భక్తిశ్రద్ధలతో భీమేశ్వరుని తెప్పోత్సవం
సామర్లకోట :
కుమారరామ భీమేశ్వరస్వామి జన్మ నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని గురువారం రాత్రి ఆలయ కోనేరులో తెప్పోత్సవం నిర్వహించారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఆలయంలో స్వామికి అభిషేకాలు, ప్రత్యేకపూజలు, అమ్మవారికి కుంకుమార్చనలు చేశారు. రాత్రి ఆలయ కోనేరు వద్ద స్వామి, బాలా త్రిపుర సుందరీదేవి ఉత్సవ విగ్రహాలకు డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, తెప్పోత్సవ నిర్వాహక కుటుంబ సభ్యులు పూజలు చేశారు. విద్యుద్దీపాలతో అలంకరించిన రథంపై స్వామి, అమ్మవార్ల విగ్రహాలను ఉంచి కోనేరు చుట్టూ తెప్పోత్సవం నిర్వహించారు. పారిశ్రామిక వేత్తలు కటకం సతీష్, సరేష్ దంపతుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆలయ కమిటీ చైర్మన్ కంటే బాబు, కార్య నిర్వాహణాధికారి పులి నారాయణమూర్తి, సభ్యులు మహంకాళి వెంకటగణేష్, పడాల పుత్రయ్య, బి. త్రిమూర్తులు, అన్నదాన ట్రస్తు నాయకులు బిక్కిన సాయిపరమేశ్వరరావు, చుండ్రు గోపాలకృష్ణ, చుండ్రు వాసు, భక్త సంఘం నాయకులు బూరయ్య, తూతిక కామేశ్వర రావు, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు
పాల్గొన్నారు.