Beeruva
-
కూతురు సంసారం చక్కదిద్దాలని.. అందరినీ ఆలయానికి పంపి, తిరిగి వచ్చేసరికి
బనశంకరి: బీరువాలో నిమ్మకాయ పెట్టి నగలు దోచుకెళ్లిన ఉదంతంపై యలహంక పోలీస్‌స్టేషన్‌లో జరిగింది. అళ్లాలసంద్రకు చెందిన ఇందిరా అనే మహిళ కుమార్తె సంసారంలో గొడవలు వచ్చాయి. కుమార్తె పుట్టింటికి వచ్చింది. దీంతో తన కుమార్తె జీవితాన్ని చక్కదిద్దాలని హొసపేట సురేశ్ పాటిల్‌ను ఇందిరా ఆశ్రయించింది. అమావాస్యరోజున అందరినీ ఆలయానికి పంపి బీరువా తెరిచి రూ.5 లక్షల విలువచేసే బంగారు నగలు దోచుకుని బీరువాలో నిమ్మకాయపెట్టి పారిపోయాడు. దీనిపై కేసు నమోదైంది. చదవండి తప్పతాగి పాఠశాలకు వెళ్లి.. ఛీ, విద్యార్థుల ముందే బట్టలు విప్పి... -
నీ చూపే చల్లని చిరుగాలై...
‘బీరువా’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సురభి... ఎక్స్‌ప్రెస్‌రాజా, ఎటాక్, జెంటిల్మెన్... సినిమాలతో సుపరిచితమయ్యారు. తాజాగా ‘ఓటర్’ సినిమాతో ఆకట్టుకున్న సురభి ముచ్చట్లు... నా బలం: పేరెంట్స్ ఇష్టమైన నటి: మాధురీ దీక్షిత్ కష్టమైన పాత్ర: మొదటి సినిమాలో చేసింది. నటి కాకపోయి ఉంటే: కచ్చితంగా నటినే! మరో సందేహమే లేదు!! సమయం దొరికితే: మ్యూజిక్ వింటాను. నెట్‌ఫ్లిక్స్ చూస్తాను. సౌత్‌లో నచ్చిన నటి: అనుష్కా శెట్టి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్: సహనం. నాలో ఓపిక, సహనంలాంటివి చాలా తక్కువ. సినిమాల పుణ్యమా అనే సహనాన్ని అలవర్చుకున్నాను. నచ్చిన డైరెక్టర్లు: ఈ జాబితా చాలా పెద్దది గురూ! ఫ్యాషన్ సెన్స్: సింపుల్‌గా ఉండాలి. బాడీకి సూట్ కావాలి. అతిగా ఉండకూడదు. నచ్చిన ప్రదేశం: గ్రీస్ నచ్చిన గాయని: లతా మంగేష్కర్ నచ్చిన మ్యూజిక్ డైరెక్టర్: ఏఆర్ రెహమాన్ హైదరాబాదీస్: 1. సినిమాలను బాగా ఎంజాయ్ చేస్తారు. 2. భోజనప్రియులు. 3. మంచి మనసున్న మనుషులు బాగా ఆడే ఆట: క్యారమ్స్ బాగా చూసే ఆట: రేసింగ్ గేమ్స్ మ్యూజిక్‌లో ఇష్టపడే జానర్: జాస్ నచ్చే పేరు: లిపిక ఫస్ట్ క్రష్: హృతిక్ రోషన్ నచ్చే పానీయం: స్ట్రాబెర్రీ బలహీనత: నా స్వీట్నెస్? సూపర్ పవర్ ఉంటే?: ఎదుటి వాళ్ల మనసులను చదువుతాను. ఫెవరైట్ స్పైస్: గ్రీన్‌చిల్లీ ఫెవరెట్ టీవీ షో: కపిల్‌శర్మ షో బోధించడానికి ఇష్టపడే సబ్జెక్ట్: సైకాలజీ ఊత పదాలు: సా...ర్, అచ్ఛా చేయాలనుకునే రోల్స్: ఛాలెంజింగ్ రోల్స్ చేయాలని ఉంది. లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్: ఇది వ్యక్తులను బట్టి మారుతుంది. రెండిట్లో ఏది ఉత్తమం అనేదాన్ని పక్కన పెడితే...పెళ్లికి ముందు భాగస్వామి గురించి తెలుసుకోవడం తప్పనిసరి. ఎలాంటి భర్త కావాలి: జెంటిల్మెన్గా ఉండాలి. ప్రతి ఒక్కరినీ గౌరవించాలి. తాను చేసే పనిని గౌరవించాలి. ‘ఆడవాళ్లు వంటింటికే పరిమితం’ అనే భావం ఉండకూడదు. ఇష్టమైనది: ప్రకృతి ఆరాధన. -
తాళం వేసిన ఇంట్లో చోరీ
లక్ష నగదు అపహరణ కామారెడ్డి రూరల్ : మండలంలోని దేవునిపల్లిలో తాళం వేసిన ఇంట్లో దొంగలు పడ్డారు. సంఘటన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన మిర్యాల్కర్ గణేశ్ సోమవారం ఇంటికి తాళం వేసి నిజామాబాద్‌కు వెళ్లారు. దుండగులు ఇంటికి వేసిన తాళాన్ని పగుల గొట్టి ఇంట్లో బీరువాను పగులగొట్టి లక్ష రూపాయలను దోచుకెళ్లారు. మంగళవారం సాయంత్రం నిజామాబాద్ నుంచి తిరిగి వచ్చి చూడగా ఇంట్లో దొంగలు పడ్డట్లు గుర్తించారు. దీంతో గణేశ్ దేవునిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా క్లూస్ టీం వచ్చి దొంగల వేలిముద్రలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు దేవునిపల్లి ఎస్సై సంతోష్‌కుమార్ బుధవారం తెలిపారు. -
బడి.. మృత్యు ఒడి!
♦ తరగతి గదిలో బీరువా మీద పడి విద్యార్థిని దుర్మరణం ♦ ప్రొద్దుటూరు శ్రీవాణి విద్యాలయంలో ఘటన ♦ ప్రజాసంఘాల ఆందోళన ♦ పాఠశాల సీజ్ చేస్తున్నట్లు ప్రకటించిన డీఈఓ భుజానికి పుస్తకాల సంచి తగిలించుకుని మమ్మీ.. టాటా అంటూ ఆ చిన్నారి ముద్దులొలికే మాటలతో అమ్మకు వీడ్కోలు పలుకుతుంటే అవే తన గారాల పట్టి చివరి మాటలు అవుతాయని ఆ మాతృమూర్తి కలలో కూడా ఊహించి ఉండదు. పాఠశాలలో తోటి పిల్లలతో కలిసి సరదాగా ఆడుకుంటున్న ఆ పసిపాప తరగతి గదిలోని బీరువానే తనను మృత్యు ఒడికి చేరుస్తుందని ఏమాత్రం భావించి ఉండదు. ఆడుతు.. పాడుతూ సరదాగా గడిపిన చిన్నారి కొద్ది క్షణాల్లో విగతజీవిగా మారింది. కన్నవారికి కడుపు కోత మిగిలింది. ప్రొద్దుటూరు క్రైం: బడి.. ఆ చిన్నారి పాలిట మృత్యు ఒడిగా మారింది. తరగతి గదిలోని చెక్క బీరువా పసి పాప ప్రాణాలను కబళించింది. కోటి ఆశలతో కన్నబిడ్డను పాఠశాలకు పంపిన ఆ తల్లిదండ్రులకు గర్భశోకం మిగిలింది. ప్రొద్దుటూరు పట్టణం గవిని సర్కిల్లోని శ్రీవాణి ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో జరిగిన ఈ దుర్ఘటనతో తల్లిదండ్రులు ఉలిక్కిపడ్డారు. ప్రొద్దుటూరు మండల పరిధిలోని మూల వారిపల్లె గ్రామానికి చెందిన నరసింహులు బేల్దారి పని చేసుకొని జీవనం సాగించేవాడు. అతనికి విష్ణు అనే కుమారుడు, భార్గవి అనే కుమార్తె ఉన్నారు. వీళ్లిద్దరూ గత ఏడాది వరకూ లింగాపురంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో విద్యను అభ్యసించేవారు. అయితే 15 రోజుల క్రితం పిల్లలిద్దరిని గవిని సర్కిల్ సమీపంలోని శ్రీవాణి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో చేర్పించారు. విష్ణు ఒకటో తరగతి చదువుతుండగా, భార్గవిని ఎల్కేజీలో చేర్పించారు. కాగా మధ్యాహ్నం సమయంలో విద్యార్థులందరూ భోజనం చేశాక నలుగురు విద్యార్థినులు ఆడుకుంటూ ఎల్కేజీ తరగతి గదిలోకి వెళ్లారు. వారు ఆడుకుంటున్న సమయంలో అక్కడే చెక్క బీరువా భార్గవిపై పడింది. పెద్ద శబ్దం రావడంతో పాఠశాల యాజమాన్యంతో పాటు ఉపాధ్యాయులు తరగతి గదిలోకి వెళ్లారు. భార్గవిపై పడిన బీరువాను తొలగించగా చిన్నారి రక్త గాయాలతో స్పృహ కోల్పోయి పడి ఉంది. దీంతో వెంటనే పసిపాపను సమీపంలోని జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించగా పరిశీలించిన వైద్యుడు చనిపోయినట్లు నిర్ధారించారు. తలకు గాయం కావడంతో చిన్నారి మృతి చెందినట్లు ఆయన పేర్కొన్నారు. విషయం తెలియడంతో విద్యార్థిని తల్లిదండ్రులు లక్ష్మీప్రసన్న, నరసింహులు, బంధువులు ఆస్పత్రికి చేరుకొని కన్నీరు మున్నీరుగా విలపించారు. పాఠశాలను సీజ్ చేస్తాం : డీఈఓ ప్రతాపరెడ్డి సమాచారం తెలుసుకున్న జిల్లా విద్యాశాఖ అధికారి ప్రతాపరెడ్డి సంఘటన జరిగిన పాఠశాలను సందర్శించారు. ఆయన లోపలికి రాగానే విద్యార్థి, ప్రజాసంఘాల నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సంఘటన జరగడం చాలా దురదృష్టకర మని డీఈఓ వారిని ఉద్దేశించి అన్నారు. పాఠశాలను వెంటనే సీజ్ చేస్తున్నట్లు ఆయన ప్రక టించారు. మిగతా విద్యార్థులకు ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు వెంటనే తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన ఎంఈఓ క్రిష్టఫర్‌ను ఆదేశించారు. వారి అభిప్రాయాలను తెలుసుకొని ఎలాంటి టీసీలు లేకుండా ఇతర పాఠశాలల్లో చేర్పించే ఏర్పాటు చేస్తామని తెలిపారు. విద్యార్థిని మృతికి కారణమైన క్లాస్‌టీచర్, పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామన్నారు. ఆఫీసు గదిని సీజ్ చేసి, రికార్డులను స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని అందరూ డిమాండ్ చేయడంతో కరస్పాండెంట్లు రమేష్‌రెడ్డి, రహంతుల్లాలను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొని వెళ్లారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బాలస్వామిరెడ్డి తెలిపారు. -
మలుపు ఖాయం!
‘‘ప్రతి విషయంలోనూ ఎంతో శ్రద్ధ తీసుకుని ‘బీరువా’ సినిమా చేశాను. నా మీద ప్రేక్షకులు పెట్టుకున్న నమ్మకాన్ని ఈ సినిమా ఏమాత్రం వమ్ము చేయదు’’ అని సందీప్‌కిషన్ నమ్మకంగా చెబుతున్నారు. కణ్మణి దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన ‘బీరువా’ నేడు ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా ‘సాక్షి’తో సందీప్ ముచ్చటించారు. కేవలం కథను నమ్మి ఈ సినిమా చేశా. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ విజయం తర్వాత నేను ఒప్పుకున్న కథ ఇది. అగ్రనిర్మాణ సంస్థలైన ఉషాకిరణ్ మూవీస్, ఆనంది ఆర్ట్స్ కూడా కథ నచ్చే సంయుక్తంగా ఈ సినిమా నిర్మించాయి. హేమాహేమీలైన ఛోటా కె. నాయుడు, థమన్, గౌతంరాజులు ఈ సినిమాను పెద్ద స్థాయికి తీసుకెళ్లారు. నాక్కూడా సినిమా మీద నమ్మకంతో డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నా. కథలోని కొత్తదనం తెలియాలనే ‘బీరువా’ టైటిల్ పెట్టాం. సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్ లేని ఇల్లు అయినా ఉంటుందేమో కానీ, బీరువా లేని ఇల్లు ఏదీ ఉండదు. ఈ సినిమాలో బీరువా కూడా ఓ కీలకపాత్ర పోషించింది. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’లో రైలు ఎలా కీలకమైందో, ఇందులోని ప్రేమకథకు బీరువా కీలకమన్నమాట. ప్రస్తుతం ‘టైగర్’ సినిమా చేస్తున్నా. ‘బీరువా’, ‘టైగర్’ చిత్రాలు నా కెరీర్‌ని కచ్చితంగా మలుపు తిప్పడం ఖాయం. ఈ రెండు సినిమాల ఫలితాలను బట్టి నా భవిష్యత్ కెరీర్‌ను ఎలా డిజైన్ చేసుకోవాలో నిర్ణయించుకుంటా. -
పంపిణీ రంగంలోకి సందీప్ కిషన్
‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’తో జోరు మీద ఉన్న సందీప్ కిషన్ ప్రస్తుతం ‘బీరువా’, ‘టైగర్’ తదితర చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ‘బీరువా’ ఈ నెల 23న విడుదల కానుంది. ఈ చిత్రంతో ఆయన పంపిణీదారునిగా మారుతున్నారు. ‘‘ఈ సినిమాపై నమ్మకంతో గుంటూరు ఏరియా హక్కుల్ని నా స్నేహితుడు రాజాతో కలిసి తీసుకున్నా. టైటిల్ కార్డు నుంచి శుభం కార్డు వరకూ ఈ ‘బీరువా’ బాగా నవ్విస్తుంది’’ అని సందీప్ కిషన్ తెలిపారు. ఉషాకిరణ్ ఫిలిమ్స్, ఆనంది ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. కణ్మణి దర్శకుడు. రామోజీరావు నిర్మాత. వినోదంతో పాటు ఈ సినిమాలో ఓ కొత్త అంశం ఉందని హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్మీట్లో దర్శకుడు పేర్కొన్నారు. ఈ సమావేశంలో నరేశ్, జెమిని కిరణ్, సుబ్రతో చౌదరి, అనితా చౌదరి, సురభి, గౌతంరాజు తదితరులు మాట్లాడారు.