bharosa yatra
-
ప్రజాభిప్రాయం మేరకే ‘రైతు భరోసా’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతు భరోసా పథకాన్ని ఎలా అమలు చేయా లన్న అంశంపై ప్రజాభిప్రాయం మేరకే ముందుకెళ్లాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. ఈ పథకం పరిధిలోకి వచ్చే భాగస్వామ్య పక్షాలతో పాటు మే«థావులు, సామాన్య ప్రజల అభిప్రాయాలను కూడా సేకరించిన తర్వాతే విధివిధానాల రూపకల్పనకు శ్రీకారం చుట్టాలని అభిప్రాయ పడింది. ఉమ్మడి జిల్లాల స్థాయిలో ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకునేందుకు గాను ఈనెల 11–16 తేదీల్లో ఉపసంఘంలోని మంత్రులు, ఇన్చార్జి మంత్రులు జిల్లా కేంద్రాల్లో పర్యటించాలని, విస్తృత స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేయాలని, ఈ సమావేశాల్లో అభిప్రాయం తెలిపేందుకు గాను ప్రత్యేక ఫార్మాట్‌ను రూపొందించాలని ఉపసంఘం నిర్ణయించింది. రైతు భరోసాపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం శుక్రవారం సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన గంటకు పైగా సమావేశమైంది. ఈ సమావేశంలో ఉపసంఘం సభ్యులైన మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, తుమ్మల నాగేశ్వరరావు, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి రఘునందన్‌రావులతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సాగులో లేకున్నా రైతుబంధు ఇచ్చారు!గత ప్రభుత్వ హయాంలో రైతుబంధు అమలు చేసిన తీరు, సీజన్ల వారీగా అయిన ఖర్చు, ఎంత మంది రైతులకు.. ఎన్ని ఎకరాల భూమి ఉందన్న అంశాలను వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి రఘునందన్‌రావు ఉపసంఘానికి వివరించారు. గత రెండు సీజన్లలో రైతుబంధు ఇచ్చిన తర్వాత తమ శాఖ నేతృత్వంలో పరిశీలన జరిపామని, ఈ సందర్భంగా ఎలాంటి సాగు చేయకుండానే 20 లక్షల ఎకరాలకు రైతుబంధు ఇచ్చినట్టు తేలిందని ఆయన వెల్లడించారు. ఈ 20 లక్షల ఎకరాల్లో వ్యవసాయ యోగ్యమైన భూమి ఉన్నా సాగు చేయకపోవచ్చని, ప్లాట్లు, కొండలు, గుట్టలు కూడా ఉండవచ్చని తెలిపారు.అనంతరం మంత్రులు మాట్లాడుతూ.. ఎవరెవరికి రైతు భరోసా అమలు చేయాలన్న దానిపై తొందరపడకూడదని, ప్రజల డబ్బును ప్రజల అభిప్రాయం మేరకు వెచ్చించాలని, వారి అభిప్రాయం తీసుకున్న తర్వాతే ఎలాంటి భూములకు రైతు భరోసా వర్తింపజేయాలి, ఎన్ని ఎకరాల వరకు అమలు చేయాలన్న దానిపై స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సాగు చేసే ప్రతి ఎకరానికీ రైతు భరోసా ఇస్తామని, వరంగల్ డిక్లరేషన్‌లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు కౌలు రైతులకు కూడా ఈ సాయాన్ని అందిస్తామని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి పర్యటనల్లో ప్రజల అభిప్రాయం తీసుకున్న తర్వాత మరోమారు సమావేశం కావాలని మంత్రులు నిర్ణయించారు. -
నేటి నుంచి పల్లె గోస- బీజేపీ భరోసా యాత్ర షురూ
-
కౌలు రైతు భరోసా యాత్రలో పవన్ పచ్చి అబద్ధాలు
-
రైతులకు అండగా నిలిచేందుకే భరోసా యాత్ర
పత్తికొండ: ప్రభుత్వ చేయూత కరువై అప్పుల బాధతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతులకు అండగా నిలిచేందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా యాత్రకు శ్రీకారం చుట్టారని ఆ పార్టీ రాష్ట్ర ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ తలసిల రఘురాం అన్నారు. శుక్రవారం ఆయన కర్నూలు జిల్లా పత్తికొండలో ఆ నియోజకవర్గ ఇన్చార్జి కంగాటి లక్ష్మీనారాయణరెడ్డితో కలిసి స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వరుస కరువుతో రైతులు అల్లాడిపోతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదన్నారు. బ్యాంకులతో పాటు ప్రై వేట్ వ్యక్తులు ఇచ్చిన అప్పుల కోసం ఒత్తిళ్లు చేస్తుండటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో రైతులు పంట అప్పులతో ఆత్మహత్యలు చేసుకోవడం లేదని అసెంబ్లీ సాక్షిగా చెప్పడం చూస్తే ఆయనకు వారిపట్ల ఉన్న ఆదరణను తెలియజేస్తోందన్నారు. అందువల్లే రైతుల్లో ధైర్యం నింపే ఉద్దేశంతో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ భరోసా యాత్ర చేపట్టారన్నారు. అనంతపురం జిల్లాలో 75 మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా.. జగన్మోహన్రెడ్డి ఆయా కుటుంబాలను కలిసి ఆత్మసై ్థర్యం కల్పించారన్నారు. కర్నూలు జిల్లాలోనూ ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాలను పరామర్శించేందుకు త్వరలోనే తమ పార్టీ అధ్యక్షుడు భరోసా యాత్ర పత్తికొండ నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి శ్రీరంగడు, మండల కన్వీనర్ జూటూరు బజారప్ప, తదితరులు పాల్గొన్నారు. -
రేపటి నుంచి 'అనంత'లో వైఎస్ జగన్ భరోసా యాత్ర
హైదరాబాద్: అనంతపురం జిల్లాలో రేపటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రైతు భరోసా యాత్ర చేపట్టనున్నారు. ఈ జిల్లాలో ఇది నాలుగో విడత రైతు భరోసా యాత్ర. ఇందులో భాగంగా వైఎస్ జగన్ ధర్మవరం, రాప్తాడు, కదిరి నియోజక వర్గాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అప్పులబాధ తాళలేక ఆత్మహత్యలు చేసుకున్న రైతుల, చేనేత కార్మికుల కుటుంబాలను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శిస్తారని వైఎస్ఆర్ సీపీ నేతలు తలశిల రఘురాం, శంకర్ నారాయణ తెలిపారు. -
రాహుల్ ‘భరోసా యాత్ర’ అదిరిపోవాలి
-
రాహుల్ ‘భరోసా యాత్ర’ అదిరిపోవాలి!
పర్యటన ఏర్పాట్లపై నేతలతో రఘువీరా సమీక్ష సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ రాష్ట్ర పర్యటన అదిరేలా ఉండాలని అందుకు తగ్గట్టుగా క్షేత్ర స్థాయిలో ఏర్పాట్లు చేయాలని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ఆ పార్టీ ముఖ్యనేతలను ఆదేశించారు. రైతులు, డ్వాక్రా మహిళలు, చేనేత కార్మికులు, ఉపాధి కూలీల కష్టాలు తెలుసుకునేందుకు రాహుల్ ఈ నెల 24న అనంతపురం జిల్లా నల్లమాడ నుంచి ఓ.డి.చెరువు వరకు పాదయాత్ర చేపట్టనున్నారు. 23వ తేదీ రాత్రికి పుట్టపర్తికి చేరుకొని ఆ రాత్రికి అక్కడే బస చేసి మరుసటి రోజు ఉదయం సత్యసాయి మహా సమాధిని దర్శించుకొని ఆయన భరోసా యాత్ర చేపడతారు. పాదయాత్రలో భాగంగానే అక్కడక్కడ రాహుల్ గాంధీతో మాట్లాడించాలని నిర్ణయించారు. 15 కిలోమీటర్ల పైబడి యాత్ర చేపడుతున్నందున కార్యకర్తలు, గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఉత్సాహం నింపేందుకు ప్రత్యేకంగా పాటలు రాయించారు. పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి శుక్రవారం ఇందిరభవన్లో ఆ పార్టీ నేతలతో సమావేశమై రాహుల్ పర్యటన ఏర్పాట్లపై సమీక్షించారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు భరోసా యాత్ర సందర్భంగా ఆర్థిక సహాయం అందించనున్నారు. -
నేటి నుంచి రెండో విడత ‘భరోసా’
-
నేటి నుంచి రెండో విడత ‘భరోసా’
నాలుగు నియోజకవర్గాల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన * ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరామర్శ సాక్షి ప్రతినిధి, అనంతపురం: కరువు దెబ్బకు పంటలు ఎండిపోయాయి... చంద్రబాబు సర్కారు చేతులెత్తేసింది... మాఫీ అవుతాయనుకున్న అప్పులు మోయలేని భారమయ్యాయి... అప్పులోళ్ల వేధింపులు తట్టుకోలేక, బ్యాంకర్ల ఒత్తిళ్లు భరించలేక, చంద్రబాబు సర్కారు చేసిన మోసం సహించలేక... అనంతపురం జిల్లాలో 66మంది రైతులు ఉసురు తీసుకున్నారు. అయినా ప్రభుత్వాధినేత గుండె కరగలేదు. రైతు కుటుంబాలను ఆదుకోవడంలో చిత్తశుద్ధి చూపలేదు. ఆత్మహత్యలు జరగలేదన్నారు, పరిహారాన్ని పరిహాసంగా మార్చారు. సర్కారు దుర్మార్గాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డి శాసనసభలో నిలదీశారు. అన్నదాత కుటుంబాల్లో భరోసా నింపేందుకు రైతు భరోసాయాత్ర చేపట్టారు. తొలి విడతలో ఐదు నియోజకవర్గాల్లో పర్యటించి రైతన్నల కన్నీరు తుడిచారు. సోమవారం నుంచి నాలుగు రోజులపాటు మలి విడత రైతు భరోసా యాత్ర చేపట్టారు. ఇందులో భాగంగా గుంతకల్లు, ఉరవకొండ, రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించనున్నారు. అలాగే గత నెల 29న రాప్తాడు తహసీల్దార్ కార్యాలయంలో హత్యకు గురైన వైఎస్సార్సీపీ నాయకుడు భూమిరెడ్డి ప్రసాదరెడ్డి కుటుంబ సభ్యులను ఓదారుస్తారు. హత్య అనంతరం జరిగిన దాడుల అభియోగంతో అరెస్టయి స్థానిక సబ్జైల్లో ఉన్న వైఎస్సార్సీపీ నాయకులను జగన్ పరామర్శిస్తారు. మాజీ ఎమ్మెల్యే బి. గురునాథ్‌రెడ్డి, పార్టీ నాయకుడు తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి, మరో 30 మంది రిమాండ్‌లో ఉన్న విషయం తెలిసిందే. భరోసాయాత్ర షెడ్యూల్ 11వ తేదీ సోమవారం: గుంతకల్లు 12వ తేదీ మంగళవారం: ఉరవకొండ 13వ తేదీ బుధవారం: రాయదుర్గం 14వ తేదీ గురువారం: కళ్యాణదుర్గం -
'కేసీఆర్ అసమర్థత వల్లే రైతులకు కష్టాలు'
నిజామాబాద్: రైతాంగ సమస్యలపై అసెంబ్లీ, శాసనమండలిలో తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీస్తామని కాంగ్రెస్ నేతలు పొన్నాల లక్ష్మయ్య, జానారెడ్డి, డీ. శ్రీనివాస్, షబ్బీర్ అలీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో గురువారం భరోసాయాత్ర నిర్వహించారు. కరెంట్ కష్టాలతో పంటలు ఎండిపోయిన రైతులను వారు పరామర్శించారు. కేసీఆర్ అసమర్థత వల్లే రైతులకు కరెంట్ కష్టాలు వచ్చాయన్నారు. రుణాలు మాఫీకాక అప్పులు పెరిగిపోవడంతో 220 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు. కరువు మండలాలు ప్రకటించి రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులు కోల్పోయిన పంటబీమా నష్టాన్ని కూడా ప్రభుత్వమే చెల్లించాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు.