better facilities
-
బాలల సంరక్షణకు భారత్ చర్యలు భేష్
ఐక్యరాజ్య సమితి: అంతర్జాతీయంగా భారత్‌కు మరో శుభపరిణామమిది. చిన్న పిల్లలు సాయుధ పోరాటాల వైపు వెళ్లకుండా కట్టడి చేసినందుకు గాను ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ (యూఎన్ఎస్జీ) వార్షిక నివేదిక నుంచి భారత్ పేరును తొలగించినట్టుగా యూఎన్ సెకట్రరీ జనరల్ ఆంటోనియా గుటెరెస్ తెలిపారు. సాయుధ ఘర్షణల ప్రభావం పడకుండా చిన్నారుల మెరుగైన సంరక్షణ కోసం భారత్ తీసుకున్న చర్యల్ని గుటెరెస్ స్వాగతించారు. 2010 నుంచి భారత్ పేరు ఈ నివేదికలో ఉంటూ వస్తోంది. కశ్మీర్లో ఉగ్రసంస్థలు బాలలను నియమించడం, భద్రత పేరుతో సైనికులు తిరిగి అదుపులోకి తీసుకోవడం వంటివాటితో భారత్ పేరు ఆ నివేదికలో ఉంటూ వస్తోంది. భారత్‌తో పాటు బుర్కినా ఫాసో, కేమరూన్, నైజీరియా, పాకిస్తాన్, ఫిలిఫ్పీన్స్లోనూ చిన్నారులు ఉగ్రముఠాల్లో చేరుతున్నట్టు యూఎన్ నివేదికలు చెబుతున్నాయి. బాలల హక్కుల పరిరక్షణకు కశ్మీర్లో ఒక కమిషన్‌ను ఏర్పాటు చేయడంపై గుటెరెస్ హర్షం వ్యక్తం చేశారు. బాలల సంక్షేమం కోసం చేపట్టిన చర్యలతో ఛత్తీస్‌గఢ్, అసోం, జార్ఖండ్, ఒడిశా, జమ్ముకశ్మీర్‌లలో బాలల సంరక్షణ మెరుగైందని ఆ నివేదిక వెల్లడించింది. -
రైళ్లలో సూపర్ సౌకర్యాలు.. ఇక అంతా ఆటోమేటిక్కే!
దేశంలో రైళ్లు.. కోట్లాది మందికి అనువైన ప్రయాణ సాధనాలు. ఇతర సాధనాలతో పోలిస్తే చార్జీలు తక్కువగా ఉండటంతో అనేక మంది రైళ్లనే ఆశ్రయిస్తుంటారు. అయితే సౌకర్యాలు సరిగా లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతుంటారు. ముఖ్యంగా టాయిలెట్ల విషయం చెప్పనక్కర్లేదు. ఎక్కువ మంది ప్రయాణిస్తున్న కారణంగా వీటి నిర్వహణ సక్రమంగా ఉండటం లేదు. ఇలాంటి ఇబ్బందులకు భారత రైల్వే శాఖ చెక్ పెడుతూ సరికొత్త సౌకర్యాలను తీసుకొస్తోంది. రైళ్లలో ప్రస్తుతం ఉన్న టాయిలెట్ల స్థానంలో మెరుగైన సౌకర్యాలతో రూపొందించిన బయో టాయిలెట్లను ఏర్పాటు చేస్తామని భారతీయ రైల్వే తెలిపింది. దీనికి సంబంధించి కొత్తగా రూపొందించిన బయో టాయిలెట్లతో కూడిన ఏసీ కోచ్‌ను రాంచీ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రవేశపెట్టింది. దీనిపై ప్రయాణికుల అభిప్రాయాలు తీసుకుని తర్వాత మిగతా రైళ్లలోనూ వీటిని అందుబాటులోకి తెస్తామని తెలిపింది. ముక్కు మూసుకోవాల్సిన పని లేదు! రైల్వే శాఖ రూపొందించిన ఈ బయో టాయిలెట్లు ఆటోమేటిక్ హైజీన్, వాసన నియంత్రణ వ్యవస్థలను కలిగి ఉంటాయి. అలాగే నీటి కొళాయిలు, సోప్ డిస్పెన్సర్లు కూడా టచ్ ఫ్రీ అంటే సెన్సార్ ఆధారితంగా ఉంటాయి. అయితే వీటిని దొంగిలించకుండా కూడా ఏర్పాట్లు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. వీటితో పాటు తలుపులు, గ్యాంగ్‌వేలను మెరుగు పరిచింది రైల్వే శాఖ. అసౌకర్యమైన టాయిలెట్లపై ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో రైల్వే శాఖ ఈ చర్యలు చేపట్టింది. -
‘చిన్నమ్మ జైలులో బానే ఉన్నారు.. త్వరలో చెన్నైకి’
బెంగళూరు: ఇప్పుడ్పిపుడే జైలు వాతావరణాన్ని చిన్నమ్మ శశికళ అలవాటు చేసుకుంటున్నారని అన్నాడీఎంకే కర్ణాటక విభాగం కార్యదర్శి వీ పుగాజెండి తెలిపారు. అయితే, ఆమె వయోభారం రీత్యా కొన్నిప్రత్యేక సౌకర్యాలు అవసరం అని చెప్పారు. వాటికోసం మరోసారి కూడా దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు. అక్రమాస్తుల కేసులో దోషిగా తేలి ప్రస్తుతం బెంగళూరులోని జైలులో శశికళ ఉంటున్న విషయం తెలిసిందే. తనకు ప్రత్యేక సౌకర్యాలను ఏర్పాటుచేయాలని చేసుకున్న వినతికి కోర్టు నిరాకరించింది. అయితే, తనకు ఓ టేబుల్ ఫ్యాన్, మంచి పరుపునైనా అనుమతించాలని, తన ఆరోగ్యం, వయసు రీత్యా అవి అవసరం అని మరోసారి తన పిటిషన్లో పేర్కొన్నారట. ‘చిన్నమ్మ బాగున్నారు. కాకపోతే కాస్తంత నీరసంగా ఉన్నారు. ఆమె షుగర్ లెవల్, రక్తపోటు సాధారణంగానే ఉంది. ఇప్పుడిప్పుడే ఆమె జైలు వాతావరణానికి తగినట్లుగా సర్దుకుంటున్నారు. వయసు, ఆరోగ్యం దృష్ట్యా చిన్నచిన్న సౌకర్యాలకోసం ఆమె దరఖాస్తు చేసుకున్నారు. అవి ఆమెకు అందుతాయని నేను ఆశిస్తున్నాను. ఆమెను చెన్నైలోని కేంద్ర కారాగారంలోకి తరలించేంత వరకు ఎటాచ్ బాత్రూమ్తో కూడిన సెల్, ఒక మంచం, పరుపు, ఒక టేబుల్ ఫ్యాన్లాంటివి ఇస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆమె విజ్ఞప్తి సరైనదే’ అని కూడా పుగాజెండి చెప్పారు. తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి త్వరలోనే న్యాయవాదులతో జైలు వద్దకు వచ్చి ఆమెను చెన్నై తరలించేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తారని తెలిపారు. గతంలో కూడా గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్న అనుభవం శశికళకు ఉందని చెప్పారు. -
విద్యార్థులకు మెరుగైన సౌకర్యాల కల్పన
మంత్రి రావెల కిషోర్‌బాబు పాతగుంటూరు: జిల్లాలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు చెప్పారు. రూ.52 కోట్లతో నాలుగు ప్రాంతాల్లో గురుకుల పాఠశాలల భవనాలను నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. నగరంలోని రాజావారితోటలోని వెనుకబడిన తరగతుల సంక్షేమ బాలికల వసతి గృహాన్ని బుధవారం ఆయన సందర్శించారు. హిందూ కళాశాల, ఆంధ్రాబ్యాంక్ సమకూర్చిన దుప్పట్లను విద్యార్థులకు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ తాడికొండ, గుంటూరు రూరల్ మండలం అడవితక్కెళ్లపాడు, కాకుమానుల్లో గురుకుల పాఠశాలల భవనాలు నిర్మిస్తామని చెప్పారు. ఒక్కొక్క గురుకుల పాఠశాలకు రూ.13 కోట్లు కేటారుుంచామని తెలిపారు. కోర్టు వివాదం తీరిన వెంటనే కాకుమాను గురుకుల పాఠశాల పనులు చేపడతామన్నారు. తాడికొండలో 10 ఎకరాలు, కాకుమానులో ఏడు ఎకరాల స్థలంలో పాఠశాలలు ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. ప్రతి పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. ప్రపంచాన్ని జయించే శక్తి నేటి విద్యార్థులకు ఉందన్నారు. వారు ఉన్నత స్థాయికి ఎదిగేందుకు తల్లిదండ్రుల ప్రోత్సాహం, గురువుల బోధన అవసరమన్నారు. విద్యార్థులు బాగా చదువుకునేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. విద్యార్థులకు ఏ సమస్య వచ్చినా టోల్‌ఫ్రీ నంబర్ 180042513521కు ఫోన్ చేయవచ్చన్నారు. ఆంధ్రాబ్యాంక్ డీజీఎం గిరీష్‌కుమార్, ఏజీఎంలు రత్నకుమారి, సుబ్బారావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.