హైదరాబాద్‌లో ఈ నెలలోనే ఎయిర్‌టెల్ 4జీ ట్రయల్ | Bharti Airtel to begin 4G trial in Chennai; Mumbai, Hyderabad next | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో ఈ నెలలోనే ఎయిర్‌టెల్ 4జీ ట్రయల్

Published Thu, May 14 2015 12:55 AM | Last Updated on Tue, Sep 4 2018 5:16 PM

హైదరాబాద్‌లో ఈ నెలలోనే ఎయిర్‌టెల్ 4జీ  ట్రయల్ - Sakshi

హైదరాబాద్‌లో ఈ నెలలోనే ఎయిర్‌టెల్ 4జీ ట్రయల్

న్యూఢిల్లీ: భారతీ ఎయిర్‌టెల్ సంస్థ ఈ నెలాఖరు కల్లా హైదరాబాద్‌లో 4జీ సర్వీసులను ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నది. గురువారం నుంచి ఈ సర్వీసులను చెన్నైలో ప్రయోగాత్మకంగా ఆరంభిస్తుందని సమాచారం. నెలాఖరు కల్లా హైదరాబాద్‌తో పాటు ముంబైలో కూడా ఈ సేవలు మొదలవుతాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.  ప్రస్తుతం ఎయిర్‌టెల్ సంస్థ బెంగళూరు, కోల్‌కత, పుణే, చంఢీగర్, మొహాలి తదితర 19 నగరాల్లో 4జీ సర్వీసులను అందిస్తోంది. ఈ ఏడాది చివరికల్లా ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాలు, పంజాబ్‌ల్లో 4జీ  సర్వీసులను ప్రారంభిస్తామని ఎయిర్‌టెల్ కంపెనీ ఈ ఏడాది జనవరిలో వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement