begins
-
ఇలా సరిహద్దులకు కాపలాగా ఉంటే ఎలా సార్! అవతల మీరు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయ్!
-
‘హర హర మహాదేవ..’ భక్తి పారవశ్యంలో ప్రయాగ్ రాజ్.. జనసంద్రంగా త్రివేణి సంగమం (చిత్రాలు)
-
రేపటి నుంచి మహాకుంభమేళా.. ఎటు చూసినా కోలాహలం (ఫోటోలు)
-
Hyderabad: పాత బస్తీలో మెట్రోరైలు పనులు షురూ
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీ వాసుల కల నెరవేరే సమయం ఆసన్నమైంది. ఎన్నో ఏళ్ల తర్జనభర్జనలు..ప్రభుత్వ నిర్ణయాల అనంతరం ఇక్కడ మెట్రో రైలు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు చారిత్రక పాతబస్తీలో మెట్రో పనులు మొదలయ్యాయి. మెట్రో రూట్లో రోడ్డు విస్తరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మెట్రో రెండో దశలో భాగంగా ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల మేర మెట్రోరైల్ లైన్ నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఈ రూట్లో పాతబస్తీలో రోడ్డు విస్తరణ, ఆస్తుల సేకరణ పనులను సకాలంలో పూర్తి చేసి మెట్రో నిర్మాణ పనులను పట్టాలెక్కించేందుకు హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌మెట్రో రైల్ కార్యాచరణను వేగవంతం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు పనుల పురోగతిని తెలియజేస్తున్నట్లు హెచ్‌ఏఎంఆర్‌ఎల్ ఎండీ ఎనీ్వఎస్‌రెడ్డి చెప్పారు. సుమారు ఏడున్నర కిలోమీటర్ల నిడివి గల ఎంజీబీఎస్ – చాంద్రాయణగుట్ట మార్గంలో 1100 ఆస్తులను గుర్తించినట్లు పేర్కొన్నారు. ఈ ఆస్తుల సేకరణ పనులు వేగవంతమయ్యాయన్నారు. త్వరలో పరిహారం చెల్లింపు... భూసేకరణ చట్టానికి అనుగుణంగా సేకరించనున్న ఆస్తులకు పరిహారం చెల్లించేందుకు హెచ్ఏఎంఎల్ చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకు గుర్తించిన 1100 ఆస్తులలో 900 ఆస్తులకు సంబంధించిన రిక్విజిషన్ను మెట్రోరైల్ అధికారులు ఇప్పటికే హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌కు అందజేశారు. ఈ మేరకు ఆయన వాటిలో 800 ఆస్తులకు సంబంధించిన ప్రిలిమినరీ నోటిఫికేషన్ వివిద దఫాలుగా విడుదల చేశారు. ఇప్పటి వరకు గుర్తించిన ఆస్తులలో 400 ఆస్తులకు ప్రిలిమినరీ డిక్లరేషన్‌ను కూడా జారీ చేశారు. వాటిలో 200 ఆస్తుల పరిహారానికి సంబంధించిన అవార్డులను ఈ నెలాఖరులోగా ప్రకటించనున్నట్లు ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఆ తర్వాత సేకరించిన వాటికి పరిహారం చెల్లించి కూల్చివేతలు చేపట్టనున్నారు. దీంతో మెట్రో రైలు మార్గ నిర్మాణానికి మార్గం సుగమం కానుంది. ఈ మార్గంలో ఉన్న వివిధ నిర్మాణాలు, ప్రభావిత ఆస్తుల యాజమానులతో సానుకూలంగా చర్చించి, వాటిని భూసేకరణ చట్టం ప్రకారం సేకరించి రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నట్టు ఎండీ వివరించారు. రోడ్డు విస్తరణలోను, మెట్రో నిర్మాణంలోను మతపరమైన, చారిత్రక కట్టడాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా సమర్ధవంతమైన ఇంజినీరింగ్ పరిష్కారాలతో పరిరక్షిస్తుస్తున్నట్లు మరోసారి స్పష్టం చేశారు. పర్యాటకంగా మరింత ఆకర్షణ... మెట్రో రైల్ రాకతో పాత నగరం మరింత ఆకర్షణను సంతరించుకోనుంది. ఇప్పటికే జాతీ య, అంతర్జాతీయ పర్యాటకులు చార్మినార్ సహా పలు ప్రాంతాలను సందర్శించేందుకు పెద్ద ఎత్తున తరలివస్తున్న సంగతి తెలిసిందే. మెట్రో అందుబాటులోకి వస్తే మరింత ఎక్కువ మంది పర్యాటకులు పాతబస్తీని సందర్శించే అవకాశం ఉంది. అటు నగరంలోని ప్రధాన ప్రాంతాల నుంచి, ఇటు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రయాణికులు, పర్యాటకులు ఎలాంటి ఇబ్బంది లేకుండా పాతబస్తీకి రాకపోకలు సాగించనున్నారు. -
ఉజ్జయినిలో శివరాత్రి మహోత్సవాలు ప్రారంభం!
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలోని మహాకాళేశ్వరుని ఆలయంలో నేటి నుంచి (ఫిబ్రవరి 29) శివ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీ మహాకాళేశ్వర స్వామిని అందంగా అలంకరించారు. శ్రీ కోటేశ్వర మహాదేవుని పూజలతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. నేటి (గురువారం) ఉదయం ఎనిమిది గంటల నుంచి కోటేశ్వర మహాదేవునికి శివపంచాయతన పూజ, అభిషేకం జరిగింది. హారతి అనంతరం మహాకాళేశ్వరుని పూజ, అభిషేకం జరిగింది. 11 మంది బ్రాహ్మణులు ఈ పూజలను నిర్వహిస్తున్నారు. వీరు ఈ శివరాత్రి మహోత్సవాలలో ఆలయంలో విశేష పూజలు నిర్వహించనున్నారు. శివరాత్రి మహోత్సవాల సందర్భంగా మహాకాళేశ్వర ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భద్రత, పార్కింగ్, ప్రసాద వితరణ తదితర సదుపాయాల ఏర్పాటుకు సంబంధించి ప్రత్యేక ప్రణాళికను రూపొందించారు. మార్చి 8న జరిగే శివరాత్రి వేడుకల వరకూ ప్రతీరోజూ మహాశివుణ్ణి ప్రత్యేకంగా అలంకరించనున్నామని ఆలయ కమిటీ తెలిపింది. ఈ శివ నవరాత్రుల్లో ఇక్కడ పూజలు నిర్వహించే పండితులు ఉపవాసం పాటించనున్నారు. -
ఆరు రాష్ట్రాల్లో ఉపఎన్నికలు.. కొనసాగుతున్న పోలింగ్
ఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లోని ఏడు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలకు నేడు పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రారంభమైంది. దేశంలో వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇండియా కూటమికి, అధికార బీజేపీకి మధ్య మొదటి పోటీగా ఈ పోలింగ్‌ను రాజకీయ వర్గాలు చూస్తున్నాయి. Bypolls: Voting begins in six states for 7 assembly seats Read @ANI Story | https://t.co/6U9T1V6j1l#bypolls #UP #Tripura #Jharkhand #WestBengal pic.twitter.com/rlxhf6bo5k — ANI Digital (@ani_digital) September 5, 2023 జార్ఖండ్‌లోని డుమ్రి, త్రిపురలోని బోక్సానగర్, మధన్పూర్, ఉత్తరప్రదేశ్‌లోని ఘోసి, ఉత్తరాఖండ్‌లోని బాగేశ్వర్, కేరళలోని పుతుపల్లి, పశ్చిమ బెంగాల్‌లోని ధూప్‌గురి నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. ఈ నెల 8న కౌంటింగ్ నిర్వహించనున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల మరణాల కారణంగా ధూప్‌గురి, పుతుపల్లి, బాగేశ్వర్, డుమ్రీ, బోక్సానగర్‌లలో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఘోసి, ధన్పూర్ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసిన నేపథ్యంలో ఉపఎన్నికలు జరుగుతున్నాయి. సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఎమ్మెల్యే పదవికి దారా సింగ్ చౌహాన్ రాజీనామా చేయడంతో ఉత్తరప్రదేశ్‌లోని ఘోసిలో ఉప ఎన్నికలు వచ్చాయి. ఆయన రాజీనామా తర్వాత బీజేపీలో చేరారు. ఉపఎన్నికలకు ఎస్పీ సుధాకర్ సింగ్‌పై బీజేపీ దారా సింగ్ చౌహాన్‌ను రంగంలోకి దింపింది.దారా సింగ్ చౌహాన్ ఘోసీ నుంచి 2012 నుంచి 2017 వరకు ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ ఆ తర్వాత వరుసగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ తన మిత్రపక్షమైన ఎస్పీకి మద్దతునిస్తోంది. త్రిపురలోని ధన్‌పూర్‌లో బీజేపీ అభ్యర్థి ప్రతిమా భూమిక్ లోక్‌సభ స్థానానికి రాజీనామా చేయడంతో సీటు ఖాలీ అయింది. ప్రస్తుతం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా-మార్క్సిస్ట్ (సీపీఐ-ఎం) అభ్యర్థి కౌశిక్ చందాపై ప్రతిమా భూమిక్ సోదరుడు బిందు దేబ్‌నాథ్‌ను భాజపా బరిలోకి దింపుతోంది. అటు.. ఉమెన్ చాందీ మరణంతో పుతుపల్లి సీటు ఖాళీ కావడంతో ఈరోజు పోలింగ్ జరుగుతోంది. సీపీఎం అభ్యర్థి జైక్ సీ థామస్‌పై కాంగ్రెస్ నేతృత్వంలోని ఫ్రంట్ సీనియర్ నేత తనయుడు చాందీ ఉమెన్ను బరిలోకి దింపింది. ఇదీ చదవండి: కుల విభేదాల్ని మాత్రమే ఖండించా.. ఉదయ్‌నిధి స్టాలిన్ తాజా ప్రకటన -
Rottela Panduga : నెల్లూరులో రొట్టెల పండుగ (ఫొటోలు)
-
అమర్నాథ్ యాత్రకు ఏర్పాట్లు ప్రారంభం
శ్రీనగర్: ఈ ఏడాది జరగబోయే అమర్నాథ్ యాత్రకు సంబంధించి కీలక సమాచారాన్ని వెల్లడించారు కాశ్మీర్ డివిజనల్ కమీషనర్ విజయ్ కుమార్ బిధూరి. జులై 1 నుండి ఆగస్టు 31 వరకు సాగే ఈ యాత్రకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ఏర్పాట్లు షురూ.. రెండు నెలలపాటు జరిగే ఈ యాత్ర ఏర్పాట్ల విషయమై శ్రీనగర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కాశ్మీర్ డివిజనల్ కమీషనర్ మాట్లాడుతూ.. ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర జులై 1న ప్రారంభమై 62 రోజులపాటు కొనసాగి ఆగస్టు 31న ముగుస్తుంది. దేశవిదేశాల నుండి వచ్చే భక్తులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండే యాత్ర ఆద్యంతం వారికి సౌకర్యాలు కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. దారి పొడవునా సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తున్నాము. క్యాంపుల సామర్ధ్యాన్ని పెంచి ఒక్కోచోట సుమారు 75000 మందికి పైగా భక్తులకు వసతి సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయనున్నాము. వ్యర్ధాలను తొలగించడానికి ప్రతి క్యాంపులోనూ అంతర్గతంగా నిర్మించిన వ్యవస్థలను ఏర్పాటు చేశాము. ఈ ఏడాది అమర్నాథ్ యాత్రకు సుమారు 8-9 లక్షల మంది హాజరయ్యే అవకాశముందన్నారు. హోంమంత్రి అమిత్ షా పర్యవేక్షణలో.. రిజర్వేషన్ కౌంటర్లు, తత్కాల్ రిజర్వేషన్లు, సాంకేతిక సదుపాయాలు, వైఫై, విద్యుత్తు, మంచి నీటి సౌకర్యాలు, పారిశుధ్యం, పరిశుభ్రత, వైద్య సదుపాయాలు తదితర ఏర్పాట్లన్నిటినీ జమ్మూ డిప్యూటీ కమీషనర్ అవ్ని లవాస పర్యవేక్షణలో జరుగుతున్నాయని, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎప్పటికప్పుడు ఏర్పాట్లను సమీక్షిస్తున్నారని ఆయన తెలిపారు. జీవితంలో ఒక్కసారైనా.. ప్రతీ ఏటా వైభవోపేతంగా జరిగే అమర్నాథ్ యాత్రకు దేశవిదేశాల నుంచి లక్షల్లో భక్తులు హాజరవుతూ ఉంటారు. హిమాలయాల నడుమ కోలాహలంగా జరిగే ఈ యాత్రకు జీవితంలో ఒక్కసారైనా వెళ్లి శివనామస్మరణ చేసి తరించాలనుకుంటారు భక్తులు. వచ్చే నెలలో ప్రారంభమయ్యే ఈ యాత్రకు ఈ ఏడాది కూడా అత్యధిక సంఖ్యలో భక్తులు పోటెత్తుతారని అంచనా. ఇది కూడా చదవండి: కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై.. సచిన్ పైలట్ కొత్త పార్టీ? -
చార్ధామ్ యాత్ర ప్రారంభం
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉత్తరకాశీ జిల్లాలోని గంగోత్రి, యమునోత్రి ఆలయాలు ఆరు నెలల అనంతరం తిరిగి తెరుచుకోవడంతో చార్ధామ్ యాత్ర మొదలైంది. గంగోత్రి ఆలయ తలుపులను శనివారం మధ్యాహ్నం 12.35 గంటలకు, యమునోత్రి గుడిని 12.41 గంటలకు ఆలయ కమిటీ సభ్యులు తెరిచారు. ఈ సందర్భంగా గంగోత్రి ఆలయంలో, యమునా దేవత శీతాకాల నివాసమైన ఖర్సాలీలో కూడా ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామి పూజలు చేశారు. అనంతరం యమునా దేవిని అందంగా అలంకరించిన పల్లకీలో ఊరేగింపుగా యమునోత్రికి తీసుకువచ్చారు. చార్ధామ్ యాత్రకు ఇప్పటికే 16 లక్షల మంది యాత్రికులు పేర్లను నమోదు చేసుకున్నారు. ఈనెల 25న కేదార్నాథ్, 27న బదరీనాథ్ ఆలయాలు తిరిగి తెరుచుకోనున్నాయి. హిమాలయాల్లోని ఈ నాలుగు పుణ్యక్షేత్రాల్లో రోజువారీ భక్తుల సందర్శనపై పరిమితం విధించాలన్న ప్రతిపాదనను విరమించుకున్నట్లు సీఎం ధామి ప్రకటించారు. -
భవాని దీక్షలు మొదటి రోజు: ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భవానీలు (ఫొటోలు)
-
మేడారం గద్దెపైకి సారలమ్మ.. చిలకలగుట్ట నుంచి సమ్మక్క
మేడారం నుంచి సాక్షి ప్రతినిధి, వరంగల్: తెలంగాణ కుంభమేళా, ఆసియా ఖండంలో అతిపెద్ద ఆదివాసీ జాతర బుధవారం ఘనంగా ప్రారంభమైంది. కోరిన కోరికలు తీర్చే వన దేవత సారలమ్మ బుధవారం రాత్రి మేడారం గద్దెపై కొలువుదీరింది. తొలుత కన్నెపల్లి నుంచి మేడారంలో ఉన్న కన్నతల్లి సమ్మక్క చెంతకు సారలమ్మ చేరుకుంది. రాత్రి 10.45 గంటలకు గద్దెలపైకి వచ్చింది. సారలమ్మతోపాటే గంగారం మండలం పూనుగొండ నుంచి పగిడిద్దరాజు, ఏటూరునాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజు గద్దెలపైకి చేరారు. ముగ్గురి రాకతో మేడారం వన జాతర వైభవంగా మొదలైంది. కన్నెపల్లి నుంచి మేడారానికి సారలమ్మ బుధవారం సాయంత్రం 4 గంటలకు కన్నెపల్లిలో సారలమ్మ పూజారులు కాక సారయ్య, కాక కిరణ్, కాక వెంకటేశ్వర్లు, కాక కనకమ్మ, కాక భుజంగరావు పూజా క్రతువులు ప్రారంభించారు. 7 గంటల వర కు వాయిద్యాలు, నృత్యాలతో కన్నెపల్లి ఆలయం మార్మోగిపోయింది. అనంతరం ఆలయం నుంచి రాత్రి 7.09 గంటలకు మొంటె (వెదురు బుట్ట)లో అమ్మవారి ప్రతిరూపమైన పసుపు, కుంకుమలు తీసుకుని మేడారానికి పూజారులు బయలుదేరారు. మార్గమధ్యలో జంపన్నవాగులో ప్రత్యేక పూజలు చేశారు. వంతెన ఉన్నా నీటిలో నుంచే నడుస్తూ వాగును దాటారు. అక్కడి నుంచి మేడారంలోని సమ్మక్క గుడికి చేరుకున్నారు. పగిడిద్దరాజు, గోవిందరాజులు అప్పటికే అక్కడికి చేరుకున్నారు. ఆదివాసీ గిరిజన సాంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహించిన తర్వాత పూజారులు ముగ్గురి రూపాలను గద్దెలపైన ప్రతిష్టించారు.పగిడిద్ద రాజు రాత్రి 10.40కి, గోవిందరాజు 10.42కు, సారలమ్మ 10.45 గంటలకు గద్దెలపై కొలువుదీరారు. సంతాన భాగ్యం కోసం ‘వరం’పట్టిన భక్తులు సారలమ్మ ప్రధాన పూజారి కాక సారయ్య అమ్మవారి ప్రతిమను మొంటె (వెదురు బుట్ట)లో తీసుకొని కన్నెపల్లి ఆలయం మెట్లు దిగి ముందుకు కదులుతుండగా సంతాన భాగ్యం కోసం ఎదురు చూసే భక్తులు గుడి ముందు కింద పడుకుని పొర్లు దండాలతో వరం పట్టారు. సారలమ్మను తీసుకువస్తున్న పూజారులు వీరిపై దాటి వెళ్లారు. సోలం వెంకటేశ్వర్లు పట్టిన హనుమాన్ జెండా నీడలో కన్నెపల్లి వెన్నెలమ్మగా పేరున్న సారలమ్మ గద్దెలపైకి చేరారు. అడిషనల్ ఎస్పీ మురళీధర్, డీఎస్పీలు కొత్త దేవేందర్‌రెడ్డి, విష్ణుమూర్తి, రోప్ పార్టీ ఓఎస్డీ సంజీవ్‌రావు, పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలు మూడంచెల రోప్ పార్టీతో భద్రత కల్పించారు. ప్రభుత్వం తరఫున ములుగు జిల్లా కలెక్టర్, ఇన్చార్జి పీవో కృష్ణ ఆదిత్య హాజరయ్యారు. ఎదురెళ్లి దండాలు పెడుతూ.. మేడారానికి బుధవారం మధ్యాహ్నం వరకు భక్తుల తాకిడి మామూలుగానే ఉన్నా సాయంత్రం 4 గంటల నుంచి ఒక్కసారిగా జనం పోటెత్తారు. కన్నెపల్లి నుంచి 4 కిలోమీటర్ల దూరంలోని మేడారం గద్దెల వద్దకు సారలమ్మను తీసుకొచ్చే అద్భుత సన్నివేశాన్ని కనులారా చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సారలమ్మ గద్దెలకు రాకను సూచిస్తూ ఆదివాసీ పూజారులు కొమ్ము బూరలు ఊదగా భక్తులు దారి పొడవునా ఇరువైపులా ఎదురెళ్లి దండాలు పెట్టారు. ప్రత్యేక డోలు వాయిద్యాలు, శివసత్తుల పూనకాలు, హిజ్రాల శివాలతో కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయం పరవశించింది. ఎమ్మెల్యే సీతక్క తదితరులు కన్నెపల్లిలో సారలమ్మ ఆలయం వద్ద ఆదివాసీ నృత్యం చేశారు. భారీగా జనం.. కిక్కిరిసిన వనం సారలమ్మ, పగిడిద్దరాజు, గోవింద రాజు ప్రతిమలు గద్దెలపైకి చేరుకోవ డంతో లక్షలాదిగా భక్తులు తరలివస్తున్నారు. దీంతో మేడారం నలువైపులా కిలోమీటర్ల పొడవునా వాహనాలు, గుడారాలతో కిక్కిరిసిపోయింది. కన్నెపల్లి, రెడ్డిగూడెం, జంపన్నవాగు, కొత్తూరు, నార్లాపూర్ పరిసర ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. భక్తుల పుణ్య స్నానాలతో జంపన్న వాగు నిండిపోయింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
Medaram Jatara 2022: మేడారం జాతర ప్రారంభం... భక్తులతో కిటకిటలాడుతున్న వనం (ఫోటోలు)
-
Nagoba Jatara: ఆదివాసీ సంస్కృతికి అద్దంపట్టేలా జాతర షురూ..
-
ఏపీలో ప్రారంభమైన రాత్రి కర్ఫ్యూ: రోడ్లన్నీ వెలవెల
సాక్షి, అమరావతి: మహమ్మారి కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో రాత్రి కర్ఫ్యూ శనివారం ప్రారంభమైంది. రాత్రి పది గంటలకు రాష్ట్రవ్యాప్తంగా కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. కర్ఫ్యూ అమల్లోకి రావడంతో రోడ్లన్నీ వెలవెలబోయాయి. వాహనదారులు, ప్రజల ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ కర్ఫ్యూను పోలీసులు పక్కాగా అమలయ్యేలా చర్యలు చేపట్టారు. పలుచోట్ల పోలీస్ అధికారులు తనిఖీలు చేపట్టారు. అనవసరంగా బయటకు వచ్చిన వాహనదారులు, ప్రజలను ప్రశ్నించారు. విశాఖపట్టణం, విజయవాడ, విజయనగరం, రాజమండ్రి, కాకినాడ, కర్నూలు, వైఎస్సార్ కడప, అనంతపురము, కృష్ణా, విజయనగరం, శ్రీకాకుళం, చిత్తూరు కర్ఫ్యూను పోలీస్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. కర్ఫ్యూ నుంచి అత్యవసర సేవలకు మినహాయింపు ఇచ్చారు. విశాఖపట్టణంలో రద్దీగా ఉండే ఆర్కే బీచ్, జగదాంబ జంక్షన్, ఆర్టీసీ కాంప్లెక్స్ రైల్వే స్టేషన్ పరిసరాలు నిర్మానుష్యంగా మారాయి. నగరంలో 23 పోలీస్ సబ్ కంట్రోల్ రూమ్... పెట్రోలింగ్ పార్టీలతో పాటు అదనపు బలగాలతో కర్ఫ్యూ ఆంక్షలు అమలు చేస్తున్నారు. అన్ని దుకాణాలు మూసివేసి సహకరించాల్సిందిగా చిత్తూరు ఎస్పీ వెంకట అప్పలనాయుడు వ్యాపారులను విజ్ఞప్తి చేశారు. విజయవాడలో.. విజయవాడ: బందరు రోడ్ పీవీపీ మాల్ వద్ద నైట్ కర్వ్యూను విజయవాడ పోలీస్ కమీషనర్ బత్తిన శ్రీనివాసులు పర్యవేక్షించారు. అత్యవసర సేవలకు మినహాయింపునిచ్చినట్లు తెలిపారు. కర్ఫ్యూకు విజయవాడ నగర ప్రజలు సహకరించాలని కోరారు. 70 పికెట్స్, 62 బీట్స్ ద్వారా రాత్రి పూట కర్వ్యూను పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు. మొదటి రెండు రోజులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. శ్రీకాకుళంలో తనిఖీలు చేస్తున్న పోలీసులు శ్రీకాకుళం రోడ్డులో బోసిపోయిన ఓ కూడలి -
రంజాన్ ఉపవాసాలు ప్రారంభం
-
ప్రారంభమైన సమ్మక్క–సారలమ్మ జాతర
వెంకటాపురం(కె): మండల పరిధిలోని బీసీ మర్రిగూడెం పంచాయతీలోని రంగరాజాపురం కాలనీలో శ్రీ సమ్మక్క, సారలమ్మ జాతర బుధవారం వైభవంగా ప్రారంభమైంది. బుధవారం సాయంత్రం అమ్మవార్లను పులి వాహనంపై మండల కేంద్రంలో ఊరేగించారు. అమ్మవారి జాతరను తిలకించేందుకు వెంకటాపురం, వాజేడు మండలాల నుంచే కాకుండా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి భక్తులు తరలివచ్చారు. ఘనంగా తిరుగువారం పండుగ ములుగు రూరల్: మండంలొని పొట్లాపురంలో నూతనంగా వెలిసిన శ్రీ సమ్మక్క–సారలమ్మ మినీ జాతర సందర్భంగా పలు గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ మేరకు తిరుగువారం పండుగను పూజారులు, గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. తిరుగువారం సందర్భంగా పూజారులు అమ్మవార్లకు చీరసారెలు, పసుపు, కుంకుమలు సమర్పించి, యాటపోతులను బలిచ్చారు. సర్పంచ్ కుమ్మిత లతఅంకిరెడ్డి అమ్మవార్లకు పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఈసం పాపయ్య, వార్డు సభ్యురాలు కవితయుగేంధర్, లక్ష్మీనారాయణ, రఘు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
తెలుగు రాష్టాల్లో పాక్షిక సూర్యగ్రహణం
-
తెలంగాణ : ఉత్సాహంగా మొదలైన బతుకమ్మ వేడుకలు
-
ఖైరతాబాద్ గణేశ్ శోభాయాత్ర
-
నేటి నుంచి అభిమానులతో రజనీ భేటీ
సాక్షి, చెన్నై: సూపర్‌స్టార్ రజనీ కాంత్ నేటి నుండి ఈ నెల 31 వరకూ తన అభిమానులతో భేటీ కానున్నారు. కోడంబాక్కంలోని రాఘవేంద్ర కల్యాణ మండపంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ అభిమానులతో రజనీ సమావేశమవుతారు. ఈ నెల 12న జరిగిన 68వ పుట్టినరోజు వేడుకల సందర్భంగా రజనీ రాజకీయ ఆరంగేట్రంపై ప్రకటన చేస్తారని ఆశించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. అయితే మంగళవారం నుంచి అభిమానులతో రజనీ సమావేశమవుతున్న నేపథ్యంలో ఆయన రాజకీయ ప్రవేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
ఇవాల్టి నుంచి తిరుమలలో తెప్పోత్సవాలు
-
ఎయిర్ ఇండియా- రైల్వేస్ ప్రైస్ వార్
న్యూఢిల్లీ: విమాన టికెట్లలో డిస్కౌంట్ ఆఫర్లతో భారతీయ రైల్వేలకు ప్రభుత్వ, ఇతర ప్రయివేట్ విమానయాన సంస్థలు షాకిస్తున్నట్టే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వరంగ విమాన యాన సంస్థ ఎయిర్ ఇండియా రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు చార్జీలకు దాదాపు సమామైన ధరలను ఆఫర్ చేస్తోంది. ఇప్పటికే నూతన సంవత్సరంలో మూడు ప్రధాన విమాన యాన సంస్థలు తగ్గింపు ధరలను ప్రకటించాయి. తాజా ఎయిర్ ఇండియా మూడు నెలల తగ్గింపు ధరలను లాంచ్ చేసింది. ఈ డిస్కౌంట్ సేల్ ఆఫర్ జనవరి 6 న మొదలై ఏప్రిల్ 30 వ తేదీతో ముగియనుందని ఎయిర్ ఇండియా తెలిపింది. ఈ రాయితీ టిక్కెట్లు జనవరి 26 ఏప్రిల్ 30 మధ్య ప్రయాణానికి అందుబాటులో ఉన్నాయి. (చదవండి: ఎయిర్‌లైన్స్ భారీ డిస్కౌంట్ ఆఫర్లు) రైల్వే రిజర్వేషన్ కోసం వెయిటింగ్ తదితర కారణాల రీత్యా అసంతృప్తిగా ఉన్న రైల్వే ప్రయాణికులను ఆకర్షించే యోచనలో ఈ తగ్గింపు ధరల్ని ఎయిర్ ఇండియా ప్రవేశపెట్టినట్టు సమాచారం. ఈ ప్రత్యేక ఛార్జీలు అన్ని రాజధాని రూట్ తోపాటు, జాతీయ రవాణా సంస్థ రైల్వేస్ తిరగని ఇతర మార్గాల్లో కూడా అందుబాటులోకి తెచ్చినట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఉదాహరణకు, న్యూ ఢిల్లీ-ముంబై విమాన ఛార్జీ రూ 2,401 కే అందిస్తుండగా , రాజధాని ఎసి సెకండ్ కాస్ల్ ఛార్జీ రూ 2,870 గా ఉంది. న్యూఢిల్లీ-పాట్నా రాజధాని టికెట్ రూ 2,290, కాగా, ఎయిర్ ఇండియా ఎకానమీ క్లాస్ టికెట్ ను రూ 2,315 కు అందిస్తోంది. -
తెలంగాణ జాగృతి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభం
-
ఐటా టెన్నిస్ టోర్నమెంట్ ప్రారంభం
గుంటూరు స్పోర్ట్స్: రాష్ట్ర క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా కృషి చేయాలని ఎన్టీఆర్ స్టేడియం కార్యదర్శి దామచర్ల శ్రీనివాసరావు అన్నారు. శనివారం బృందావన్ గార్డెన్స్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో అండర్–14 బాల బాలికల ఐటా టెన్నిస్ టోర్నమెంట్ ప్రారంభం అయ్యింది. ముఖ్యఅతిథులు దామచర్ల శ్రీనివాసరావు, డాక్టర్ పోట్ల శివయ్య క్రీడాకారులను పరిచయం చేసుకొన్నారు. ఈ సందర్భంగా పోట్ల శివయ్య క్రీడాకారులకు అల్పహరం అందించారు. టోర్నమెంట్లో ఆంధ్ర, తెలంగాణ , కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన 50 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. టోర్నమెంట్‌ను ఐటా చీఫ్ రిఫరీ శ్రీకుమార్ పర్యవేక్షించారు. కార్యక్రమంలో సంపత్ కుమార్, డాక్టర్ రవి, కమల్, చౌదరి, టెన్నిస్ కోచ్ శివ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
యాప్ ఆధారిత బస్ సేవలపై ఏసీబీ దర్యాప్తు!
న్యూఢిల్లీః రాజధాని నగరంలో యాప్ ఆధారిత ప్రిమియమ్ బస్ సర్వీసులపై ఏసీబీ దర్యాప్తు ప్రారంభించింది. ఆప్ సర్కార్ ప్రతిపాదించిన బస్ సర్వీసులకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ తిరస్కరించడమే కాక, ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించడంతో, ప్రీమియం బస్ సేవలపై ఏసీబీ దర్యాప్తు ప్రారంభించింది. ఢిల్లీ యాంటీ కరప్షన్ బ్రాంచ్ బుధవారం ఢిల్లీలో ప్రారంభించనున్న యాప్ బేస్డ్ ప్రీమియం బస్ సర్వీసులపై దర్యాప్తు ప్రారంభించింది. యాప్ ఆధారిత బస్సు సేవలపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎమ్మెల్యే విజేందర్ గుప్తా ఫిర్యాదు పటిషన్ దాఖలు చేయడంతో ఏసీబీ దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపింది. అక్రమ ఎల్జీ నోటిఫికేషన్ జారీపై తమకు ఫిర్యాదు అందడంతో వ్యవహారంపై దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఏసీబీ ఛీఫ్ ఎం.కె.మీనా తెలిపారు. బీజేపీ నేత మంగళవారం ఫిర్యాదు దాఖలు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రీమియం బస్సుల విషయంలో ఒకే ఒక్క యాగ్రిగేటర్ ను ప్రోత్సహించారన్న వాదంతో పాటు... యాప్ ఆధారిత బస్సుల్లో ఎటువంటి నియమ నిబంధనలు పాటించలేదని, బస్ మార్గాలు, బస్సుల సంఖ్య కూడ నిర్ణయించకపోవడంపై తమకు ఆరోపణలు వచ్చినట్లు మీనా తెలిపారు. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం జూన్ 1 నుంచి రాజధానిలో యాప్ ఆధారిత ప్రీమియం బస్ సేవలు ప్రారంభించనున్నట్లు గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ప్రజలు స్వంత కార్లనుంచి ప్రజా రవాణా వ్యవస్థపై మొగ్గు చూపాలన్న ఉద్దేశ్యంతోనే తాము ఈ సేవలను ప్రోత్సహించామని, ఇందులో ఎటువంటి స్వలాభం లేదని 'ఆప్' ప్రభుత్వం వాదిస్తోంది. -
సమ్మర్ క్యాంప్ మొదలైంది!
ప్రతియేటా వేసవిలో ఆర్ఎస్ఎస్ నిర్వహించే ప్రత్యేక ట్రైనింగ్ కార్యక్రమం 'సంఘ్ శిక్షా వర్గ్' సమ్మర్ క్యాంప్ రేషింబాగ్ లో విజయవంతంగా ప్రారంభమైంది. భారత్ పై అవగాహనను, అనుభవాన్ని పెంచుకునే క్యాంప్ గా ఈ కార్యక్రమాన్ని ఆరెస్సెస్ సీనియర్ ప్రచారక్ దత్తాత్రేయ హోసబేల్ అభివర్ణించారు. 25 రోజుల పాటు జరిగే ఈ శిక్షణా కార్యక్రమంలో అన్ని రాష్ట్రాలనుంచి ఎనిమిది వందల మంది యువ స్వయం సేవక్ లు పాల్గొంటున్నారు. ఆరెస్సెస్ వేసవి శిక్షణా శిబిరంలో వివిధ భాషలు, ఆహారపు అలవాట్లు, వస్త్రధారణలు కలిగిన ఎనిమిది వందలమంది స్వయం సేవక్ లు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలనుంచి పాల్గొంటున్నారు. వివిధ వాతావరణాలనుంచి వచ్చి 25 రోజులపాటు కలసి పాల్గొని ప్రత్యేక శిక్షణను పొందే ఈ శిక్షణా శిబిరం ఓ మినీ భారత్ ను తలపిస్తుంది. అయితే వీరంతా ఇలా కలసి శిక్షణ తీసుకోవడం నిజమైన భారత్ కు అర్థాన్ని చెప్తుందని దత్తాత్రేయ హోసబేల్ అన్నారు. ఆరెస్సెస్ అంటే కేవలం యూనిఫాం, ప్రార్థనలే కాదని, భిన్నత్వంలో ఏకత్వాన్నిసాధించే ప్రయత్నమని ఆయన తెలిపారు. అన్ని ప్రాంతాల ప్రజలు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఒక్కటిగా కలసి నిర్వహించే కార్యక్రమమే సంఘ్ శిక్షా వర్గ్ అని, దేశంలో మాట్లాడే ప్రతి భాషలోనూ ఆరెస్సెస్ సాహిత్యం అందుబాటులో ఉందని హోసబేల్ తెలిపారు. అన్ని రాష్ట్రాల్లో ఉండే లక్షణాలను, విభిన్న విశేషాలను, వ్యత్యాసాలను తెలుసుకుని భారత్ పై సరైన అవగాన పెంచుకునేందుకు స్వయంసేవక్ లకు ఈ శిక్షణ ప్రోత్సహిస్తుందని విశ్వసంవాద్ కేంద్రం విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించారు. ఆరెస్సెస్ ఛీఫ్ మోహన్ భగవత్ ప్రత్యేక సందేశంతో జూన్ 9 న శిక్షణా కార్యక్రమం ముగుస్తుంది. -
గర్భంలోనే వృద్ధాప్యం నిర్థారణ
కొంతమంది యువకులు.. పుట్టుకతో వృద్ధులు అన్నారు. కొందరు అతి చిన్న వయసులోనే వృద్ధాప్యం మీద పడినట్లు కనిపిస్తారు. మరి కొందరు వయసు మళ్లినా యవ్వనంగా కనిపిస్తుంటారు. దీనంతటికీ గర్భధారణ సమయమే ప్రధానమట. గర్భంతో ఉన్న మహిళలు తీసుకునే ఆహారం, పోషకాలను బట్టే ఈ ప్రక్రియ ఆధారపడి ఉంటుందంటున్నారు లండన్ కు చెందిన పరిశోధకులు. గర్భంలోని పిండానికి అందే పోషకాల ఆధారంగానే పుట్టిన తర్వాత వారి యవ్వన, వృద్ధాప్య దశలు ప్రారంభమౌతాయని తాజా పరిశోధనలలో తేలింది. పుట్టక ముందే ముదిమి లక్షణాలు నిర్థారణ అవుతాయని లండన్ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు చెప్పారు. గర్భధారణ, పిండ అభివృద్ధిని ఎలుకలపై ప్రయోగించి చూశారు. గర్భధారణ సమయంలో తల్లి గర్భంలో ఆక్సిజన్ తగ్గడం, ధూమపానం వంటి అలవాట్లతో పుట్టే పిల్లల్లో యవ్వనం, వృద్ధాప్యం వంటి లక్షణాలు సంక్రమిస్తాయని, చిన్నతనంలోనే వృద్ధాప్య లక్షణాలు కనిపించే అవకాశం ఉంటుందని కనుగొన్నారు. మనుషుల్లో 23 జతల క్రోమోజోములుంటాయి. ప్రతి క్రోమోజోమ్ చివరి భాగాన్ని టెలోమేర్గా పిలుస్తారు. షూలేస్ చివరి భాగంలోని ప్లాస్టిక్ లా ఉండే ఈ టెలోమేర్లు క్రోమోజోములను బయటకు వెళ్లకుండా నివారిస్తుంటాయి. ఈ టెలోమేర్లు చిన్నివిగా మారడాన్ని బట్టి మనిషి వయసును, వృద్ధాప్యాన్ని లెక్కించవచ్చని పరిశోధకులు అంటున్నారు. ప్రయోగాల్లో భాగంగా పుట్టిన ఎలుకల్లోని రక్తనాళాల్లో ఉండే టెలోమేర్ల పొడవును కొలిచారు. అవి గర్భంలో ఉన్నప్పుడు తల్లి పొందిన యాంటీ ఆక్సిడెంట్లు, ఆక్సిజన్ ను బట్టి ఉన్నట్లు తెలుసుకున్నారు. గర్భంలో పిండం పెరుగుదల వారికి అందే ఆక్సిజన్ ను బట్టి ఉంటుందని, అది పుట్టిన తర్వాత వచ్చే లక్షణాలకు కారణమౌతుందని చెప్తున్నారు. తల్లి గర్భంలో ఉన్నపుడు తక్కువ ఆక్సిజన్ ను ఆమ్లాలను పొందిన ఎలుక పిల్లలు కాస్త ఎక్కువ వయసున్నట్లుగా కనిపించాయని, అవి గుండె సంబంధిత వ్యాధులను కూడా కలిగి ఉన్నట్లు తెలుసుకున్నారు. అలాంటి పిల్లలు తక్కువ పొడవున్న టెలోమేర్స్ ను కలిగి ఉన్నట్లు పరిశోధకులు చెప్తున్నారు. సరైన ఆక్సిజన్, యాంటీ ఆక్సిడెంట్లు అందిన పిల్లలు ఆరోగ్యంగానూ, తక్కువ వయసున్నట్లు కనిపించడంతోపాటు.. టెలోమేర్ల పొడవు కూడా ఎక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు. ఎలుకలపై చేసిన తమ ప్రయోగాలు పుట్టిన తర్వాతే కాక గర్భంలో ఉన్నప్పుడే పిల్లల పెరుగుదల, లక్షణాలకు కారణమైనట్లుగా నిర్థారిస్తున్నాయని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం పరిశోధకులు డినో గిస్పాని చెప్తున్నారు. ఇప్పటికే వాతావరణాన్ని బట్టి, అలవాట్లను బట్టి మన జన్యువుల్లో వచ్చే లోపాలు ఊబకాయానికి, గుండె జబ్బులకు కారణాలవుతున్నట్లు మనకు తెలుసని, అయితే ప్రస్తుత పరిశోధనలు గర్భంలోఉన్నపుడే ముదిమి లక్షణాలు, గుండె జబ్బులు నిర్ధారణ అవుతాయని నిరూపించినట్లు ఫ్యాసబ్ జర్నల్ లో ప్రచురించిన పరిశోధనలో తెలిపారు. -
విన్ స్టన్ తుఫాన్ విధ్వంసం.. 20 కి చేరిన మృతులు
విధ్వంసకర విన్స్టన్ తుఫానుతో ఫిజి పౌరులు నిరాశ్రయులయ్యారు. తుఫాను బీభత్సంతో అతలాకుతలమైన ఆ ప్రాంతాన్ని వెంటనే పునరుద్ధరించేందుకు సహకరించాలని స్థానికులు కోరుతున్నారు. శనివారం ఫిజి ద్వీపంలో చెలరేగిన శక్తివంతమైన తుఫాను వల్ల సుమారు 20 మంది మరణించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఫిజి తుఫాను సృష్టించిన బీభత్సం ప్రాణ నష్టంతో పాటు... తీవ్ర ఆస్తి, పంట నష్టాన్ని తెచ్చిపెట్టింది. పునరావాస కేంద్రాల్లోని తుఫాన్ బాధితులకు తిరిగి ఆశ్రయం కల్పించే పనులు ప్రారంభించినట్లు ఫసిఫిక్ పశ్చిమ డివిజన్ అధిపతి తెలిపారు. మరో ఐదు రోజుల్లో బాధితులు తిరిగి తమ తమ ప్రాంతాలకు వెళ్లేందుకు కావలసిన ఏర్పాట్లు చేస్తున్నట్లు స్థానిక కమిషనర్ మానస చెప్పారు. ఫిజి ద్వీపాల్లోని తుఫాను బాధిత ప్రాంతాల్లో.. ముఖ్యంగా ప్రధాన ద్వీపమైన విటి లెవుతో సహా పవర్, టెలి కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. దీంతో అధికారులు పూర్తిస్థాయి నష్టాన్ని అంచనా వేసే పనిలో పడ్డారు. తుఫాను కారణంగా ఫిజి ప్రాంతంలో విధించిన కర్ఫ్యూ ను సోమవారం ఎత్తివేసినప్పటికీ... తక్షణ పునరుద్ధరణ పనులకోసం 30 రోజులపాటు ఎమర్జెన్సీని ప్రకటించారు. ప్రాథమిక సాయంగా ఆస్ట్రేలియా ప్రభుత్వం ఫిజికి 5 మిలియన్ డాలర్ల సాయాన్నిఅందించింది. గృహాలను కోల్పోయిన తుఫాన్ బాధితులకు ఆహారం, తాగునీరు, పరిశుభ్రత వంటి తక్షణ సాయం అందించేందుకు ఆ నిధులను వినియోగించాలని విదేశీ వ్యవహారాల మంత్రి జూలీ బిషప్ చెప్పారు. ఫిజినుంచీ వర్జిన్ ఆస్ట్రేలియా, ఎయిర్ న్యూజిల్యాండ్, ఫిజి ఎయిర్వేస్ విమానాలను ఇప్పటికే పునరుద్ధరించాయని, అయితే జెట్ స్టార్ మాత్రం మంగళవారం నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలిపారు. తుఫాను వల్ల ఫిజి సందర్శకులకు ఎటువంటి ముప్పు లేదని, వారంతా సురక్షితంగా, సౌకర్యవంతంగా ఉన్నారని ఫిజి టూరిజం మంత్రి ఫయాజ్ సిద్ధిక్.. ప్రభుత్వ ఫేస్ బుక్ పేజీలో ప్రకటించారు. 'విటి లెవు' ప్రాంతంలో అత్యధికంగా ఉన్న హోటళ్లకు ఎటువంటి నష్టం జరగలేదని, మొబైల్, ఇంటర్నెట్ వ్యవస్థ మాత్రం తీవ్రంగా దెబ్బతిన్నట్లు ఆయన పేర్కొన్నారు. -
విజయావాడలో ఏపీ కేబినెట్ భేటీ
-
మార్చి 2 నుంచి ఇంటర్ ఎగ్జామ్స్
-
మార్చి 2 నుంచి ఇంటర్ ఎగ్జామ్స్
షెడ్యూల్ జారీ చేసిన ఇంటర్మీడియెట్ బోర్డు ♦ 21వ తేదీ వరకు నిర్వహణ ♦ ఫిబ్రవరి 3 నుంచి 24 వరకు ప్రాక్టికల్స్ ♦ జనవరి 28న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్ష ♦ అదేనెల 30న ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష ♦ పరీక్షలకు హాజరుకానున్న దాదాపు 9.5 లక్షల మంది విద్యార్థులు ♦ ఏపీలోనూ మార్చి 2 నుంచే పరీక్షలు ప్రారంభించే అవకాశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ పరీక్షలు వచ్చే ఏడాది మార్చి 2వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ మేరకు ఇంటర్మీడియెట్ బోర్డు షెడ్యూలు జారీ చేసింది. పరీక్షల షెడ్యూలుకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సోమవారం ఆమోదం తెలిపారు. ఎన్ఐటీల్లో ప్రవేశాలకు ఏప్రిల్ 3న జేఈఈ మెయిన్ రాత పరీక్ష నిర్వహించేందుకు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో అంతకంటే పది రోజుల ముందుగానే ఇంటర్ పరీక్షలను పూర్తి చేయాలన్న లక్ష్యంతో బోర్డు కసరత్తు చేసింది. జేఈఈ మెయిన్ పరీక్షలు రాయబోయే విద్యార్థులపై ఒత్తిడి లేకుండా చూసేందుకు ఈ చర్యలు చేపట్టింది. ఇదే విషయాన్ని పేర్కొంటూ ఈ నెల 16న 'మార్చి 2 నుంచి ఇంటర్ పరీక్షలు' శీర్షికన సాక్షి ప్రత్యేక కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే. షెడ్యూలు ప్రకారం మార్చి 2 నుంచి 16వ తేదీ వరకు ప్రధాన పరీక్షలు పూర్తి కానుండగా, 21వ తేదీతో అన్ని పరీక్షలు పూర్తవుతాయి. ద్వితీయ భాష పేపర్‌తో పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్షలను నిర్వహిస్తారు. దాదాపు 9.5 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ మార్చి 2 నుంచే ఇంటర్ పరీక్షలను నిర్వహించనున్నారు. మార్చి 11 నుంచి నిర్వహించనున్నట్లు ఏపీ ప్రభుత్వం ముందుగా ప్రకటించింది. అయితే తెలంగాణ సర్కారు ఏ రోజు నుంచి పరీక్షలను ప్రారంభిస్తుందో అదే రోజు నుంచి ఏపీలోనూ ప్రారంభించాలని భావిస్తోంది. గతేడాది పరీక్షల సందర్భంగా తెలంగాణలో ముందుగా పరీక్షలు జరుగడంతో ఇక్కడి ప్రశ్నపత్రాల్లో ఇచ్చిన కొన్ని ప్రశ్నలు ఏపీలోనూ రావడంతో కొంత ఆందోళన వ్యక్తమైంది. దీంతో తెలంగాణతోపాటే ఏపీలోనూ పరీక్షల నిర్వహణకు అక్కడి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఫిబ్రవరి 3 నుంచి ప్రాక్టికల్స్ ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలను ఫిబ్రవరి 3 నుంచి 24వ తేదీ వరకు నిర్వహిస్తామని బోర్డు ప్రకటించింది. ఆదివారాల్లోనూ పరీక్షలు నిర్వహిస్తారు. జనరల్, వొకేషనల్ విద్యార్థులకు ఇవే తేదీలు వర్తిస్తాయి. టైంటేబుల్ కూడా ఒకేలా ఉంటుంది. అయినప్పటికీ వొకేషనల్ విద్యార్థుల కోసం మళ్లీ వేరుగా టైంటేబుల్ జారీ చేయనున్నారు. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్ష జనవరి 28న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంటుంది. ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష జనవరి 30న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంటుంది. పరీక్షల షెడ్యూలు ఇదీ.. ప్రథమ సంవత్సర టైంటేబుల్ తేదీ వారం పరీక్ష 2-3-2016 బుధవారం ద్వితీయ భాష పేపర్-1 4-3-2106 శుక్రవారం ఇంగ్లిషు పేపర్-1 8-3-2016 మంగళవారం మ్యాథ్స్ పేపర్-1ఏ, బాటనీ పేపర్-1, సివిక్స్ పేపర్-1, సైకాలజీ పేపర్-1 10-3-2016 గురువారం మ్యాథ్స్ పేపర్-1బీ, జువాలజీ పేపర్-1, హిస్టరీ పేపర్-1 12-3-2016 శనివారం ఫిజిక్స్ పేపర్-1, ఎకనామిక్స్ పేపర్-1, క్లాసికల్ లాంగ్వేజ్ పేపర్-1 15-3-2016 మంగళవారం కెమిస్ట్రీ పేపర్-1, కామర్స్ పేపర్-1, సోషియాలజీ పేపర్-1, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్-1 17-3-2016 గురువారం జియాలజీ పేపర్-1, హోంసెన్సైస్ పేపర్-1, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-1, లాజిక్ పేపర్-1, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేపర్-1 (బైపీసీ విద్యార్థులకు) 19-3-2016 శనివారం మాడర్న్ లాంగ్వేజ్ పేపర్-1, జియాగ్రఫీ పేపర్-1 ద్వితీయ సంవత్సర టైంటేబుల్ తేదీ వారం పరీక్ష 3-3-2016 గురువారం ద్వితీయ భాష పేపర్-2 5-3-2016 శనివారం ఇంగ్లిషు పేపర్-2 9-3-2016 బుధవారం మ్యాథ్స్ పేపర్-2ఏ, బోటనీ పేపర్-2, సివిక్స్ పేపర్-2, సైకాలజీ పేపర్-2 11-3-2016 శుక్రవారం మ్యాథ్స్ పేపర్-2బీ, జువాలజీ పేపర్-2, హిస్టరీ పేపర్-2 14-3-2016 సోమవారం ఫిజిక్స్ పేపర్-2, ఎకనామిక్స్ పేపర్-2, క్లాసికల్ లాంగ్వేజ్ పేపర్-2 16-3-2016 బుధవారం కెమిస్ట్రీ పేపర్-2, కామర్స్ పేపర్-2, సోషియాలజీ పేపర్-2, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్-2 18-3-2016 శుక్రవారం జియాలజీ పేపర్-2, హోంసెన్సైస్ పేపర్-2, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-2, లాజిక్ పేపర్-2, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేపర్-2 (బైపీసీ విద్యార్థులకు) 21-3-2016 సోమవారం మాడర్న్ లాంగ్వేజ్ పేపర్-2, జియాగ్రఫీ పేపర్-2 -
ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
-
మరో రికార్డు బద్దలుకు శ్రీకారం
బీజింగ్: చైనా మరో సాహసానికి దిగింది. ప్రపంచంలో అతిపెద్ద డ్యాం నిర్మాణం ప్రారంభించింది. దాదాపు 314 మీటర్ల (1,030 అడుగులు) ఎత్తు దీనిని నిర్మిస్తున్నది. చైనాలోని ప్రముఖ నది అయిన యాంగ్జీపై దీనిని నిర్మిస్తోంది. దీనికి శ్వాంజియాంకో డ్యాం అని నామకరణం చేసింది. 2022లోగా దీనిని పూర్తి చేయనున్నట్లు చైనా పర్యవరణశాఖ దాని వెబ్సైట్లో పెట్టింది. ఈ నిర్మాణం పూర్తయితే ప్రపంచంలోనే అతిపెద్ద డ్యాంగా శ్వాంజియాంకో నిలవనుంది. ప్రస్తుతం ప్రపంచంలోని ఎత్తైన జిన్ పింగ్-1 డ్యాం కూడా చైనాలోనే ఉండటం విశేషం. ఈ నిర్మాణంతో చైనా తన రికార్డు తానే బద్దలు కొట్టనుంది. భారీ స్థాయిలో విద్యుదుత్పాదన చేయాలనే ఉద్దేశంతోనే చైనా ఈ ఆనకట్టను నిర్మిస్తున్నట్లు స్పష్టం చేసింది. దేశానికి అవసరమవుతున్న విద్యుత్‌లో 20శాతం విద్యుత్‌ను ఈ ప్రాజెక్టునుంచే పొందాలనే లక్ష్యంతో డ్యాం నిర్మాణం చేపట్టామని ప్రకటించింది. వాతావరణంలో కర్భన సమ్మేళనాల స్థాయి దీనిద్వారా తగ్గిపోతుందని పేర్కొంది. ప్రపంచంలోనే అతిపెద్ద జల విద్యుత్ డ్యాంలు చైనాలో ఉన్న విషయం తెలిసిందే. -
విశాఖలో వైఎస్ఆర్ సీపీ మహాధర్నా ఆరంభం
-
ఘనంగా వీరారాధన ఉత్సవాలు ప్రారంభం
కారంపూడి చేరుకుంటున్న వీరాచార, వీరవిద్యావంతులు కారంపూడి: పల్నాటి వీరారాధన ఉత్సవాలు శుక్రవారం రాత్రి ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో వున్న వీరాచార, వీరవిద్యావంతులు కారంపూడి చేరుకుంటున్నారు. సుమారు 35 కొణతాలు ఉత్సవ నిధి మీదకు వచ్చాయి. తమ వెంట తెచ్చుకున్న వంశపారంపర్యంగా వస్తున్న ఆయుధాలను వీరులగుడిలో వుంచారు. తర్వాత వాటిని బయటకుతీసి నాగులేరు గంగధారి మడుగులో శుభ్రపరచారు. వీరతాళ్లు, వీర్ల అంకమ్మ పెట్టెలోని వస్తువులనూ శుభ్రంచేశారు. వీరులగుడి పూజారులు ఆయుధాలకు పసుపు పూసి పూజకట్టారు. వీరులగుడి ఆవరణలో ఆయుధాలకు అలంకారాలు చేశారు. ఆయుధాలతో ఊరేగింపుగా అంకాళమ్మ తల్లి, చెన్నకేశవస్వాములను దర్శించుకుని అక్కడ తీర్థం తీసుకున్నారు. తర్వాత పీఠాధిపతి పిడుగు తరుణ్‌చెన్నకేశవ ఇంటికి వెళ్లి ఆయన వెంట వీరులగుడికి చేరుకున్నారు. అక్కడ పీఠాధిపతి వీరులగుడి ముఖద్వారంపై ఎర్రజెండాను ప్రతిష్టించి ఉత్సవాలను ప్రారంభించారు. వీరులగుడిలో వున్నపోతురాజుకు పెద్ద అన్నంముద్దను పూజారి సమర్పించారు. ఆనాడు బ్రహ్మనాయుడు శివనందుల కోట ఆక్రమణకు వెళ్లినప్పుడు అడ్డు వచ్చిన పోతురాజుకు మేకపోతును, పెద్దముద్దను ఇచ్చి సంతృప్తి పరచాడని, అదేవిధంగా ఆ సన్నివేశాన్ని స్మరిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించారు. వాస్తవానికి జీవంమెడను నోటితో కొరికి పోతురాజుకు సమర్పించే ప్రక్రియను రాచగావు అంటారు. ప్రభుత్వ నిషేధం కారణంగా అన్నంముద్దను సమర్పిస్తున్నారు. తర్వాత పీఠాధిపతి హాజరైన వీరాచార, వీరవిద్యావంతులందరికీ ముంజేతి కంకణాలు కట్టారు. ఆచారవంతులు పీఠాధిపతికి నమస్కరించారు. పీఠాధిపతి సమక్షంలో కథాగానాలు కొనసాగేందుకు అఖండ జ్యోతిని వెలిగించారు. గుంటూరుకు చెందిన పోతురాజు యేగయ్య రాచగావు కథాగానం ఆలపించారు. పల్నాటి వీరారాధనోత్సవాల్లో రెండో రోజు రాయబారం ఉత్సవం జరుగుతుంది. వీరాచారం మాకు ప్రాణప్రదం.. నాకిప్పుడు 75 సంవత్సరాలు. ఉహ తెలిసినప్పటి నుంచి తండ్రి నర్సయ్య వెంట ఉత్సవాలకు వస్తున్నా. ఆయన మృతి తర్వాత కథలు చెప్పే బాధ్యత చేపట్టాను. చిన్నప్పటి నుంచి వీరుల కథ చెప్పడానికి నాన్న తర్పీదునిచ్చాడు. మా పూర్వీకులంతా వీరాచారంపైనే ఆధారపడ్డాం. వీరాచారవంతులు విద్యావంతులైన వమ్ములను గౌరవిస్తారు. వారి ఇళ్లలో మంచైనా చెడైనా చె ప్పడానికి శుభకార్యాలు మా సలహా ప్రకారం చేసుకుంటారు. వీరాచారం మా ప్రాణం లాంటిది. -పోతురాజు యేగయ్య, వీరవిద్యావంతుడు, గుంటూరు -
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
-
ఛట్‌పూజ ప్రారంభం
సాక్షి, న్యూఢిల్లీ: పూర్వాంచలీయుల సంస్కృతి, సంప్రదాయాల్లో భాగమైన ఛట్‌పూజ నగరంలో బుధవారం నుంచి ప్రారంభమైంది. నగరంలో పూర్వాంచలీయుల సంఖ్య కూడా పెరుగుతుండడంతో ఈ పండుగపై రాజకీయ నాయకులు కూడా దృష్టిసారించారు. పూజలు జరిగే నదీతీరాలను శుభ్రపరిచే పనులను ఇప్పటికే పూర్తి చేశారు. నాలుగురోజులపాటు జరుపుకునే ఈ వ్రతంలో తొలిరోజైన నహాయ్ఖాయ్ను సంప్రదాయంగా జరుపుకున్నారు. రెండో రోజైన ‘ఖర్నా’ను జరుపుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఛట్ పూజను ప్రధానంగా నాలుగు రోజులు జరుపుకుంటారు. మొదటి రోజును నహాయ్ ఖాయ్, రెండోరోజును ఖర్నా, మూడవ రోజును పెహలా ఆర్ఘ్య్, నాలుగవరోజును పార్నాగా పేర్కొంటారు. ఛట్ పూజ చేసేవారు అత్యంత నిష్టగా నహాయ్‌ఖాయ్ ఆచరిస్తారు. ఎక్కువగా మహిళలే ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఇల్లంతా శుభ్రపరచుకుని, శుచిగా స్నానం చేస్తారు. వ్రతధారులే స్వయంగా పీలి మట్టితో పొయ్యి తయారుచేసి మామిడి కట్టెలను ఉపయోగించి అర్వాచావల్, శనగపప్పు, సొరకాయ లేదా అరటికాయ కూరతో తయారుచేసిన వంటకాన్ని ఆరగిస్తారు. వంటలో సాధారణంగా ఉప్పు వినియోగించరు. ఒకవేళ వాడినా సైంధవ లవణాన్ని మాత్రమే వాడుతారు. సొరకాయ ఈ రోజున వంటలో ప్రధానంగా వాడుతారు కనుక నహాయ్ ఖాయ్ భోజనాన్ని కొందరు కద్దూబాత్గా పేర్కొంటారు. వ్రతధారులు రాత్రి ప్రసాదం తరువాత మరుసటి రోజు సాయంత్రం వరకు ఉపవాసముంటారు. ఈ రోజును ఖర్నాగా పేర్కొంటారు. సాయంత్రం ఖీర్, రొట్టెలను ప్రసాధంగా స్వీకరించి నిర్జల ఉపవాసాన్ని ప్రారంభిస్తారు. మూడవ రోజున అస్తమించే సూర్యున్ని పూజించి చాటలో ప్రసాదాన్ని సమర్పిస్తారు. నాలుగో రోజున ఉదయించే సూర్యునికి ఆర్ఘ్యప్రసాదాలు సమర్పించి వ్రత విసర్జన చేసి విందు భోజనం చేయడంతో వ్రతం పూర్తవుతుంది. పెరుగుతున్న ఆదరణ... సువిశాల భారతదేశం వైవిధ్యానికి నెలవు. ఈ వైవిధ్య భరితమైన సంస్కృతి, వేషధారణ, ఆచారాలు, వ్యవహారాల్లోనే కాకుండా పండుగలలో కూడా కనబడుతుంది. దీపావళి, దసరా వంటి పండుగలు యావద్దేశం ఆనందోత్సాహాలతో జరుపుకుటున్నప్పటికీ కొన్ని ప్రాంతాలలో జరుపుకునే పండుగల గురించి మిగతా ప్రాంతాల వారికి పెద్దగా తెలియదు. ఉదాహరణకు కేరళ వాసుల అతి పెద్ద పండుగ ఓనమ్ గురించి మిగతా ప్రాంతాల ప్రజలకు తెలియదు. తెలంగాణవాసులు అత్యుత్సాహంతో జరుపుకునే బతుకమ్మ వేడుక గురించి పక్కనే ఉన్న సీమాంధ్ర ప్రాంతాల వారికి తెలియదు. ఇలా ఆయా ప్రాంతాలకే ప్రత్యేకమైన పండుగలు, పర్వదినాలు ఎన్నో ఉన్నాయి. ఈ కోవలోకే వస్తుంది పూర్వాంచలీయులు జరుపుకునే ఛట్ పూజ. ఛట్ పూజ గురించి రెండు దశాబ్దాల కిందటి వరకు ఢిల్లీవాసులకు కూడా పెద్దగా తెలియదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. నగరంలో పూర్వాంచలీయుల సంఖ్య భారీగా పెరగడంతో ఇప్పుడు ఈ పూజ సందడి నగరమంతటా దర్శనమిస్తోంది. ఒకప్పుడు ఛట్ పూజ కోసం పూర్వాంచలీయులే స్వయంగా ఘాట్లను శుభ్రపరచుకుని అన్ని ఏర్పాట్లు చేసుకునేవారు. పూజ సామగ్రిని ఉత్తర ప్రదేశ్, బీహార్ల నుంచి తెప్పించుకునేవారు. కానీ ఇప్పుడు ప్రభుత్వమే ఈ పూజ కోసం దాదాపు 70 ఘాట్ల వద్ద అన్ని ఏర్పాట్లు చేస్తోంది. పూజా సామగ్రి కూడా ఇప్పుడు నగరంలోని అన్ని మార్కెట్లలో లభిస్తోంది. ఢిల్లీ ప్రభుత్వం 2000 సంవత్సరంలో ఛట్ పూజ రోజును ఐచ్చిక సెలవుగా ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం కూడా 2011లో ఛట్‌పూజ రోజును ప్రాంతీయ సెలవుగా ప్రకటించింది. తాము అధికారంలోకి వచ్చినట్లయితే ఛట్ పూజ రోజున ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటిస్తామని బీజేపీ చెబుతోంది. ఆసియా క్రీడల సమయం నుంచి నగరానికి పూర్వాంచలీయుల వలసలు పెరిగాయని, ఉపాధికోసం నగరానికి వచ్చిన వారు పాలం, సంగమ్ విహార్, డాబ్రీ, ఉత్తం నగర్, కిరాడీ, సాగర్పూర్, సీమాపురి, మంగోల్‌పురి తదితర ప్రాంతాలలో నివాసమేర్పరచుకుని యమునా తీరాన ఛట్ పూజ చేసుకునేవారని, లక్షలాది మంది పూర్వాంచలీయులు ఈ వేడుకలకు హాజరుకావడం గమనించి రాజకీయ నాయకులు, ప్రభుత్వం కూడా ఈ పూజ కార్యక్రమాలలో పాలుపంచుకోవడం ప్రారంభించారని నగరంలో 30 సంవత్సరాలుగా నివాసముంటోన్న పూర్వాంచలీయులు చెప్పారు. ఛట్ పూజ కూడా కూడా బతుకమ్మ పండుగ మాదిరిగానే ప్రకృతికి సన్నిహితమైనది. సక ల సృష్టికి ఆధారమైన సూర్యభగవానున్ని ఈ పండుగ సందర్భంగా కొలుస్తారు. మోకాలి లోతు వరకు నీటిలో నిలబడి సూర్యదేవునికి ఆర్ఘ్యప్రసాదాలను సమర్పించడం ఈ పూజ ప్రత్యేకత. వెదురు గంప లేదా చాటలో పళ్లను ఉంచి అస్తమించే సూర్యునికి, ఉదయించే సూర్యునికి ప్రసాదంగా సమర్పిస్తారు. ఈ పూజలో ప్రధాన భాగం నదీతీరాన జరుగుతుంది కాబట్టి ఈ పూజ నదుల శుద్ధీకరణలపై కూడా దృష్టిసారించేలా చేస్తుంది. పండుగ సమయంలో ప్రసాదంగా సమర్పించే బెల్లం, చెరకు, కొబ్బరిరకాయలు, అరటిపళ్లు, పసుపు,అల్లం ఇత్యాది సామగ్రి ఆరోగ్యానికి కూడా మేలుచేస్తుందంటారు వైద్య నిపుణులు. -
కీలక ఫైళ్లు కనబడడం లేదనే వార్తలు
-
4వ రోజుకు చేరుకున్న నిరవధిక నిరాహార దీక్షలు