bhanwarl lal
-
ఆ తీర్మానాన్ని కేంద్రానికి పంపలేదు
సాక్షి ప్రతినిధి, చెన్నై: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో శిక్షననుభవిస్తున్న ఖైదీలను విడుదల చేయాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం చేసిన తీర్మానాన్ని కేంద్రం పరిశీలనకు పంపినట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ ఖండించారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమంత్రి పళనిస్వామి అధ్యక్షతన ఈనెల 9వ తేదీన సమావేశమైన మంత్రివర్గం.. ఏడుగురు రాజీవ్ హంతకుల విడుదలకు సిఫారసు చేస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఆ తీర్మాన ప్రతిని గవర్నర్‌కు కూడా పంపింది. అయితే, గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో అనేక ఊహాగానాలు చోటుచేసుకున్నాయి. సుప్రీంకోర్టు తీర్పు ప్రతులు ఈనెల 14న మాత్రమే తమకు అందాయని, నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉందని గవర్నర్ కార్యాలయం పేర్కొంది. -
సార్వత్రిక ఎన్నికలపై మున్సి‘పోల్స్’ ప్రభావం
-
సార్వత్రిక ఎన్నికలపై మున్సి‘పోల్స్’ ప్రభావం
సాధారణ ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకు ఫలితాలు ప్రకటించొద్దు సీఈవోకి రాజకీయ పార్టీల వినతి ఫలితాల వాయిదాపై ఈసీకి నివేదిస్తాం: సీఈవో భన్వర్‌లాల్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ముందుగా జరగనున్న మునిసిపల్ ఎన్నికల ఫలితాల ప్రభావం ఆ తర్వాత జరిగే సార్వత్రిక ఎన్నికలపై పడే ప్రమాదం ఉందని పలు రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి. వీలైతే మునిసిపల్ ఎన్నికలు ముందుగా జరగకుండా చూడాలని, అలా సాధ్యం కాని పక్షంలో ఆ ఎన్నికల ఫలితాలనైనా సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకూ వెల్లడించకుండా చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) భన్వర్‌లాల్‌కు రాజకీయ పార్టీలన్నీ విన్నవించాయి. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో బుధవారం సాయంత్రం భన్వర్‌లాల్ నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్సీ సి.కమలాకర్ రెడ్డి (కాంగ్రెస్), రవీందర్ (టీడీపీ), వై.వెంకటేశ్వరరావు (సీపీఎం), కె.లక్ష్మణ్ (బీజేపీ) తదితరులు పాల్గొన్నారు. శాంతియుత వాతావరణంలో స్వేచ్ఛాయుత ఎన్నికలు జరిగేలా అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని భన్వర్‌లాల్ కోరారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసే వరకు మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ప్రకటించకుండా నిలుపుదల చేసే అంశాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు నివేదిస్తామని తెలిపారు. మున్నిపోల్స్ సన్నద్ధంపై రమాకాంత్‌రెడ్డి చర్చ మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పి.రమాకాంత్‌రెడ్డి ఉన్నతాధికారులతో బుధవారం బుద్ధభవన్‌లో సమావేశం నిర్వహించారు. డీజీపీ ప్రసాదరావు, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్ కల్లం, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి సమీర్‌శర్మ, సీడీఎంఏ జనార్దన్‌రెడ్డి, ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శితో చర్చించారు. స్థానిక సంస్థల్లో శాంతిభద్రతల పరిస్థితి, పోలీసు బలగాల మోహరింపు, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలతోపాటు, ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసేలా తీసుకోవాల్సిన చర్యలపై డీజీపీ ప్రసాదరావు, శాంతిభద్రతల అదనపు డీజీపీతో చర్చించారు. చెక్‌పోస్టులు, పట్టణాలు, నగరాల్లో వాహనాల తనిఖీలు చేపట్టి... అక్రమంగా డబ్బు తరలిస్తుంటే సీజ్ చేయాలని నిర్దేశించారు. అనధికార మద్యం షాపులను తక్షణమే మూసివేయించాలని, మద్యం దుకాణాలు ప్రభుత్వం విధించిన సమయానికి మించి ఎట్టిపరిస్థితుల్లోనూ తెరిచి ఉంచకుండా చర్యలు తీసుకోవాలన్నారు. -
రాష్ట్ర విభజనతో ఎన్నికలకు సంబంధం లేదు: భన్వర్‌లాల్
హైదరాబాద్: ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకారమే రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ స్పష్టం చేశారు. రాష్ట్ర విభజనతో ఎన్నికలకు సంబంధం లేదని భన్వర్‌లాల్ తేల్చి చెప్పారు. ఎన్నికలకు పూర్తి సన్నద్ధంగా ఉన్నామా అనే విషయాన్ని ఎన్నికల కమిషన్ చర్చించి తుది నిర్ణయం తీసుకుంటుందని ఆయన తెలిపారు. ఈ నెల 25లోపు ఎన్నికల బదిలీలు పూర్తి చేయమని జిల్లాల కలెక్టర్లను ఆదేశించినట్టు చెప్పారు. ఓటర్ లీస్టులో పేరుందో లేదో ప్రతి ఒక్కరూ ముందుగా చెక్ చేసుకోవాలని భన్వర్‌లాల్ సూచించారు. కాగా, 9246 2800 27 అనే నంబర్‌కు VOTE స్పెస్ ఇచ్చి EPIC కార్డు నంబర్ ఎంటర్ చేసి ఎస్ఎమ్ఎస్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చనని భన్వర్‌లాల్ చెప్పారు. -
కొత్త ఈవీఎంలొస్తే తొలి దశలోనే పోలింగ్
నెలాఖరుకల్లా సిద్ధంకాకుంటే ఆఖరి దశలోనే బెంగళూరు భెల్, హైదరాబాద్ ఈసీఐఎల్‌లో తయారీ సాక్షి, హైదరాబాద్: త్వరలో జరగనున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో మన రాష్ట్రంలో అన్నీ కొత్త ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎంల)నే వినియోగించనున్నారు. ఇందుకోసం మూడు లక్షలకు పైగా బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (భెల్), హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్)లో తయారవుతున్నాయి. ఈ ప్రక్రియ నెలాఖరుకల్లా పూర్తయితే తొలి దశ తనిఖీలు జరిగి, ఎన్నికల నాటికి ఈవీఎంలు సిద్ధంగా ఉంటాయని ఎన్నికల కమిషన్ వర్గాలు తెలిపాయి. వాటితో 2009లో జరిగిన తరహాలోనే తొలి దశలో రాష్ట్రంలో పోలింగ్ జరుగుతుందని చెబుతున్నాయి. ఒకవేళ అవి నెలాఖరులోగా సిద్ధంగాకుంటే ఆఖరి దశల్లో పోలింగ్ ఉంటుందంటున్నాయి. 2006 సంవత్సరానికి ముందు తయారు చేసిన ఈవీఎంలను రాష్ట్రంలో ఇప్పటివరకు వినియోగిస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో అన్నీ కొత్తవే ఉపయోగించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు వినియోగించిన ఈవీఎంలన్నింటినీ ఇతర రాష్ట్రాలకు తరలించారు. ఈ కొత్త ఈవీఎంలపై ‘నన్ ఆఫ్ ది ఎబౌ’ (నోటా) గుర్తు కూడా ఉంటుంది. ఒక్కో ఈవీఎంపై 16 మంది అభ్యర్థుల పేర్లు, వారికి కేటాయించిన గుర్తులు ఉంటాయి. ఇప్పుడు కొత్తగా నోటా రావడంతో 15 మంది పేర్లు, గుర్తులకే అవకాశం ఉంటుంది. వ్యయంపై నిఘాకు సిద్ధంగా ఉండండి: రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ ముమ్మరం చేశారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తేదీ నుంచే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వస్తుంది. నాటి నుంచి అభ్యర్థులు, పార్టీల ఎన్నికల వ్యయంపై నిఘా పెట్టేందుకు మండల, నియోజకవర్గాల వారీగా అధికారులతో కూడిన బృందాలను ఏర్పాటు చేసి సిద్ధంగా ఉండాలని కలెక్టర్లకు భన్వర్‌లాల్ ఆదేశాలు జారీ చేశారు. ఈ బృందాల్లో పోలీసు అధికారి, మండల అభివృద్ధి అధికారి, తహసిల్దారుతో పాటు ఒక వీడియోగ్రాఫర్ కూడా ఉండాలని స్పష్టం చేశారు. అలాగే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుపై బృందం సభ్యులకు శిక్షణ ఇప్పించాలని సూచించారు. గత ఎన్నికలకు సంబంధించిన నాన్‌బెయిబుల్ వారెంట్లను ఇప్పటినుంచే అమలుచేయాలని కూడా ఆదేశాల్లో స్పష్టం చేశారు. -
షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు: భన్వర్‌లాల్
‘సాక్షి’తో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ వాయిదా ప్రచారంలో వాస్తవం లేదు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని, అందుకు అనుగుణంగానే ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) భన్వర్‌లాల్ స్పష్టం చేశారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలు వాయిదా పడతాయనే ప్రచారంలో వాస్తవం లేదన్నారు. నియోజకవర్గాల పునర్విభజన ఈ ఎన్నికల తర్వాత 2019 ఎన్నికలకు ముందు చేస్తారని చె ప్పారు. రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లను ఇటీవల సమీక్షించిన కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) సంతృప్తి వ్యక్తం చేసినట్లు శుక్రవారం ‘సాక్షి’తో మాట్లాడుతూ సీఈఓ వెల్లడించారు. - రాష్ట్రంలో ఓటర్ల నమోదు ప్రక్రియపైన కూడా కమిషన్ సంతృప్తిని వ్యక్తం చేసింది. - ఎన్నికల ఏర్పాట్లను మరోమారు సమీక్షించేందుకు నాతో పాటు సీఎస్, డీజీపీలతో ఈ నెల 20న ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేసింది. - 76 లక్షల మంది కొత్త ఓటర్లు నమోదయ్యూరు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని గుర్తించాం. ఒక్కో పోలింగ్ కేంద్రానికి పది మంది సిబ్బంది చొప్పున 70 వేల పోలింగ్ కేంద్రాలకు 7 లక్షల మంది సిబ్బందిని గుర్తించాం. ప్రస్తుతం రాష్ట్ర విభజన సంబంధిత పరిణామాల నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతంలో ఉద్యోగుల సమ్మె గురించి కూడా ఈసీ దృష్టికి తీసుకెళ్లాం. - రాష్ర్టంలో పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలతో పాటు ఇతర పరీక్షలన్నీ ఏప్రిల్ 23వ తేదీకల్లా పూర్తి అవుతాయని కమిషన్‌కు చెప్పాం. - ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాక ఉద్యోగులు సమ్మె చేయరాదు. ఎన్నికల విధుల్లో పాల్గొనాల్సిందే. - ఈసీ నిబంధనలకు విరుద్ధంగా ఎవరిని బదిలీ చేసినా నిలుపుదల చేస్తాం. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే నిబంధనలకు విరుద్ధంగా జరిగిన కొన్ని బదిలీలను నిలుపుదల చేస్తున్నాం. - నిబంధనల మేరకు ఈ నెల 25లోగా బదిలీల ప్రక్రియను పూర్తి చేయాలని కమిషన్ ఆదేశించింది.