనగా కింగ్‌ఫిషర్ బ్రాండ్ తయారు చేసే మద్యం కంపెనీ సరఫరా నిలిపివేసింది. అయితే కొద్ది కాలం తర్వాత మళ్లీ పునరుద్ధరించింది. ఈ విధంగా బీర్ల కంపెనీలు చాలాకాలంగా చేస్తున్న డిమాండ్‌ను, ధరల నిర్ణాయక కమిటీ సిఫారసును పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం, బేసిక్ ధర తదనుగుణంగా ఎమ్మార్పీని కూడా పెంచుతూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. -
బీరు ప్రియులపై మరో భారం.. బాటిల్‌పై రూ. 5 నుంచి 10 వరకు పెంపు!.
సాక్షి, బెంగళూరు: రాష్ట్రంలో బీరు ప్రియులపై మరో భారం పడనుంది. త్వరలో రాష్ట్రంలో వాటి ధరలు పెరిగే అవకాశం ఉంది. కొన్నినెలల కింద ప్రభుత్వం మద్యం ధరలను పెంచడం తెలిసిందే. బార్లీ, డీజిల్, పెట్రోల్ రేట్లు అమాంతం పెరగడంతో బీర్ల ధరలు పెంచేందుకు తయారీ కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ఇందుకోసం అబ్కారీ శాఖకు ఆ కంపెనీలు విజ్ఞప్తి చేశాయి. బాటిల్ మీద రూ. 5 నుంచి రూ. 10 మేర పెంచడానికి ఉవ్విళ్లూరుతున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం, బార్లీ కొరత ఈ బీర్ల ధర పెంపునకు రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కూడా ఒక కారణంగా చెబుతున్నారు. బీర్ల తయారీలో అవసరమైన ముఖ్యమైన ముడి పదార్థం బార్లీ. బార్లీ ఎక్కువగా రష్యా, ఉక్రెయిన్ నుంచి దిగుమతి అవుతోంది. ప్రస్తుతం ఆ ఇరు దేశాల మధ్య నెలకొన్న యుద్ధం కారణంగా బార్లీ దిగుమతి క్షీణించినట్లు చెబుతున్నారు. దీంతో బీర్ల తయారీకి ఖర్చు పెరిగిందని ధర పెంచుకోవడానికి నిర్ణయించాయి. ఇప్పటికే మద్యం అధిక ధరల వల్ల మందుబాబుల జేబుకు చిల్లు పడుతోంది. ఇప్పుడు బీర్ల ధరలు పెరిగితే లబోదిబోమనడం ఖాయం. చదవండి: ఆశిష్ మిశ్రాకు సుప్రీంకోర్టు షాక్.. కీలక ఆదేశాలు జారీ -
’బీరు’ బాబులకు శుభవార్త.. ధర తగ్గింది!
సాక్షి, హైదరాబాద్: ‘బీర్’బలులకు శుభవార్త.. ప్రతి బీర్ బాటిల్‌పై రూ.10 స్పెషల్ ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో అన్ని రకాల బీర్లపై ధర రూ.10 తగ్గనుంది, ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ధరలు సోమవారం నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. సోమేశ్ కుమార్‌తో సినీ ప్రముఖుల భేటీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తో టాలీవుడ్ నిర్మాతలు సోమవారం బీఆర్కేఆర్ భవన్లో సమావేశమయ్యారు. కరోనా వల్ల చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. -
వచ్చే నెల నుంచి బీర్ల ధరలు భగ్గు ?
సాక్షి, బెంగళూరు: వేసవి నేపథ్యంలో రాష్ట్రంలో బీర్లకు డిమాండ్ నెలకొంది. దీన్ని ఆసరాగా చేసుకుని వచ్చే నెల 1 నుంచి బీర్ల ధరలను పెంచేందుకు అబ్కారీ ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే కొత్త ధరలను అమలవుతాయి. డిమాండ్ పెరగడంతో మద్యం దుకాణాల్లో బీర్ల ధరలను అనధికారికంగా పెంచి అమ్ముతున్నారు. ఇదే క్రమంలో ప్రభుత్వానికి ప్రతిపాదించిన ధరల ప్రకారం 650 ఎంఎల్ బీర్ బాటిల్ ధర రూ. 10 నుంచి రూ. 20 మేర పెరిగుతుంది. బీర్ ధరల పెంపుపై ఇప్పటికే బడ్జెట్లో ప్రకటన చేశారు. అలాగే గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. మరో మూడు నాలుగు రోజుల్లో బీర్ ధరల పెంపుకు సంబంధించిన కొత్త ధరలను అబ్కారీ శాఖ విడుదల చేయనుంది. ప్రస్తుతం ఉన్న అదనపు ఎక్సైజ్ పన్నును 150 శాతం నుంచి 175 శాతం మేర పెంచనున్నారు. ఈ పెంపు ద్వారా బీర్‌పై రూ. 10 నుంచి రూ.20 మేర ధర పెరిగే అవకాశం ఉంది. అబ్కారీ శాఖ వివరాల ప్రకారం గడిచిన 10 ఏళ్లలో బీర్ల కొనుగోలు ఐదు రెట్లు పెరిగాయి. అబ్కారీ శాఖ ద్వారా ఏడాదికి రూ. 2,400 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వస్తోంది. 2019–20 ఆర్థిక ఏడాదిలో ఆ ఆదాయన్ని రూ. 2,800 కోట్లకు పెంచాలని లక్ష్యంగా చేసుకున్నారు. మద్యంతో ప్రలోభాలకు గురిచేసి ఓట్లను రాబట్టుకునే అవకాశం ఉండడంతో ఎన్నికల సంఘం మద్యం, బీర్ల అమ్మకాలపై గట్టి నిఘా వేసింది. -
బుస్సుమన్న బీరు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బీర్ల ధరలు పెరిగాయి. ప్రతి 650 ఎంఎల్ సీసాపై కనిష్టంగా రూ.10, గరిష్టంగా రూ.20 చొప్పున పెంచుతూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన ధరలో సింహ భాగాన్ని బ్రూవరీల యాజమాన్యాలకే ఇవ్వనున్నారు. ఈ ఉత్తర్వులు వెలువడేందుకు ముందే టీఎస్‌బీసీఏ డిపోల నుంచి స్టాక్ తీసుకున్న మద్యం వ్యాపారులు పాత ధరకే బీర్లు విక్రయించాలని, కొత్త ధరకు విక్రయిస్తే ఎమ్మార్పీ ఉల్లంఘన కేసులు నమోదు చేస్తామని ఎక్సైజ్ కమిషనర్ సోమేశ్‌కుమార్ స్పష్టం చేశారు. నాలుగేళ్లుగా బీర్ల ధరలు పెంచలేదని, బీరు ఉత్పత్తిలో ఉపయోగించే మాల్ట్, ఫ్లేవర్స్, ఇతర ముడి పదార్థాల రేట్లు భారీగా పెరిగిపోవటంతో నష్టపోతు న్నామని, కనీసం ఈసారైనా సీసా బేసిక్ ధరపై 20 శాతం అదనంగా పెంచాలని బ్రూవరీలు డిమాండ్ చేస్తున్నాయి. కంపెనీ యాజమాన్యాల డిమాండ్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం బీర్ల ధరలు పెంచింది. మొత్తం 186 రకాల బ్రాండ్లు సాధారణంగా ఏడాది కాలానికి బీర్లు సరఫరా చేసేందుకు ప్రభుత్వం కంపెనీలతో ఒప్పందం చేసుకుంటుంది. గతేడాది కుదుర్చుకున్న ఒప్పందం ఈ ఏడాది మార్చి 31తో ముగిసింది. ఏప్రిల్ 1 నుంచి కొత్త పాలసీ అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో లైసెన్స్ పునరుద్ధరణ ప్రక్రియ కసరత్తు చేపట్టింది. టెండర్ల ఖరారుతోపాటు బీర్ల బేసిక్ ధర నిర్ణయించేందుకు ప్రభుత్వం రిటైర్డ్ జడ్జి జస్టిస్ గోపాల్‌రెడ్డి నేతృత్వంలో కమిటీ వేసింది. జనవరి మాసంలో టెండర్లు ఆహ్వానించగా.. మొత్తం 186 రకాల బ్రాండ్లను సరఫరా చేయడానికి కంపెనీలు టెండర్లు దాఖలు చేశాయి. వీటిలో 66 బ్రాండ్లు ఇప్పటికే వినియోగంలో ఉండగా.. కొత్తగా 120 బ్రాండ్లకు టెండర్లు దాఖలయ్యాయి. కంపెనీల యాజమాన్యంతో సంప్రదింపులు జరిపిన జస్టిస్ గోపాల్‌రెడ్డి కమిటీ.. బేసిక్ ధరపై 10 శాతం అదనంగా పెంచాలని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలను యథాతథంగా ఆమోదిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం సంతకం చేశారు. ఇక్కడే ఉత్పత్తి అంతర్జాతీయ బ్రాండ్లు అంటే విదేశాల్లోనే తయారు చేసిన మద్యాన్ని ఇక్కడికి తీసుకొచ్చి విక్రయించాలన్న నిబంధన ఏమీ లేదు. ఎక్సైజ్ నిబంధనల ప్రకారం పేటెంట్ పొందిన బీరు తయారీ ఫార్ములాతో స్థానికంగా అందుబాటులో ఉన్న బ్రూవరీల్లో వారి బ్రాండ్ బీరును ఉత్పత్తి చేసుకోవచ్చు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 6 బ్రూవరీలతో (బీర్ల తయారీ పరిశ్రమలు) పలు అంతర్జాతీయ కంపెనీలు ఒప్పందం చేసుకొని బీర్లు ఉత్పత్తి చేశాయి. ఈ సారి టెండర్లలో సోన్ డిస్టిలరీస్, బ్రూవరీస్ మధ్యప్రదేశ్, ఎస్ఎన్జే డిస్టిలరీస్ నెల్లూరు, ఎస్పీఆర్ డిస్టిలరీస్ మైసూర్, ప్రివిలేజ్ ఇండస్ట్రీస్ పుణే, హరియాణా బ్రూవరీస్, సోన బ్రూవరేజెస్ ఛత్తీస్‌గఢ్ ఉన్నాయి. అలాగే రాష్ట్రీయ మార్కెట్లో పెద్ద వాటాదారుగా ఉన్న యూబీ (యునైటెడ్ బ్రూవరేజెస్) మైసూర్, ఔరంగాబాద్, పశ్చిమ బెంగాల్ తదితర ప్రాంతాల నుంచి ఈసారి కొత్తగా టెండర్లు దాఖలయ్యాయి. -
బీరు ధరకు రెక్కలు
సాక్షి, హైదరాబాద్: గత నెలలో మద్యం ధరలు పెంచిన ప్రభుత్వం తాజాగా బీరుపై దృష్టి పెట్టింది. బీరు ధరలు పెరగబోతున్నాయి. కేసు బీరు మీద కనిష్టంగా రూ.45 నుంచి రూ.60 వరకు పెంచనున్నట్లు సమాచారం. ఇందుకు సాధ్యాసాధ్యాల అ మలుకు ముగ్గురు సభ్యుల కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఈ కమిటీకే ధర నిర్ణయ బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయి. పెంచబోతున్న మొత్తంలో పన్నులు పోనూ మిగిలిన సొమ్మును బీరు కంపెనీలకే ఇచ్చేలా కసరత్తులు చేస్తున్నారు. ఇందుకేనా? రాష్ట్రానికి అవసరమైనంత బీరు సరఫరా కోసం ప్రభుత్వం ప్రతి ఏటా బ్రూవరీ కంపెనీలతో ఒప్పందం చేసుకుంటుంది. ఇటీవల మద్యం ధరలు పెంచిన నేపథ్యంలో బీరు ధరలు కూడా పెంచాలని బ్రూవరీస్ యాజమాన్యం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తోంది. ఈ విజ్ఞప్తి పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. ఇక్కడే అధిక వినియోగం రాష్ట్రంలో ప్రస్తుతం 6 బ్రూవరీ (బీరు ఉత్పత్తి పరి శ్రమలు)ల ద్వారా నెలకు 507.91 లక్షల బల్కు లీటర్ల (బీఎల్ఎస్) చొప్పున ఏడాదికి 6,096 బీఎల్ ఎస్‌ల బీరు ఉత్పత్తి అవుతోంది. ఇందులో 5,500 బీఎల్ఎస్లు రాష్ట్రంలోనే వినియోగమవుతోంది. రోజుకు 8 లక్షల మంది 13 లక్షల సీసాల చొప్పున బీర్లు తాగుతున్నట్లు టీఎస్‌బీసీఎల్ నివేదికలు చెబు తున్నాయి. ఈ లెక్కన నెలకు 37.5 లక్షల కేసుల బీర్ల ను మందు బాబులు లాగిస్తున్నారు. ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య 296 లక్షల కేసుల బీర్లు వినియోగ మయ్యాయి. గతేడాది విక్రయాలతో పోలిస్తే ఇది 27% అధికం. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ లాంటి పొరుగు రాష్ట్రాల్లో బీర్ల వినియోగం తెలంగాణలో సగం కూడా లేదు. -
ఏపీలో 15శాతం పెరగనున్న బీరు ధరలు?
-
బీరు ధర రూ. 5 పెంపు
ధరల నిర్ణాయక కమిటీ ఆమోదం అదనంగా రూ.100 కోట్లు ఆదాయం సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో బీరు ధరలు పెరగనున్నాయి. ఒక్కో బీరు ధర ప్రస్తుతం ఉన్నదాని కన్నా రూ.ఐదు వంతున పెంచేందుకు ధరల నిర్ణాయక కమిటీ ఆమోదం తెలిపిందని ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారి తెలిపారు. సంబంధిత ఫైలు ప్రభుత్వానికి చేరింది.ఒక్కో బీరుపై ఐదు రూపాయల చొప్పున పెంచడంతో ఏడాదికి అదనంగా రూ. 100 కోట్లు వస్తాయని అధికారులు తెలిపారు. 2010 సంవత్సరం నుంచి బీరు ధరలు పెంచాలని తయారీ కంపెనీలు కోరుతున్నాయని, ఈ నేపథ్యంలో ఇప్పుడు ధరలు పెంచక తప్పనిసరి పరిస్థితి నెలకొందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇలా ఉండగా రాష్ట్రం విడిపోయిన తరువాత ఏపీలో బీరు, మద్యం కొరత ఏర్పడిందని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. వినియోగానికి, సరఫరాకు మధ్య గత వ్యత్యాసాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉత్పత్తి చేయాలనేది ప్రభుత్వ అభిప్రాయంగా ఉందన్నారు. ప్రస్తుతం మద్యంను తెలంగాణ నుంచి, బీర్లను పాండిచ్చేరి నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అవసరమైన మద్యం, బీర్లను ఉత్పత్తి చేసేందుకు వీలుగా కొత్తగా మద్యం, బీర్లు తయారీ కంపెనీలకు అనుమతించనున్నట్లు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.