Bharti Airtel company
-
నేను చెప్తున్నాగా! ఎయిర్టెల్ భవిష్యత్తు బ్రహ్మాండం!
న్యూఢిల్లీ: యుద్ధాలతో రాటుదేలిన తమ సంస్థ భవిష్యత్ బాగుంటుందని టెలికం దిగ్గజం భారతి ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ ధీమా ధీమా వ్యక్తం చేశారు. నియంత్రణ సంస్థలపరమైన సవాళ్లు, మార్కెట్లో తీవ్ర పోటీ వంటి అనేక ఎత్తుపల్లాలను చూసిన ఎయిర్టెల్ ప్రస్తుతం పటిష్ట స్థితిలో ఉందని ఆయన చెప్పారు. ‘దేశీయంగా టెలికం రంగంలో ప్రస్తుతం రెండున్నర సంస్థలు మాత్రమే మిగిలాయి. ఇక భవిష్యత్ బాగానే ఉండేలా కనిపిస్తోంది. మరో సంక్షోభం ఏదైనా వస్తుందా రాదా అంటే ఏమో ఎవరు చెప్పగలరు? అయితే, మా కంపెనీ యుద్ధాలతో రాటుదేలి చాలా పటిష్టంగా మారింది‘ అని పరిశ్రమల సమాఖ్య సీఐఐ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మిట్టల్ వివరించారు. ఈ సందర్భంగా 2002–2003 మధ్య ఎయిర్టెల్ ఎదుర్కొన్న గడ్డు పరిస్థితులను గుర్తుచేసుకున్నారు. ఒకానొక దశలో కంపెనీ కుప్పకూలిపోవడం ఖాయమనే భావన నెలకొందని పేర్కొన్నారు. ‘మేము దేశవ్యాప్తంగా సేవలను భారీగా విస్తరించడంపై దృష్టి పెట్టిన దశలో మా మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. చేతిలో డబ్బు వేగంగా కరిగిపోతోంది ఆదాయాలు పెరగడం లేదు. కొన్నాళ్ల క్రితమే రూ. 45 దగ్గర లిస్టయిన షేరు ధర రూ.19కి పడిపోయింది. ఓడలో పగుళ్లు ఏర్పడుతున్నాయి. ఏది చేసినా కలిసి రావడం లేదు. అలాంటప్పుడు సరైన వ్యూహం, సరైన టెక్నాలజీ ఉంటే కచ్చితంగా గెలుపు మాదే అవుతుందనే నమ్మకంతో ముందుకెళ్లాం. అదే ఫలితాలనిచ్చింది. 18 నెలల్లోనే షేరు రూ.19 నుంచి ఏకంగా రూ.1,200కు ఎగిసింది‘ అని మిట్టల్ వివరించారు. 2008–09లో కొత్తగా 12 సంస్థలు టెలికం లైసెన్సులు పొందినప్పుడు కూడా గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయని పేర్కొన్నారు. కానీ తాము ఈసారి సిద్ధంగా ఉండి, దీటుగా ఎదుర్కొనగలిగామని మిట్టల్ పేర్కొన్నారు. -
ఎయిర్టెల్ ప్రత్యేకమైన మైక్రో-వెబ్సైట్
న్యూఢిల్లీ: భారతీ ఎయిర్టెల్ కంపెనీ ప్రత్యేకమైన మైక్రో-వెబ్‌సైట్‌ను సోమవారం ప్రారంభించింది. ఎయిర్టెల్ నెట్వర్క్ కవరేజ్ లైవ్ స్టేటస్‌ను ఈ ప్రత్యేకమైన వెబ్సైట్ తెలియజేస్తుంది. అంతేకాకుండా ఈ వెబ్సైట్ కంపెనీ సైట్ విస్తరణ ప్రాజెక్ట్ పురోగతిని కూడా వెల్లడిస్తుంది. కాల్ డ్రాప్‌ల విషయంలో విమర్శలు బాగా పెరుగుతున్న నేపథ్యంలో ఎయిర్టెల్ ఈ ప్రత్యేక వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెస్తుండడం విశేషం. మొబైల్ నెట్వర్క్ నాణ్యతను మెరుగుపరిచేందుకు గానూ మూడేళ్లలో రూ.60,000 కోట్ల పెట్టుబడులతో ప్రాజెక్ట్ లీప్‌ను అమలుచేయబోతున్నట్లు గత నెలలోనే ఎయిర్టెల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
హైదరాబాద్‌లో ఈ నెలలోనే ఎయిర్టెల్ 4జీ ట్రయల్
న్యూఢిల్లీ: భారతీ ఎయిర్టెల్ సంస్థ ఈ నెలాఖరు కల్లా హైదరాబాద్‌లో 4జీ సర్వీసులను ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నది. గురువారం నుంచి ఈ సర్వీసులను చెన్నైలో ప్రయోగాత్మకంగా ఆరంభిస్తుందని సమాచారం. నెలాఖరు కల్లా హైదరాబాద్‌తో పాటు ముంబైలో కూడా ఈ సేవలు మొదలవుతాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఎయిర్టెల్ సంస్థ బెంగళూరు, కోల్‌కత, పుణే, చంఢీగర్, మొహాలి తదితర 19 నగరాల్లో 4జీ సర్వీసులను అందిస్తోంది. ఈ ఏడాది చివరికల్లా ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాలు, పంజాబ్‌ల్లో 4జీ సర్వీసులను ప్రారంభిస్తామని ఎయిర్టెల్ కంపెనీ ఈ ఏడాది జనవరిలో వెల్లడించింది. -
డిసెంబర్ 15కు ఏపీలో ఎయిర్టెల్ 4జీ సేవలు
న్యూఢిల్లీ: డిసెంబర్ 15 నాటికి టెలీకాం దిగ్గజ సంస్థ భారతీ ఎయిర్టెల్ ఏపీలో తొలిసారిగా ఎఫ్‌డీడీ-ఎల్టీఈ టెక్నాలజీ 4జీ సేవల్ని ప్రారంభించనుంది. ఏపీతోసహా 11 రాష్ట్రాల్లో ఆరు లేదా అంతకన్నా ఎక్కువ సర్కిళ్లలో ఈ 4జీ సేవల్ని విస్తరించనుంది. దీనికోసం నోకియా నెట్వర్క్స్తో మంగళవారం ఒప్పందాన్ని కుదిర్చుకుంది. ఏపీ, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో ఈ ఏడాది డిసెంబర్ 15 నాటికి 4జీ సేవల్ని అందుబాటులోకి తేవాలని భావిస్తోంది. అలాగే ఈ సేవల్ని వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి కర్ణాటకలో, ఏప్రిల్ నాటికి రాజస్థాన్‌లో ప్రారంభించాలని చూస్తోంది. ‘దేశంలో ఇప్పటికే నాలుగు సర్కిళ్లలో 4జీ సేవల్ని ప్రారంభించాం. ఇప్పుడు ఈ సేవల్ని మరికొన్ని సర్కిళ్లలో ప్రారంభించాలని అనుకుంటున్నాం’ అని ఎయిర్టెల్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ అభయ్ సవర్గాంకర్ చెప్పారు. భారతీ ఎయిర్‌టెల్‌తో కలిసి భారత్‌లో తొలిసారి ఎఫ్‌డీడీ-ఎల్టీఈ టెక్నాలజీ 4జీ సేవల్ని ప్రారంభించటం చాలా ఆనందంగా ఉందని నోకియా నెట్వర్క్స్ వైస్ ప్రెసిడెంట్ సందీప్ గిరోత్రా అన్నారు.