పంపిణీ రంగంలోకి సందీప్ కిషన్ | Sundeep Kishan distributes his Beeruva | Sakshi
Sakshi News home page

పంపిణీ రంగంలోకి సందీప్ కిషన్

Published Mon, Jan 19 2015 11:22 PM | Last Updated on Sun, Sep 15 2019 12:38 PM

పంపిణీ రంగంలోకి సందీప్ కిషన్ - Sakshi

పంపిణీ రంగంలోకి సందీప్ కిషన్

 ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’తో జోరు మీద ఉన్న సందీప్ కిషన్ ప్రస్తుతం ‘బీరువా’, ‘టైగర్’ తదితర చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ‘బీరువా’ ఈ నెల 23న విడుదల కానుంది. ఈ చిత్రంతో ఆయన పంపిణీదారునిగా మారుతున్నారు. ‘‘ఈ సినిమాపై నమ్మకంతో గుంటూరు ఏరియా హక్కుల్ని నా స్నేహితుడు రాజాతో కలిసి తీసుకున్నా. టైటిల్ కార్డు నుంచి శుభం కార్డు వరకూ ఈ ‘బీరువా’ బాగా నవ్విస్తుంది’’ అని సందీప్ కిషన్ తెలిపారు. ఉషాకిరణ్ ఫిలిమ్స్, ఆనంది ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. కణ్మణి దర్శకుడు. రామోజీరావు నిర్మాత. వినోదంతో పాటు ఈ సినిమాలో ఓ కొత్త అంశం ఉందని హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో దర్శకుడు పేర్కొన్నారు. ఈ సమావేశంలో నరేశ్, జెమిని కిరణ్, సుబ్రతో చౌదరి, అనితా చౌదరి, సురభి, గౌతంరాజు తదితరులు మాట్లాడారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement