Bharat Petroleum Corporation
-
ఐవోసీ రైట్స్‌కు బోర్డు ఓకే
న్యూఢిల్లీ: ఇంధన రంగ ప్రభుత్వ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) రైట్స్ ఇష్యూ చేపట్టనుంది. ఇందుకు బోర్డు అనుమతించినట్లు తాజాగా వెల్లడించింది. తద్వారా రూ. 22,000 కోట్లు సమీకరించనున్నట్లు తెలియజేసింది. ఇటీవల రైట్స్ ఇష్యూకి వెళ్లేందుకు మరో చమురు పీఎస్‌యూ భారత్ పెట్రోలియం కార్పొరేషన్(బీపీసీఎల్) బోర్డు సైతం అనుమతినివ్వగా.. నంబర్ వన్ కంపెనీ ఐవోసీ తాజాగా జత కలిసింది. వెరసి రెండు సంస్థలూ ఈక్విటీ షేర్ల జారీ ద్వారా భారీగా పెట్టుబడులను సమకూర్చుకోనున్నాయి. రైట్స్ జారీ ద్వారా వివిధ ప్రాజెక్టుల పెట్టుబడి వ్యయాలకు నిధులు సమకూర్చుకోనున్నట్లు ఐవోసీ పేర్కొంది. వెరసి కంపెనీలో ప్రమోటర్‌గా కేంద్ర ప్రభుత్వం సైతం రైట్స్‌కు సబ్ర్‌స్కయిబ్ చేయడం ద్వారా పెట్టుబడులు సమకూర్చనుంది. కర్బన ఉద్గారరహిత ప్రాజెక్టుల కోసం కేంద్ర ప్రభుత్వం చమురు పీఎస్‌యూలకు పెట్టుబడులు అందించే ప్రణాళికల్లో ఉన్న నేపథ్యంలో రైట్స్ ప్రతిపాదనలకు ప్రాధాన్యం ఏర్పడింది. రూ. 18,000 కోట్లకు సై పీఎస్‌యూ దిగ్గజం బీపీసీఎల్ బోర్డు గత నెల (జూన్) 28న రైట్స్ ఇష్యూకి అనుమతించింది. తద్వారా కంపెనీ రూ. 18,000 కోట్లు సమీకరించేందుకు గ్రీన్‌సిగ్నల్ లభించింది. ప్రభుత్వం వార్షిక బడ్జెట్లో ఇంధన రంగ పీఎస్‌యూలు బీపీసీఎల్, ఐవోసీ, హెచ్పీసీఎల్లకు మొత్తం రూ. 30,000 కోట్ల పెట్టుబడులు సమకూర్చుకునేందుకు ప్రతిపా దించిన సంగతి తెలిసిందే. తద్వారా కర్బన ఉద్గార రహిత సన్నాహాలకు మద్దతిచ్చేందుకు నిర్ణయించింది. ఇక ఓఎన్జీసీకి మెజారిటీ వాటా గల మరో పీఎస్‌యూ హెచ్‌పీసీఎల్.. ప్రిఫరెన్షియల్ షేర్ల జారీ ద్వారా ప్రభుత్వ పెట్టుబడులు సమకూర్చుకునే వ్యూహాల్లో ఉంది. కాగా.. గత నెలలో ఐవోసీ అధీకృత వాటా మూలధనాన్ని రెట్టింపునకు అంటే రూ. 30,000 కోట్లకు పెంచుకున్న సంగతి తెలిసిందే. జేవీ బాటలో దేశీయంగా బ్యాటరీ స్వాపింగ్ బిజినెస్ నిర్వహించేందుకు భాగస్వామ్య సంస్థ(జేవీ)ను ఏర్పాటు చేయనున్నట్లు ఐవోసీ పేర్కొంది. ఇందుకు బోర్డు తాజాగా అనుమతించినట్లు వెల్లడించింది. సన్ మొబిలిటీ పీటీఈ లిమిటెడ్, సింగపూర్‌తో సమాన భాగస్వామ్యాన(50:50 శాతం వాటా) ప్రయివేట్ రంగ జేవీకి తెరతీయనున్నట్లు వివరించింది. 2026–27 ఆర్థిక సంవత్సరంవరకూ రూ. 1,800 కోట్ల ఈక్విటీ పెట్టుబడులతో జేవీని ఏరా>్పటు చేయనున్నట్లు తెలియజేసింది. సొంత అనుబంధ సంస్థ ఐవోసీఎల్ సింగపూర్ పీటీఈ లిమిటెడ్, సింగపూర్‌లో ఫ్రిఫరెన్స్ షేర్లు, వారంట్ల ద్వారా 78.31 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసేందుకు సైతం బోర్డు ఓకే చెప్పినట్లు వెల్లడించింది. ఈ వార్తల నేపథ్యంలో ఐవోసీ షేరు ఎన్ఎస్ఈలో 0.8 శాతం బలపడి రూ. 99.40 వద్ద ముగిసింది. 13న ఎన్ఎస్ఈలో త్రిధ్య లిస్టింగ్ ఐపీవోతో రూ. 26 కోట్లు సమీకరణ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సంస్థ త్రిధ్య టెక్ ఎన్ఎస్ఈ ఎస్ఎంఈ ప్లాట్‌ఫామ్ ద్వారా ఈ నెల 13న లిస్ట్‌కానుంది. కంపెనీ షేరుకి రూ. 35–42 ధరలో చేపట్టిన పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 26.41 కోట్లు సమకూర్చుకుంది. ఇష్యూలో భాగంగా 62.88 లక్షల షేర్లను విక్రయించింది. జూన్ 30– జూలై 5 మధ్య చేపట్టిన ఇష్యూకి 72 రెట్లు అధిక స్పందన లభించింది. ప్రధానంగా సంస్థాగతేతర, రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన లభించినట్లు కంపెనీ వెల్లడించింది. నిధులను రుణాల చెల్లింపు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 183 రెట్లు, రిటైలర్ల నుంచి 68 రెట్లు అధికంగా బిడ్స్ దాఖలైనట్లు కంపెనీ వెల్లడించింది. అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్) విభాగంలో 16 రెట్లు అధిక స్పందన నమోదైంది. కాకా ఇండస్ట్రీస్ ఐపీవో 10న షేరుకి రూ. 55–58 ధరల శ్రేణి న్యూఢిల్లీ: పాలిమర్ ఆధారిత ప్రొఫైల్స్ తయారీ కంపెనీ కాకా ఇండస్ట్రీస్ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 10న(సోమవారం) ప్రారంభంకానుంది. 12న (బుధవారం) ముగియనున్న ఇష్యూకి ధరల శ్రే ణి రూ. 55–58కాగా.. చిన్న, మధ్యతరహా సంస్థ ల కోసం ఏర్పాటైన బీఎస్ఈ ఎస్ఎంఈ ప్లాట్‌ఫా మ్ ద్వారా లిస్ట్‌కానుంది. ఇష్యూలో భాగంగా కంపెనీ 36.6 లక్షల షేర్లను విక్రయానికి ఉంచనుంది. తద్వారా రూ.21.23 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. -
బీపీసీఎల్, ఎయిరిండియా విక్రయం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు రిఫైనరీ దిగ్గజం భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్), విమానయాన సంస్థ ఎయిరిండియాల విక్రయం సాధ్యమైనంత వరకూ ఈ ఆర్థిక సంవత్సరంలోనే ముగించాలని కేంద్రం యోచిస్తోంది. మార్చి నాటికల్లా అమ్మకం పూర్తి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఎయిరిండియాపై చాలా మంది ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నట్లు ఆమె వివరించారు. ఎయిరిండియా విక్రయానికి ప్రభుత్వం ప్రయత్నించడం ఇది రెండోసారి. 76%వాటాలను అమ్మేందుకు గతేడాది ప్రయత్నించినప్పటికీ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపకపోవడంతో విరమించుకోవాల్సి వచ్చింది. మరోవైపు, పెట్టుబడులకు ఊతమిచ్చేలా కేంద్రం గత ఐదేళ్లలో పలు సంస్కరణలు ప్రవేశపెట్టిందని, ఇవి 2024–25 నాటికి భారత్‌ను 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న లక్ష్య సాధనకు తోడ్పడతాయని సోమవారం లోక్‌సభలో నిర్మలా సీతారామన్ చెప్పారు. వ్యాపారానికి మరింత వెసులుబాటు దేశంలో వ్యాపార నిర్వహనకు మరింత సులభతరమైన వాతావరణాన్ని సృష్టించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి బృందం– కంపెనీ లా కమిటీ సూచించింది. ఈ మేరకు కార్పొరేట్ వ్యవహారాల కార్యదర్శి ఇంజెటి శ్రీనివాస్ నేతృత్వంలోని కమిటీ నివేదికను కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్‌కు సమరి్పంచింది. -
బీపీసీఎల్‌లో 3% వాటాల డిజిన్వెస్ట్‌మెంట్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ చమురు దిగ్గజం భారత్ పెట్రోలియం కార్పొరేషన్లో (బీపీసీఎల్) 3 శాతం వాటాలను విక్రయించాలని కేంద్రం యోచిస్తోంది. తద్వారా రూ. 1,800 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. -
సబ్సిడీ తోడ్పాటుతో బీపీసీఎల్‌కు లాభాలు
నికర లాభం రూ.551 కోట్లు న్యూఢిల్లీ: భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలానికి రూ.551 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఇంధన అమ్మకాలపై వచ్చిన నష్టాలకు పూర్తి పరిహారం లభించడమే దీనికి కారణమని వివరించింది. అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా తగ్గడంతో నిల్వ నష్టాలు రూ.1,600 కోట్లుగా ఉన్నప్పటికీ ఈ స్థాయి నికర లాభం సాధించామని బీపీసీఎల్ పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం రూ.1,080 కోట్ల నగదు సబ్సిడీని, ఓఎన్జీసీ వంటి అయిల్ అప్‌స్ట్రీమ్ కంపెనీలు రూ.2,333 కోట్లు చెల్లించాయని వివరించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి రూ.1,089 కోట్ల నికర నష్టాలు వచ్చాయని వివరించింది. గత క్యూ3లో రూ.64,768 కోట్లుగా ఉన్న అమ్మకాలు ఈ క్యూ3లో రూ.57,915 కోట్లకు, స్థూల రిఫైనింగ్ మార్జిన్ 1.76 డాలర్ల నుంచి 1.54 డాలర్లకు తగ్గిందని తెలిపింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేర్ ఎన్ఎస్ఈలో 2.7 శాతం వృద్ధితో రూ.725కు పెరిగింది. -
పెట్రోలు బంకుల మోసాలు...గప్ ‘చిప్’
మళ్లీ ‘చిప్’ బాగోతం బట్టబయలు అటు కొలతలో తరుగు.. ఇటు నాణ్యతలో దగా ఎడాపెడా వినియోగదారులకు టోకరా బంకుల యాజమాన్యాల ఇం‘ధన’ దోపిడీ ఫిర్యాదులొస్తేనే తూ.కొ. శాఖ చర్యలు సాక్షి, సిటీ బ్యూరో: పెట్రోలు బంకుల మోసాలకు అడ్డుకట్ట పడటం లేదు. అటు కొలతలో.. ఇటు నాణ్యతలో వినియోగదారులు దగా పడుతూనే ఉన్నారు. పంపింగ్‌లో, మీటర్ రీడింగ్‌లో చేతివాటం చూపడం దగ్గర్నుంచి ఏకంగా ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించడం వరకు మోసాల స్థాయి పెరిగి.. యథేచ్ఛగా సాగుతూనే ఉంది. ఫలితంగా ఇం‘ధన’ రూపేణా గ్రేటర్‌లోని పెట్రోల్, డీజిల్ వినియోగదారుల జేబుకు నిత్యం లక్షల్లో చిల్లుపడుతోంది. బుధవారం భారత్ పెట్రోలియం కార్పొరేషన్‌కు చెందిన ఉప్పల్‌లోని జయలీల ఫిల్లింగ్ స్టేషన్ మోసాల తంతు బట్టబయలైన తీరు మరోసారి వినియోగదారులు ఉలిక్కిపడేలా చేసింది. బంకుల నిర్వాహకులు తమపై సరైన నిఘా, పర్యవేక్షణ లేకపోవడాన్ని సాకుగా తీసుకుని సాఫ్ట్వేర్ చిప్‌లతో మీటర్ రీడింగ్‌లో జంపింగ్‌కు పాల్పడుతూ దోపిడీ చేస్తున్నారు. ఈ పరిస్థితికి అడ్డుకట్ట వేయాల్సిన తూనికల, కొలతల శాఖ అధికారులు.. వినియోగదారుల నుంచి ఫిర్యాదులందితే కానీ కాలు కదపట్లేదు. పోలీసు టాస్క్‌ఫోర్స్ ప్రత్యేక బృందం ఆరు నెలల క్రితం పెట్రోలు బంకుల సాఫ్ట్వేర్ చిప్ మోసాలను బయటపెట్టినా.. తూనికలు కొలతల శాఖ నామమాత్రపు తనిఖీలతో సరిపెట్టింది. అప్పట్లోనే గట్టి చర్యలు తీసుకుని ఉంటే బుధవారం మరో మోసం బయటపడేది కాదు. బుధవారం నాటి ఘటనలో, ఉప్పల్ జయలీల బంకులో ప్రతి లీటర్‌కు 2.30 ఎంఎల్ మేర కొలతలో తరుగు ఉన్నట్టు తేలింది. అంటే ఈ లెక్కన గ్రేటర్ వ్యాప్తంగా ఉన్న బంకుల్లో ఏ మేరకు వినియోగదారులు నష్టపోతున్నారో అర్థం చేసుకోవచ్చు. జరిమానాలతో సరి.. బెదరని డీలర్లు పెట్రోలు బంకుల మోసాలపై నమోదవుతున్న కేసులు కేవలం జరిమానాలకే పరిమితవుతున్నాయి. దీంతో బంకుల డీలర్లు బెరుకు లేకుండా అక్రమాలకు పాల్పడుతున్నారు. ఆరు నెలల క్రితం కొన్ని ఫిల్లింగ్ యంత్రాల సాఫ్ట్‌వేర్‌లో ప్రత్యేక చిప్‌లను రిమోట్ ద్వారా ఆపరేట్ చేస్తూ, మరికొన్నింటిలో సాక్షాత్తూ ఆయిల్ కంపెనీలు సరఫరా చేసిన రిమోట్‌లోనే మార్పుచేర్పుల ద్వారా ఇంధనం పంపింగ్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నట్టు వెలుగుచూసిన ఘటన వినియోగదారులను నివ్వెరపరిచింది. అప్పట్లో ఆయిల్ కంపెనీలు సరఫరా చేసిన ఫిల్లింగ్ మిషన్ మోడల్‌ను తప్పుపట్టి హడావుడి చేసిన అధికారులు ఆపై నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకొన్నారు. బంకుల మోసాలపై భారత తూనికలు కొలతల చట్టం-2009 సెక్షన్ 22 కింద కేసులు నమోదు చేసి జరిమానాలతో సరిపెట్టారు. దీంతో బంకు యాజమాన్యాలకు భయం లేకుండాపోయింది. తాజాగా బుధవారం వెలుగుచూసిన ఘటనతో వినియోగదారులు కంగుతిన్నారు. మోసాలు ఇలా... పెట్రోల్ బంకులకు ఆయిల్ కంపెనీలే ఫిల్లింగ్ యంత్రాలను సరఫరా చేస్తాయి. కొన్ని కంపెనీలు నిబంధనలకు విరుద్ధంగా ఫిల్లింగ్ యంత్రంలో మార్పుచేర్పులతో పాటు రిమోట్ ద్వారా ఆపరేట్‌కు వెసులుబాటు కల్పించాయి దీన్ని ఆసరా చేసుకున్న యాజమాన్యాలు పెట్రోలు, డీజిల్ పంపింగ్ రీడింగ్‌లో జంపింగ్‌లకు పాల్పడుతూ వినియోగదారులకు తూకంలో టోకరా వేస్తున్నాయి కొన్ని కంపెనీల్లో ఫిల్లింగ్ యంత్రాలకు రిమోట్ వెసులుబాటు లేకున్నా.. పంపింగ్ యంత్రాల్లో ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను అమర్చి కొలతల్లో మోసాలకు పాల్పడుతున్నారు సాధారణంగా ప్రతి ఫిల్లింగ్ యంత్రానికి తూనికలు కొలతల శాఖ సీల్ వేసి ఉంటుంది. బంకుల యాజమాన్యాలు దీన్ని బ్రేక్ చేసి సైతం మోసాల సాఫ్ట్వేర్ చిప్‌లను అమర్చుతున్నారు పెట్రోల్ బంకుల్లోని ఫిల్లింగ్ యంత్రంపై చూస్తే రీడింగ్సవ్యంగానే కనిపిస్తుంది. కానీ, ప్రత్యేక సాఫ్ట్వేర్ చిప్‌లను అమర్చిన కారణంగా ప్రతి వెయ్యి లీటర్లలో 40 లీటర్ల మేర ఇంధనం బంకుల నిర్వాహకులకు ‘ఆదా’ అవుతోంది ఒక్కో బంకులో నిత్యం పది వేల లీటర్ల ఇంధనాన్ని విక్రయిస్తారనుకుంటే, 400 లీటర్ల మేర యాజమాన్యానికి ‘మిగులు’బాటవుతోంది. ఫలితంగా వినియోగదారులు ఎడాపెడా నష్టపోతున్నారు. -
ఆయిల్ ఇండియా లాభం 26% డౌన్
న్యూఢిల్లీ: గతేడాది(2013-14) క్యూ4(జనవరి-మార్చి)లో ప్రభుత్వ రంగ దిగ్గజం ఆయిల్ ఇండియా నికర లాభం 26% క్షీణించి రూ. 566 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది(2012-13) ఇదే కాలంలో రూ. 765 కోట్లను ఆర్జించింది. ఉత్పత్తి మందగించడం, సబ్సిడీ చెల్లింపులు పెరగడం లాభాలను ప్రభావితం చేసినట్లు కంపెనీ తెలిపింది. సబ్సిడీ చెల్లింపులు రూ. 1,850 కోట్ల నుంచి రూ. 2,348 కోట్లకు ఎగశాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు డీజిల్, వంటగ్యాస్ విక్రయాలవల్ల వాటిల్లే ఆదా య నష్టాలకుగాను ఆయి ల్ ఉత్పత్తి సంస్థలు 48% వరకూ సబ్సిడీలు చెల్లిస్తాయి. ముడిచమురు ఉత్పత్తికిగాను బ్యారల్‌కు 106.55 డాలర్ల చొప్పున బిల్లింగ్ చేసినప్పటికీ, 69.19 డాలర్లమేర సబ్సిడీ ఇవ్వడంతో నికరంగా 37.36 డాలర్లు మాత్రమే లభించినట్లు కంపెనీ వివరించింది. గతంలో బ్యారల్‌కు 56 డాలర్ల సబ్సిడీ ఇచ్చినప్పటికీ నికరంగా 55.44 డాలర్లు ఆర్జించినట్లు తెలిపింది.