స్తంభం విరిగినా.. పట్టించుకోరా..!
మర్రిగూడ : మండల కేంద్రంలోని గంథ్రాలయ వద్ద నాలుగు రోజుల క్రితం గుర్తుతెలియన వాహనం ఢీకొనడంతో విద్యుత్ స్తంభం మధ్యకు విరిగి ఇనుప చువ్వల ఆధారంగా వేలాడుతూ ప్రమాదకరంగా మారింది. ఈ స్తంభం నుంచివెళ్లే లైన్తోనే గృహాలకు విద్యుత్ సరఫరా అవుతున్నా సంబంధిత అధికారులు దాన్ని పట్టించుకోవడం లేదు. బస్టాండ్ సమీపంలో ఉన్న ఈ స్తంభంతో పెను ముప్పు పొంచి ఉన్నందున వెంటనే దాన్ని తొలగించి కొత్త స్తంభాన్ని ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.