ప్రధాని కార్యదర్శి వేతనం రూ.2 లక్షలు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి కార్యాలయంలో పనిచేసే అధికారుల జీతాలను ప్రజలందరికీ తెలిసేలా పీఎంవో వెబ్సైట్లో ఉంచారు. సమాచార హక్కు చట్టం ప్రకారం పీఎంవో ఈ చర్యలు తీసుకుంది. పీఎంవోలోని ఉద్యోగులందరిలో సీనియర్ ఐఏఎస్ అధికారి భాస్కర్ ఖుల్బీ అత్యధికంగా నెలకు రూ.2.01 లక్షల వేతనం అందుకుంటున్నారు.
ప్రధాని ముఖ్య కార్యదర్శి నృపేంద్ర మిశ్రా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ప్రధాని అదనపు ముఖ్య కార్యదర్శి పీకే మిశ్రా నెలకు రూ. 1,62,500 వేతనంతో పాటు పెన్షన్ అందుకుంటున్నారు. అత్యధిక వేతనం తీసుకుంటున్న వీరంతా రిటైర్డ్ సివిల్ సర్వీస్ అధికారులే.