best results
-
Lok Sabha Elections 2024: దక్షిణాదిన అత్యుత్తమ ఫలితాలు: అమిత్ షా
అహ్మదాబాద్: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ అత్యుత్తమ ఫలితాలను సాధించనుందని హోం మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ‘బీజేపీకి ఉన్న అనుకూల వాతావరణాన్ని బట్టి 400 పైగా సీట్లు సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈదఫా ఎన్నికల్లో దక్షిణాదిన మొదటిసారిగా అత్యధిక స్థానాలు సాధించుకుంటాం’అని అమిత్ షా చెప్పారు. దీన్ని బట్టి ప్రతిపక్ష ఇండియా కూటమికి ఎన్ని సీట్లు దక్కుతాయో ఊహించుకోవచ్చునన్నారు. -
బీవోఐ జూమ్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో పీఎస్‌యూ దిగ్గజం బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీవోఐ) ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 90 శాతం జంప్‌చేసి రూ. 1,027 కోట్లను తాకింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 541 కోట్లు మాత్రమే ఆర్జించింది. అయితే మొత్తం ఆదాయం రూ. 12,311 కోట్ల నుంచి రూ. 11,211 కోట్లకు క్షీణించింది. నికర వడ్డీ ఆదాయం సైతం రూ. 3,739 కోట్ల నుంచి రూ. 3,408 కోట్లకు బలహీనపడింది. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 13.25 శాతం నుంచి 10.46 శాతానికి తగ్గాయి. నికర ఎన్పీఏలు మాత్రం 2.46 శాతం నుంచి 2.66 శాతానికి పెరిగాయి. ప్రొవిజన్లు, కంటింజెన్సీలు రూ. 1,810 కోట్ల నుంచి భారీగా తగ్గి రూ. 335 కోట్లకు పరిమితమయ్యాయి. కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్) 16.66 శాతంగా నమోదైంది. ఫలితాల నేపథ్యంలో బీవోఐ షేరు ఎన్ఎస్ఈలో 3.5 శాతం పతనమై రూ. 56.4 వద్ద ముగిసింది. -
టెన్త్‌కు అంకితమై
ఉత్తమ ఫలితాలకు ప్రత్యేక కార్యాచరణ ‘కమిట్మెంట్’ పేరిట 10 వారాల ప్రణాళిక ఏలూరు సిటీ : జిల్లాలో విద్యా కుసుమాలను వికసింపజేసేందుకు అంకితభావం (కమిట్మెంట్) పేరిట ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేయనున్నారు. పది వారాలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు విద్యాశాఖ దీనిని రూపొందించింది. పదో తరగతి పరీక్ష ఫలితాల్లో జిల్లాను రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలబెట్టేందుకు సులువైన అష్టాంగ మార్గాలను సైతం పాటించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అర్ధ వార్షిక పరీక్షల్లో విద్యార్థుల సామర్థ్యాన్ని గుర్తించి, వారిని నాలుగు గ్రేడులుగా విభజించారు. ప్రతి విద్యార్థిపై దృష్టి సారించి పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించేలా కమిట్మెంట్ (కరిక్యులర్ ఆర్గనైజేషన్, మెథడ్స్ మోడిఫికేషన్ ఇన్ ది టెన్త్ క్లాస్ మెయిన్ ఎగ్జామ్స్ బై ఎంకరేజ్మెంట్ నేచురల్ టాలెంట్స్) పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబోతున్నారు. ఆణిముత్యాలు, ఆశా జ్యోతులపై ప్రత్యేక దృష్టి : అర్ధవార్షిక పరీక్షల్లో 80నుంచి 100 శాతం మార్కులు పొందిన విద్యార్థులను ‘పశ్చిమ ఆణిముత్యాలు’, 61నుంచి 80శాతం మార్కులు వచ్చిన వారిని ‘పశ్చిమ వజ్రాలు’, 35-60 శాతం వస్తే ‘పశ్చిమ బంగారాలు’, 0 నుంచి 35శాతం మార్కులు వచ్చిన వారిని ‘పశ్చిమ ఆశాజ్యోతులు’గా వర్గీకరించారు. ఆణిముత్యాలు 2,104 మంది, వజ్రాలు 10,332 మంది, బంగారాలు 13,888 మంది, ఆశాజ్యోతులు 5,114 మంది ఉన్నట్టు గుర్తించారు. ఆణిముత్యాలు, ఆశా జ్యోతులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని నిర్ణయించారు. అర్ధ వార్షిక పరీక్షల్లో వెనుకబడిన విద్యార్థులను ఉపాధ్యాయులు దత్తత తీసుకుంటారు. పరీక్షల్లో వారు ఉత్తీర్ణత సాధించేలా తర్ఫీదు ఇస్తారు. అర్ధవార్షిక పరీక్షల్లో ఒక సబ్జెక్టులో ఫెయిలైన విద్యార్థులు 2,065 మంది, రెండు సబ్జెక్టుల్లో ఫెయిలైన వారు 1,418 మంది, మూడు కంటే ఎక్కువ సబ్జెక్టుల్లో తప్పినవారు 1,631 మంది ఉన్నారు. వీరందరికీ ప్రత్యేక తర్ఫీదు ఇచ్చేందుకు చర్యలు చేపట్టామని డీఈవో డి.మధుసూదనరావు చెప్పారు. పదో తరగతి ఉత్తీర్ణతలో అగ్రస్థానం సాధించేందుకు కమిట్మెంట్ పేరిట ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. అష్టాంగ మార్గాలను ఆయన వివరించారు అష్టాంగ మార్గాలివీ విద్యార్థుల్లో విద్యా సామర్థ్యాల గ్రేడింగ్ నిర్ణయించటం విద్యార్థుల దత్తత : ఒక్కో ఉపాధ్యాయుడు పదిమందిని దత్తత తీసుకోవటం గృహ సందర్శన : ఉపాధ్యాయులు విద్యార్థుల గృహాలను సందర్శించటం. గృహాల సందర్శన ప్రతిరోజూ సాయంత్రం 6.30 నుంచి 8.30 గంటల వరకు, ఉదయం 4.30 నుంచి 6.30గంటల వరకు ఉండాలి. హామీ పత్రాలు : ప్రతి ఉపాధ్యాయుడి నుంచి ‘నేను బోధించి సబ్జెక్ట్‌లో ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించేలా కృషి చేస్తా’నని హామీ పత్రాలు తీసుకుంటారు. ప్రత్యేక తరగతులు : ఉదయం 8.30నుంచి 9.30 గంటల వరకు, సాయంత్రం 4.40నుంచి 5.40 గంటల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహణ బృంద చదువులు : గ్రామాల్లో ఉపాధ్యాయుల ఇళ్లవద్ద లేదా అంగన్వాడీ కేంద్రాల వద్ద టెన్త్ విద్యార్థులకు బృంద చదువులు మార్గదర్శక బృందాలు : ప్రతి బుధవారం మార్గదర్శక బృందం గ్రామాల్లో తిరుగుతూ బృంద చదువుల పరిస్థితిని పరిశీలిస్తుంది. ఎంఈవో, నలుగురు సబ్జెక్టు నిపుణులతో ఈ బృందాన్ని ఏర్పాటు చేశారు. బడిలో బస : సంక్రాంతి సెలవుల అనంతరం బడిలో బస కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. విద్యా శాఖ అధికారులంతా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి స్టడీ మెటీరియల్ : టెన్త్ విద్యార్థులందరికీ స్టడీ మెటీరియల్ అందజేస్తారు. ప్రత్యేకంగా రూపొందిం చిన 10వారాల కమిట్మెంట్ ప్రోగ్రామ్ బుక్‌లెట్‌ను ఉపాధ్యాయులకు అందజేస్తారు. -
‘పది’లో కాకతీయ ప్రభంజన
విద్యార్థులను సన్మానించిన ఆర్ఐఓ నిజామాబాద్‌అర్బన్ : పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన కాకతీయ విద్యార్థులను ఆర్ఐఓ విజయ్‌కుమార్ మంగళవారం సన్మానించారు. 10 జీపీఏ సాధించిన సీహెచ్.దినేష్, ఆర్.జిగీషతో పాటు 9.8 జీపీఏ సాధించిన ఏడుగురిని అభినందించారు. ఈ సందర్భంగా ఆర్ఐవో మాట్లాడుతూ ఉత్తమఫలితాలు సాధించడంలో కాకతీయ విద్యార్థులు ముందంజలో ఉంటారని అన్నారు. 9 రాష్ట్ర స్థాయి జీపీఏ మార్కులతో 102 మంది, 8 రాష్ట్ర స్థాయి గ్రేడు మార్కులతో 300 మంది విద్యార్థులు ప్రభంజనం సృష్టించారన్నారు. ఈ సందర్భంగా హెచ్ఎం ఫరీదొద్దీన్ మాట్లాడుతూ.. ఇటీవల వెలువడిన ఐఐటీ రామయ్య ఫలితాల్లో కుమారి, జగదీష్, సీహెచ్.భానుతేజ ఎంపికయ్యారన్నారు. అంతేకాకుండా ఐఐటీ మెరుున్స్‌లో 20 మంది విద్యార్థులు సత్తా చాటారని అన్నారు. భవిష్యత్‌లో ఇదే స్ఫూర్తితో మెరుగైన ప్రణాళికలతో విద్యార్థులను తీర్చిదిద్ది జాతీయ స్థాయిలో ప్రతిభ చూపేలా కృషి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో కాకతీయ హైస్కూల్ అధ్యాపకులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ పాఠశాలల తీరు మారాలి
కొన్నింట్లో మాత్రమే ఉత్తమ ఫలితాలు వస్తున్నాయి.. సమీక్ష సమావేశంలో ఎస్ఎస్ఏ రాష్ట్ర సీఎంఓ హరికృష్ణ విద్యారణ్యపురి : తెలంగాణ ప్రభుత్వం విద్యారంగంలో అనేక సం స్కరణలు చేపడుతున్నందున, ప్రైవేట్ విద్యపై మోజు తగ్గడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల తీరు మారేలా కృషి జరగాల్సిన అవసరముందని సర్వశిక్షాభియాన్(ఎస్ఎస్ఏ) రాష్ట్ర సీఎంఓ(కమ్యూనిటీ మొబిలైజర్) హరికృష్ణ అన్నారు. ఎస్ఎస్ఏ రాష్ర్ట శాఖ నుంచి వచ్చిన మూడు బృందాలు మూడు రోజులుగా జిల్లాలోని పలు పాఠశాలలను సందర్శించి అక్కడి స్థితిగతులను తెలుసుకున్నారు. ఈ మేరకు బుధవారం మధ్యాహ్నం హన్మకొండలోని డైట్ కళాశాలలో ఎంఈఓలు, సెక్టోరియల్ ఆఫీసర్లతో ఏర్పాటుచేసిన సమీక్ష సమావేశంలో హరికృష్ణ మాట్లాడారు. కొన్ని పాఠశాల్లో అద్భుతమైన ప్రమాణాలు ఉండగా, మరికొన్నింట్లో విద్యార్థులకు కనీస సామర్థ్యాలు లేనట్లు తమ పరిశీలనలో తేలిం దని ఆయన తెలిపారు. జిల్లాలోని బీరెల్లి పాఠశాల తెలంగాణ రాష్ట్రంలోనే అత్యుత్తమ పాఠశాలగా నిలిచిందని, దీనికి హెచ్ఎం, ఉపాధ్యాయుల కృషే కారణమని హరికృష్ణ అభినందించారు. ప్రభుత్వ పాఠశాలల స్థలా ల రికార్డులు అందుబాటులో ఉంచడం తో పాటు ఖాళీ స్థలం ఉంటే మొక్కలు పెంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించాలని ఆయన సూచించారు. పాఠశాలల అభివృద్ధికి ఎవరైనా ఆర్థికంగా చేయూతనిస్తే వారి పేర్లను ప్రదర్శించాలని కోరారు. కనీస సామర్థ్యాలు కరువయ్యాయి.. మూడు రోజుల తనిఖీల్లో భాగంగా పలు పాఠశాలల్లోని పదో తరగతి విద్యార్థులకు కనీసం చదవడం, రాయ డం కూడా రావడం లేదని గుర్తించామని రాష్ట్ర పరిశోధన శిక్షణ సంస్థ ప్రొఫెసర్ కృష్ణమోహన్ తెలిపారు. ఓ విద్యార్థి పదో తరగతి తర్వాత ఇంటర్ చదువుకుంటానని చెప్పినా ఇంటర్మీడియట్ రాయడం రాలేదని, మరో విద్యార్థి తమ ఉపాధ్యాయుడికి రూ.3వేల వేతనమని చెప్పారని... ఇలాంటి అంశాలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. జిల్లా ఏజేసీ, ఎస్ఎస్ఏ ఇన్చార్జ పీఓ కృష్ణారెడ్డి మాట్లాడుతూ తాను కూడా ఇటీవల కొన్ని పాఠశాలలను సందర్శించిన క్రమంలో కొన్నింట్లో పరిస్థితి నిరాశజనకంగా ఉందన్నారు. డీఈఓ ఎస్.విజయ్‌కుమార్ మాట్లాడుతూ పాఠశాలల పర్యవేక్షణను నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు. ఎంఈఓ జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ తాము ఎంఈఓలుగా కాకుండా మల్టీ టాస్క్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తించాల్సి వస్తోం దని, అనేక బాధ్యతలు తమకు అప్పగిస్తున్నారన్నారు. దీనికి పరిష్కారమార్గం చూపాల్సింది ఉన్నతాధికారులేనని అభిప్రాయపడ్డారు. సమావేశంలో డాక్టర్ బాల, డైట్ కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మారెడ్డి, ఎస్ఎస్ఏ జిల్లా ఏఎంఓ శ్రీనివాస్, సీఎంఓ బి.మనోజ్‌కుమార్, జీసీడీఓ బి.రాధ, ఏఎల్ఎస్ ఎస్జీఆర్పీ సురేష్, డిప్యూటీ డీఈఓ నరేందర్‌రెడ్డి, డైట్ కళాశాల అధ్యాపకుడు సోమయ్యతో పాటు ఎంఓఈలు పాల్గొన్నారు. -
చదివించే బాధ్యత నాదే
కొరుక్కుపేట: పదవ తరగతి, ప్లస్‌టూ పరీక్షల్లో మెరిట్ సాధించి ఇంజినీరింగ్, మెడిసిన్ లాంటి ఉన్నత చదువుల్లో సీటు సంపాదించుకున్న విద్యార్థులకు దానికి అయ్యే మొత్తం ఖర్చుతో చదివించే బాధ్యత తనదేనని కెన్సస్ అధినేత నరసారెడ్డి హామీ ఇచ్చారు. చెన్నై టీనగర్‌లోని కేసరి మహోన్నత పాఠశాలలో మూడేళ్లుగా సాయంత్రం సమయంలో అదనపు తరగతులకు హాజరయ్యే పదవ తరగతి, ప్లస్‌టూ విద్యార్థులకు నరసారెడ్డి శుక్రవారం నుంచి సాయంకాల అల్పాహార విందు కార్యక్రమాన్ని పునః ప్రారంభించారు. కార్యక్రమానికి కెన్సస్ అధినేత నరసారెడ్డి హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి టీనగర్ కేసరి పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోపాలయ్యా అధ్యక్షత వహించారు. విద్యార్థులను ఉద్దేశించి నరసారెడ్డి మాట్లాడుతూ మూడేళ్లుగా కేసరి మహోన్నత పాఠశాల ఉత్తమ ఫలితాలను సాధిస్తూ నగరంలో ప్రత్యేక గుర్తింపు పొందడం సంతోషంగా ఉందన్నారు. విద్యతో ఏదైనా సాధించవచ్చునన్నారు. కార్యక్రమంలో ముందుగా గోపాలయ్య మాట్లాడుతూ మూడేళ్లుగా టీనగర్ కేసరి మహోన్నత పాఠశాల మంచి ఉత్తీర్ణత సాధిస్తుందన్నారు. తమ పాఠశాల ఉత్తమ ఫలితాలు సాధించడానికే నరసారెడ్డి పాత్ర ఉందని అన్నారు. పాఠశాల ఉపాధ్యక్షులు రాధాకృష్ణ, ఆస్కా సభ్యులు ఎరుకలయ్య, కృష్ణ, సాయినాథ్, శ్రీధర్, శ్రీనివాసులు పాల్గొన్నారు. -
ట్యూటర్లెక్కడ?
కరీంనగర్ సిటీ : రెగ్యులర్ విద్యార్థులకు దీటుగా ఉత్తమ ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో హాస్టళ్లలో నియమించాల్సిన ట్యూటర్ల జాడ జిల్లాలో లేకుండాపోయింది. విద్యాసంవత్సరం ప్రారంభమై నెల రోజులు దాటినా ఏ హాస్టల్లో ట్యూటర్‌ను నియమించిన దాఖలాలు లేవు. జిల్లాలో 53 బీసీ, 93 ఎస్సీ, 22 ఎస్టీ సంక్షేమ వసతిగృహాలు ఉన్నాయి. వీటిలో 15 వేల మంది విద్యార్థులు ఉంటున్నారు. ఏడో తరగతి, పదో తరగతి విద్యార్థులకు సాధారణ బోధనతో పాటు అదనంగా నాణ్యతతోకూడిన ఉత్తమ బోధన అందించేందుకు ప్రభుత్వం ట్యూటర్ల వ్యవస్థ ప్రవేశపెట్టింది. ఈ రెండు తరగతుల విద్యార్థులను బోర్డు పరీక్షలకు సన్నద్ధం చేయడం, మెరుగైన ఫలితాలు రాబట్టడంలో ట్యూటర్ల పాత్ర కీలకం. ట్యూటర్‌గా ఉండడానికి కనీస విద్యార్హత డిగ్రీ కాగా, బీఈడీ ఉన్న వారికి ప్రాధాన్యతనిస్తారు. సబ్జెక్ట్‌కు ఒకరు చొప్పున మ్యాథ్స్, ఇంగ్లిష్, సైన్స్ సబ్జెక్ట్‌లకు ముగ్గురు ట్యూటర్లను ప్రతీ హాస్టల్‌కు నియమిస్తారు. హాస్టల్‌కు ముగ్గురు చొప్పున జిల్లా వ్యాప్తంగా 504 మంది ట్యూటర్లను నియమించాల్సి ఉంది. విద్యాసంవత్సరం ఆరంభంలోనే వీరిని నియమించడం లేదా కొనసాగించడం చే యాలి. కానీ, ఇప్పటివరకు నియమించకపోవడంతో హాస్టల్ విద్యార్థులు చదువుల్లో వెనకబడిపోతున్నారు. వేతనంతోనే సమస్య హాస్టళ్లలో ట్యూటర్ల నియామకానికి వారి వేతనమే అడ్డుగా నిలుస్తోందని సంక్షేమశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రతీ రోజు సాయంత్రం గంట పాటు బోధన చేసే ఈ ట్యూటర్లకు ప్రభుత్వం నెలకు కేవలం రూ.500 మాత్రమే చెల్లిస్తోంది. దీంతో హాస్టళ్లలో బోధించేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని సంక్షేమాధికారులు వాపోతున్నారు. గ్రామాల్లో ట్యూటర్ల సమస్య లేకున్నా... పట్టణాల్లో మాత్రం ఎవరూ ఆసక్తి కనపరచడం లేదు. పైవేట్ విద్యాసంస్థలు కోకొల్లలుగా ఉన్న పట్టణాల్లో రూ.500 వేతనంతో ట్యూటర్లుగా హాస్టళ్లలో పనిచేయడానికి ఎవరూ ప్రాధాన్యతనివ్వడం లేదు. వేతనం పెంచితే ఎవరైనా ముందుకు వచ్చే అవకాశముందని వార్డెన్లంటున్నారు. మొత్తానికి విద్యాసంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా ట్యూటర్ల ఊసే లేకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా ఉన్నతాధికారులు, సంక్షేమశాఖ అధికారులు వెంటనే ట్యూటర్ల సమస్యకు పరిష్కారం చూపిస్తేనే హాస్టల్ విద్యార్థుల నూటికి నూరుశాతం ఫలితాల లక్ష్యం నెరవేరుతుంది. -
ఫిజురీయింబర్స్మెంట్ మంచి ఫలితాలను ఇస్తుంది